సంజు కొత్త పోస్టర్‌.. అచ్చం నర్గీస్‌లా..! | Manisha Koirala Remembers Nargis In Sanju Poster | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 6 2018 6:41 PM | Last Updated on Wed, Jun 6 2018 8:11 PM

Manisha Koirala Remembers Nargis In Sanju Poster - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’  చిత్రానికి సంబంధించిన ఏ వార్త అయిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. రణబీర్‌ కపూర్‌ ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ పాత్రలో కన్పించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజు  ట్రైలర్‌ అభిమానులను విశేషంగా అకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలో అలనాటి ప్రముఖ నటి, సంజయ్‌ దత్‌ తల్లి నర్గీస్ పాత్రలో నటిస్తున్న మనీషా కొయిరాలకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 

దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ ఈ పోస్టర్‌ను ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ‘ ఆమె తన కొడుకును ముద్దుగా సంజు అని పిలుచుకునేది.. ఇప్పడు మనం కూడా అలానే పిలుస్తున్నాం. నర్గీస్‌జీ పాత్రలో మనీషా నటనను జూన్‌ 29న చూడనున్నాం’  అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌కు విశేష స్పందన వస్తుంది. మనీషా అచ్చం నర్గీస్‌లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనీషా లుక్‌ను, నర్గీస్‌ ఫొటోలతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

సంజయ్‌ దత్‌ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్‌ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించిన సంగతి తెలిసిందే.  దీనిని ఓ సారూప్యతగా చెబుతూ.. మనీషా ఈ పాత్రలో అద్భుతంగా నటించి ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మనీషా మాట్లాడుతూ.. ‘లెజండ్రీ నటి నర్గీస్‌ పాత్రలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని ఏళ్లు గడిచిన ఆమె పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది. ఇది నాకు ఒక చాలెజింగ్‌ రోల్‌’  అని తెలిపారు. ఈ చిత్రంలో వీరితో పాటు సోనమ్‌ కపూర్‌, పరేష్‌ రావల్‌, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.సంజయ్‌దత్‌ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement