ఆ సినిమాను వదులుకున్న ఆమిర్‌ | Aamir Khan Give up Rajkumar Hirani Film Sanju | Sakshi
Sakshi News home page

ఆ సినిమాను వదులుకున్న ఆమిర్‌

Published Sun, May 20 2018 9:41 AM | Last Updated on Sun, May 20 2018 1:37 PM

Aamir Khan Give up Rajkumar Hirani Film Sanju - Sakshi

అమీర్‌ ఖాన్‌(ఫైల్‌ ఫోటో)

సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా, రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ‘సంజు’​ సినిమా ప్రకటించిన దగ్గరనుంచే ప్రతి నిత్యం ఏదో ఒక విశేషంతో పత్రికల్లో హల్‌చల్‌ చేస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి బీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సంజయ్‌ దత్‌ గా బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తుండగా, సంజయ్‌ దత్‌ తండ్రి, ప్రముఖ హీరో సునిల్‌ దత్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ ‘మిస్టర్‌ పర్ఫెక‌్షనిస్ట్‌’  ఆమిర్‌ ఖాన్‌కు తీసుకోవాలని భావించారట చిత్ర దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ. ఈ విషయం గురించి ఆయనే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

‘నేను ఏ కథను సిద్ధం చేసుకున్న ముందుగా ఆమిర్‌ ఖాన్‌కే చెపుతాను. అలానే ఈ స్క్రిప్ట్‌ను ఆమిర్‌కు చెప్పినప్పుడు చాలా బాగా ఉందని ఆయన మెచ్చుకున్నారు. అంతేకాక సునిల్‌ దత్‌ పాత్రను చేయడానికి కూడా ఒప్పుకున్నారు. కానీ అదే సమయంలో తాను ‘దంగల్‌’ చిత్రం కోసం నడి వయసు వ్యక్తిగా కనిపించాల్సిన అవసరం ఉండటంతో, మరోసారీ అదే తరహా పాత్రలో నటించడం ఇష్టం లేక ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు’ అని తెలిపాడు. ‘సంజు’ చిత్రంలో ఈ ‘ఖల్‌నాయక్‌’ పాత్రకు రణ్‌బీర్‌ కపూర్‌ అచ్చుగుద్దినట్టుగా సరిపోయాడు. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సంజయ్‌దత్‌లా కనిపించడం కోసం రణ్‌బీర్‌ కపూర్‌ చాలా కష్టపడుతున్నాడు. సంజయ్‌ దత్‌ జీవితంలోని మూడు దశలకు సంబంధించిన వివరాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2018, జూన్‌ 29న విడుదల కానుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement