క్రిస్‌మస్‌ కానుకగా ‘మొఘల్‌’..!! | Aamir Khan To Produce T Series Founder Gulshan Kumar Biopic | Sakshi
Sakshi News home page

క్రిస్‌మస్‌ కానుకగా ‘మొఘల్‌’..!!

Published Thu, Jul 26 2018 5:04 PM | Last Updated on Thu, Jul 26 2018 5:29 PM

Aamir Khan To Produce T Series Founder Gulshan Kumar Biopic - Sakshi

ఆమిర్‌ ఖాన్‌

ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఆటగాళ్లు, నటులు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితం ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ‘సంజు’ సక్సెస్‌ ఇచ్చిన బూస్ట్‌తో మరికొన్ని బయోపిక్‌లు తెరక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. కాగా ప్రస్తుతం బీ- టౌన్‌లో మరో ఆసక్తికర వార్త హల్‌చల్‌ చేస్తోంది.

ప్రఖ్యాత మ్యూజిక్‌ కంపెనీ టీ- సిరీస్‌  వ్యవస్థాపకుడు గుల్షన్‌ కుమార్‌ జీవిత కథ ఆధారంగా తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, టీ- సిరీస్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సుభాష్‌ కపూర్‌(జాలి ఎల్‌ఎల్‌బీ ఫేం) దర్శకత్వం వహించనున్నారు. ‘మొఘల్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో గుల్షన్‌ కుమార్‌గా అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను ఈ క్రిస్‌మస్‌ కానుకగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోందట. ఈ విషయాన్ని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement