Nargis
-
నర్గీస్‌ను చంపేందుకు కుట్ర
టెహ్రాన్: నోబెల్ గ్రహీత, మానవ హక్కుల కార్య కర్త నర్గీస్ మొహమ్మదీని చంపేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె కుటుంబం ఆరోపించింది. కేన్సర్ నిర్ధారణకు అవసరమైన కీలకమైన శస్త్రచికిత్సను నిరాకరించి, నెమ్మదిగా ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమవుతోందని తెలిపింది. ఆమె కుడి కాలు ఎముక గాయా న్ని వైద్యులు ఇటీవల గుర్తించారని, క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన బయాప్సీకోసం శస్త్రచికిత్సకు అవకాశం ఇవ్వకుండా ఆమె ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కుటుంబం వెల్లడించింది. చికిత్సలో మరింత జాప్యం జరిగితే ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. సంవత్సరాల తరబడి జైలు జీవితం, సుదీర్ఘకాలం ఏకాంత నిర్బంధం ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, కేవలం ఆస్పత్రి సందర్శనలతో చేసే చిన్న చికిత్స ఆమె ఆరోగ్యాన్ని బాగు చేయలేదని వారు తెలిపారు. కాగా, ఇటీవల ఎంఆర్ఐలో ఆర్థరైటిస్, డిస్క్ వ్యాధి ఉన్నట్లు బయటపడిందని, 2021లో గుండెపోటుకు గురైన తర్వాత ఆమె గుండె ధమనుల్లో ఒకదానికి యాంజియోగ్రఫీ చేయాలని వైద్యులు సూచించారని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ వంటి ప్రముఖులు సైతం మొహమ్మదీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘నిర్బంధంలో ఉన్న మొహమ్మదీకి అవసరమైన వైద్య సంరక్షణను నిలిపివేస్తూ ఇరాన్ అధికారులు ఆమెను నెమ్మదిగా చంపుతున్నారు’అని హిల్లరీ క్లింటన్ గత శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొహమ్మదీ రెండు దశాబ్దాలుగా టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఇరాన్లో మానవ హక్కులకోసం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న నర్గీస్ 2011లో తొలిసారి అరెస్టయ్యారు. రెండేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన ఆమె.. 2015లో మళ్లీ జైలుకు వెళ్లారు. జైలులోనూ ఆమె పోరాటాన్ని ఆపలేదు. మహిళల హక్కులతో పాటు, మరణశిక్ష రద్దు, ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడారు. జైలులో ఉన్నప్పటికీ మొహమ్మదీ మానవ హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఇందుకుగాను 2023 సంవత్సరంలో మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. -
ఆస్పత్రిలో చేరిన నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మదీ
దుబాయ్: జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహమ్మదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఇరాన్ అధికారులు అనుమతించారు. మొహమ్మదీ తొమ్మిది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక సంస్థ ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది. మొహమ్మదీకి చికిత్స కోసం మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఫ్రీ నార్వే కూటమి ఒక ప్రకటనలో కోరింది. ఇరాన్‌లోని ఎవిన్ జైలులో మొహమ్మదీ ఇప్పటికే 30 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరిలో ఆమె శిక్ష కాలాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఆగస్టు 6న ఎవిన్ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీకి ఉరిశిక్ష విధించడాన్ని నిరసించినందుకు ఇరాన్ అధికారులు ఆమెకు అదనంగా ఆరు నెలలపాటు శిక్షను విధించారు.నర్గీస్ మొహమ్మది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్గీస్ మహమ్మదీని 2021లో అరెస్టు చేశారు. మహిళలపై ఇరాన్ ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల గురించి మొహమ్మదీ గళం విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించారు. నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డును అందుకున్న 19వ మహిళగా ఆమె పేరొందారు. 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాడి తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ ఇరాన్ మహిళగా గుర్తింపు పొందారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
'నా భర్త అందగాడు.. గతాన్ని మర్చిపో'.. హీరోయిన్‌కు సూచన!
రాజ్‌కపూర్- నర్గీస్.. వీరి ప్రేమాయణం గురించి అందరూ కథలుకథలుగా చెప్పుకునేవాళ్లు. 18 చిత్రాల్లో కలిసి నటించిన వీరికి ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ.. కానీ అప్పటికే రాజ్ కపూర్‌కు పెళ్లయి, పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఈ ప్రేమ సఫలం కాలేదు. అనంతరం నర్గీస్.. సునీల్ దత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత రాజ్ కపూర్‌తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు కూడా వెళ్లేది కాదు. 24 ఏళ్లు ఇలాగే గడిచిపోయాయి.రాజ్ కపూర్, భార్య కృష్ణ, హీరోయిన్ నర్గీస్పెళ్లికి హాజరుదశాబ్దాల తర్వాత రాజ్.. తన కుమారుడు రిషి కపూర్ పెళ్లికి రావాలంటూ నర్గీస్‌ను ఆహ్వానించాడు. ఇచ్చిన మాట ప్రకారం తన భర్తను తీసుకుని పెళ్లికి హాజరైంది. కానీ ఎందుకో అదోలా ఉంది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న రాజ్ కుమార్ భార్య కృష్ణ తనను దగ్గరకు పిలిచింది. నా భర్త అందగాడు, రొమాంటిక్ కూడా! అతడు అందరినీ ఆకర్షిస్తాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు.భార్య కృష్ణతో రాజ్ కపూర్గతాన్ని మర్చిపోదయచేసి గతం గురించి వదిలేయు.. దాన్ని తవ్వుకుంటూ కూర్చుని బాధపడొద్దు. మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వచ్చావు. ఇప్పుడు మనం స్నేహితులం అని చెప్పింది. ఈ విషయాలను రిషి కపూర్ తన పుస్తకంలో రాసుకొన్నాడు. అలాగే తన తండ్రి.. హీరోయిన్ వైజయంతిమాలతోనూ సన్నిహితంగా ఉండేవాడని పేర్కొన్నాడు. కాగా రాజ్ కపూర్ 1988లో కన్నుమూశాడు.చదవండి: ‘సరిపోదా శనివారం’ టాక్ ఎలా ఉందంటే..? -
తల్లి తరఫున నోబెల్ శాంతి బహుమతి స్వీకరణ
హెల్సింకీ: ఇరాన్ మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గీస్ మొహమ్మదీకి నోబెల్ కమిటీ ప్రకటించిన శాంతి బహుమతిని ఆమె తరఫున ఆమె కుమారుడు, కుమార్తె అందుకున్నారు. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న 51 ఏళ్ల నర్గీస్‌ను ఇరాన్ ప్రభుత్వం అక్రమ కేసులు మోపి టెహ్రాన్ జైలులో పడేసిన విషయం విదితమే. శనివారం నార్వేలోని ఓస్లోలో నర్గీస్ కవల పిల్లలు అలీ, కియానా రహా్మనీ పురస్కారాన్ని స్వీకరించారు. ‘‘ఇరాన్ సమాజానికి అంతర్జాతీయ మద్దతు అవసరం. ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన మానవహక్కుల కార్యకర్తలు, నిరసనకారులు, పాత్రికేయుల గొంతుకను సభావేదికగా గట్టిగా వినిపించండి’’ అంటూ నర్గీస్ ఇచి్చన సందేశాన్ని వేదికపై వారు చదివారు. -
అలుపెరగని పోరాటానికి నోబెల్ బహుమతి
-
ఇరాన్ హక్కుల యోధురాలికి నోబెల్ శాంతి
స్టాక్‌హోమ్: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదికి లభించింది. ఇరాన్లో మహిళల అణచివేత, మానవ హక్కులపై అవగాహన, అందరికీ స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గిస్ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్‌లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. ‘‘నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతమైనది. మహిళా హక్కుల కోసం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్లో ఏడాదిగా సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితురాలైన నర్గిస్ మొహమ్మదికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నాం’’అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రెసి అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (దాదాపుగా 10 లక్షల డాలర్లు) నగదు బహుమానం, 18 కేరట్ గోల్డ్ మెడల్, డిప్లొమా లభిస్తుంది,. డిసెంబర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్లో మహిళా హక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్‌కి ఒక ప్రకటన పంపారు. ‘‘నోబెల్ శాంతి పుర స్కారం నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్లో మార్పు కోసం పోరాడుతున్న వారి లో మరింత బలం పెరుగుతుంది. ఇక విజయం సమీపంలో ఉంది’’అని ఆ ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. 13 సార్లు అరెస్ట్..31 ఏళ్ల జైలు శిక్ష హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా నర్గిస్ వెనుకంజ వేయలేదు. ఇరాన్ ప్రభుత్వం ఆమెను ఇప్పటికి 13 సార్లు అరెస్ట్ చేసింది. అయిదు సార్లు దోషిగా నిర్ధారించింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 154 సార్లు కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు. అన్నీ కోల్పోయినా.... సంప్రదాయం పేరుతో మహిళలపై ఆంక్షలు విధిస్తూ హిజాబ్ కాస్త పక్కకి జరిగినా జైలు పాల్జేయడమో, కొట్టి చంపేయడమో చేసే దేశంలో పుట్టి మహిళా హక్కుల కోసం జీవితాన్ని ధారపోస్తున్న నర్గిస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో నాలుగ్గోడల మధ్య బందీగా ఉన్నారు. వ్యక్తి గత జీవితాన్ని, ఆరోగ్యాన్ని, స్వేచ్ఛని పణంగా పెట్టి 51 ఏళ్ల వయసున్న నర్గిస్ ఇంకా మార్పు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ‘‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షిస్తే నాలో పోరాట స్ఫూర్తి అంతకంతకూ పెరుగుతుంది. దేశంలో మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే వరకు ఈ పోరాటం ఆగదు’’అని నర్గిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇరాన్‌లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయిందో అప్పుడే నర్గిస్ తల్లి సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు. వారిని ప్రతీ వారం కలుసుకోవడానికి తల్లితో పాటు జైలుకు వెళ్లే చిన్నారి నర్గిస్‌కు తమ బతుకులు ఎందుకంత అణచివేతకు గురవుతున్నాయో అర్థం కాక తీవ్ర సంఘర్షణకు లోనయ్యేది. అది చూసి ఆమె తల్లి తనకున్న అనుభవంతో రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని హితవు చెప్పింది. అయినప్పటికీ నర్గిస్లో చిన్నప్పట్నుంచి ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్‌గా చేశారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబది స్థాపించిన డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సెంటర్లో 2003లో చేరిన ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యారి్థగా పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం రెహమనీ తన పిల్లలతో కలిసి పారిస్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తన భర్త, పిల్లలతో మాట్లాడి, ప్రేమతో వారిని అక్కున చేర్చుకొని ఆమెకు ఏళ్లు గడిచిపోయాయి. జైలు నుంచే పోరాటం జైలు నుంచి ఆమె ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తి రగిలిస్తున్నారు. రాజకీయ ఖైదీలు, మహిళా ఖైదీలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైల్లోనే ఆమె ఉద్యమం ప్రారంభించారు. జైల్లో కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో అధికారులు ఆమెపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఆమె బెదరలేదు. జైలు నుంచే పలు వ్యాసాలు న్యూయార్క్ టైమ్స్, బీబీసీ వంటి వాటికి పంపించారు. 2022 సెపె్టంబర్లో హిజాబ్ ధరించనందుకు మాసా అమిని అనే యువతిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేయగా కస్టడీలో తీవ్ర గాయాలపాలై ఆమె మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్లో భారీగా యువతీ యువకులు ఆందోళనలు చేపట్టి రోడ్లపైకి వచి్చనప్పుడు జైలు నుంచే ఆమె తన గళాన్ని వినిపించారు. పోరాడే వారిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తోటి మహిళా ఖైదీల అనుభవాలతో వైట్ టార్చర్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు విధించే ఇరాన్లో అత్యంత క్రూరమైన ఆ శిక్షను రద్దు చేసే వరకు తన పోరాటం ఆగదని నర్గిస్ ఎలుగెత్తి చాటుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!
ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే! ఆమె ముత్తాతే... పారిస్‌లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి బాలీవుడ్ నటి.. కల్కి కొచ్లిన్ ముత్తాత మోరిస్ కొచ్లిన్ చీఫ్ ఇంజినీర్ అట. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన. గొంతు బాలేదని.. గబ్బర్ సింగ్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్ కాదు, ‘షోలే’ గబ్బర్ సింగ్.. అమ్జద్ ఖాన్! ఆ సినిమాలో ఆ పాత్రకు అమ్జద్ ఖాన్‌ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్‌కు నచ్చలేదుట. గబ్బర్ సింగ్ రోల్‌కు సరిపడా స్వరం అమ్జద్‌కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్ సిప్పీ దాదాపుగా అమ్జద్‌ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్‌ను తీసుకున్నారు. అమ్జద్ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్‌గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్ సింగ్ పాత్రను రక్తి కట్టించాడు. గ్యారేజ్‌లో కాపురం.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్ కపూర్ వాళ్లింటి కారు గ్యారేజ్‌లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట. నోట్లోంచి మాట రాలేదు.. రాజ్ కపూర్, నర్గిస్ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్ మీద సునీల్ దత్కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్ దత్ సిలోన్ రేడియోలో ఆర్జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్ దత్ టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్ దత్. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాజ్‌ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్ చేస్తే సునీల్ దత్ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్ ఇండియా’లో నర్గిస్‌కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్‌కు రావాల్సింది.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్ మీద మాత్రం షారుఖ్ ఖాన్ కనబడ్డాడు. చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా సండే ఫ్లాష్‌బ్యాక్: పాత సినిమాకెళ్తాం నాన్నా! -
‘అమ్మ చనిపోతే కనీసం ఏడవలేదు’
భావోద్వేగాలతో తెరకెక్కిన రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ కావటంతో ఆయన జీవితంలోని ఆసక్తికర కోణాలను తెలుసుకునేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సంజూ బాబా పాత వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో తన తల్లి చనిపోయిన సమయంలో తాను ఎలా ప్రవర్తించిందనేది చెబుతూ భావోద్వేగానికి లోనైన ఇంటర్వ్యూ ఒకటుంది. 90వ దశకంలో తీసిన ఆ ఇంటర్వ్యూలో సంజయ్ చెప్పిన మాటలు... ‘నా తల్లిది చాలా మంచి మనస్తత్వం. సెట్స్‌లో అందరితోనూ మంచిగా మెలిగేది. ఆమె చనిపోయినప్పుడు నేను ఎలాంటి ఎమోషన్లను చూపించలేకపోయా. కనీసం ఏడవలేదు కూడా. రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో గ్రూప్‌గా కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఓ ఆడియో క్లిప్ ప్లే అయ్యింది. అందులో ఉంది నా తల్లి వాయిస్. (బ్యాక్ గ్రౌండ్లో నర్గీస్‌దత్ గొంతు వినిపించింది...)... ‘అది విన్నాక ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో?.. ఎంత జాగ్రత్తలు తీసుకుందో? తను నా గురించి ఏం కోరుకుందో? అప్పుడు నాకు అర్థమైంది. అంతే నా ప్రమేయం లేకుండా కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. అలా నాలుగైదు గంటలు ఏడ్చుకుంటూ ఉండిపోయా. తప్పో.. ఒప్పో.. అన్నీ నాలోనే ఉంటాయి. వాటిని బయటకు తీసినప్పుడే మారినమనిషిని అవుతాను’ సంజు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సంజు డెబ్యూ చిత్రం రాకీకి కొద్ది రోజుల ముందే నటి, సునీల్ దత్ సతీమణి నర్గీస్ దత్ చనిపోవటం తెలిసిందే. -
సంజయ్ దత్ ఎమోషనల్ వీడియో
-
అదే హెయిర్ స్టైల్.. అదే చీర కట్టు
సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంజయ్ దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడా చూపెట్టనున్నామని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ తల్లి, అలనాటి ప్రముఖ నటి నర్గీస్ పాత్రలో మనీషా కొయిరాల నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఇటీవల షేర్ చేసిన పోస్టర్లో మనీషాను చూసిన జనాలు అచ్చం నర్గీస్లానే ఉందంటూ కామెంట్లు చేశారు. తాజాగా మనీషా పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం అంతకుమించి అనేలా ఉన్నాయి. 1970నాటి నర్గీస్‌ను గుర్తుకు తెచ్చేలా.. అదే హెయిర్ స్టైల్, అదే చీర కట్టుతో కూడిన తన ఫొటోను మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని రెండో సాంగ్ కర్ హర్ మైదాన్ ఫతే.. తనకు ఎంతో ఇష్టమైన సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు మనీషా. సంజయ్ పాత్రలో నటించడానికి రణబీర్ ఎంత కష్టపడ్డాడో.. మనీషా కూడా నర్గీస్లా మెప్పించేందుకు అంతే శ్రమించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్, మనీషాతోపాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
సంజు కొత్త పోస్టర్.. అచ్చం నర్గీస్లా..!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’ చిత్రానికి సంబంధించిన ఏ వార్త అయిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో కన్పించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజు ట్రైలర్ అభిమానులను విశేషంగా అకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలో అలనాటి ప్రముఖ నటి, సంజయ్ దత్ తల్లి నర్గీస్ పాత్రలో నటిస్తున్న మనీషా కొయిరాలకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ పోస్టర్‌ను ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. ‘ ఆమె తన కొడుకును ముద్దుగా సంజు అని పిలుచుకునేది.. ఇప్పడు మనం కూడా అలానే పిలుస్తున్నాం. నర్గీస్జీ పాత్రలో మనీషా నటనను జూన్ 29న చూడనున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌కు విశేష స్పందన వస్తుంది. మనీషా అచ్చం నర్గీస్లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనీషా లుక్‌ను, నర్గీస్ ఫొటోలతో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిని ఓ సారూప్యతగా చెబుతూ.. మనీషా ఈ పాత్రలో అద్భుతంగా నటించి ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మనీషా మాట్లాడుతూ.. ‘లెజండ్రీ నటి నర్గీస్ పాత్రలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని ఏళ్లు గడిచిన ఆమె పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది. ఇది నాకు ఒక చాలెజింగ్ రోల్’ అని తెలిపారు. ఈ చిత్రంలో వీరితో పాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.సంజయ్‌దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
సంజయ్ దత్ తల్లి నర్గిస్‌గా...
అలనాటి ప్రముఖ నటి, హీరో సంజయ్‌దత్ తల్లి నర్గిస్, హీరోయిన్ మనీషా కొయిరాల మధ్య ఓ సారూప్యం ఉంది. అదేంటంటే... ఇద్దరూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులే. 51 ఏళ్ల వయసులో క్యాన్సర్ కారణంగా నర్గిస్ మరణించారు. క్యాన్సర్‌ని జయించిన మనీషా మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. బాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తన టాలెంట్ చూపించడానికి సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారామె. ఈ తరుణంలో మనీషాకి నర్గిస్ పాత్రలో నటించే ఛాన్స్ లభించింది. సంజయ్‌దత్ జీవితం ఆధారంగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ బయోపిక్‌లో సంజయ్ తల్లి నర్గిస్ పాత్రకి మనీషాని ఎంపిక చేశారు. ‘‘మనీషాని ఎంపిక చేయడానికి ముఖ్య కారణం ఆమె క్యాన్సర్‌ను జయించడమే. ఆ బాధను ఆమె స్వయంగా అనుభవించారు’’ అన్నారు దర్శకుడు. జనవరి 17న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. సంజయ్ పాత్ర కోసం రణబీర్ 13కిలోలు బరువు పెరిగారు. ఇందులో సంజయ్ తండ్రి సునీల్‌దత్ పాత్రలో పరేశ్ రావల్, సతీమణి మాన్యత పాత్రలో దియా మీర్జా, మాజీ ప్రేయసిగా సోనమ్ కపూర్, స్నేహితుడిగా విక్కీ కౌశల్, జర్నలిస్ట్‌గా అనుష్కా శర్మ నటిస్తున్నారు.