Sanju
-
దుపట్టా డ్యాన్స్... దుమ్ము రేపింది
సంజూ రాథోడ్ పాడిన మరాఠీ సాంగ్ ‘గులాబి శాదీ’ సూపర్ హిట్ కావడమే కాదు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ సాంగ్‌ను బేస్ చేసుకొని డ్యాన్సింగ్ నుంచి లిప్–సింకింగ్ వరకు సోషల్ మీడియా యూజర్లు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక వీడియో వైరల్ అయింది.‘గ్రూమ్స్ ఫ్రెండ్స్ ఆన్ ఫైర్’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 4.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. గులాబీ రంగు దుపట్టా వేసుకొని వరుడి ఫ్రెండ్స్ చేసిన డ్యాన్స్ ‘వారేవా’ అనేలా ఉంది. -
రాజ్ కుమార్ హిరానీ బర్త్‌డే స్పెషల్.. 5 బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే..
Director Raj Kumar Hirani Birthday Special And His 5 Block Busters: బాలీవుడ్లో విజయవంతమైన డైరెక్టర్లలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. నూతన దర్శకులు ఆరాధించేవాళ్లలో రాజ్ కుమార్ హిరానీ తప్పకుండా ఉంటారు. 100 శాతం సక్సెస్ రేట్‌తో హిందీ సినిమా చిత్ర దర్శకుడిగా ఘనత పొందారు. ఈ విజయపథంలో ఆయన ఇప్పటివరకు కేవలం 5 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో కథన శైలి, తెరకెక్కించిన విధానం, దృష్టికోణం భారతదేశ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. పైగా ప్రేక్షకులు, విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఇవాళ (నవంబర్ 20)న రాజ్ కుమార్ హిరానీ పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసిన 5 బ్లాక్బస్టర్లపై ఓ లుక్కేద్దామా..! 1. మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003) సంజయ్ దత్, అర్షద్ వార్సి, విద్యాబాలన్ నటించిన రాజ్ కుమార్ హిరానీ తొలి చిత్రం. ఈ సినిమా ఆయనకు మాస్టర్ స్టోరీ టెల్లర్ అనే ట్యాగ్‌ని సంపాదించిపెట్టింది. ఈ చిత్రం ఆ సంవత్సరంలో అతిపెద్ద వసూళ్లలో ఒకటిగా నిలవడమే కాకుండా మున్నా, సర్క్యూట్ పాత్రలు బాలీవుడ్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అవి వారికి ఇంటి పేర్లుగా కూడా మారాయి. మహాత్మా గాంధీ ధర్మ బద్ధమైన సిద్ధాంతాలపై అవగాహన కల్పించేందుకు హాస్యంతో తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్. ఈ సినిమాను తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ కూడా చేశారు. 2. లగేరహో మున్నాభాయ్ (2006) మున్నాభాయ్ ఎంబీబీఎస్‌కు సీక్వెల్‌గా వచ్చిందే లగేరహో మున్నాభాయ్. మొదటి భాగంలో ఉన్న నటీనటులే రెండో భాగంలో కూడా ఉంటారు. సామాజిక సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాను కూడా తెలుగులో శంకర్ దాదా జిందాబాద్ పేరుతో తెరకెక్కించారు. 3. 3 ఇడియట్స్ (2009) బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ 10, అత్యంత పాత్ బ్రేకింగ్ చిత్రాలలో ఒకటిగా పేరొచ్చిన చిత్రం 3 ఇడియట్స్. ఒకరకంగా ఏ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థికైనా ఒక సిలబస్ లాంటిదీ సినిమా. నిజ జీవితంలో, చదువులో ముఖాముఖి పోటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు రాజ్ కుమార్ హిరానీ. 3 ఇడియట్స్ పూర్తిస్థాయి వినోదభరితంగా ఉంటూనే మంచి సామాజిక సందేశాన్ని ఇస్తుంది. 4. పీకే (2014) ‘3 ఇడియట్స్’ ఘనవిజయం తర్వాత రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్‌తో కలిసి మళ్లీ ఒక కొత్త తరహా కథను తెరకెక్కించారు. ఒక గ్రహాంతర వాసి, మతం, దేవుడి పేరుతో జరుగుతున్న దుష్ప్రచారాల గురించి భూమిపై ఉన్న ప్రజలను భయపెట్టే విభిన్న కోణం నుంచి ఈ ఆసక్తికరమైన కథనాన్ని అందించారు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నటించారు. 5. సంజు (2018) సంజు చిత్రం 2018లో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటి. మొదటిసారిగా తెరపై సంజయ్ దత్ పాత్రను రణ్‌బీర్ కపూర్‌తో తెరకెక్కించి హిట్ కొట్టారు రాజ్ కుమార్ హిరానీ. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హృదయాన్ని హత్తుకునే ఈ కథనంలో విక్కీ కౌశల్, అనుష్క శర్మ కూడా నటించారు. ఈ చిత్రం అనేక అవార్డులను కూడా దక్కించుకుంది. అలాగే రణ్‌బీర్ కపూర్‌కు అపారమైన గుర్తింపు తీసుకొచ్చింది. -
పసిడి ‘పట్టు’ చిక్కలేదు కానీ...
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట పండింది కానీ... పసిడి పట్టు ఎవరికీ చిక్కలేదు. అటు పురుషుల ఈవెంట్లో, ఇటు మహిళల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. శుక్రవారం స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు. 62 కేజీల కేటగిరీలో సెమీస్ దాకా ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చలాయించిన సంజూ దేవి తీరా ఫైనల్‌కొచ్చేసరికి పట్టు సడలించింది. రష్యా రెజ్లర్ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూ ‘పసిడి’కలను కలగానే మిగిల్చింది. బౌట్లో సంజూకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఎలీనా తేలిగ్గా పడేసింది. 65 కేజీల ఫైనల్లో భటేరికి మాల్డొవా రెజ్లర్ ఇరినా రింగాసి చెక్ పెట్టింది. 12–2 తేడాతో భటేరిని ఓడించింది. కాంస్య పతక పోరులో నిలిచిన సనేహ్ (72 కేజీలు) గాయంతో విలవిలాడుతూ బౌట్ మధ్యలోనే వైదొలగింది. మరియమ్ గుసెనొవా (రష్యా) 3–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయాన్ని భరించలేక సనేహ్ ఆటను కొనసాగించలేకపోయింది. ఈ టోర్నమెంట్లో మహిళా రెజ్లర్లు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. 3 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో భారత్ 6 పతకాలు సాధించినప్పటికీ ఒక్కటి (రజతం) మినహా అన్నీ కాంస్యాలే ఉన్నాయి. గ్రీకో రోమన్ రెజ్లర్లు అంతా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లలో ఏ ఒక్కరు సెమీస్ అయినా చేరలేకపోయారు. -
ఇంకా లభించని బాలుడు సంజు ఆచూకీ
-
రణ్‌బీర్ మా ఇంటికొచ్చి ఆఫర్ ఇచ్చాడు
బాలీవుడ్లో సంచనాలకు మారుపేరు కంగనా రనౌత్. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా పరిణతి సాధిస్తూ... స్టార్ హీరోయిన్గా ఎదిగిన తీరులో ఆమెకు ఆమే సాటి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెబుతూ.. ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. క్వీన్ సినిమాతో ఉత్తమ నటిగా అవార్డు పొందిన కంగనా.. సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక పాత్ర నచ్చకపోతే బడా బాబుల ఆఫర్లను సైతం తిరస్కరిస్తానని ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. తాజాగా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, బడా నిర్మాత ఆదిత్య చోప్రాకు తాను గతంలో నో చెప్పిన విషయాన్ని పింక్‌విల్లాతో పంచుకున్నారు. సంజు, సుల్తాన్ సినిమాల్లో నటించే అవకాశం తనకు లభించిందని అయితే తానే వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు.(చిన్నప్పుడే డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా) ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ... ‘‘సంజు సినిమాలో నటించమని రణ్‌బీర్ కపూర్ మా ఇంటికి వచ్చి మరీ నాకు ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో పాత్ర నాకు అంతగా నచ్చలేదు. అందులో నటనకు ఆస్కారం ఉన్నట్లు అనిపించలేదు. కాబట్టి కుదరదని చెప్పాను. అసలు రణ్‌బీర్‌కు నో చెప్పే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా?ఒక్కసారి ఆలోచించండి. ఇంకో విషయం.. సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా కోసం ఆదిత్య చోప్రా తొలుత నన్ను సంప్రదించారు. నేను కుదరదన్నాను. దాంతో ఆయన నాకు ఫోన్ చేసి... ఇంకెప్పుడూ నాతో కలిసి పనిచేయనని చెప్పారు. అదే జరిగింది. అయినా నచ్చని పని చేయనందుకు పశ్చాత్తాపం లేదు’’ అని కంగనా చెప్పుకొచ్చారు ఇక... నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే తనను ఇండస్ట్రీలో నిలబెట్టాయని.. సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయకపోవడం కాస్త వేదనకు గురిచేసిందని కంగనా పేర్కొన్నారు. పద్మావత్ తర్వాత సినిమా చేద్దామన్నారని.. కానీ కుదరలేదని విచారం వ్యక్తం చేశారు. కాగా సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన సంజు భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా సుల్తాన్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. -
టాప్ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్!
‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్ డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్‌కి పెద్ద షాకే. -
‘రాజ్‌కుమార్ హిరాణీ నాపై లైంగిక దాడి చేశాడు’
సాక్షి, న్యూఢిల్లీ: మీటూ ఉద్యమం బాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది. హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని ఆయన వద్ద పనిచేసిన సహాయ దర్శకురాలు ఆరోపణలు చేశారు. సంజు సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఆమెపై సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో 2018 మార్చి-సెప్టెంబర్ మధ్యకాలంలో హిరాణీ తనపై లైంగిక దాడి చేశాడని, తనను లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించారు. ఈ మేరకు ఈ ఘటన గురించి సంజు సినిమా నిర్మాత విధూవినోద్ చోప్రాకు ఆమె ఈమెయిల్ పంపినట్లు తెలిసింది. ‘హిరాణీ మంచి పేరున్న దర్శకుడు. నేను కేవలం ఆయన వద్ద పనిచేస్తున్న అసిస్టెంట్‌ను. నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. నా పట్ల జరిగిన దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సిం వచ్చింది’’ అని ఆమె మెయిల్ ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు. తనపై వస్తున్న ఆరోపణలను హిరాణీ తీవ్రంగా ఖండించారు. ఆయన తరఫు న్యాయవాది ఆనంద్ దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ.. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆయపై కావాలనే ఎవరో తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆయన పేరు చెడగొట్టడానికి ఎవరో ఇలా చేయిస్తున్నారని అన్నారు. రాజ్‌కుమార్ హిరాణీ వంటి పెద్ద దర్శకుడిపై ఓ సహాయ దర్శకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ మీటూ ఉద్యమం తీవ్రతరమైంది. -
మంచి చాన్స్ మిస్
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా. -
ఆమిర్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టిన ‘‘సంజు’’
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా అగ్రకథానాయకుల రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘‘టైగర్ జిందా హై’’ రికార్డును తుడిచిపెట్టిన ‘సంజు’ మూడవ స్థానంలో ఉన్న ఆమిర్ ఖాన్ ‘‘పీకే’’ రికార్డును సైతం బద్దలుకొట్టింది. విడుదలైన 5 వారాల్లో 341కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా సంజు నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా మొదటి రెండు స్థానాల్లో బాహుబలి-2(510కోట్లు), దంగల్(387కోట్లు) ఉన్నాయి. కొత్తగా విడుదలవుతున్న సినిమాలకు సంజు గట్టిపోటీ ఇస్తోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన సంజు సినిమాలో రణ్‌బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. -
‘నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను’
బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంజు మూవీ హిట్‌తో ఇటు ప్రొపెషనల్ లైఫ్‌లో, కో స్టార్ అలియా భట్‌తో ఏర్పడిన సరికొత్త ప్రేమ బంధంతో అటు పర్సనల్ లైఫ్‌లోనూ సంతోషంగా గడుపుతున్నారు. అయితే సినిమాల కన్నా... హీరోయిన్లతో కొనసాగించిన ప్రేమాయణాలతోనే ఈ చాక్లెట్ బాయ్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. సంజు ట్రైలర్ లాంచ్ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘సంజుకు 308 మంది ఉన్నారు. కానీ, తన ప్రియురాళ్ల సంఖ్య ఇంకా పదికి కూడా చేరలేదని’ రణ్‌బీర్ నిజాయితీగా ఒప్పేసుకున్నాడు కూడా. అలియాతో రిలేషన్ షిప్ గురించి చెబుతూ... ‘ప్రేమలో పడటం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కొత్త మనిషి.. కొత్త ఆలోచనలు.. పాత విషయాలనే మరోసారి కొత్తగా చేస్తుంటామని.. అయితే ప్రస్తుతం తాను చాలా మారానని, బంధాలకు చాలా విలువ ఇస్తానని’ అన్నారు. దీపికాతో బ్రేకప్ అనంతరం కూడా రణ్‌బీర్ ఇలాగే ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘అవును. నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ను మోసం చేశాను. అపరిపక్వత, అనుబంధాలను పటిష్ట చేసుకునే నేర్పు లేకపోవడం.. అడ్వాంటేజ్ తీసుకోపోవడం.. ఇవన్నీ నా తప్పులే. కానీ ప్రస్తుతం నేను రియలైజ్ అయ్యాను. అందుకే ఓ కొత్త వ్యక్తితో.. ఓ ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను. మా ఇద్దరికీ పరస్పరం నమ్మకం, ప్రేమ ఉన్నాయి. గతంలో నాకు ఇలాంటి వ్యక్తి తారసపడలేదు. అందుకే బ్రేకప్ అయ్యిందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కత్రినా గురించి గొప్పగా చెప్పారు. అయితే ప్రస్తుతం కత్రినాతో బ్రేకప్ చేసుకున్న తర్వాత అలియా గురించి కూడా ఇలాగే మాట్లాడటంతో.. రణ్‌బీర్ మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కావడం లేదంటూ బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. -
చెత్త సినిమాగా తేల్చేశారు
బాలీవుడ్లో గత శుక్రవారం రిలీజ్ అయిన చిత్రాల్లో ఒకటి సంజయ్ దత్ నటించిన సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ -3. ఉన్నంతలో కాస్త పెద్ద చిత్రంగా భావించిన ఈ చిత్రం ఏ దశలోనూ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపం చూపించలేకపోయింది. టిగ్మాన్షూ ధూల్హియా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో జిమ్మీ షెయిర్గిల్, మహి గిల్, సంజయ్ దత్, చిత్రాంగద సింగ్ కీలకపాత్రలు పోషించారు. లీడ్ పాత్రల ఫెర్ఫార్మెన్స్ మాట పక్కన పెడితే కథలో పెద్దగా పసలేకపోవటంతో పూర్ రివ్యూలు దక్కాయి. క్రిటిక్స్ పరమ చెత్త మూవీగా తేల్చేశారు. రెండు రోజులకే డిజాస్టర్ టాక్ మూటగట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్లలోనూ ఢీలా పడిపోయింది. కేవలం రూ. 5 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి.. మేకర్లకు భారీ నష్టాన్ని అందించింది. లాంగ్ రన్లో ఈ చిత్రం కలెక్షన్లు సింగిల్ డిజిట్ దాటడమే కష్టంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ దత్ బయోపిక్ సంజు మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై కలెక్షన్లను దాటేసి వసూళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. మరికొన్ని రోజుల్లో పీకే రికార్డును కూడా క్రాస్ చేసే మూడో స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా హయ్యెస్ట్ గ్రాసర్ దంగల్, బాహుబలి-2 లు టాప్ 2 స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే. -
ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసర్ లిస్ట్‌లో ‘సంజు’!
రణ్‌బీర్ కపూర్ లుక్‌ను రిలీజ్ చేసినప్పటినుంచీ సంజు సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక సినీ అభిమానులు సంజు కోసం ఎదురుచూశారు. మొత్తానికి సినిమా విడుదలై రికార్డుల వేటను మొదలుపెట్టింది. సినిమా రిలీజ్ రోజు నుంచీ కలెక్షన్ల మోతమోగిస్తోంది. సంజు మూవీ కంటెంట్ పట్ల కొందరు వ్యతిరేకతను ప్రదర్శిస్నున్నా.. అవేమీ సినిమా కలెక్షన్లపై ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. మొన్నటికి మొన్న వివాదాస్పద దర్శకుడు వర్మ ఈ సినిమాపై తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. నిజాల్ని దాచి సంజయ్‌దత్‌ను మంచిగా చూపించాడనే విమర్శలు వినిపిస్తోన్నా.. ఈ మూవీ మాత్రం బాలీవుడ్లో ఆల్‌టైమ్ హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన ఐదో వారాంతం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయని ప్రముఖ ట్రేడ్ అనలిష్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పేర్కొన్నారు. టైగర్ హై జిందాను దాటి.. పీకేను చేజ్ చేస్తూ.. ఇప్పటికి నాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా 339కోట్లతో వసూళ్లతో దూసుకెళ్తోందంటూ ట్వీట్ చేశారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ నటన ఈ మూవీకి హైలెట్‌గా నిలిచింది. #Sanju crosses *lifetime biz* of #TigerZindaHai... Now FOURTH HIGHEST GROSSING *Hindi* film... Chasing #PK *lifetime biz* now... [Week 5] Fri 45 lakhs, Sat 87 lakhs, Sun 1.15 cr. Total: ₹ 339.75 cr. India biz. ALL TIME BLOCKBUSTER. — taran adarsh (@taran_adarsh) July 30, 2018 -
‘సంజు’ టీంకు షాకిచ్చిన గ్యాంగ్‌స్టర్
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన సినిమా ‘సంజు’ . పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమాలో సంజయ్ దత్ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే దర్శకుడు తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ అబూ సలేం కూడా సంజు మేకర్స్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న సీన్ 15 రోజుల్లోగా తొలగించాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవంటూ’ తన లాయర్ ప్రశాంత్ పాండే ద్వారా అబూ సలేం ‘సంజు’ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపించాడు. సంజయ్ దత్‌ను కలవనేలేదు.. ‘1993 ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి తనకు అబూ సలేం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరఫరా చేశాడని రణ్‌బీర్ కపూర్ చేత చెప్పించారు. అసలు నా క్లైంట్(అబూ సలేం) సంజయ్ దత్‌ను ఒక్కసారి కూడా కలవలేదు, ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదు. కాబట్టి ఆయన పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించిన ఈ సీన్‌ను 15 రోజుల్లోగా తొలగించాలి. అదే విధంగా అబూ సలేంకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పాలి. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని’ ప్రశాంత్ పాండే నోటీసులో పేర్కొన్నారు. కాగా ముంబై అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడైన అబూ సలేంను దోషిగా నిర్ధారించిన టాడా ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. -
క్రిస్మస్ కానుకగా ‘మొఘల్’..!!
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఆటగాళ్లు, నటులు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితం ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ‘సంజు’ సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో మరికొన్ని బయోపిక్‌లు తెరక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. కాగా ప్రస్తుతం బీ- టౌన్లో మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. ప్రఖ్యాత మ్యూజిక్ కంపెనీ టీ- సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, టీ- సిరీస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సుభాష్ కపూర్(జాలి ఎల్ఎల్బీ ఫేం) దర్శకత్వం వహించనున్నారు. ‘మొఘల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో గుల్షన్ కుమార్‌గా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను ఈ క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోందట. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. BIG NEWS... Aamir Khan Productions and TSeries to release Gulshan Kumar biopic in Christmas 2019... Written and directed by Subhash Kapoor... Filming to begin early next year. — taran adarsh (@taran_adarsh) July 26, 2018 -
ఒక్క యాడ్ కోసం 6 కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సినిమా వారికి వర్తించినంత బాగా వేరే ఎవరికి వర్తించదమో. ఎందుకంటే విజయాలు ఉంటేనే వారికి గుర్తింపు, ఆదాయం. అందుకే ఫామ్‌లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు హీరో హీరోయిన్లు. ప్రస్తుతం ఇదే బాటలో ఉన్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. ఇన్నాళ్లు వరుస వైఫల్యాలు చూసిన రణ్‌బీర్ కెరీర్‌ను ‘సంజు’ ఒక్కసారిగా మలుపుతిప్పింది. దాంతో ఆయన తన పారితోషికాన్ని రెండింతలు పెంచేశారంట. అయితే పారితోషికం పెంచింది సినిమాలకు కాదు, ప్రకటనల కోసం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ‘సంజు’ విజయం తర్వాత ఈ హీరో ప్రకటనల కోసం తీసుకునే పారితోషకాన్ని రెండు రెట్లు పెంచినట్లు సమాచారం. గతంలో రణ్‌బీర్ కమర్షియల్ వర్క్ కోసం రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల రూపాయలు తీసుకునేవారంట. కానీ ఇప్పుడు రోజుకు రూ.6 కోట్లు అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రణ్‌బీర్ దాదాపు 10 బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేస్తున్నట్లు సమాచారం. ‘సంజు’ తర్వాత రణ్‌బీర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్ట్‌లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టులో తొలి పార్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
తెరపైకి ఆర్జీవీ ‘సంజు’
ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంజుగా నటించిన రణ్‌బీర్‌కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం సంజు సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అదే పేరుతో (సంజు : ది రియల్ స్టోరీ) సంజయ్ దత్ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. హిరాణీ ‘సంజు’ సినిమాలో సంజయ్ దత్ వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించేందుకు మాత్రమే తాపత్రయ పడ్డారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఆర్జీవీ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... సంజయ్ దత్ నిజమైన బయోపిక్‌ను తెరకెక్కిస్తానని పేర్కొన్నారు. ‘హిరాణీ సంజు నచ్చింది. కానీ నా సినిమాలో రెండు దశాబ్దాలుగా సంజయ్‌ను వెంటాడుతున్న ఓ సమస్య గురించి ప్రధానంగా చర్చించబోతున్నానంటూ’ పరోక్షంగా ముంబై పేలుళ్ల కేసు గురించి వ్యాఖ్యానించారు. సంజయ్ వద్దకు ఏకే- 56 రైఫిల్ ఎలా వచ్చింది.. అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి నా సినిమాలో చూస్తారంటూ ఆర్జీవీ హింట్ ఇచ్చారు. ఇందుకోసం సంజయ్ కుటుంబ సభ్యులతో పాటు అతడి సన్నిహితులను, కొంత మంది పోలీసు, విచారణ అధికారులను సంప్రదిస్తున్నానని పేర్కొన్నారు. -
‘మహానటి’కి మరో గౌరవం..!
సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ వసూళ్లతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్లో జరుగునున్న ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో మూడు ప్రధాన విభాగాల్లో మహానటి పోటి పడనుంది. ఈ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటి కేటగిరిలో కీర్తీ సురేష్ బాలీవుడ్ స్టార్స్ రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్, విద్యాబాలన్‌లతో.. సహాయ నటి కేటగిరిలో సమంత.. రిచా చడ్డా, ఫ్రిదా పింటో, మెహర్ విజ్‌లతో పోటి పడుతున్నారు. ఇక ఉత్తమ చిత్రం కేటగిరిలో తెలుగు సినిమా రంగస్థలంతో పాటు ప్యాడ్‌మ్యాన్, హిచ్కీ, సంజు, సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి భారీ చిత్రాలతో మహానటి పోడిపడనుంది. -
‘ఆమె గొంతు వినగానే ఏడుపు ఆపుకోలేకపోయాను’
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సంజయ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉందనే విషయం అందరికి తెలిసిందే. స్వయంగా సంజయ్ దత్తే ఈ విషయం గురించి చెప్పారు. మా అమ్మ చనిపోయిందని చెప్పి అమ్మాయిల దగ్గర సానుభూతి పొంది వారికి దగ్గరయ్యేవాడినని సంజయే స్వయంగా ఒప్పుకున్నారు. అయితే నిజ జీవితంలో మాత్రం తన తల్లి నర్గీస్ దత్ చనిపోయినప్పుడు సంజయ్‌కు కన్నీళ్లు రాలేదంట. అసలు ఆ సమయంలో అతనికి ఎటువంటి ఫీలింగ్ కలగలేదంట. కానీ ఆమె చివరి రోజుల్లో ఆస్పత్రిలో ఉండగా తన కోసం పంపించిన మెసేజ్‌ను విన్నప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు సంజయ్. ఈ విషయం గురించి సంజయ్ మా అమ్మ నర్గీస్ ఎన్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నా కోసం ఒక సందేశాన్ని రికార్డు చేసి పంపించారు. దానిలో నా గురించి మా అమ్మ ‘సంజు అన్నింటి కంటే ముఖ్యమైనది వినయం. నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకో, దాన్ని కోల్పోకు. పెద్దలను గౌరవిస్తూ, ఒదిగి ఉండూ. అదే నిన్ను కాపాడుతుంది, అదే నీకు బలం’ అని తెలిపారు. ఆ సందేశం వినగానే నన్ను నేను నియంత్రించుకోలేక పోయాను. మా అమ్మ మరణించినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ మా అమ్మ మరణించిన తర్వాత ఆమె గొంతు విన్న నాకు ఏడుపు ఆగలేదు. అలా 4,5 గంటల పాటు ఏడుస్తునే ఉన్నాను అని తెలిపారు. నర్గీస్ మరణించిన తర్వాత సంజయ్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. ఆ వ్యసనం నుంచి బబయటపడేందుకు అమెరికాలోని రిహబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. ఆ సమయంలో సునీల్ దత్ ఈ టేప్‌లను సంజయ్ దగ్గరకు తీసుకువచ్చారు. ఆ టేప్‌లలో ఏముందో సునీల్ దత్‌కు కూడా తెలియదంటా. ఆయన వాటిని ప్రెస్ చేయగానే ఆ గదిలో ఒక్కసారిగా నర్గీస్ గొంతు ప్రతిధ్వనించిందంట. తల్లి గొంతు విన్న సంజయ్ తనను తాను నియంత్రించుకోలేక పోయారంటా. అన్నాళ్లు మనసులో గూడు కట్టుకుపోయిన బాధ ఒక్కసారిగా బయటకు వచ్చి అలా ఏడుస్తూనే ఉన్నారంటా. ఇదంతా నర్గీస్ చనిపోయిన మూడేళ్ల తర్వాత జరిగింది. సంజయ్ ఈ విషయం గురించి చెప్తుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నర్గీస్ 1981లో క్యాన్సర్‌తో బాధపడుతూ చనిపోయారు. ఆమె మరణం తర్వాతే సంజయ్ డ్రగ్స్‌కు బానిసయ్యారు. -
రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో సంబురాలు
దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. సంజు చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన సంజులో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్ పోషించగా, రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్టర్. సంజు బాబా లైఫ్‌లోని ప్రధాన కోణాలతో ఈ చిత్రాన్ని భావోద్వేగంగా హిరాణీ తెరకెక్కించాడు. తొలిరోజు రూ.34 కోట్లు రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలిచిన సంజు.. వరుస డిజాస్టర్లతో అయోమయంలో ఉన్న రణ్‌బీర్ కెరీర్‌కు భారీ సక్సెస్ ఇచ్చింది. అమీర్‌ఖాన్ దంగల్(2016 డిసెంబర్) తర్వాత రిలీజ్ అయిన (బాహుబలి-2ని మినహాయిస్తే...) చిత్రాలేవీ పట్టుమని మూడు వందల కోట్ల క్లబ్లో చేరలేకపోయాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ట్యూబ్‌లైట్.. షారూఖ్ నటించిన జబ్ హ్యారీ మెట్ సెజల్లు చతికిలపడగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన టైగర్ జిందా హై, రేస్-3.. పద్మావత్ లాంటి చిత్రాలు ఆ ఫీట్‌ను సాధించలేకపోయాయి. ఈ తరుణంలో బిగ్గెస్ట్ హిట్ కోసం బాలీవుడ్ దాహాన్ని సంజు తీర్చేసింది. ఇండియాలో రెండువారాల్లో 378 కోట్ల (గ్రాస్), రూ.295 కోట్ల(నెట్) వసూళ్లు(తొలివారంలోనే రూ.202 కోట్లు) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో 7 మిలియన్ క్లబ్ దాటేసి ఇంకా దూసుకుపోతోంది. విమర్శలు... అయితే సంజు జీవితంలోని చీకటి కోణాలు పేరిట రాజ్‌కుమార్ హిరాణీ తప్పులను కప్పిపుచ్చాడని పలువురు విమర్శలకు దిగారు. ఈ క్రమంలో మిశ్రమ రివ్యూలు ఇవ్వటంతోపాటు, పలు కోణాల్లో క్రిటిక్స్ సంజును తప్పుబట్టారు. అయితే తన జీవితం తెరిచిన పుస్తకమని, దాచేందుకు ఏం లేదంటూ విమర్శలపై సంజయ్ దత్ అంతే ఘాటుగా స్పందించారు. -
‘మా తల్లిదండ్రుల పాత్రలో ఎవరిని ఊహించలేను’
సంజయ్‌దత్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ‘సంజు’ సినిమా సూపర్‌హిట్టయిన సంగతి తెలిసింది. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ ప్రస్తుతం 300 కోట్ల రూపాయల క్లబ్ వైపు దూసుకుపోతుంది. ఒకప్పటి బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ సంజయ్ జీవతంలో ఉన్న ఎత్తుపల్లాలన్నింటిని దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు. మున్నాబాయ్ జీవితంలో మత్తు పదార్ధాల దశ, పలువురు హీరోయిన్లతో అతనికి ఉన్న సంబంధాలు, అక్రమాయుధాలు కలిగి ఉన్న కేసులో జైలుకెళ్లడం వంటి పలు అంశాలను వాస్తవికంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే ‘సంజు’ చిత్రంలో కేవలం సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రకు, తల్లి నర్గీస్ పాత్రలకే ఎక్కువ ప్రధాన్యం ఇచ్చారని, సంజయ్ సోదరిమణులు నమ్రతా దత్, ప్రియా దత్‌లను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం గురించి సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ ‘‘సంజు’ సినిమా నాకు నచ్చింది. కానీ సంజయ్ దత్ కుటుంబ సభ్యురాలిగా, సంజయ్‌కు అత్యంత ఆప్తురాలిగా సినిమాను విశ్లేషించాలంటే కాస్తా కష్టమే. ఎందుకంటే సంజయ్ జీవితంలో ప్రతి క్షణం నేను అతనితో పాటే ఉన్నాను. అతన్ని దగ్గరి నుంచి చూశాను’ అన్నారు. అలానే సునీల్ దత్ పాత్రలో నటించిన పరేష్ రావల్ గురించి మాట్లాడుతూ ‘మా నాన్న చాలా ప్రత్యేకం, ఆయన పాత్రలో నేను ఎవరిని ఊహించుకోలేను. నేను ప్రేక్షకురాలిని కాదు కదా. అందుకే మా నాన్న పాత్రలో నటించిన పరేష్ రావల్‌కు నేను అంతగా కనెక్ట్ కాలేకపోయాను. అయితే పరేష్ రావల్ పాత్ర నాకు నచ్చలేదని కాదు. కానీ నేను ఆయన పాత్రకు అంతగా కనేక్ట్ కాలేకపోయాను అంతే. ఎందుకంటే నేను సునీల్ దత్ కూతుర్ని’. అన్నారు. అలానే తమ తల్లి పాత్రలో నటించిన మనిషా కోయిరాల గురించి మాట్లాడుతూ ‘మా అమ్మ పాత్రకు మనీషా కోయిరాల బాగానే సరిపోయింది. కానీ సునీల్ దత్, నర్గీస్‌ల కూతురిగా వారి పాత్రలో మరొకరిని ఊహించలేను. అలానే సంజయ్ కుటుంబ సభ్యురాలిగా సినిమా గురించి ఎటువంటి కామెంట్ చేయలేను. కానీ ప్రేక్షకులు వారి వారి పాత్రలకు బాగానే కనేక్ట్ అయ్యారు. అది చాలా గొప్ప విషయం’ అన్నారు. సంజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ ఒదిగిపోయాడని మెచ్చుకున్నారు. ఈ సినిమాలో తనను బాగా కదిలించిన సన్నివేశాలు సంజయ్ మత్తుపదార్ధాలకు బానిసవ్వడం, ఆ తర్వాత వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అని తెలిపారు. ఈ విషయం గురించి ‘అది నిజంగానే చాలా కష్ట సమయం, ముఖ్యంగా మా నాన్న గారికి. కానీ సంజయ్‌కి వీటన్నింటి నుంచి బయటపడేందుకు కావాల్సిన ధైర్యం ఉంది. అందుకే మత్తు పదార్ధాల వ్యసనాన్ని జయించగలిగాడు. మళ్లీ దాన్ని పురావృతం కాకుండా చూసుకోగలిగాడు. అలానే సంజు జైలు జీవితం గడపడం కూడా చాలా కష్టమైన దశే. కానీ వీటన్నింటిని కూడా అతను ఎంతో ధైర్యంగా ఎదుర్కొగలిగాడు’ అని తెలిపింది. -
సంజయ్ దత్ గొప్పా.. ఎలా? : పాంచజన్య
న్యూఢిల్లీ : సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’ చిత్రాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధికారిక వార పత్రిక పాంచజన్య సమాజానికి బాలీవుడ్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎడిటోరియల్ కాలమ్‌లో సంజూ సినిమాను ఉద్దేశించి ఓ కథనాన్ని ప్రచురించింది. హాలీవుడ్ ‘ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ పేరుతో గణిత శాస్త్రంలో మేధావి అయిన రామనుజం జీవిత చరిత్రను తెరకెక్కిస్తే, బాలీవుడ్ మాత్రం అండర్వరల్డ్కు సంబంధించిన వారిపై చిత్రాలను తీస్తోందంటూ మండిపడింది. అండర్‌వరల్డ్‌ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ సంజూ సినిమాను తీశారని వ్యాఖ్యానించింది. ముంబై పేలుళ్లలో సంజయ్ దత్ దోషిగా తేలడాన్ని, అతని అరెస్ట్‌ను, కూతురితో అతనికున్న సంబంధాలను కూడా ఈ సందర్భంగా పాంచజన్య ప్రస్తావించింది. సంజయ్ దత్‌కు లేని అవలక్షణం లేదు. అతడు 1993 బాంబు పేలుళ్లు, మత హింసలో పాలుపంచుకున్నాడు. మారణాయుధాలను తన దగ్గర దాచుకున్నాడు. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. తన కూతురిని కొన్నేళ్లుగా కనీసం కలవనేలేదు. సినిమాలో చూపించినట్లుగా అతనికి 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం ఉంది. ఇదీ సంజయ్ దత్. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించి పొగడ్తలతో ముంచెత్తడంపై తీవ్ర స్థాయిలో ఆ పత్రిక ధ్వజమెత్తింది. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై కూడా పాంచజన్య విరుచుకుపడింది. గతంతో పీకే వంటి సినిమాను హిందువులకు వ్యతిరేకంగా హిరాణీ తీశారని, ఇప్పుడు అవలక్షణాలు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిని సమాజానికి ఏదో చేసేసినట్లు హీరోను చేసి చూపించడం సరియైన పద్దతేనా? అని ప్రశ్నించింది. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి గల్ఫ్ నుంచి నుంచి పెట్టుబడులు వస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. -
‘ఆయన లేఖ చూసి ఆశ్చర్యానికి లోనయ్యా’
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజు’. ఇందులో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్, తండ్రి సునీల్ దత్‌గా పరేష్ రావెల్ నటించారు. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పరేష్ రావెల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తనకు సునీల్ దత్ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. సునీల్ దత్ చనిపోయే కొద్ది రోజుల ముందు పరేష్‌కు ఓ లేఖ రాశారు. అతను చనిపోయిన రోజు తనకు ఆ లేఖ గురించి తెలిసిందని పరేష్ సునీల్ దత్తో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. ‘మే 25, 2005న.. నేను ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో సునీల్ దత్ స్వర్గస్తులయ్యారని తెలిసింది. సునీల్ నివాసానికి వెళుతున్నా, రాత్రి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని నా భార్యకు ఫోన్ చేసి చెప్పాను. సునీల్ దత్ నుంచి మీకో ఉత్తరం వచ్చిందని నా భార్య నాకు చెప్పింది. అందులో ఏం రాసుందని అడిగాను. ‘ డియర్ పరేష్ జీ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు, మీ కుటుంబ సంభ్యులు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అని రాసి ఉందని నా భార్య సమాధానమిచ్చింది. నా పుట్టిన రోజు మే 30న కానీ ఐదు రోజు ముందుగానే సునీల్ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాశారు. సునీల్ జీ, నేను పండగల సమయంలో కూడా ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకోం. ఆయన చనిపోవడానికి ముందు ఈ లేఖ నాకు రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది’ అని పరేష్ రావెల్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.265 కోట్లు వసూళ్లను రాబట్టి, రూ.300కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. -
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’
ముంబై: సంజయ్ దత్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతే కాకుండా అత్యంత తక్కువ సమయంలో రూ.200 కోట్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. పదో రోజు (ఆదివారం) రూ. 28.05 కోట్లు వసూలు చేసింది. దీంతో సంజు సినిమా ఇప్పటి వరుకూ రూ.265.48 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీ అవుతోంది. విడుదలైన తొలి మూడు రోజులకే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రణ్‌బీర్‌కపూర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాల, అనుష్క శర్మ, దియా మీర్జా, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. సంజయ్ దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ జీవించేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. -
‘సంజు’ సిన్మాకు సంజయ్ ఎంత తీసుకున్నారు?
బయోపిక్‌లు వాస్తవానికి దూరంగా తెరకెక్కుతున్నాయన్న విమర్శలు వస్తోన్నా.. సినిమాలు మాత్రం విజయవంతమవుతున్నాయి. బాలీవుడ్లో అందరూ ఎదురుచూసిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమా గత వారం విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటనకు బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోతోంది. రాజ్‌కుమార్ హిరాణీ గత సినిమాల మాదిరిగానే ‘సంజు’ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తోంది. విడుదలైన వారంలోనే దాదాపు 200కోట్లు కలెక్ట్ చేసి ప్రస్తుతం 250కోట్లకు పరుగెడుతోంది. అయితే ఈ సినిమాకు గాను సంజయ్‌దత్‌కు ఎంత ముట్టజెప్పారన్న వార్తలు వైరల్‌గా మారాయి. సంజయ్‌దత్‌కు మొదటగా ఓ పదికోట్లు ఇచ్చారని, సినిమా లాభాల్లో షేర్ కూడా ఉందనీ.. మొత్తంగా సంజయ్ దత్‌కు దాదాపు 20కోట్ల వరకు ముట్టవచ్చని బీటౌన్ టాక్. విదూ వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరాణీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో సోనమ్‌కపూర్, మనీషా కొయిరాల, పరేష్ రావెల్, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ ముఖ్యపాత్రల్లో నటించారు. -
సంజు సినిమాలో ఆ విషయాలు చూపలేదు!
ముంబై : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘సంజు’. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలై మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలన్నింటినీ తెరపై చూపించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నా.. చాలా ముఖ్యమైన విషయాలను విస్మరించారని విమర్శకులు అంటున్నారు. సంజయ్ జీవితంలో కీలక పాత్రలు పోషించిన వారిని తెరపై అసలు చూపలేదని వారి వాదన. వారిలో సంజయ్ దత్ ఆప్త మిత్రుడైన సల్మాన్ ఖాన్, ప్రియురాలు మాధురీ దీక్షిత్ వంటి వారిని చూపలేదని, సంజయ్ కథానాయకునిగా తెరకెక్కిన రాఖీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ టీనా మునిమ్‌తో సంజుకు ఉన్న అఫైర్ గురించి ప్రస్తావన లేదని వారు అంటున్నారు. రిషీ కపూర్ రాసిన ‘ఖుల్లంఖుల్లా’ అనే పుస్తకంలో టీనా మునిమ్ ప్రస్తావన తెచ్చారాయన. సంజయ్ అతని మిత్రుడు గుల్సన్ గ్రోవర్.. టీనా మునిమ్‌తో తనకు అఫైర్ ఉందన్న అనుమానంతో తనను కొట్టడానికి ఇంటికి వచ్చారని, అయితే తనకు కాబోయే భార్య నీతూ సింగ్ వారికి నచ్చచెప్పటంతో గొడవ సద్దుమణిగిందని ఆ పుస్తకంలో రిషీ కపూర్ రాసుకున్నారు. సంజయ్ జీవితంలోని ఎన్నో విషయాలను నిర్భయంగా చూపించిన చిత్రయూనిట్.. ఇలాంటి విషయాలను దాచిపెట్టడం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. -
సమాజాన్ని విస్మరించిన సినిమా
అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్’ల ముందు మోకరిల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిరసన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధానమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీసుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్ స్టర్లను ఎన్కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రాయాల్ని బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. దేశంలో బాగా ప్రతిభ గల, విజయవంతమైన బడా సినీ దర్శకులు అధి కారంలో ఉన్నవారికి ఏ మాత్రం జంకు లేకుండా ఎందుకు లొంగిపోతున్నారు? విధూ వినోద్ చోప్రా– రాజ్‌కుమార్ హిరాణీ తాజా సినిమా సంజూ నా వాద నకు కారణం. సంజయ్‌దత్‌ని దుర్మార్గులైన జర్నలి స్టుల రాతలకు బలి అయిన నటునిగా ఈ సినిమాలో నిజాయతీ లేకుండా చిత్రించారని నేను చెప్పాను. అమెరికాలో ప్రసిద్ధ హాలీవుడ్ హీరో రాబర్ట్ డీ నీరో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను రాయడానికి వీలులేని మాటలతో తీసిపారేస్తూ మాట్లాడుతున్న ఈకాలంలో పెద్ద పెద్ద సినీ నిర్మాతలు రాజ్ ఠాక్రేకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ కొత్త సినిమా నిర్మాణం ఎందుకు ప్రారంభిస్తున్నారు? మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత రాజ్ ఎంతటి బెదిరింపు ధోరణితో మాట్లాడినా, కిందటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్త 288 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే సాధించగలిగారు. మరాఠీల కోసం పాటుపడుతున్నానని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఈ పార్టీకి 227 సీట్లున్న ముంబై మునిసి పల్ కార్పొరేషన్లో వచ్చిన స్థానాలు కేవలం ఏడే. అయితే ముంబై సినిమా నిర్మాతలు రాజ్‌ఠాక్రే ముందు ఎందుకు సాగిలపడుతున్నారు? కారణం– ఆయన గెలిచేదేమీ లేకున్నా చాలా విధ్వంసం సృష్టిం చగలరు. అందుకే సినీరంగం ఇలాంటివారికి తేలికగా లొంగిపోతుంది. ఈ సినీ పరిశ్రమకు మాఫియా ముఠాలన్నా, కండబలంతో అధికారం చెలాయించే వారన్నా భయం ఎక్కువ. భారత సమాజంలో దుర దృష్టకర విషయం ఏమంటే, మన సృజనశీల వర్గాలు సాధారణంగా అధికారంలో ఉన్నవారికి అనుకూ లంగా వ్యవహరిస్తారు. ఇండియాలో కొందరు విద్యా రంగానికి చెందిన అధ్యాపకులు, చిత్రకారులు, కొందరు జర్నలిస్టులు మినహా సృజనాత్మక రంగా లకు చెందిన పలువురు ప్రముఖులు ప్రభుత్వాలు, మాఫియా ముఠాల ముందు తాబేదారులుగా ప్రవ ర్తిస్తారు. అయితే వందల కోట్ల వసూళ్లు, వేలాది కోట్ల విలువైన స్టూడియోలున్న హిందీ సినీరంగం ఎందు కింత సిగ్గుమాలిన రీతిలో వ్యవహరిస్తోంది? పెరిగిన ‘దర్బారీ’ సంస్కృతి! ప్రాచీన కాలం నుంచీ దేశంలో సాగుతున్న దర్బారీ సంస్కృతి నుంచి ఈ ధోరణి పుట్టుకొచ్చింది. కళలు, సంస్కృతి ప్రధానంగా మహరాజులు, తర్వాత సుల్తా నులు, బాద్షాల ప్రాపకంలోనే ముందుకు సాగాయి. రాజాస్థానంలో ఉంటేనే సంగీతకారులు లేదా చిత్ర కారులు తమ ప్రతిభాపాటవాలను సొమ్ము చేసుకో వడం తేలిక. రాజుల పోయి ‘భారత ప్రభుత్వం’ వచ్చినా ఆస్థాన సంస్కృతి అలాగే నిలబడిపోయింది. ప్రభుత్వం ఈ కళాకారులకు నిధులు, స్కాలర్షి ప్లు, విదేశీ పర్యటనలకు అవకాశాలు, ఢిల్లీలో భారీ బంగళాలు, ఇంకా పద్మ అవార్డులు ఇస్తోంది. అయితే, రచయితలు ముఖ్యంగా కవులు, చిత్రకా రులు ఈ సర్కారీ ‘దయ’ నుంచి బయటపడ్డారు. ఈ ర^è యితల్లో ఎక్కువ మంది వామపక్ష సిద్ధాంతాలను నమ్మడం వల్లే భిన్న మార్గం ఎంచుకోగలిగారు. సినీరంగంలో అంతు లేని డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, అత్యంత శక్తిమంతులైన ప్రముఖులు ఊహకందని రీతిలో పిరికిపందలుగా మారిపో యారు. వామపక్ష తరంతో పాటే మొదట కనిపించిన తెగువ, తిరుగుబాటు మాయమయ్యాయి. హిందీ పాటల రచయిత, కవి గుల్జార్(83) ఒక్కరే ధైర్యంగా నిలబడ్డారు. మిగిలినవారు ముఖ్యంగా, మొదటి తరం కళాకారుల వారసులు అధికారంలో ఉన్నవారికి సలాం చేస్తూ ఆస్థాన రచయితలు, కవులుగా మారి సంతోషంగా జీవిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే నిజమైన, తీవ్ర పోటీ ఉన్న రాజకీయాల్లోకి దిగే సాహసం చేశారు. ఈ సినీ ప్రముఖులందరిలో అతి పెద్ద కళాకారుడైన అమితాబ్ బచ్చన్ ఎన్నికల రాజకీయాల్లోకి దిగిన మూడేళ్ల లోపే ‘గాయపడి’ వెనుదిరిగారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు. అధికారంలో ఉన్నవారిని తర్వాత ఏనాడూ ఆయన ప్రశ్నించలేదు. ఇటీవల కఠువా, ఉన్నావ్ రేప్ ఉదంతాలు వెలుగు చూసినప్పుడు ఆయన ‘గంభీర మౌనం’ పాటించారు. బాల్ ఠాక్రేపై తీసిన ‘సర్కార్’లో నటించినా అమితాబ్ నిజజీవి తంలో ఎవరి జోలికీ పోలేదు. అయితే, రాజ్ బబ్బర్, శత్రుఘ్న సిన్హా, హేమ మాలిని, స్మృతి ఇరానీ, దివ్య స్పందన వంటి కొందరు మాత్రం భిన్న మార్గంలో పయనిస్తున్నారు. మిగిలిన కళాకారులు కొందరు రాజ్యసభ నామినేటెడ్ సభ్యులుగా సంతృప్తిగా బతు కుతూ అవసరం లేకున్నా ప్రభుత్వాలకు అనుకూ లంగా సభలో ఓటు వేస్తున్నారు. నీతులు చెప్పడంతోనే పేచీ! ఈ సినీ ప్రముఖులు తాము రూపొందించే చిత్రాల్లో చెప్పే నీతులు కారణంగా వారిని తప్పు పట్టాల్సి వస్తోంది. మున్నాభాయ్ సిరీస్ సహా 3 ఈడియట్స్ నుంచి పీకే వరకూ రాజ్‌కుమార్ హిరాణీ సామాజిక సందేశంతో విజయవంతమైన సూపర్ హిట్ సిని మాలు తీశారు. విధువినోద్ చోప్రా దేశభక్తి బోధిస్తూ తీసిన ద మిషన్ కశ్మీర్ చూసి జనం కోట్లాది రూపా యలు సమర్పించుకున్నారు. చోప్రా సొంత రాష్ట్ర మైన కశ్మీర్లో ఐఎస్ఐ కుట్రలను సినిమాలోని మంచి వ్యక్తులు భగ్నం చేయడం మనకు బాగా నచ్చింది. అయితే వారు నివసించే ముంబై నగరంలో మాత్రం ఐఎస్ఐని తేలికగా వదిలేశారు. సంజయ్‌దత్ అమా యకుని పాత్రలో సామాన్య ప్రజానీకం మధ్య నటిస్తే బాగుంటుంది. కాని, లోపాలతోపాటు ప్రతిభ ఉన్న హీరో పాత్రలో ఆయన అంతగా ఆకట్టుకోలేడు. సంజయ్‌కు ఏకే 56 రైఫిల్ సరఫరా చేసిన దావూద్ ఇబ్రహీం, ఆయన సోదరుడు అనీస్, ఈ మాఫియా సభ్యులు ఇంకా కరాచీ నుంచి తమ నేర సామ్రాజ్యం నడుపుతూనే ఉన్నారు. అందుకే దావూద్ ‘భాయ్’ ముఠాతో ఎందుకు పేచీ పెట్టుకోవాలనేది ముంబై సినీప్రముఖుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇక జనం కోసం ‘భాయ్’ సల్మాన్ మరో సంచలన చిత్రం నిర్మిస్తారు! కరాచీలో ఉంటున్న ఓ బడా భాయ్‌ని కోర్టు విచారణకు రప్పించడానికి ఈ పనిచేస్తారు. అగ్రతారలు చెప్పే సాకు ఏమంటే... ఇలాంటి విషయాలపై ధైర్యంగా మాట్లాడకపోవడా నికి అగ్రతారలకు చెప్పడానికి సాకులున్నాయి. ఏం మాట్లాడినా తాము భారీగా నష్టపోతామని వారు వాదిస్తారు. ఓసారి బహిరంగంగా ధైర్యంగా మాట్లాడి ఆమిర్ ఖాన్ ‘పొరపాటు’ చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఎదురైన స్పందన ఆయన నోరు మూయించింది. చివరికి ప్రభుత్వంతో ఓ విషయం ప్రచారానికి ఆమిర్‌తో కుదిరిన ఒప్పందం రద్ద యింది. ఇలాంటి సందర్భమే వచ్చినప్పుడు మరో అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ ఈ మాత్రం ధైర్యం కూడా ప్రదర్శించలేదు. కానీ, ముస్లిం పేర్లున్న పాత్రల్లో నటిస్తూ షారుఖ్ కనీసం ‘మౌన ప్రకటన’ అయినా చేయగలిగారు. సల్మాన్ పూర్తిగా అందరినీ ఓడించే మంచి హిందువుగా నటించారు. తన తాజా చిత్రంలో ఐఎస్ఐని దెబ్బదీసే పాత్రలో రాణించారు. అయితే, కేసుల్లో దోషిగా తేలడం వల్ల సల్మాన్‌కు కూడా సంజయ్‌దత్ మాదిరిగానే సమస్య ఎదురవు తోంది. సినిమా వంటి మాధ్యమాలు సమకాలీన సామాజిక, ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబించడం ఆనవాయితీగా వస్తోంది. ఆరంభంలో ఈ పనిచేసిన సినిమా రంగం ఇప్పుడు ఆ బాధ్యత విస్మరించింది. సంజూ చిత్రంలో జర్నలిస్టులను దుర్మార్గులుగా చిత్రించడం, వారిపై విద్వేషం కక్కడంపై నాకు కోపం ఏమీ లేదు. పత్రికల్లో ఈ సినీ ప్రముఖులు తమకు అనుకూలంగా ఎలా రాయించుకుంటు న్నారో నాకు బాగా తెలుసు. అలాగే సినిమాలు బాగు న్నాయని డబ్బు ఇచ్చి మరీ ‘రేటింగ్స్’ సంపాదించు కుంటున్నారనేది బహిరంగ విషయమే. అయితే, జర్నలిస్టులను ఇంతగా మాయ చేసి లోబరుచుకున్నా గాని–1993 ముంబై బాంబు పేలుళ్ల చరిత్రను ఎవరూ మార్చలేరు. శక్తిమంతమైన సినీ ప్రపంచం సమాజంలో మార్పు తీసుకురాగలదు. బడుగు బల హీన వర్గాలు, మైనారిటీల హక్కుల రక్షణకు తోడ్పడ గలుగుతుంది. అయితే, అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వాలు, సొంత మూక బలమున్న రాజ్‌ఠాక్రే, దావూద్ ఇబ్రాహీం వంటి ‘బలవంతుల’ ముందు తలలు వంచితే ఈ పనులు చేయడం కుదరదు. కొన్ని వర్గాల ప్రజలపై ఉన్న అనుమానాలను తప్పని చెప్ప డంగాని, రాజ్యాధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించ డంగాని సాధ్యం కాదు. ప్రభుత్వం కోరుకుంటుంది కాబట్టి మరుగుదొడ్లపై సినిమా తీయడం తేలికే. దేశంలో సినిమాల నిర్మాణం మొదలై ఇంత కాల మైనా పది మంది అగ్రశ్రేణి హీరోల్లో ఒక్కరూ కూడా ఓ దళితుడి పాత్ర వేయలేదు. రజనీకాంత్ మాత్రమే సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో ఆ పని చేయగలిగారు. ముంబై ‘భాయ్‌ల’ ముందు మోకరిల్లారు! అత్యంత శక్తిమంతమైన భారత సినీ ప్రపంచం నేర ప్రపంచంలో రారాజులైన ‘భాయ్’ల ముందు మోకరి ల్లిందనే విషయం మనం మరువ రాదు. తమ నిర సన తెలపడానికి ఈ సినీ ప్రముఖులు ఏనాడూ ప్రధా నమంత్రి ఇంటికి ఊరేగింపుగా పోలేదు. వారు గుట్టు చప్పుడు కాకుండా రాజీపడతారు. ముంబై పోలీ సుల్లో ఓ చిన్న బృందం గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లలో కాల్చిచంపే పని ప్రారంభించగానే వారు సాగిలపడి మరీ తమ జోలికి రావద్దని వేడుకున్నారు. అయితే, అంతా చీకటే కాదు, కొత్త ఆశలు చిగురించే పరి స్థితులు కనిపిస్తున్నాయి. అనేక మంది కొత్త, యువ సినీ దర్శకులు, కళాకారులు తమ అభిప్రా యాలు, ఆదర్శాలు, లక్ష్యాలను బాహాటంగా తమ చిత్రాల్లో ప్రదర్శించడానికి వెనుకాడడం లేదు. అధికారంతో విర్రవీగేవారిని ప్రశ్నించడానికి వారు తెగువ ప్రద ర్శిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య పెరగడమే గాక, వారు వృత్తిలో విజయం సాధించడం మనకు ఆనందాన్నిచ్చే విషయం. వారేమీ అగ్రశ్రేణి దర్శ కులు, నిర్మాతలు, తారలు కాలేదు. ఎప్పటికీ కాకపో వచ్చు కూడా. కానీ, వారు శక్తిమంతులు. వారే హిందీ సినిమా రంగాన్ని భవిష్యత్తులో సృజనాత్మక మార్గంలో నడిపిస్తారు. శేఖర్ గుప్తా, వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షో సందర్భంగా వీరిద్దరు కలుసుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన రాజ్ కుమార్ హిరాణి ‘సంజు’, తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో తరుణ్ భాస్కర్ తీయాలనుకుంటున్న సినిమాలకు సంబంధించిన ఆలోచనలను కూడా హిరిణితో చర్చించారట. సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన సంజు గత శుక్రవారం రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా అదే రోజు రిలీజ్ అయి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది. -
కష్టాల్లో ఒక స్నేహితుడుండాలి
సంజయ్ దత్‌ను జైల్లో పడేశారు. పెద్ద స్టార్. పైగా టాడా కేసులో ఉన్నాడు. అతడిని ఎవరైనా చంపితే అదొక గొడవ అని ఒంటరి గదిలో ఉంచారు. చీకటి... మాట్లాడే దిక్కు లేదు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. కేసు నడిచింది. ఏకె 56 రైఫిల్ ఉన్నందుకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. అప్పటికే మూడేళ్లు జైల్లో ఉన్నాడు కనుక ఇంకో మూడేళ్లు ఎరవాడ జైల్లో గడపాలి. ముంబై బ్లాస్ట్స్తో కాని టెర్రిరిస్ట్ చర్యతో కాని సంజయ్ దత్‌కు ఏం సంబంధం లేదనీ కాని ప్రాణభయంతో అనుమతి లేకుండా ఏకె 56 దగ్గర ఉంచుకున్నందుకు మాత్రమే జైలు శిక్ష అని కోర్టు ప్రకటించింది. సంజయ్ దత్ ఎరవాడ జైలుకు చేరుకున్నాడు.ఈసారి నలుగురులో తిరిగేంత స్వేచ్ఛ ఉంది.కొంచెం ఊపిరి సలుపుకునే వీలు ఉంది.కాని అక్కడ సంజయ్‌కు ఏ జ్ఞాపకం వెంటాడింది.తల్లి ఏనాడో మరణించింది. తండ్రి కూడా గతించాడు.తోబుట్టువుల దగ్గర అన్ని రహస్యాలు మాట్లాడలేము.ఇక మిగిలిందల్లా స్నేహితులు.ఆ స్నేహితులే సంజయ్ దత్‌కు జైల్లో పదే పదే గుర్తుకొచ్చారు. దగ్గర కూర్చునే స్నేహితులు, ధైర్యం చెప్పే స్నేహితులు, గట్టిగా హగ్ చేసుకునే స్నేహితులు... మనిషి ఆస్తి ఐశ్వర్యాలు కోల్పోయి ఒంటరి కాడు. స్నేహితులను కోల్పోయినప్పుడే ఒంటరి అవుతాడు.జైల్లో ఉన్నప్పుడు అసలైన శిక్ష స్నేహితులను కలవకపోవడమే.‘సంజు’ సినిమాలో ఒక స్నేహితుడి పాత్ర ఉంటుంది. తెర మీద ఆ పాత్ర పేరు ‘కమలేష్ కన్హయ్యలాల్ కపాసి’. నటుడు వికీ కౌశల్ దానిని పోషించాడు.విక్కీ కౌశల్ గతంలో ‘మసాన్’ సినిమాతో ప్రేక్షకులకు తెలుసు. కాని ‘సంజు’ సినిమాతో ఎక్కువమందికి తెలిసి పెద్ద స్టార్ అయ్యాడు. ‘సంజు’ సినిమాలో ఈ పాత్ర చివరికంటా సంజయ్దత పాత్ర పోషించిన రణబీర్ కపూర్‌కు తోడుగా ఉంటుంది. అమెరికాలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేరినప్పుడు అతనికి బాసటగా నిలుస్తుంది. అతడి కష్టంలో అండగా నిలుస్తుంది. అలాంటి స్నేహితుడు లేకపోతే సంజయ్‌దత్ ఏమైపోయి ఉండేవాడా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులకు నిజ జీవితంలో ఈ పాత్ర ఎవరా అనే కుతూహలం కలుగుతుంది. అతని పేరు ‘పరేష్ ఘెలాని’. అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్. ఇతనిది సంజయ్ దత్‌ది ఒకే వయసు. సంజయ్ తల్లి నర్గిస్ వైద్యం కోసం ఆమెను అమెరికాలోని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఆమె కోలుకోవడం కోసం ఒక ఫ్యాన్‌గా అక్కడి వస్తాడు. అప్పుడే సంజయ్‌దత్‌కు పరిచయం అవుతాడు. ఆ పరిచయం చాలా మంచి స్నేహంగా మారుతుంది. అప్పటికే సంజయ్‌దత్ డ్రగ్స్‌కు బానిస అయి ఉంటాడు. అతణ్ణి ఆ మత్తు నుంచి బయటపడేయడానికి పరేష్ ఘెలాని చాలా ప్రయత్నించాడు. రిహాబిలేషన్ సెంటర్ నుంచి సంజయ్ పారిపోయి పరేష్ దగ్గరకు చేరుకున్నప్పుడు అతడే తిరిగి సెంటర్‌కు పంపాడు. ఏకే 56 ఉందన్న కారణంగా అరెస్టయినప్పుడు కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి సంజయ్ కోసం తిప్పలు పడ్డాడు. అయితే మీడియా ఏకంగా ముంబై పేలుళ్లకు సంజయే సూత్రధారి అన్నంతగా కథనాలు వెలువరించడంతో అమెరికాలో ఎఫ్బిఐ తనను కూడా విచారిస్తుందన్న భయంతో సంజయ్‌కు దూరం అయ్యాడు. ఎరవాడ జైలులో సంజయ్‌కు ఎక్కువగా గుర్తొచ్చిన స్నేహితుడు అతడే. ఇన్నాళ్లకు మళ్లీ ‘సంజు’ సినిమాతో పరేష్ వార్తలలోకి ఎక్కాడు.ఈ సినిమా ఆ ఇద్దరి స్నేహాన్ని మళ్లీ బలపరిచింది.ప్రేక్షకులు ప్రతి మనిషికి ఇలాంటి స్నేహితుడుండాలి అని మెచ్చుకుంటున్నారు.ఆమిర్ ఖాన్ సినిమా చూసి పరేష్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్‌కు ప్రశంసలు కురిపించాడు. అన్నట్టు విక్కీ కౌశల్ సినిమా ఇండస్ట్రీలో ఒక సాధారణ స్టంట్ మేన్ కుమారుడు. కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి ‘సంజు’ సినిమాతో పెద్ద పేరు సంపాదించుకున్నాడు. ఇంతకీ సంజు చూశారా? ఇంకా లే....దా! -
అందుకే వరుసగా 8 విజయాలు సొంతమయ్యాయి..!!
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తన గారాల కూతురు సోనమ్ కపూర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సినీ రంగంలో కూతురి విజయాలను ప్రస్తావిస్తూ ... ‘జీవితాన్ని తీర్చిదిద్దడంలో మన ఎంపిక చేసుకునే అంశాలే కీలక పాత్ర పోషిస్తాయి. సోనమ్.. స్క్రిప్టులు, డైరెక్టర్లు, కంటెంట్ విషయాల్లో నువ్వు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నావ్. వృత్తి పట్ల నిబద్ధత, నీ కఠోర శ్రమల ఫలితంగానే వరుసగా 8 విజయాలు నీ సొంతమయ్యాయి...! చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూసి నేనెంతో గర్వపడుతున్నాను’ అంటూ అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. సోనమ్ హిట్ సినిమాలు... నీర్జా, రాంజానా, భాగ్ మిల్కా భాగ్, ప్యాడ్మాన్, ఖూబ్సూరత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్, సంజు సినిమాలకు సంబంధించిన పోస్టర్ల ఫొటోల సమాహారాన్ని అనిల్ కపూర్ తన ట్వీట్‌తో పాటుగా షేర్ చేశారు. 2007 లో ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. మొదట్లో సరైన హిట్లు లేక సతమతమైంది. కానీ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రాలు వీరే ది వెడ్డింగ్, సంజులు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం రాజ్ కుమార్‌కు జంటగా నటిస్తోన్న ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలో సోనమ్ కపూర్ తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది . The choices we make shape our lives. @sonamakapoor you have made some pretty damn good ones when it comes to scripts, directors & content...Your hard work, commitment & conviction has resulted in 8 hits in a row! So happy & proud of you! pic.twitter.com/R4LuMIh7oM — Anil Kapoor (@AnilKapoor) July 2, 2018 -
బాహుబలి-2 రికార్డు బద్ధలు
ఇండియన్ భాక్సాఫీస్ వద్ద బాహుబలి ది కంక్లూజన్ సృష్టించిన రికార్డులు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయి. హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేసింది. అప్పటి నుంచి విడుదలైన చిత్రాలు భారీస్థాయిలో స్క్రీన్లలో రిలీజ్ చేసినప్పటికీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాయి. అయితే ఎట్టకేలకు రీసెంట్ రిలీజ్ సంజు బాహుబలి-2 నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం అధిగమించింది. ఈ చిత్రం ఆదివారం(మూడో రోజు) రూ. 46.71 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్) పేరిట ఉంది. ఏదైతేనేం మొత్తానికి బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించేస్తోంది. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్లో నటించిన సంజు కేవలం మూడు రోజుల్లోనే రూ. 120 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తొలిరోజ దాదాపు రూ.35 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనర్‌గా నిలవటంతోపాటు.. రణ్‌బీర్ కెరీర్ బెస్ట్ ఓపెనర్‌గా కూడా నిలిచింది. సాహోరే.. హైబ్రిడ్ పిల్లా -
మేకింగ్ ఆఫ్ సంజు
-
వంద కోట్ల క్లబ్లో ‘సంజు’
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సంజు అదే రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో రణబీర్‌కపూర్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్ వ్యవహారాలకు సంబంధించి, ఎఫైర్ల గురించి చెబుతూ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు 34 కోట్టు రాబట్టి రణబీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే వీకెండ్ కూడా పూర్తయింది. మొదటి వారాంతానికి వంద కోట్ల క్లబ్లో చేరిన సంజు.. రెండో వారాంతానికి రెండు వందల కోట్ల క్లబ్‌లోకి చేరతాడని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. TOP 5 - 2018 Opening Weekend biz... 1. #Sanju ₹ 120.06 cr 2. #Padmavaat ₹ 114 cr [5-day *extended* weekend; select previews on Wed, released on Thu]... Hindi + Tamil + Telugu. 3. #Race3 ₹ 106.47 cr 4. #Baaghi2 ₹ 73.10 cr 5. #Raid ₹ 41.01 cr India biz. — taran adarsh (@taran_adarsh) July 2, 2018 -
ఆయనకు నేను బిగ్ ఫ్యాన్ : హీరోయిన్
సాక్షి, ముంబై : సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సంజుగా రణ్‌బీర్ నటన విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా సంజు మూవీ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, రణ్‌బీర్ కపూర్‌లపై హీరోయిన్ అలియా భట్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసిన అనంతరం తన స్పందన తెలియజేస్తూ... ‘రాజ్‌కుమార్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ ఇవ్వడం సాధారణ విషయంగా మారిపోయింది. అయితే గత రెండేళ్లలో ఆయన తీసిన గొప్ప సినిమా ఏదంటే మాత్రం కచ్చితంగా సంజు అనే చెప్తాను. ఈ సినిమా ద్వారా ఆయన స్టామినా ఏంటో మరోసారి రుజువైంది’ అంటూ అలియా వ్యాఖ్యానించారు. పనిలో పనిగా తన స్నేహితుడు రణ్‌బీర్ కపూర్‌ను కూడా పొగడ్తల్లో ముంచెత్తారు అలియా. ‘సంజు పాత్రలో రణ్‌బీర్ జీవించేశారు. నా ఫేవరెట్ సినిమాల్లోని టాప్ 10లో సంజుకు మొదటి స్థానం ఇస్తాను. విక్కీ కౌశల్, పరేష్ జీ, అనుష్క శర్మ, సోనమ్ కపూర్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇదొక అద్భుతమైన సినిమా’ అంటూ అలియా ప్రశంసించారు. -
‘అమ్మ చనిపోతే కనీసం ఏడవలేదు’
భావోద్వేగాలతో తెరకెక్కిన రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ కావటంతో ఆయన జీవితంలోని ఆసక్తికర కోణాలను తెలుసుకునేందుకు కొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సంజూ బాబా పాత వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అందులో తన తల్లి చనిపోయిన సమయంలో తాను ఎలా ప్రవర్తించిందనేది చెబుతూ భావోద్వేగానికి లోనైన ఇంటర్వ్యూ ఒకటుంది. 90వ దశకంలో తీసిన ఆ ఇంటర్వ్యూలో సంజయ్ చెప్పిన మాటలు... ‘నా తల్లిది చాలా మంచి మనస్తత్వం. సెట్స్‌లో అందరితోనూ మంచిగా మెలిగేది. ఆమె చనిపోయినప్పుడు నేను ఎలాంటి ఎమోషన్లను చూపించలేకపోయా. కనీసం ఏడవలేదు కూడా. రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో గ్రూప్‌గా కూర్చున్న సమయంలో హఠాత్తుగా ఓ ఆడియో క్లిప్ ప్లే అయ్యింది. అందులో ఉంది నా తల్లి వాయిస్. (బ్యాక్ గ్రౌండ్లో నర్గీస్‌దత్ గొంతు వినిపించింది...)... ‘అది విన్నాక ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో?.. ఎంత జాగ్రత్తలు తీసుకుందో? తను నా గురించి ఏం కోరుకుందో? అప్పుడు నాకు అర్థమైంది. అంతే నా ప్రమేయం లేకుండా కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. అలా నాలుగైదు గంటలు ఏడ్చుకుంటూ ఉండిపోయా. తప్పో.. ఒప్పో.. అన్నీ నాలోనే ఉంటాయి. వాటిని బయటకు తీసినప్పుడే మారినమనిషిని అవుతాను’ సంజు ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సంజు డెబ్యూ చిత్రం రాకీకి కొద్ది రోజుల ముందే నటి, సునీల్ దత్ సతీమణి నర్గీస్ దత్ చనిపోవటం తెలిసిందే. -
సంజయ్ దత్ ఎమోషనల్ వీడియో
-
90ల నాటి నుంచే ‘సంజు’ ప్రమోషన్...!
బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా 1993 నాటి ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేసిన రిషి కపూర్... ‘ థ్యాంక్యూ! ఈ నలుగురు అప్పుడెప్పటి నుంచో మూవీ(సంజు)ని ప్రమోట్ చేస్తూ ఉన్నారంటూ’ కామెంట్ చేశారు. అసలు విషయమేమిటంటే... 1993 ముంబై పేలుళ్ల సమయంలో అరెస్టైన సంజయ్ దత్‌కు సంఘీభావం తెలుపుతూ బాలీవుడ్ పరిశ్రమ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ‘సంజు వీ ఆర్ విత్ యూ’ (సంజు మేము నీతో ఉన్నాం) అనే పోస్టర్‌తో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్‌లు నిల్చుని ఉన్న పాత ఫొటోను రిషి కపూర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న రణ్‌బీర్ సంజు సినిమాను ప్రమోట్ చేసేందుకు రిషి కపూర్ కష్టపడాల్సిన అవసరం లేదోమో’ అంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సంజు సినిమా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. సంజు పాత్రకు ప్రాణం పోసిన రణ్‌బీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతుండటంతో రిషి కపూర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. Thank you! These people been promoting the film ever since! pic.twitter.com/Ot2iDM9Hk7 — Rishi Kapoor (@chintskap) June 29, 2018 -
హయ్యెస్ట్ గ్రాసర్‌గా ‘సంజు’
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ తొలిరోజు కలెక్షన్ల దుమ్మురేపింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్ అయిన చిత్రాల్లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు రణ్‌బీర్ కెరీర్లోనే బెస్ట్ వసూళ్లు(ఫస్ట్ డే) రాబట్టిన చిత్రంగా నిలిచింది. సంజు మూవీ రివ్యూ బాలీవుడ్ ట్రేడ్ అనాలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం ఇండియాలోనే సంజు ఫస్ట్ డే రూ. 34.75 కోట్లు రాబట్టింది. ఇక రణ్‌బీర్ కెరీర్లో ఇప్పటిదాకా తొలిరోజు వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంజు నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు బేషరమ్(రూ.21.56) పేరిట ఉంది. చిత్రానికి పాజిటివ్ టాక్ రావటంతో వీకెండ్లోనే వంద కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ఆదర్శ్ అంచనా వేస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. -
సంజయ్ దత్తు
సినిమా హీరోలకు మేకప్ మామూలే. తళతళలాడిపోడానికి పూస్తారు. సమాజంలో కూడా రంగులు పులిమేవారుంటారు. నిజం సరిగ్గా తెలియకపోతే ఆ రంగులు భలే ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. ఒక్కోసారి ఆ రంగులే నిజం అనిపిస్తాయి. సంజయ్‌దత్ జీవితంలో అలాంటి రంగులు ఎన్నో! ఉగ్రవాది.. వ్యసనపరుడు.. స్త్రీలోలుడు.. వగైరా.. వగైరా..! ‘సంజూ’ సినిమాలో రాజ్‌కుమార్ హిరాణీ ఈ రంగుల్లో నిజానిజాల్ని ఇంకో కోణంలో చూపించాడు. సంజయ్‌ని ముత్యంలా చూపించడానికి దత్తత తీసుకున్నాడు! డ్రగ్స్, ఆల్కహాల్, అమ్మాయిలు, గన్స్, గూండాలు.. ఇదంతా సినిమా సరుకు. సంజయ్‌దత్ జీవితాన్ని ‘సంజు’ సినిమాగా తీసిన రాజ్‌కుమార్ హిరాణీకి ఈ సరుకు ఎక్కడా వెతుక్కోకుండానే గంపగుత్తగా ఒకటే చోట దొరికింది. సంజయ్‌దత్ జీవితంలోనే ఇవన్నీ ఉన్నాయి. వాటికి హిరాణి కొంచెం ఎమోషన్ కలిపాడు. పిక్చర్ హిట్ అయింది. ఐదు స్టార్లకు అంతా నాలుగు స్టార్లు వేస్తున్నారు. సంజయ్ రోల్ వేసిన రణబీర్ కపూర్ కూడా మళ్లీ చాలాకాలం తర్వాత ఈ సినిమాతో స్టార్ అయ్యాడు. ‘నేను టెర్రరిస్టును కాదు’ పాతికేళ్లుగా సంజయ్‌దత్ తన నెత్తిమీద ‘టెర్రరిస్ట్’ అనే గంపను మోస్తున్నాడు. అది అతడి జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్నిప్పుడు దించి, సినిమాలో పెట్టి సంజయ్ మనో భారం తగ్గించాడు హిరాణీ. కళంకితుడన్న ఇమేజ్‌ని తొలగించి సంజయ్‌ని ప్రక్షాళన చెయ్యిడానికి హిరాణీ ఈ సినిమా తియ్యలేదు. ఒక స్టార్ తనయుడు.. విలాసాలకు, విపరీతాలకు అలవాటు పడినవాడు.. జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో కూడా హిరాణీ చెప్పలేదు. నిరంతరం ప్రశ్నలతో విసిగించి, వేధించే మీడియా నుంచి పారిపోయి.. ‘నేను టెర్రరిస్టును కాదు’ అని అరిచి చెప్పడానికి బయోగ్రఫీని రాయించాలనుకుంటాడు రణబీర్‌కపూర్ (సంజు). పూర్తిగా అతడి సైడు నుంచి స్టోరీ చెప్పాలి. అనుష్క వస్తుంది బయోగ్రఫీ రాయడానికి. వస్తుంది కానీ, గొప్ప ఉద్వేగంతో వచ్చేం కూర్చోదు. టెర్రరిస్ట్ బయోగ్రఫీలో తెలియంది ఏముంటుందీ?! ‘ఏముంటుందిలే అనుకునేదానిలో ఎంతో ఉండొచ్చు’ అని రణబీర్ భార్య దియా మీర్జా అంటుంది. రణబీర్ కూడా అంతా నిజమే చెబుతాను అంటాడు. అనుష్క రెడీ అవుతుంది. సినిమా మొదలౌతుంది. ఒక్కో ఘట్టం చెప్పుకుంటూ పోతాడు రణవీర్. ఒక్కో ఘట్టం రాసుకుంటూ పోతుంది అనుష్క. ఒక్కో ఘట్ట తీసుకుంటూ పోతాడు రాజ్ హిరాణీ. రీలంతా రియల్ లైఫే బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్‌దత్ జీవితగాథను సినిమాగా తీస్తున్నట్లు ప్రకటించి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్‌బీర్ కపూర్‌ను ‘సంజు’ మూవీ రోల్‌కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్, ప్రొమోల్లో అచ్చం ‘సంజూబాబా’లా కనిపించిన రణ్‌బీర్.. ఆ అంచనాలను తారస్థాయికి చేర్చాడు. కథేమిటంటే.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి, తొలి చిత్రం (రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు. సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు అతడి జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో తనకు తానుగా లొంగిపోవాలని భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవితాన్ని కథగా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. బయోగ్రాఫర్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె (అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. అనుష్కకు వివరిస్తూ ఉండగా కథ సాగుతుంది. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ ఈ ట్యాగ్ లైన్‌తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు వివరించే ప్రయత్నం చేశాడు. వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్‌ను తెరపై ఆయన డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్‌గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూస గుచ్చినట్లుగా వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగ్రుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి (పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్‌ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. ఈ క్రమంలో సంజు కెరీర్‌ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను (మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగింది. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. దియా మెప్పించారు సంజయ్ దత్ పాత్రలోకి రణ్‌బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు.. చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపిస్తుంది. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్ (విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు–కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కొయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్–విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్‌ను అందించింది. ‘కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్’, ‘రుబీ రుబీ’ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోపాటు విజువల్‌గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్‌కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 5300 స్క్రీన్లు ‘సంజు’తో రణ్‌బీర్ కపూర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో స్టార్టయ్యింది. శుక్రవారం సినిమాకి íß ట్ టాక్ వస్తే శని, ఆదివారాలు హౌస్‌ఫుల్ అవుతాయి. అటువంటిది ‘సంజు’ సినిమా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోరెత్తిందనే చెప్పాలి. ఇకపోతే బాలీవుడ్లో రెండు రకాలుగా సినిమా ఓపెనింగ్స్ ఉంటాయి. హాలిడే ఓపెనింగ్, నాన్ హాలిడే ఓపెనింగ్. శుక్రవారం నార్త్ ఇండియాలో నాన్ హాలిడే ఓపెనింగ్ 55 శాతంతో మార్నింగ్ షో స్టార్టయ్యింది. అంటే అది చాలా పెద్ద ఓపెనింగ్ కింద లెక్క. మొత్తమ్మీద 4000 స్క్రీన్లతో పాటు విదేశాల్లోని 1300 స్క్రీన్లు కలుపుకుని 5300 స్క్రీన్లలో రిలీజైంది సంజు. మొదటిరోజు షేర్ 33 కోట్లనుండి 36 కోట్ల వరకు వస్తుందని బిజినెస్ అనలిస్ట్‌ల విశ్లేషణ. ఇది రీసెంట్గా రిలీజైన సల్మాన్‌ఖాన్ రేస్3 కంటే ఎక్కువ. (రేస్3 ఫస్ట్ డే షేర్ 29.5 కోట్లు) అని ‘సంజు’ విశేషాలను వివరించారు ఫాక్స్ స్లార్ ఇండియా హైదరాబాద్ ప్రతినిధి తెలిపారు. ‘సంజు’కు భారీ షాక్ కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్డీ ప్రింట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్ మీడియా యూజర్లు ఆ వెబ్సైట్ లింక్‌ను స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్ అయిన విషయం తెలుసుకున్న రణ్‌బీర్ కపూర్ అభిమానులు ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్ అయ్యింది. దయచేసి ఈ లింక్‌లను ఎవరికీ షేర్? చేయకండి’ అంటూ రణ్‌బీర్‌కు మద్దతు తెలుపుతున్నారు. సంజుపై కామెంట్స్ సంజు చాలా బాగా నచ్చింది. తండ్రీకొడుకులు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ మనసుని కదలించేలా చెప్పారు రాజ్ కుమార్‌గారు. రణ్‌బీర్ కపూర్ అవుట్‌స్టాండింగ్‌గా చేశారు. విక్కీ కౌశల్ మైండ్‌బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎంటర్టైన్ చేస్తూనే ఎంగేజింగ్‌గా కథ చెప్పారు హిరాణీ. టీమ్ అందరికీ కంగ్రాట్స్. – ఆమిర్ ఖాన్ కేవలం రెండున్నర గంటల్లో ఏడుస్తూనే, నవ్వించడం అచీవ్మెంట్. ప్రస్తుతం ఉన్న నెంబర్ 1 ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణీ. సంజయ్ దత్లా రణ్‌బీర్ అత్యద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మిమిక్రీ చేస్తున్నట్టుగా కాకుండా సంజయ్ దత్ క్యారెక్టర్ స్కిన్‌లోకి వెళ్లి మరి నటించాడు. మనందర్నీ స్క్రీన్‌కి కట్టిపారేస్తాడు. బ్లాక్‌బస్టర్ హిట్కొట్టినందుకు టీమ్‌కి కంగ్రాట్స్. – దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మాస్టర్ ఆఫ్ సినిమా నుంచి మరో బెస్ట్ జెమ్ బయటకు వచ్చింది. బెస్ట్ ఇవ్వడంలో రణ్‌బీర్, రాజ్ కుమార్ హిరాణీ ఇద్దరూ పోటీపడ్డారు. – దర్శకుడు హరీష్ శంకర్. రాజ్ కుమార్ సార్... మంచి సినిమా ఇవ్వడం ప్రతిసారీ మీకెలా సాధ్యం అవుతుంది? మైండ్‌బ్లోయింగ్ సినిమా. నవ్వించారు. ఏడిపించారు. రణ్‌బీర్, రాజు సార్ మీ ఇద్దరికీ పెద్ద హగ్. థియేటర్ నుంచి ఓ బెటర్ పర్సన్‌గా.. నన్ను బయటకు పంపించారు. – ధనుశ్, తమిళ నటుడు మాస్టర్‌పీస్. బయోపిక్ తీయడమంటే ఆషామాషీ కాదు. కానీ, రాజు హిరాణీ, రైటర్ అభిజిత్ జోషీ అద్భుతమైన స్క్రీన్‌ప్లే రాశారు. పవర్ఫుల్. ఎంగేజింగ్, ఎమోషనల్. రాజ్‌కుమార్ ఎందుకు మాస్టర్ స్టోరీ టెల్లరో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రణ్‌బీర్ కపూర్‌కి ఈ సినిమాతో అవార్డ్లు, అభినందనలు అందుకుంటాడు. సినిమాలో ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో మెరిశారు. – తరణ్ ఆదర్శ్, ట్రెడ్ అనలిస్ట్ -
‘ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను’
భారీ అంచనాల మధ్య రికార్డు స్థాయిలో విడుదలైన ‘సంజు’ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొడుతూ సూపర్ హిట్ వైపు దూసుకెళ్తోంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖులు కూడా తెగ అభినందిస్తున్నారు. తాజగా ఈ జాబితాలోకి మరో సీనియర్ నటి చేరారు. విభిన్న కథలతో...అద్భుతమైన నటనతో హిందీ చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ హీరోయిన్ షబనా ఆజ్మీ ‘సంజు’ను అభినందిస్తూ ట్విటర్లో మెసేజ్ చేశారు. ఈ సందర్భంగా రిషి కపూర్‌ను ట్యాగ్ చేస్తూ ‘సంజు సినిమా చూశాను...రణ్‌బీర్ జీవితంలోనే ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. ‘సంజు’లో రణ్‌బీర్ యాక్టింగ్ చూసి నిజంగా ఒక్క క్షణం నేను ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను. విక్కి కౌశల్ నువ్వు నీ పాత్రకు న్యాయం చేశావు’అని మెసేజ్ చేశారు. -
‘సంజు’కు భారీ షాక్...
సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ చిత్రం బాక్సాఫీస్‌ల వద్ద కలేక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా కేవలం ఒక్క భాషలోనే 4000 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొన్ని గంటల క్రితమే విడుదలైన ఈ సినిమాకు ఇంతలోనే భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం సంజు సినిమానూ వదల్లేదు. ప్రస్తుతం ‘సంజు’ పైరసీ కాపీ, అది కూడా హెచ్డీ ప్రింట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అది కూడా పూర్తి నిడివి చిత్రం కావడం గమనార్హం. ఇది గమనించిన సోషల్ మీడియా యూజర్లు ఆ వెబ్సైట్ లింక్‌ను స్క్రీన్ షాట్స్ తీసి ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలైన కొద్దిసేపటికే ఈ సంఘటన జరగడం వల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశముందంటున్నారు విశ్లేషకులు. సినిమా లీక్ అయిన విషయం తెలుసుకున్న రణ్‌బీర్ కపూర్ అభిమానులు మాత్రం ఈ విషయం గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘నిజమైనా సిని అభిమానులు ఇలాంటి పనికిమాలిన చర్యలను ప్రోత్సాహించరు. వారు థియేటర్‌కి వెళ్లి, టిక్కెట్ కొని సినిమా చూస్తార’ని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘సంజు లీక్ అయ్యింది. దయచేసి ఈ లింక్‌లను ఎవరికీ షేర్ చేయకండి’ అంటూ రణ్‌బీర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం ఈ విషయం గురించి సీబీఎఫ్‌సీని విమర్శిస్తున్నారు. గతంలో సంజు సినిమాలోని టాయిలెట్ దృశ్యాలు విడుదలయినప్పడు సీబీఎఫ్సీ నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూ ‘టాయిలెట్ సీన్లు విడుదలైతే దేశ గౌరవాన్ని కించపరిచామని వాదించిన వారు ఇప్పుడు సినిమా మొత్తం లీక్ అయింది. అయినా ఎందుకు మాట్లడటం లేదు’ అని విమర్శిస్తున్నారు. -
‘సంజు’ మూవీ రివ్యూ
టైటిల్ : సంజు జానర్ : బయోపిక్ తారాగణం : రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, దియా మీర్జా, విక్కీ కౌశల్, అనుష్క శర్మ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : రాజ్‌కుమార్ హిరాణీ నిర్మాత : విదూ వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరాణీ Sanju Telugu Movie Review: బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవితగాథ సంజును ప్రకటించి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ. పైగా సక్సెస్ లేక సతమతమవుతున్న యువ హీరో రణ్‌బీర్ కపూర్‌ను సంజు రోల్‌కు తీసుకోవటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ట్రైలర్-ప్రొమోల్లో అచ్చం సంజు బాబాల కనిపించిన రణ్‌బీర్.. ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చాడు. భారీ అంచనాల మధ్య సంజు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంజుగా రణ్‌బీర్ ఏమేర అలరించాడో చూద్దాం... కథ.. స్టార్ వారసుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టి డెబ్యూ చిత్రం(రాకీ)తోనే స్టార్డమ్ సంపాదిస్తాడు సంజు(రణ్‌బీర్ కపూర్). సినీ ప్రస్థానం కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ అలవాటు, అక్రమాయుధాల కేసు సంజు(రణ్‌బీర్ కపూర్) జీవితాన్ని కుదిపేస్తాయి. ఆయుధాల కేసులో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తానుగా లొంగిపోవాలని సంజు భావిస్తాడు. కానీ, అంతకు ముందే తన జీవిత కథగా మలిచేందుకు ప్రయత్నిస్తాడు. రచయిత కోసం ఎదురుచూస్తున్న తరుణంలో విన్నె(అనుష్క శర్మ) ముందుకు వస్తుంది. తన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సంజు.. విన్నెకు వివరిస్తూ కథ సాగుతుంది. విశ్లేషణ.. మనకు బాగా తెలిసిన వ్యక్తి జీవితంలోని ఆసక్తికర అంశాలను కూలంకుశంగా తెలుసుకోవాలనే ఆసక్తి సహజం. ‘ఒక్క మనిషి.. పలు కోణాలు’ అంటూ ట్యాగ్ లైన్‌తోనే సంజు జీవితంలోని దశలను దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ వివరించే యత్నం చేశాడు. అయితే వివాదాల నటుడు సంజయ్ దత్ లైఫ్‌ను తెరపై హిరాణీ డీల్ చేసిన విధానం అద్భుతం. వివాదాలను కూడా ఎమోషనల్‌గా మలిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన జీవితంలో ఎత్తుపల్లాలను పూసగూచ్చినట్లు వివరిస్తూ సంజు కథ ముందుకు సాగుతుంది. తల్లి మరణం, హీరోగా ఎదిగే క్రమంలో డ్రగ్స్ అలవాటుతో సంజు సతమతమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు చేసే స్ట్రగుల్, విమర్శలు వెల్లువెత్తినా తండ్రి(పరేష్ రావెల్) కొడుక్కి అండగా నిలవటం, ముఖ్యంగా వాళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే ఫస్టాఫ్‌ను గ్రిప్పింగ్‌గా నడిపిన దర్శకుడు.. సెకండాఫ్‌ను మొత్తం జైలు జీవితం, కేసు, కోర్టు ప్రధానాంశాలుగా నడిపించాడు. తాను టెర్రరిస్ట్‌ను కాదంటూ సంజు పడే మానసిక సంఘర్షణ, భావోద్వేగపూరిత సన్నివేశాలతోనే ద్వితీయార్థాన్ని కానిచ్చేశాడు. అయితే ఈ క్రమంలో సంజు కెరీర్‌ను చూపించినా.. వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. హీరోయిన్లతో రిలేషన్షిప్స్, వైవాహిక జీవితంలోని లోతైన అంశాలను(మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశల గురించి) చూపించకుండా సంజు కథ సాగటం గమనార్హం. ఈ విషయంలో ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురికావొచ్చు. నటీనటుల విషయానికొస్తే.. సంజయ్ దత్ పాత్రలోకి రణ్‌బీర్ కపూర్ జీవించేశాడు. సంజు అంటే రణబీర్ అనేలా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొన్ని సన్నివేశాల్లో రణ్‌బీర్ తనను తాను అద్భుతంగా ఆవిష్కరించుకున్నాడు. డ్రగ్స్ బాధితుడిగా చేసే సన్నివేశాలు అయితేనేం, వీధుల్లో అడుక్కునే సీన్ అయితేనేం, పోలీస్ విచారణలో, ఆస్పత్రిలో స్నేహితుడితో... ఒక్కటి కాదు చెప్పుకుంటూ పోతే బోలెడు సీన్లు. ఎమోషనల్ సీన్లలోనే కాదు.. కామెడీతో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను కూడా పండించాడు. తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్‌ను తప్ప వేరే ఎవరినీ ఊహించుకోలేం అనిపించింది. సాధారణంగా ఎంటర్టైన్మెంట్ పాత్రలకు పేరుగాంచిన ఈ సీనియర్ నటుడు.. సీరియస్ నటనతో సంజుకు బలంగా నిలిచాడు. ఇక సంజు బెస్ట్ ఫ్రెండ్ కమలేష్(విక్కీ కౌశల్) పాత్ర సినిమాకు మరో ఆకర్షణ. కష్టాల్లో ఉన్న స్నేహితుడికి అండగా ఉండటం, సంజు-కమలేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. నర్గీస్ దత్ పాత్రలో సీనియర్ నటి మనీషా కోయిరాలాకు పెద్దగా సీన్లు లేవు. అయినా ఉన్నంతలో ఆమె పాత్ర అలరిస్తుంది. భార్య మాన్యతా పాత్రలో దియా మీర్జా మెప్పించారు. సోనమ్ కపూర్, అనుష్క శర్మ, మిగతా పాత్రలు ఓకే. పలువురు సెలబ్రిటీలు, చివర్లో కాసేపు స్వయంగా సంజయ్ దత్ కనిపించటం ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్, రోహన్ రోహన్-విక్రమ్ మాంట్రెసె సంగీతం సినిమాకు తగ్గ మూడ్‌ను అందించింది. కర్ హర్ మైదాన్ ఫతే సాంగ్, రుబీ రుబీ పాటలు అలరిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోపాటు విజువల్‌గా కూడా సంజు మెప్పిస్తుంది. రాజ్‌కుమార్ హిరాణీ అద్భుతమైన స్టోరీ టెల్లర్. అందులో ఏ మాత్రం సందేహం లేదు. దత్ ఫ్యామిలీతో ఉన్న స్నేహాన్ని పక్కనపెట్టి మరీ కథానుగుణంగా కొన్ని సన్నివేశాలను స్వేచ్ఛగా తెరకెక్కించారు. చిత్రం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఓవరాల్‌గా హిరాణీ సినిమాల్లో లభించే హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమర్ ఎలిమెంట్స్ ‘సంజు’లో పుష్కలంగా లభిస్తాయి. ఫ్లస్ పాయింట్లు కథా-కథనం రణ్‌బీర్ కపూర్ మిగతా పాత్రలు సంగీతం మైనస్ పాయింట్లు కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించకపోవటం అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
సంజుపై సెక్స్ వర్కర్ల ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్ల మనోభావాలను దెబ్బతీశారంటూ బాలీవుడ్ చిత్రం సంజుపై జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. చిత్ర ట్రైలర్లో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు ఎన్సీడబ్య్లూలో ఫిర్యాదు చేశారు. ‘మీ భార్యతో కాకుండా ఎంత మందితో పడుకున్నారంటూ అనుష్క పాత్ర రణ్ బీర్ ను అడుగుతుంది. దానికి స్పందిస్తూ.. వేశ్యలతో కలుపుకుని చెప్పాలా? లేక.. అంటే వారిని మినహాయించి చెప్పాలంటే 308 మందితో... అంటూ సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సెక్స్ వర్కర్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యమకారుడు, న్యాయవాది గౌరవ్ గులాటి సెక్స్ వర్కర్ల తరపున ఎన్సీడబ్యూలో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చైర్పర్సన్ రేఖా శర్మ బుధవారం మీడియాతో ధృవీకరించారు. ‘చిత్రంలో ఓ డైలాగ్పై అభ్యంతరం వ్యక్తం అయ్యింది. ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్‌కు ఈ ఫిర్యాదును పంపించాం. వారిచ్చే నివేదిక మీదే చర్యలు ఆధారపడి ఉంటాయి’ అని ఆమె చెప్పారు. కాగా, రణ్‌బీర్ కపూర్, పరేష్ రావెల్, మనీషా కోయిరాలా, సోనమ్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన సంజు రేపు అంటే జూన్ 29న విడుదల కానుంది. -
ఆ హీరో కెరీర్లోనే అతిపెద్ద రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా ‘సంజు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రలో చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ నటించాడు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. రాజ్ కుమార్ హిరానీ ట్రాక్ రికార్డ్ తో పాటు సంజయ్‌దత్ బయోపిక్ కావటంతో సంజు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది. అందుకు తగ్గట్టుగా దాదాపుగా 4000 స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఒక్క భాషలో రిలీజ్ అయ్యే సినిమాను ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేయటం కూడా ఓ రికార్డే. అంతేకాదు రణబీర్ కపూర్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ కావటం విశేషం. -
తారల విషాదగాథలే... తెరపై అద్భుత కావ్యాలా?
చిత్ర సీమలో వెలిగిన తారలెందరో. నేలకు రాలిన తారలు మరెందరో. కొందరి తారల గాథలు సినిమా కథలా విషాదంతో ముగిశాయి. జీవితంలో ఓడిపోయినా.. వారి జీవితాన్ని కథగా మలిస్తే... అవి వెండితెరపై అద్భుతాలను సృష్టించాయి. అవే డర్టీపిక్చర్, మహానటి. సిల్క్ స్మిత. అప్పట్లో ఓ క్రేజీ స్టార్. ఈమె చూపుల్లోనే ఏదో మత్తు ఉన్నట్లు కుర్రకారుకు మతి పోగొట్టేసింది. కేవలం ఈమె నర్తించిన పాటల కోసమే సినిమాకు వెళ్లే అభిమానులు ఉండేవారు. సినిమాలో ఈమె చేసిన ప్రత్యేక గీతం తరువాత థియేటర్లో ఎవరూ ఉండేవారు కాదట. అంతలా ఆమె పాపులార్టీని సొంతం చేసుకుంది. ఒకానొక దశలో ఈమె స్టార్ హీరోలు, హీరోయిన్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉండేది. తెరపై మాత్రమే అశ్లీల పాత్రలు చేసే ఈమె.. వ్యక్తిగతంగా ఎన్నో నిగూఢ దానధర్మాలు చేసేవారట. సిల్క్‌స్మిత ఎంతో మంచి వారని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలాంటి సిల్క్‌స్మిత కథను ఆధారంగా తెరకెక్కించిన డర్టీ పిక్చర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక సినీ తారల జీవిత చరిత్రను తెరకెక్కించిన వాటిలో చెప్పుకోదగ్గ సినిమా మహానటి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో మహానటిగా గుర్తింపు పొందిని సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అంతటి నటికి నివాళిగా పేర్కొన్నారు సినీ అభిమానులు. సినీ జీవితాన్ని ప్రారంభించడం, అందులోని ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితం, చివరి దశ అన్నింటిని మనసుకి హత్తుకునేలా చిత్రీకరించారు. మహానటి సావిత్రిని గుర్తుంచుకున్నంత కాలం ఈ ‘మహానటి’ సినిమాను కూడా గుర్తుంచుకుంటారు. బాలీవుడ్‌కు పెద్దన్న సంజయ్ దత్. ఎన్నో వివాదాలు, ఇంకెన్నో ఎఫైర్స్, దుర్భరమైన జైలు జీవితం గడిపిన సంజయ్ దత్ జీవితాన్ని తెరకెక్కించారు రాజ్ కుమార్ హిరాణీ. తన ప్రతి సినిమాలో సమాజానికి ఏదో ఒకరకమైన సందేశాన్ని ఇచ్చే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ. మున్నాభాయ్ సిరీస్, పీకే, త్రీ ఇడియట్స్ ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేశారు హిరాణీ. తాజాగా తన ఆప్త మిత్రుడైన సంజయ్ దత్ ప్రస్థానాన్ని సంజు పేరుతో వెండితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యారు. సంజయ్‌దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటనకు బీ టౌన్ మొత్తం ఆశ్చర్యపోతోంది. ట్రైలర్లో సంజయ్‌ను మరిపించేలా యాక్ట్ చేసిన రణ్‌బీర్ కపూర్ పూర్తి నటనను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అంతేగాక సంజయ్‌దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడ ఈ సినిమా ప్రస్థావించబోతోంది. సంజయ్‌కు ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందన్న విషయం, డ్రగ్స్‌కు బానిసైన పరిస్థితుల గురించి, ముంబై పేలుళ్ల గురించి కూడా ఈ సినిమాలో టచ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు కావల్సినంత ట్విస్ట్‌లు, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్న సంజయ్ దత్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన ఎటువంటి ఆంక్షలు పెట్టకపోవడం ఆశ్చర్యకరం. పైన మాట్లాడుకున్న రెండు సినిమాలు వారి మరణానంతరం కథలను వెండితెరపై ఆవిష్కరించారు. కానీ జూన్ 29న రానున్న సంజు మాత్రం అందుకు విరుద్దంగా వస్తోంది. ఈ సినిమా సంజయ్ దత్‌కు ఎలాంటి ఇమేజ్ను తెచ్చిపెడుతుందో చూడాలి మరి. -
కుర్ర హీరోయిన్లే కావాలా?
ఒక హీరోయిన్‌కు 30 ఫ్లస్ దాటాయంటే.. ఆమెకు ఛాన్స్‌లు తగ్గిపోవటం ఇండస్ట్రీలో కామన్‌గా మారింది(కొందరిని మినహాయిస్తే...). ఆ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా(37) కూడా ఉన్నారు. సుమారు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్లో ఆమె రణ్‌బీర్ కపూర్ ‘సంజు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో మాన్యతాదత్ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ‘ఒక నటీమణికి 30 ఏళ్లు వచ్చాయంటే, క్రమక్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోతుంటాయి. దర్శక నిర్మాతలు యంగ్ హీరోయిన్లే కావాలని కోరుకుంటున్నారు. అంతెందుకు 50 ఏళ్లు దాటిన మన హీరోలు కూడా పడుచు అమ్మాయిలతోనే జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏం? అందరికీ కుర్రహీరోయిన్లే కావాలా? మిగతా వాళ్లు నటనకు పనికిరారా?’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ..‘ఇక్కడ టాలెంట్‌తో పని లేదు. కేవలం ఫ్రెష్ ఫేస్‌ల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు. మిగతా ఇండస్ట్రీల్లోనూ ఇదే పరిస్థితి. సినిమా రంగంలో మార్పులు వస్తున్నాయి. మరి యాక్టర్ల జీవితంలో మార్పు రాకూడదా?.. పర్సనల్ లైఫ్‌తోపాటు ప్రొఫెషనల్ లైఫ్ కోరుకోవటం తప్పేం కాదు కదా!’ అని ఆమె తెలిపారు. ‘అయితే వివాహం అయ్యాక కూడా కెరీర్‌ను తమ టాలెంట్‌తో అద్భుతంగా మలుచుకున్న వాళ్లూ లేకపోలేదు. ఉదాహరణకు షర్మిలా ఠాగూర్, వహీదా రెహమాన్, స్మితా పాటిల్‌లు.. పెళ్లయ్యాక కూడా కెరీర్‌ను సక్సెస్ఫుల్ గా కొనసాగించారు. నేను కూడా వాళ్ల బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నా. అందుకే మంచి కథల కోసం ఇంత కాలం ఎదురు చూశా. మధ్యలో ఓ ఇరానియన్ చిత్రం చేస్తున్న సమయంలో దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ నుంచి కబురు అందింది. దాదాపు రెండేళ్ల తర్వాత సంజు కార్యరూపం దాల్చింది. సంజుతో మంచి చిత్రంలో నటించాననే కోరిక తీరింది’ అని దియా ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
‘సంజు’ మూవీ స్టిల్స్
-
రణ్వీర్ స్థానంలో రణ్‌బీర్ వచ్చాడా..?
సిని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సంజు’. ట్రైలర్...ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. రణ్‌బీర్ కపూర్ అచ్చు సంజయ్ దత్ లాగా మారిపోయాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు రణ్‌బీర్. అయితే సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు చిత్ర నిర్మాత విధు వినోద్ చోప్రా. ‘సంజు’ సినిమాలో సంజయ్ దత్ పాత్ర కోసం మొదట రణ్వీర్ సింగ్‌ను అనుకున్నారంట. కానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మాత్రం రణ్‌బీర్ కపూర్‌ను ‘సంజు’ పాత్ర కోసం ఎంపిక చేసారంట. ఈ విషయం గురించి విధు ‘‘సంజు’ పాత్ర కోసం రణ్‌బీర్‌ను తీసుకోవాలనే ఆలోచన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీది. కానీ నాకు ఈ ఆలోచన నచ్చలేదు. ఎందుకంటే సంజయ్ పాత్రలో నేను రణ్వీర్ను అనుకున్నాను. ఈ పాత్రకు రణ్వీర్ అయితే చాలా బాగా సరిపోతాడని అనిపించింది. కానీ రాజు మాత్రం రణ్‌బీరే ఈ పాత్రకు చక్కగా సరిపోతాడని నన్ను ఒప్పించాడు. షూటింగ్ ప్రారంభమయ్యాక రణ్‌బీర్‌ను సంజయ్ పాత్రలో చూసి నేను ఆశ్చర్యపోయాను. దాంతో నేను మొదట్లో అన్న మాటలను వెనక్కి తీసుకున్నాను. ఎందుకంటే రణ్‌బీర్ పూర్తిగా సంజయ్‌లాగా మారిపోయాడు. సంజయ్ దత్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఒక్కోసారి సంజయ్ ఆత్మ రణ్‌బీర్‌లో ప్రవేశించిందేమో అనిపిస్తుంది. అంతలా ఒదిగిపోయాడు ఆ పాత్రలో’ అని తెలిపారు. రణబీర్‌కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంజు భాయ్ పాత్రలో రణబీర్ కపూర్ ఒదిగిపోయిన తీరుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంజయ్‌దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
అపజయం ఓ అనుభవం
ఏ రంగంలో అయినా సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు కామన్. కానీ వాటిని మనం ఎలా తీసుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్. సంజయ్ దత్ జీవితం ఆధారంగా రూపొందిన ‘సంజు’ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు రణ్‌బీర్. ఫాదర్స్ డే సందర్భంగా ట్వీటర్లో అభిమానులతో చాట్ చేశారీ హీరో. ఈ సందర్భంగా ఓ అభిమాని సక్సెస్, ఫెయిల్యూర్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అని అడిగితే, ‘‘సక్సెస్, ఫెయిల్యూర్ మనం చేసిన పనికి రిజల్ట్ మాత్రమే. రిజల్ట్ కంటే ఆ జర్నీని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. అలాగే సక్సెస్ నుంచి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఫెయిల్యూర్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అందులోని పాఠాలే సక్సెస్‌కి ఫార్ములాలు అవుతాయి’’ అని సమాధానమిచ్చారు. -
సల్మాన్‌కు సాలిడ్ కౌంటర్
విడుదలకు ముందే సీనియర్ హీరో సంజయ్ దత్ సంజుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అచ్చం సంజును దింపేశాడంటూ రణ్‌బీర్ కపూర్‌పై ఇప్పటికే ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే సంజుపై స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్లు మాత్రం ఆసక్తికరంగా మారాయి. క్లైమాక్స్ సన్నివేశాల్లో సంజయ్ దత్ స్వయంగా నటిస్తేనే బాగుండేదన్న సల్లూ భాయ్ అభిప్రాయ పడ్డాడు. దీంతో రకరకాల కథనాలు బాలీవుడ్లో చక్కర్లు కొట్టగా.. చివరకు ఈ చిత్ర హీరో రణ్‌బీర్ ఎట్టకేలకు స్పందించారు. ‘ఎవరి బయోపిక్‌లో వాళ్లు నటించటం అనేది జరిగే పని కాదు. అది ఆ పాత్ర ఔనత్యాన్ని నాశనం చేస్తుంది. ప్రేక్షకులు చిత్రంలో నన్నే సంజుబాబాగా ఊహించుకుని చూస్తుంటారు. అలాంటప్పుడు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయటం నా బాధ్యత. వయసురీత్యా సర్దుబాటు చేయాలంటూ అసలు పాత్రనే రంగంలోకి దించితే ఆ ఫలితం ఖచ్ఛితంగా తేడా కొడుతుంది. ఇంతదాకా ఏ దర్శకుడు కూడా అలాంటి ప్రయత్నం చేసి ఉండడనే నేను అనుకుంటున్నా. అసలు ఆ ఆలోచన చేసిన వాళ్లు.. అది కరెక్ట్కాదన్నది గుర్తిస్తే మంచిది’ అని ఆదివారం ఓ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌బీర్ తెలిపాడు. కాగా, కత్రినా కైప్ విషయంలో ఈ ఇద్దరు హీరోలకు అస్సలు పడదనే.. బాలీవుడ్లో ఇప్పటికీ టాక్ నడుస్తూనే ఉంటుంది. సంజయ్ దత్ బెస్ట్ ఫ్రెండ్ కావటంతో ఆయన బయోపిక్‌పై సల్మాన్ మాములుగా స్పందించాడే తప్ప.. ఎవరినీ బాధపెట్టడానికి కాదని భాయ్ సన్నిహితుల చెబుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన సంజు ఈ నెల 29న విడుదల కానుంది. -
‘సంజు’పై ఫిర్యాదు; ఇండియా పరువేంగాను?
న్యూఢిల్లీ: రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాపై ఫిర్యాదు నమోదైంది. ‘సంజు’ ట్రైలర్లో చూపించిన ‘జైలు టాయిలెట్ లీకేజీ సీన్ల’ను తక్షణమే తొలగించాలని, లేకుంటే సినిమా విడుదలపై స్టే కోరుతూ కోర్టుకు వెళతామని ఫృథ్వీ మస్కే అనే స్వచ్ఛంద కార్యకర్త.. సెన్సార్ బోర్డును హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషికి ఫిర్యాదును అందజేశారు. ఇండియా పరువేంగాను?: ‘‘సంజు సినిమా ట్రైలర్లో టాయిలెట్ లీకేజీ సీన్ చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ సీన్ వల్ల ఇండియాలోని జైళ్ల నిర్వహణ, అధికారుల పనితీరుపై ప్రపంచానికి తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకు ముందు చాలా సినిమాల్లో జైల్ సీన్లు ఉన్నప్పటికీ, ఇలా టాయిలెట్ లీకేజీని చూపించిన దాఖలాలు లేవు. వాస్తవానికి అలాంటి సంఘటనేదీ జరిగినట్లు ఎక్కడా నమోదుకాలేదు’’ అని ఫృథ్వీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు సీన్‌పై సెన్సార్ బోర్డు స్పందించకుంటే, సినిమా విడుదల నిలిపేసేలా కోర్టుకు వెళతానని తెలిపారు. కాగా, ఈ ఫిర్యాదుపై సీబీఎఫ్సీ స్పందన ఇంకా వెలువడాల్సిఉంది. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 29న ‘సంజు’ విడుదలకానుంది. సంజు ట్రైలర్ -
అదే హెయిర్ స్టైల్.. అదే చీర కట్టు
సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సంజు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంజయ్ దత్ జీవితంలోని చీకటి కోణాలను కూడా చూపెట్టనున్నామని చిత్ర బృందం ప్రకటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సంజయ్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ తల్లి, అలనాటి ప్రముఖ నటి నర్గీస్ పాత్రలో మనీషా కొయిరాల నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఇటీవల షేర్ చేసిన పోస్టర్లో మనీషాను చూసిన జనాలు అచ్చం నర్గీస్లానే ఉందంటూ కామెంట్లు చేశారు. తాజాగా మనీషా పోస్ట్ చేసిన ఫొటోలు మాత్రం అంతకుమించి అనేలా ఉన్నాయి. 1970నాటి నర్గీస్‌ను గుర్తుకు తెచ్చేలా.. అదే హెయిర్ స్టైల్, అదే చీర కట్టుతో కూడిన తన ఫొటోను మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని రెండో సాంగ్ కర్ హర్ మైదాన్ ఫతే.. తనకు ఎంతో ఇష్టమైన సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు మనీషా. సంజయ్ పాత్రలో నటించడానికి రణబీర్ ఎంత కష్టపడ్డాడో.. మనీషా కూడా నర్గీస్లా మెప్పించేందుకు అంతే శ్రమించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్, మనీషాతోపాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
హీరో ‘డ్రగ్స్’ కష్టాలు
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ బయోపిక్ సంజు రిలీజ్‌కు ముందే హాట్ టాపిక్‌గా మారింది. అచ్చం సంజూ బాబాలా తెరపై కనిపించేందుకు రణ్‌బీర్ కపూర్ పడ్డ కష్టం.. పైగా సంజయ్ దత్ లైఫ్‌లోని ప్రతీ కోణాన్ని విప్పి చూప్పానని దర్శకుడు చేసిన ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆ అంచనాలను పెంచేయగా.. తాజాగా చిత్రంలోని ఓ సాంగ్ ప్రమోషన్ బిట్‌ను వదిలారు. ‘కర్ హర్ మైదాన్ ఫతే...’ అంటూ సాగే పాట.. శేఖర్ అస్థిత్వ లిరిక్స్, విక్రమ్ మాంట్రోస్ సంగీతాన్ని అందించగా.. సుఖ్విందర్ సింగ్-శ్రేయా ఘోషల్‌లు పాటను ఆలపించారు. సంజయ్ దత్ జీవితంలోని డ్రగ్స్ కోణాన్ని చూపిస్తే సాగే పాట ఇది. వాటి నుంచి తేరుకోడానికి పునరావాస కేంద్రానికి పంపించటం, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి ఇంటికి చేరటం, దారిలో అడ్డుకుంటూ కష్టాలు పడటం, డ్రగ్స్ నుంచి బయటపడేందుకు చేసే యత్నాలు, తల్లిదండ్రుల ఆప్యాయత.. మొత్తం ఎమోషనల్ కంటెంట్‌తో సాంగ్ సాగింది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ తండ్రి సునీల్‌దత్ పాత్రలో పరేష్ రావెల్, తల్లి నర్గీస్ దత్ పాత్రలో మనీషా కోయిరాల నటించారు. సోనమ్ కపూర్, దియా మీర్జాలు ఇతరత్రా పాత్రల్లో నటిస్తుండగా, కీలక పాత్రలో అనుష్క శర్మ కనిపించనుంది. జూన్ 29న సంజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సంజు ‘కర్ హర్ మైదాన్ ఫతే...’ ప్రోమో సాంగ్
-
సంజు కొత్త పోస్టర్.. అచ్చం నర్గీస్లా..!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ‘సంజు’ చిత్రానికి సంబంధించిన ఏ వార్త అయిన క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. రణబీర్ కపూర్ ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్రలో కన్పించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సంజు ట్రైలర్ అభిమానులను విశేషంగా అకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలో అలనాటి ప్రముఖ నటి, సంజయ్ దత్ తల్లి నర్గీస్ పాత్రలో నటిస్తున్న మనీషా కొయిరాలకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ పోస్టర్‌ను ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. ‘ ఆమె తన కొడుకును ముద్దుగా సంజు అని పిలుచుకునేది.. ఇప్పడు మనం కూడా అలానే పిలుస్తున్నాం. నర్గీస్జీ పాత్రలో మనీషా నటనను జూన్ 29న చూడనున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌కు విశేష స్పందన వస్తుంది. మనీషా అచ్చం నర్గీస్లాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనీషా లుక్‌ను, నర్గీస్ ఫొటోలతో పోలుస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిని ఓ సారూప్యతగా చెబుతూ.. మనీషా ఈ పాత్రలో అద్భుతంగా నటించి ఉంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మనీషా మాట్లాడుతూ.. ‘లెజండ్రీ నటి నర్గీస్ పాత్రలో నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని ఏళ్లు గడిచిన ఆమె పేరు ఎప్పటికి నిలిచి ఉంటుంది. ఇది నాకు ఒక చాలెజింగ్ రోల్’ అని తెలిపారు. ఈ చిత్రంలో వీరితో పాటు సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు.సంజయ్‌దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
చివరి సీన్లలో ఆయన నటిస్తే బాగుండేది
ముంబాయి: సంజయ్ దత్ బయోపిక్ ఆధారంగా నిర్మించిన తాజా చిత్రం ‘సంజు’ ట్రైలర్‌ను బాలీవుడ్కండల నటుడు సల్మాన్‌ఖాన్ బుధవారం వీక్షించారు. ఈ చిత్రం గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ..క్లైమాక్స్ సన్నివేశాల్లో సంజయ్ దత్ స్వయంగా నటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాజు హిర్వాణీ చాలా సెన్సిబుల్ డైరెక్టర్ అని, ఆయన తనదైన శైలిలో చిత్రాలు తీస్తుంటాడని అన్నారు. సల్మాన్ ఖాన్ బయోపిక్ భవిష్యత్‌లో వచ్చే అవకాశం ఉందా అని ఇంటర్వూలో ప్రశ్నించగా..తన బయోపిక్ తీసే ఉద్దేశం తనకు లేదని, అలాంటి పని తాను చేయనని చెప్పారు. ఒకవేళ తీసే ఉద్దేశం ఉంటే తానే బహిరంగా చెబుతానని వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్(52) తాజాగా నటించిన రేస్3 చిత్రం ఈ నెల 15న విడుదల అవుతోంది. సంజు సినిమాలో సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించిన సంగతి తెల్సిందే. -
బండబూతులే ఆయన కౌంటర్లు
సాక్షి, ముంబై: బాలీవుడ్ వెటరన్ నటుడు రిషి కపూర్ వ్యవహార శైలి ఒక్కోసారి తీవ్ర విమర్శలకు దారితీస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ దిగ్గజ నటుడు.. విమర్శకులకు ఒక్కోసారి ఘాటైన బదులు ఇస్తుంటారు. తాజాగా సంజయ్ దత్ బయోపిక్ సంజు ట్రైలర్ విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అయితే ఓ వ్యక్తి ఈ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేయగా, దానికి రిషి కపూర్ బండ బూతుతో బదులిచ్చారు. ‘సంజు ట్రైలర్ చూసి నిర్ఘాంతపోయా. సంజయ్ దత్ ఇమేజ్ను మంచిగా చూపేందుకే దర్శకుడు ప్రయత్నించాడు. అతనో క్రిమినల్. క్రిమినల్‌ను క్రిమినల్లాగేనే చూపించాలి. పైగా బాంబు పేలుళ్లలో అతని హస్తం ఉందన్న విషయం లోకానికి తెలుసు. అలాంటప్పుడు దర్శకుడు మూర్ఖంగా ఎలా చేయగలిగాడు’ అంటూ దర్శకుడిని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి ట్వీట్లు చేశాడు. ఇది రిషి కపూర్‌కు మంట పుట్టించింది. ‘సినిమా గురించి నీకేం తెలుసు *****. మేం ప్రేక్షకులకు వినోదం అందించేందుకు ఉన్నామే తప్ప.. ఎవరి ఇమేజ్‌నో రిపేర్ చేయటానికి కాదు. నీలాంటోళ్లు అసలు సినిమాలు చూసేందుకు కూడా పనికి రారు’ అంటూ రిషి ఘాటు రీ ట్వీట్ చేశారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న సంజు జూన్ చివర్లో విడుదల కానుంది. -
‘సంజు’ ట్రైలర్ వచ్చేసింది..!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంజు ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తోంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సంజు’ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్‌కపూర్, సంజయ్ దత్ పాత్రలో నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా, సోనమ్ కపూర్, పరేష్ రావల్, అనుష్క శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. సంజు భాయ్ పాత్రలో రణబీర్ కపూర్ ఒదిగిపోయిన తీరుకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సంజయ్‌దత్ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలతో పాటు ప్రపంచానికి తెలియని నిజాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. -
సంజు డైలాగ్: సెక్స్ వర్కర్ల ఆగ్రహం
-
‘మున్నాభాయ్’ మళ్లీ వస్తున్నాడు!
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ మరోసారి సీక్వెల్ బాట పట్టారు. గతంలో వచ్చిన ‘మున్నాభాయ్’, 'లగేరహో మున్నాభాయ్'లకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాతో బిజీగా ఉన్న హిరానీ, ఆ తర్వాత తెరకెక్కించే చిత్రం మున్నాభాయ్ సిరీస్‌లో ఉండనుందని ప్రకటించారు. సంజు ప్రమోషన్లో భాగంగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ‘మున్నాభాయ్ ఛలో అమెరికా’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు, కొన్ని కథలు కూడా పరిశీలిస్తున్నట్లు హిరానీ తెలిపారు. అయితే స్క్రిప్ట్ ఇంకా పూర్తికాలేదని ఆయన వెల్లడించారు. ఇదే విషయంపై సంజయ్ దత్ మాట్లాడుతూ.. ‘మున్నాభాయ్ మూడోపార్ట్ ఉంటుంది. కానీ అది మున్నాభాయ్ ఛలో అమెరికా కాకపోవచ్చు. ఎందుకంటే నేను అమెరికా వెళ్లేందుకు వీసాను పొందలేనంటూ చమత్కరించారు. హిరానీ తన ప్రస్తుత చిత్రం సంజు పూర్తయిన వెంటనే మున్నాభాయ్ స్ర్కిప్ట్‌ను పూర్తి చేస్తారు. అన్ని కలిసొస్తే వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం కావొచ్చ’ని సంజూ తెలిపారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్‌లోని రెండు చిత్రాలను శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేరుతో రీమేక్ చేశారు. తన కామెడీ టైమింగ్‌తో అందరిని అలరించారు. -
ఆ సినిమాను వదులుకున్న ఆమిర్
సంజయ్ దత్ జీవితం ఆధారంగా, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ‘సంజు’ సినిమా ప్రకటించిన దగ్గరనుంచే ప్రతి నిత్యం ఏదో ఒక విశేషంతో పత్రికల్లో హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బీ టౌన్లో చక్కర్లు కొడుతోంది. సంజయ్ దత్ గా బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సంజయ్ దత్ తండ్రి, ప్రముఖ హీరో సునిల్ దత్ పాత్ర కోసం బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ ఆమిర్ ఖాన్‌కు తీసుకోవాలని భావించారట చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ఈ విషయం గురించి ఆయనే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ‘నేను ఏ కథను సిద్ధం చేసుకున్న ముందుగా ఆమిర్ ఖాన్‌కే చెపుతాను. అలానే ఈ స్క్రిప్ట్‌ను ఆమిర్‌కు చెప్పినప్పుడు చాలా బాగా ఉందని ఆయన మెచ్చుకున్నారు. అంతేకాక సునిల్ దత్ పాత్రను చేయడానికి కూడా ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తాను ‘దంగల్’ చిత్రం కోసం నడి వయసు వ్యక్తిగా కనిపించాల్సిన అవసరం ఉండటంతో, మరోసారీ అదే తరహా పాత్రలో నటించడం ఇష్టం లేక ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు’ అని తెలిపాడు. ‘సంజు’ చిత్రంలో ఈ ‘ఖల్నాయక్’ పాత్రకు రణ్‌బీర్ కపూర్ అచ్చుగుద్దినట్టుగా సరిపోయాడు. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సంజయ్దత్లా కనిపించడం కోసం రణ్‌బీర్ కపూర్ చాలా కష్టపడుతున్నాడు. సంజయ్ దత్ జీవితంలోని మూడు దశలకు సంబంధించిన వివరాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2018, జూన్ 29న విడుదల కానుంది -
సమ్మర్ కోసం ఆగలేను : హీరో కూతురు
ముంబై: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో ఒకటి కుర్రకారు గుండెల్లో వేడి రాజేస్తోంది. ‘ఎండాకాలం వచ్చే వరకు ఆగలేను’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ అమ్మడు. ‘సమ్మర్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంతకుముందు కంటే కాస్త అందంగా కనిపించొచ్చు, అందుకే ఇక వేచి ఉండలేను’ అంటూ తన ఫాలోవర్లతో షేర్ చేసుకున్నారు త్రిషాల. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్లు కలిగిన త్రిషాల తన ఫ్యాన్స్‌తో ఎప్పడూ అప్డేటెడ్గా ఉంటారు. దుబాయ్‌లో తన కుటుంబంతో కలిసి విహార యాత్రలో ఉన్న ఆమె స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో దిగిన ఈ ఫొటోలో మరింత అందంగా పోజులిచ్చారు. ఆమె తన అందంతో అభిమానులను కట్టిపడేశారు. త్రిషాల పోస్టు చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సంజు’ చిత్రం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సంజయ్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్లో రణబీర్ అచ్చం సంజయ్‌దత్ లాగానే ఉండడంతో ‘సంజు’ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. త్రిషాల దత్ సంజయ్ మొదటి భార్య రిచా శర్మ కూతురన్న విషయం తెలిసిందే. -
18 నెలల జైల్లోనే.. బెయిల్ కూడా దొరకలేదు!
న్యూఢిల్లీ : ‘‘ సంజూ మొదటిసారి 1993లో అరెస్ట్ అయ్యాడు. 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. కనీసం బెయిల్ కూడా దొరకలేదు. ఆ సమయంలో సంజూ పరిస్థితికి అద్దం పట్టే పోస్టర్ ఇది ’’ అంటూ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ‘సంజూ’ సినిమా లేటెస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. హీరో రణ్‌బీర్ చేతులకు బేడీలతో ఉన్న ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. ఈ సినిమాలో సంజయ్‌దత్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇప్పటికే విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజు పాత్రలో రణ్‌బీర్ చేతులకు బేడీలు వేసుకున్న, 2013లో ఎరవాడ జైలులో ఉన్నప్పటి పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఇప్పటికే సినిమా పూర్తి కావస్తుండటంతో ప్రమోషన్లపై దృష్టి సారించింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా సంజయ్ దత్ జీవితంలో చోటుచేసుకున్న కీలక సంఘటనలకు సంబంధించిన సినిమా దృశ్యాల పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. Sanju was first arrested in 1993. In prison for 18 months. Could not get bail. A recreation of that time. #RanbirKapoor #RajkumarHiraniFilms @VVCFilms @foxstarhindi pic.twitter.com/JOL2W3pQaO — Rajkumar Hirani (@RajkumarHirani) May 12, 2018 -
సంజయ్ దత్ బయోపిక్.. ఏ పాత్రల్లో ఎవరు?
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా వేచి చూస్తున్న సంజయ్ దత్ బయోపిక్ సంజు టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిర్వాణీ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్ తన 22 ఏట నుంచి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇరుకున్న దాకా జరిగిన పరిణామాలను ఈ సినిమాలో దర్శకుడు చూయించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటిస్తున్న పరేష్ రావల్, మనిషా కోయిరాలా, దియా మీర్జా పాత్రల గురించి మీడియాకు వెల్లడించారు. సునీల్ దత్‌గా పరేశ్ రావల్ ఈ సనిమాలో సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ పాత్రను పరేష్ రావల్ పోషిస్తున్నట్లు దర్శకుడు ధృవీకరించారు. తర్వాత విడుదల చేసే పరేష్‌ను ఇంట్రడ్యూస్ చేస్తామని తెలిపారు. నర్గీస్ దత్‌గా మనీషా కోయిరాలా సంజయ్‌దత్ తల్లిపాత్రకు మనీషా కోయిరాలాను తీసుకుంటున్నట్లు దర్శకుడు తెలిపారు. సంజయ్ దత్ నటించిన తొలి సినిమా విడుదలకు మూడు రోజుల ముందు నర్గీస్ క్యాన్సర్‌తో చనిపోయింది. మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్ బాధితురాలే. విదేశాలలో చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ మహమ్మారి నుంచి మనీషా విజయవంతంగా బయటపడిన విషయం తెల్సిందే. సంజయ్ దత్, మనీషా కోయిలారా కలిసి యాల్గార్, కార్టూస్, సనమ్ చిత్రాల్లో నటించారు. మాన్యతా దత్‌గా దియా మీర్జా సంజయ్ దత్ జీవితాన్ని సమూలంగా మార్చిన మూడో భార్య మాన్యతా దత్ పాత్ర నటి దియా మీర్జాను ఎంపిక చేశారు. వీరిద్దరికీ 2008లో పెళ్లి అయిన సంగతి తెల్సిందే. సంజయ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన వ్యాపారాలన్నీ ఆమెనే చక్కబెట్టేవారు. సంజయ్ మొదటి భార్య రిచా శర్మ, రెండో భార్య రియా పిళ్లైల పాత్రలకు ఎవరిని తీసుకునేది దర్శకుడు ధృవీకరించలేదు. సంజయ్ బాల్య మిత్రుడి పాత్రకు విక్కీ కౌశల్ సంజయ్ దత్ బాల్య మిత్రుడు కుమార్ గౌరవ్ పాత్రకు విశాల్ కౌశల్‌ను తీసుకుంటున్నట్లు ఊహాగానాలు గతంలో వినిపించాయి. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ విశాల్ కౌశల్‌ను ఈ పాత్రకు తీసుకుంటున్నట్లు దర్శకుడు చెప్పారు. సంజయ్ దత్ రెండో సోదరి నమ్రతా దత్ భర్తే ఈ కుమార్ గౌరవ్. తొలి చిత్ర సహనటి పాత్రకు సోనమ్ సంజయ్ దత్ తొలి చిత్రం రాఖీలో సంజయ్‌తో జోడీ కట్టిన టీనా మునిమ్ పాత్రకు సోనమ్ కపూర్‌ను తీసుకుంటున్నట్లుగా తెలిసింది. అయితే ట్రైలర్ వస్తేగానీ ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సల్లూ భాయ్ పాత్రకు జిమ్ సర్భ్ సంజయ్ దత్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు, బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ పాత్రకు జిమ్ సర్భ్ను తీసుకుంటున్నట్లు రూమర్లు వస్తున్నాయి. ఒకానొక సమయంలో వారిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారు. ఇద్దరూ కలిసి సాజన్, చల్ మేరే భాయ్, ఓమ్ శాంతి ఓం సినిమాల్లో నటించారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. జర్మలిస్టు పాత్రలో అనుష్క శర్మ ఈ సినిమాలో అనుష్క శర్మ జర్మలిస్టు పాత్ర పోషిస్తున్నట్లు తెలియవచ్చింది. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగే జర్నలిస్టు పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. కరిష్మా టన్నా, బొమన్ ఇరానీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. కరిష్మా టన్నా, మాధురీ దీక్షిత్ పాత్రంలో, బొమన్ ఇరానీ, కాంటే సినిమా దర్శకుడు సంజయ్ గుప్తా పాత్రలకు తీసుకుంటున్నట్లు సినిమా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ దత్ బయోగ్రఫీ ఆధారంగా తీస్తోన్న ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. -
మనిషి ఒక్కడే.. పాత్రలు ఎన్నో
ఛార్టెడ్ ఫ్లైట్స్‌లో తిరిగిన స్టార్ హీరో బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. న్యూయార్క్‌లోని హై బిల్డింగ్ విండోలో నుంచి ప్రపంచాన్ని చూసి విజయగర్వంతో నవ్విన అతను, అసలు విండోనే లేని జైలుగదిలో ఖైదీగా ఉండాల్సి వచ్చింది. డ్రగ్స్‌తో లైఫ్ క్లోజ్ అనుకున్న టైమ్‌లో జిమ్‌లో హార్డ్‌వర్క్ చేసి నార్మల్ లైఫ్‌లోకి వచ్చాడు. ఒక మనిషి జీవితంలో ఇన్ని జరుగుతాయా? అంటే.. అవును. బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ లైఫ్‌లో జరిగాయి. ఇంకా సంజయ్ జీవితంలో ఏమేం జరిగాయో తెలుసుకోవాలంటే ఆయన జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘సంజు’ చూడాల్సిందే. జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘వన్ మ్యాన్ మెనీ లైఫ్స్’ అని ఫస్ట్ లుక్ పోస్టర్స్‌పై ఉంటడం విశేషం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్‌గా రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నారు. ఇతర పాత్రలను సోనమ్‌కపూర్, పరేశ్‌రావల్, అనుష్కాశర్మ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ చూశాక.. సంజయ్‌దత్ పాత్రకు రణ్‌బీర్ కపూర్ కరెక్ట్‌గా సరిపోయాడని బీటౌన్ సెలబ్రిటీలు పొగిడేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ట్రైలర్ లాంచ్ ప్రొగ్రామ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి రణ్‌బీర్‌ను అడిగితే– ‘‘నా దృష్టికి ఈ విషయం రాలేదు. ఇండస్ట్రీలో ఇలాంటిది ఉంటే అంతకంటే వరస్ట్ థింగ్ మరొకటి లేదు’’ అని అన్నారు. అలాగే సంజయ్‌దత్ బయోపిక్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు రణ్‌బీర్. -
వన్.. టు.. త్రీ..
...మూవీస్‌ను ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట అనుష్కా శర్మ. ఆల్రెడీ హిందీ చిత్రాలు ‘సూయిధాగా, జీరో’ల్లో కథానాయికగా నటిస్తున్నారామె. సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’లోనూ స్క్రీన్‌పై మెరవనున్నారు. సో.. ఈ ఏడాది అరడజనుకు పైగా వెండితెరపై అనుష్కా శర్మను చూడొచ్చని సంబరపడిపోకండి. ఇక్కడే ఉంది అసలు మెలిక. త్వరలో అనుష్కా శర్మ ఎనౌన్స్ చేయబోయే మూడు సినిమాలు కథానాయికగా కాదు. నిర్మాతగా. నాలుగేళ్ల క్రితం తన సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు అనుష్కా శర్మ. తొలి ప్రయత్నంగా ‘ఎన్‌హెచ్ 10’ నిర్మించారు. ఆ తర్వాత ఫిల్హౌరీ, పరీ సినిమాల నిర్మాణంలో భాగమైంది క్లీన్ స్లేట్ ఫిలిమ్స్. ఇప్పుడు సోలో నిర్మాతగా సినిమాలను నిర్మించాలనుకుంటున్నారట. మంచి స్క్రిప్ట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కోసం చూస్తున్నారట అనుష్కా శర్మ. అదండీ మేటర్. -
బయో పీక్స్
► పద్మావత్‌కి అక్కడ దారి ఉందా? చరిత్రలో ఖ్యాతి గాంచిన రాణుల్లో రాణి పద్మావతి ఒకరు. ఆమె జీవితం ఆధారంగానే సంజయ్ లీలా భన్సాలీ ‘పద్మావత్’ చిత్రాన్ని తెరకెక్కించారని బాలీవుడ్ టాక్. దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. అయితే హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో రిలీజ్‌కు అభ్యంతరం తెలిపాయి. దీంతో చిత్రనిర్మాణ సంస్థ వయాకామ్18 సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పరిశీలనకు అంగీకరించింది. ► బయోపిక్స్ క్రేజ్ పీక్స్‌కి చేరింది. బాక్సింగ్ రింగ్‌లో మేరీ కోమ్ పిడిగుద్దులు గుద్దుతుంటే... లేడీ లైన్ అని, చప్పట్లు కొట్టారు. ఈ లేడీ లైన్ బాక్సర్‌గా రాణించడానికి చాలా కష్టాలు పడ్డారు. అందుకే మేరీ కోమ్ స్టోరీతో సినిమా తీస్తే... ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. ‘బావలు సయ్యా.. మరదలు సయ్యా’... సిల్క్ సిత్మ రింగు రింగులు తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉన్న హార్టులు కూడా స్వీట్ సిక్స్టీ అయిపోయాయి. అందుకే ఆమె లైఫ్ స్టోరీతో ‘డర్టీ పిక్చర్’ తీస్తే ఎగబడి చూశారు. గ్రౌండ్లో ధోని రన్నుల మీద రన్నులు పీకుతుంటే... ఈ రేంజ్లో ఆడటానికి ఏ రేంజ్లో కష్టపడ్డాడు? ఇతగాడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాల్సిందే అనుకున్నారు. అందుకే ధోని జీవితకథతో తీసిన ‘ఎం.ఎస్.ధోని’ హిట్. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ స్క్రీన్‌పై మెరిసిన ‘బయోపిక్స్’ ఎన్నో. ఈ నిజ జీవిత కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే రెండు మూడేళ్లుగా హిందీలో బయోపిక్స్ హవా సాగుతోంది. ఈ ఏడాదైతే మినిమమ్ పది నిజజీవిత కథలు రీల్‌కి వచ్చే అవకాశం ఉంది. ఆ రియల్ స్టోరీస్ ఏంటంటే... ► ట్రిపుల్ ధమాకా కిలాడీ కుమార్... బాలీవుడ్లో అక్షయ్‌కుమార్‌ని అలానే అంటారు. ఎందుకంటే సినిమాల సెలెక్షన్ విషయంలో అక్షయ్ భలే కిలాడీ. అది నిజమే. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటారు. సోషల్ మెసేజ్ ఉన్న ‘ప్యాడ్‌మేన్’ లాంటి సినిమా అంటే చాలు.. ‘సై’ అంటారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే ‘శానిటరీ నేప్కిన్’లు తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆయన కథతో తీసిన సినిమానే ‘ప్యాడ్‌మేన్’. ఆర్. బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా అక్షయ్ భార్య, మాజీ కథానాయిక ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా మారారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. అక్షయ్లాంటి మాస్ హీరో ఈ సినిమా చేయడం గ్రేట్. ఈ ఒక్క బయోపిక్‌లోనే కాదు.. ఈ ఏడాది మరో రెండు నిజజీవిత కథల్లో కనిపించి, ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారు. అవేంటంటే... ► గోల్డెన్ జూబ్లీ ఇయర్లో గోల్డ్ లాస్ట్ ఇయర్ అక్షయ్‌కుమార్ గోల్డెన్ జూబ్లి ఇయర్లోకి ఎంటరయ్యారు. అంటే.. ఆయన వయసు 50. గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అక్షయ్ ‘గోల్డ్’ పేరుతో సినిమా చేయడం విశేషం. గతేడాదే షూటింగ్ పూర్తయింది. హాకీ ప్లేయర్ బల్బీర్ సింగ్ జీవితం ఆధారంగా లేడీ డైరెక్టర్ రీమా కగ్తి దర్శకత్వంలో ఈ సినిమాని ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. స్వతంత్ర భారతదేశం తరఫున ఒలింపిక్స్‌లో తొలి బంగారు పతకం సాధించిన టీమ్‌లో బల్బీర్ సింగ్ ఒకరు. ఆయన కథతోనే ‘గోల్డ్’ తీశారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► గుల్షన్ జీవిత కథలో... ఢిలీల్లో పండ్ల దుకాణంలో పని చేసిన గుల్షన్ కుమార్ చౌకగా ఆడియో కేసెట్లు అమ్మే దుకాణం కొని, చిన్నగా మొదలై, సంగీత ప్రపంచంలో పెద్దగా ఎదిగారు. టీ–సిరీస్ మ్యూజిక్ లేబుల్ వ్యస్థాపకుడిగా, నిర్మాతగా ఎంతో పేరు సంపాదించారు. ఆయన జీవితం ఆధారంగా తీయబోతున్న ‘మొఘల్’ చిత్రంలో గుల్షన్ కుమార్ పాత్ర చేయబోతున్నారు అక్షయ్. 1997లో గుల్షన్ హత్యకు గురయ్యా రు. తొలినాళ్లల్లో ఆయన పడ్డ కష్టాల నుంచి మరణం వరకూ ‘మొఘల్’ కథ ఉంటుంది. అక్షయ్‌తో ‘జాలీ ఎల్ఎల్బి 2’ తెరకెక్కించిన సుభాష్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► క్వీన్ కంగనా ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్ క్వీన్ అనిపించుకున్నారు కంగనా. ఇప్పుడు క్వీన్‌గా ఆమె నటిస్తోన్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్ని చిన్ని గాయాలవుతున్నా కంగనా లెక్క చేయకుండా చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► దత్‌గా కపూర్ హీరో సంజయ్ దత్ జీవితం కథతో రాజ్‌కుమార్ హిరానీ ఓ సినిమా తీస్తున్నారు. ఇందులో సంజయ్గా రణబీర్ కపూర్ చేస్తున్నారు. యంగ్ ఏజ్, ఓల్డ్ సంజయ్గా కనిపించడం కోసం రణ బీర్ బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు. సంజయ్ వృత్తి జీవితం, వ్యక్తిగత వివాదాలు వంటివి చూపిస్తారని టాక్. ఈ చిత్రానికి ‘సంజూ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. సంజయ్ దత్‌ని ‘సంజూ బాబా’ అని పిలుస్తుంటుంది బాలీవుడ్. అందుకే ఈ టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. జూన్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ► హృతిక్.. ఫస్ట్ బయోపిక్ ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కష్టపడే పేద విద్యార్థుల కోసం ఆనంద్‌కుమార్ ‘సూపర్ 30’ అనే కాన్సెప్ట్ తయారు చేశారు. ఎందరో స్టూడెంట్స్‌కి శిక్షణ ఇచ్చి, వారు గెలిచేలా చేశారు. ఎవరీ ఆనంద్‌కుమార్ అంటే.. బిహారీ గణిత శాస్త్రవేత్త. ఆయన బయోపిక్‌లో నటించనున్నారు హృతిక్. ఆయన నటిస్తోన్న తొలి బయోపిక్ ఇది. విశాల్ బాల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ ‘సూపర్ 30’. నవంబర్‌లో రిలీజ్ కానుంది. ► అతని గోల్ గెలుపే ఒక మ్యాచ్‌లో పెద్ద గాయం అయితే కోలుకుని మళ్లీ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి గాయమే అయ్యింది హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి. కానీ మ్యాచ్‌లో కాదు లైఫ్‌లో. అంటే.. యాక్సిడెంట్ అయ్యింది. సందీప్ సింగ్ తిరిగి హాకీ స్టిక్ పట్టడం అసాధ్యం అన్నారు కొందరు. కానీ, అతని గోల్ గెలుపువైపు. హాకీ స్టిక్ పట్టుకున్నారు.. గోల్ కొట్టారు. అసాధ్యం కాదు.. సుసాధ్యం అని ప్రూవ్ చేశారాయన. ఇప్పుడు ఈ రియల్ కథనంపై రీల్ లైఫ్ స్టోరీ రూపొందుతోంది. షాద్ అలీ దర్శకత్వంలో ‘సూర్మ’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ పాత్రలో నటిస్తున్నారు దిల్జీత్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది. ► గురి ఎలా కుదిరింది ఒలింపిక్స్‌లో పతకం సాధించడం అంత ఈజీ కాదు. అందుకే మెడల్ సాధించినవాళ్లు ఆదర్శంగా నిలుస్తారు. అభినవ్ బింద్రా ఈ కోవకే వస్తారు. 2008 బిజీంగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ పతకం సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు అభినవ్. గోల్డ్ మెడల్‌పై అంత కచ్చితమైన గురి అతనికి ఎలా కుదిరిందన్న దానిపై ఇప్పుడు ఓ బయోపిక్‌ను హిందీలో రూపొందించనున్నారు. అభినవ్ బింద్రా పాత్రను హర్షవర్థన్ కపూర్ పోషించనున్నారు. ► సెట్స్‌కు సై! దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ ఒకరు. ఆమె జీవితం సిల్వర్ స్క్రీన్కు రానుంది. సైనా పాత్రను శ్రద్ధాకపూర్ పోషించనున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడం లేదన్న వార్తలు వచ్చాయి. ‘‘అది నిజం కాదు. త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ► ఆడ.. ఈడ..అదే జోరు! పది బయోపిక్స్ మాత్రమే కాదు.. మరికొన్ని సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది. వాటిలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. ఇందులో విద్యాబాలన్ నటిస్తారని టాక్. రచయిత షాహిర్ బయోపిక్‌లో అభిషేక్ బచ్చన్ నటిస్తారట. ఆల్రెడీ కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. మరి ఇంకెన్ని రియల్ స్టోరీస్ రీల్ పైకి వస్తాయో చూడాలి. ఆ సంగతలా ఉంచితే చెప్పిన తేదీ ప్రకారం పైన ఉన్న పది బయోపిక్‌లు రిలీజ్ అవుతాయా? ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలు వాయిదా పడినట్లు పడతాయా? వేచి చూద్దాం. మరో సంగతేంటంటే.. ఆడ (హిందీ)లో మాత్రమే కాకుండా ఈడ (సౌత్) కూడా బయోపిక్స్ జోరు బాగానే ఉంది. ట్రెండ్‌తో, సీజన్‌తో సంబంధం లేదు. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తుల కథలతో ఎప్పుడు సినిమా తీసినా ‘వర్కవుట్’ అవుతుంది. ఏమంటారు? ఇంకో విషయం కూడా... బయోపిక్స్‌లో క్రీడాకారుల లైఫ్ హిస్టరీలు ఎక్కువగా ‘పిక్’ చేస్తుండటం విశేషం. ► నో ఫైట్! సందీప్సింగ్కి, సంజయ్‌దత్‌కి నో ఫైట్. అయినా.. ఇదేంటి. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌కి, నటుడు సంజయ్‌దత్‌కి ఫైట్ ఏంటి గురూ అంటే.. రియల్ లైఫ్‌లో కాదండి. రీల్ లైఫ్‌లో. అది కూడా వీరికి కాదు. వీరి బయోపిక్స్‌లో నటిస్తున్న హీరోలకి. ముందు సూర్మ (సందీప్ సింగ్ బయోపిక్)ను జూన్ 29న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, మార్చి 30న రిలీజ్ కావాల్సిన ‘సంజు’ ( సంజయ్‌దత్ బయోపిక్కు పరిశీలనో ఉన్న టైటిల్) వాయిదా పడింది. ఈ చిత్రాన్ని కూడా జూన్ 29నే విడుదల చేయాలనుకుంటున్నారు. దాంతో రెండు బయోపిక్‌లకు క్లాష్ తప్పదని పరిశీలకులు అన్నారు. క్లాష్ ఉండకూడదనుకున్నారేమో ‘సూర్మా’ను ఆరు రోజులకు వాయిదా వేశారు. అంటే... జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. సో.. నో ఫైట్ అన్నమాట. -
రణ్‌బీర్ బ్రహ్మాస్త్రం తీశాడు..!
రణ్‌బీర్ కపూర్‌పై బాలీవుడ్‌కు భారీ ఆశలున్నాయి. నెక్ ్స›్టసూపర్స్టార్ రణ్‌బీరే అని అందరూ అనుకోవడం ఎప్పుడూ జరిగేదే! అయితే యాక్టింగ్ పరంగా ది బెస్ట్ అనిపించుకుంటాడు కానీ, బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ హిట్ ఎప్పుడూ కొట్టలేక పోతుంటాడు. ప్రస్తుతానికి బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానితో ‘సంజు’ సినిమా చేస్తున్నాడు రణ్‌బీర్. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చిలో రిలీజ్. ఈ సినిమాతో రణ్‌బీర్ బాలీవుడ్లో టాప్ రేసులోకి దూసుకెళతాడని ట్రేడ్ భావిస్తోంది. దీని తర్వాత వచ్చే సినిమా కూడా అదే రేంజ్లో ఉండాలని రణ్‌బీర్ భావిస్తున్నాడట. అందుకే ఈసారి ఏకంగా బ్రహ్మాస్త్రం తీశాడు. బ్రహ్మాస్త్రం అంటే మామూలు విషయమా? శక్తులన్నీ కూడగట్టి బలాన్ని చూపించడం. ‘వేక్ అప్ సిద్’, ‘యే జవానీ హై దీవానీ’ సినిమాలతో తనకు సూపర్‌హిట్స్ ఇచ్చిన అయాన్ ముఖర్జీతో హ్యాట్రిక్ కోసం ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌తో వచ్చేస్తున్నాడు రణ్‌బీర్. ఇందులో హీరోయిన్ ఆలియా భట్. అమితాబ్ బచ్చన్ కీ రోల్లో కనిపిస్తారు. ఇదొక సూపర్ హీరో జానర్ అని టాక్. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళుతుందీ సినిమా. ఇప్పటికే టీమ్ ఇజ్రాయిల్‌లో లొకేషన్ హంట్‌లో ఉంది. ‘సంజు’, ‘బ్రహ్మాస్త్ర’ ప్లాన్ చేసినట్లుగా, అందరూ అనుకున్నట్లుగా పెద్ద కమర్షియల్ హిట్స్ అయిపోతే రణ్‌బీర్ టాప్ రేసులోకి వెళ్లినట్టే!!! -
‘చనిపోతున్నాను.. రక్షించండి’
జింద్: మరోసారి మానవత్వం మంటగలిసింది. భర్త చేతిలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో కొట్టుకుంటూ రక్షించండి అని అరుస్తున్నా చుట్టుపక్కల వారు నిర్దయగా వ్యవహరించారు. ఆమెకు సహాయం చేయాల్సింది పోయి తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ ఉండిపోయారు. ఆమె కన్నబిడ్డలు చుట్టూ చేరి రోదిస్తున్నా ఒక్కరూ కనికరించలేదు. ఈ దయనీయ ఘటన హర్యానాలోని జింద్‌లో చోటు చేసుకుంది. మరోలీ అనే గ్రామంలో సంజూ అనే మహిళ ఉంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త నరేశ్ మంచివాడు కాదు. నిత్యం గొడవపడుతూ హింసిస్తుండేవాడు. ఈ క్రమంలో ఒకసారి తన భర్తపై కేసు పెట్టింది. శుక్రవారం రోజు సాయంత్రం బయటకు వెళ్లిన సంజు ఇంటికి రాగానే వెంటనే ఆమె కళ్లలో కారం పోశాడు. ఆ వెంటనే చెట్లను, మొద్దులను కత్తిరించేందుకు ఉపయోగించే రంపంతో ఆమె భుజంపై, కడుపులో, మొకాలిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఇంటిముందే నడివీధిలో పడిపోయింది. తాను చనిపోతున్నానని, రక్షించాలని ప్రాధేయపడినా ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి రాగా ఓ వ్యక్తి వీడియో తీసుకుంటూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిని గట్టిగా మందలించిన పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలోనే ఉంది. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.