మరో బయోపిక్లో అక్షయ్ | Alshay kumar to play gulshan Kumar biopic | Sakshi
Sakshi News home page

మరో బయోపిక్లో అక్షయ్

Published Wed, Mar 15 2017 12:47 PM | Last Updated on Tue, Sep 5 2017 6:10 AM

మరో బయోపిక్లో అక్షయ్

మరో బయోపిక్లో అక్షయ్

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ రూట్ మార్చాడు. ఒకప్పడు కామెడీ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెట్టిన అక్కి... ఇప్పుడు పీరియాడిక్, బయోపిక్ సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. గత ఏడాది ఇదే జానర్లో ఎయిర్ లిఫ్ట్, రుస్తుం సినిమాలు చేసిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న ప్యాడ్ మ్యాన్ సినిమా కూడా బయోపిక్గా తెరకెక్కుతున్న సినిమానే. తాజాగా ఇదే జానర్లో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు అక్షయ్ కుమార్.

మ్యూజిక్ మొఘల్గా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ లెజెండ్ గుల్షన్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. మొఘల్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ది గుల్షన్ కుమార్ స్టోరి' అనేది ట్యాగ్ లైన్ కాగా.. 'ది ఎంపరర్ ఆఫ్ మ్యూజిక్' అనేది క్యాప్షన్. ఈ సినిమాను గుల్షన్ కుమార్ భార్య సుదేష్ కుమారి నిర్మిస్తుండగా సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సిలౌట్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement