gulshan Kumar
-
గుల్షన్ కుమార్ హత్య కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు
ముంబై: కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య హిందీ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 1997 గుల్షన్ కుమార్ హత్య కేసులో నిర్మాత రమేష్ తౌరానిని నిర్దోషిగా ప్రకటించడాన్ని బొంబాయి హైకోర్టు ఏకీభవించింది. అలాగే అబ్దుల్ రషీద్ మర్చంట్ శిక్షను కోర్టు ధృవీకరించింది. జస్టిస్ ఎస్ ఎస్ జాదవ్, ఎన్ ఆర్ బోర్కర్ డివిజన్ బెంచ్ కూడా రౌఫ్ సోదరుడు, ఈ కేసులో మరొక నిందితుడు అబ్దుల్ రషీద్ మర్చంట్‌ను దోషులగా తేల్చింది. కుమార్ పై కాల్పులు జరిపిన వ్యక్తులలో రషీద్ ఒకరు అని పేర్కొంటూ అతనికి జీవిత ఖైదు విధించారు. గుల్షన్ కుమార్ హత్య కేసులో అనేక మందిని విచారించిన తర్వాత రావుఫ్ మర్చంట్, చంచ్యా పిన్నమ్, రాకేశ్ కావోకర్లను ప్రధాన నిందితులుగా కోర్టు నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును జూలై 1న బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. ‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే గుల్షన్ కుమార్‌ను 1997 ఆగస్టు 12న సబర్బన్ అంధేరిలోని ఓ ఆలయం వెలుపల దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ కేసులోని నిందితులు నదీమ్ సైఫీ, గ్యాంగ్ స్టర్ అబూ సలేం పరారీ ఉన్నారు. ఇక కుమార్‌ను హత్య చేయడానికి నదీమ్ సైఫీ, తౌరాని అబూ సలేంకు డబ్బు చెల్లించినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది. అబ్దుల్ వ్యాపారి సెషన్స్ కోర్టు ముందు లేదా డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు వెంటనే లొంగిపోవాలనీ.. అతను తన పాస్ పోర్ట్‌ను పోలీసులకు అప్పగించాలని తెలిపింది. ఒకవేళ అతను లొంగిపోకపోతే సెషన్స్ కోర్టు బెయిల్ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ, చేసి అతన్ని అదుపులోకి తీసుకుంటుంది, ’’ అని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బాంబే హైకోర్టు పేర్కొంది. ఇక ఏప్రిల్ 2002, 29న, 19 మంది నిందితుల్లో 18 మందిని సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు రౌఫ్‌ను భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం), 120 (బి) (క్రిమినల్ కుట్ర), 392 (దోపిడీ), 397 (దోపిడీలో తీవ్ర గాయాలు కలిగించేది), సెక్షన్ 27 (స్వాధీనం) భారత ఆయుధ చట్టం) కింద శిక్ష విధించింది. అయితే ఈ శిక్షకు వ్యతిరేకంగా రౌఫ్ అప్పీల్ చేయగా.. రౌఫ్ శిక్షను, అతనిపై విధించిన జీవిత ఖైదును కూడా ధర్మాసనం ఏకీభవించింది. చదవండి: వైరల్: కిక్ ఇచ్చాడు.. కుప్పకూలి పడ్డాడు! -
బాలీవుడ్‌లోకి ‘డార్లింగ్’ డైరెక్ట్ ఎంట్రీ
-
ప్రభాస్ కొత్త చిత్రం 'ఆదిపురుష్'
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో 'తానాజీ' దర్శకుడు ఔంరౌత్‌తో కలిసి ప్రభాస్ సినిమా చేయనున్నారనేది తెలిసిన విషయమే. అయితే ఈ చిత్రం ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కనుందనే సస్పెన్స్‌కు తెరదించుతూ మంగళవారం ఉదయం 7.11 నిమిషాలకు ఈ చిత్ర టైటిల్‌ను పోస్టర్‌తో సహా విడుదల చేశారు. ప్రభాస్ 22వ సినిమాకు "ఆదిపురుష్" అనే పేరును ఖరారు చేస్తున్నట్లు హీరో ప్రభాస్, దర్శకుడు ఓంరౌత్ ప్రకటించారు. "చెడుపై మంచి సాధించే విజయాన్ని పండగ చేసుకుందాం" అనేది క్యాప్షన్. ఈ పోస్టర్లో హనుమంతునితోపాటు ఎందరో మునులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి ఇది పౌరాణిక చిత్రమని ఈజీగా తెలుస్తోంది. (పారితోషికంలో ప్రభాస్ రికార్డు!) త్రీడీలో రూపుదిద్దుకోనుండటం ఈ సినిమా ప్రత్యేకత. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేయనున్నారు. టీ సిరీస్ నిర్మిస్తోంది. సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ప్రారంభం అవుతుండగా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటున్నారు. ప్రభాస్ 22 వ సినిమాలో రాముడిగా లేదా విష్ణువుగా కనిపించనున్నారని అభిమానులు జోస్యం చెప్తున్నారు. ఇదే నిజమైతే ప్రభాస్ కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మరోవైపు లాక్‌డౌన్‌లోనూ సినిమా అనౌన్స్ చేసి తమను సర్ప్రైజ్ చేశారంటూ అభిమానులు #Prabhas22, #Adipurushను ట్రెండ్ చేస్తున్నారు. (చిరు చేసిన 'చేపల వేపుడు’ వీడియో చూశారా!) -
రాత్రులు నిద్రపట్టేది కాదు
‘‘ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా అని నిర్ధారణ కాకముందే తుది నిర్ణయానికి రాకూడదు. తప్పొప్పులు తేలే వరకూ ఒక వ్యక్తి పని కోల్పోవడమే కాకుండా ఏ పని దొరక్కుండా ఖాళీగా ఉండాలా? నా నిర్ణయం ఒకరికి జీవనోపాధి కోల్పోయేలా చేసింది అనే ఆలోచన నాకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది’’ అని ఆమిర్ ఖాన్ అన్నారు. సంగీత దర్శకుడు గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ‘మొఘల్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. సుభాష్ కపూర్ దర్శకుడు. అయితే ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సుభాష్ కపూర్‌ౖపై వేధింపుల ఆరోపణలు (గీతికా త్యాగీ ఆరోపించారు) రావడంతో ‘మొఘల్’ నుంచి ఆమిర్ తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు ప్రకటించారు. ‘‘గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి సరైనది అనిపించింది. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది. నా మనస్సాక్షిని నమ్మి వెళ్తున్నాను. కొందరికి ఈ నిర్ణయం కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. మొన్న మే నెలలో ‘ఐఎఫ్‌టీడీఏ’ (ఇండియన్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్) నుంచి నాకో లేఖ వచ్చింది. ‘సుభాష్ కపూర్ కేస్ ప్రస్తుతం కోర్ట్‌లో నడుస్తోంది. అప్పుడే అతను దోషి అని ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. మీ ఆలోచనను మరోసారి సమీక్షించుకోండి’ అన్నది దాని సారాంశం. సుభాష్‌తో పని చేసిన కొందరు మహిళా అసిస్టెంట్ డైరెక్టర్స్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లతో నేను, నా భార్య కిరణ్ తన తీరు గురించి మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్లు తన గురించి మంచిగా మాట్లాడారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తనెప్పుడూ స్త్రీలతో తప్పుగా ప్రవర్తించి ఉండడు అని చెప్పదలచుకోలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలు పని ప్రదేశంలో జరిగినవి కావు. అందుకే ఈ సినిమాలో మళ్లీ భాగమయ్యాను’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆమిర్ ఖాన్. ఆమిర్ నన్ను సంప్రదించలేదు: గీతికా 2014లో సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి గీతికా త్యాగీ. ఆమిర్ తీసుకున్న తాజా నిర్ణయం గురించి త్యాగీ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది ఆమిర్ తీసుకున్న నిర్ణయం (సినిమా నుంచి తప్పుకోవడం) అభినందించదగ్గది. కానీ ఇప్పుడు సుభాష్ గురించి ఆరా తీసినప్పుడు ఆమిర్ ఖాన్‌గారు నన్ను సంప్రదించలేదు. సంప్రదించే ప్రయత్నం చేశారని నా వరకూ రాలేదు. మీరు (ఆమిర్) అంత జాలి చూపించాలనుకున్నప్పుడు రెండువైపుల కథను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆమిర్ మార్చుకున్న నిర్ణయం వల్ల వేధింపుల గురించి మాట్లాడటానికి ఎవరు ముందుకు వస్తారు? ఆరోపణలు చేసిన తర్వాత నేను కోల్పోయిన పని, పడ్డ బాధ ఎవరికి తెలుసు? మన రూల్స్ మగవాళ్లను కాపాడేందుకు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పోరాటాన్ని ఆపను’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయి వేధింపులకు గురైనప్పుడు బాలీవుడ్లో ఒక్కరికీ నిద్రపట్టని రాత్రులు ఉండవు ఎందుకో? (ఆమిర్ కామెంట్‌ను ఉద్దేశించి). సుభాష్‌కి మళ్లీ పని కల్పించినప్పుడు బాధితురాలిని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకో? బాలీవుడ్లో వేధించినవారికి సానుభూతి దొరుకుతుంది కానీ అమ్మాయిలకు మాత్రం ఎప్పుడూ దొరకదేంటో.. అర్థం కావడంలేదు’’ అంటూ వ్యంగ్య ధోరణిలో తనుశ్రీ దత్తా విమర్శనాస్త్రాలు సంధించారు. గీతికా త్యాగీ , తనుశ్రీ దత్తా -
క్రిస్మస్ కానుకగా ‘మొఘల్’..!!
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఆటగాళ్లు, నటులు, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితం ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి మంచి వసూళ్లు సాధించాయి. తాజాగా సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు కాసులు కురిపిస్తోంది. ‘సంజు’ సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో మరికొన్ని బయోపిక్‌లు తెరక్కించేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. కాగా ప్రస్తుతం బీ- టౌన్లో మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. ప్రఖ్యాత మ్యూజిక్ కంపెనీ టీ- సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవిత కథ ఆధారంగా తెరపై ఆవిష్కరించేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, టీ- సిరీస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సుభాష్ కపూర్(జాలి ఎల్ఎల్బీ ఫేం) దర్శకత్వం వహించనున్నారు. ‘మొఘల్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో గుల్షన్ కుమార్‌గా అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను ఈ క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తోందట. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. BIG NEWS... Aamir Khan Productions and TSeries to release Gulshan Kumar biopic in Christmas 2019... Written and directed by Subhash Kapoor... Filming to begin early next year. — taran adarsh (@taran_adarsh) July 26, 2018 -
మరో బయోపిక్‌లో అక్షయ్
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూట్ మార్చాడు. ఒకప్పడు కామెడీ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెట్టిన అక్కి... ఇప్పుడు పీరియాడిక్, బయోపిక్ సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. గత ఏడాది ఇదే జానర్లో ఎయిర్ లిఫ్ట్, రుస్తుం సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న ప్యాడ్ మ్యాన్ సినిమా కూడా బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమానే. తాజాగా ఇదే జానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు అక్షయ్ కుమార్. మ్యూజిక్ మొఘల్‌గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ లెజెండ్ గుల్షన్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. మొఘల్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ది గుల్షన్ కుమార్ స్టోరి' అనేది ట్యాగ్ లైన్ కాగా.. 'ది ఎంపరర్ ఆఫ్ మ్యూజిక్' అనేది క్యాప్షన్. ఈ సినిమాను గుల్షన్ కుమార్ భార్య సుదేష్ కుమారి నిర్మిస్తుండగా సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సిలౌట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. -
నీ స్వరం... తేనె ప్రవాహం!
యంగ్ టాలెంట్: తులసీ కుమార్ టీ-సీరిస్ యజమాని గుల్షన్ కుమార్ కుమార్తెగా కంటే, మంచి గాయనిగా తులసీ కుమార్ ఎక్కువమందికి పరిచయం. ‘రెడీ’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబాయి’ , ‘దబంగ్’ మొదలైన సినిమాలలో తులసీ కుమార్ పాడిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.‘‘ప్రతిభ లేని వారిని ఘనమైన కుటుంబనేపథ్యం కూడా రక్షించలేదు’’ అనే తులసీ చెప్పే కబుర్లు కొన్ని...ఒకరోజు నేను పాట పాడుతుంటే నాన్నగారు విన్నారు. ఆయనకు నా గొంతు బాగా నచ్చింది. ‘‘భవిష్యత్తులో మంచి గాయనిగా పేరు తెచ్చుకో’’ అని దీవించారు. అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు. నాన్న ఆశీర్వాద బలమో ఏమో గానాన్నే వృత్తిగా ఎంచుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ భక్తి వాతావరణం ఉంటుంది. ఆ ప్రభావంతోనే మొదట్లో భక్తి పాటలు ఎక్కువగా పాడాను. కెరీర్ మొదట్లో భక్తి పాటలు పాడడం అనేది దేవుడి ఆశీస్సులు కోరడం లాంటిది. మొత్తం ఏడు భక్తి ఆల్బమ్‌లు చేశాను.అనూ మాలిక్ సంగీతం సమకూర్చిన ‘హమ్ కో దివానే కర్ గయే’ సినిమాకు తొలిసారిగా సోనూ నిగమ్‌తో కలిసి పాడాను. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. నా అభిమాన గాయని లతాజీ(లతా మంగేష్కర్), ఆశాజీ(ఆశా భోంస్లే) ఇప్పటి వాళ్లలో మాత్రం సోనూ నిగమ్ ‘పేయింగ్ గెస్ట్’ సినిమాలోని ‘చాంద్ ఫిర్ నిక్లా’ పాట అంటే ఇష్టం.నా పని విషయంలో నాకు నేనే విమర్శకురాలిని. నా మనసుకు నచ్చిన పాట పెద్దగా పాపులర్ కాకపోయినా నా అభిమానంలో మాత్రం తేడా ఉండదు. నటించమని ఆఫర్లు వస్తుంటాయి. కానీ సంగీతం మాత్రమే నాకు ప్రధానం. నటించడం వల్ల పాడడం మీద ఏకాగ్రత పోతుందని నా అభిప్రాయం. అందుకే నటనకు దూరంగా ఉన్నాను.ఎలాంటి పాటనైనా అలవోకగా పాడగలగడం అనే దాని మీద గాయకుల విజయం ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల పాటలూ పాడి మంచి గాయనిగా నిరూపించుకోవాలనేది నా కోరిక.