హీరో ‘డ్రగ్స్‌’ కష్టాలు | Sanju Kar Har Maidaan Fateh Song Promo Out | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 1:04 PM | Last Updated on Sun, Jun 10 2018 1:15 PM

Sanju Kar Har Maidaan Fateh Song Promo Out - Sakshi

పాటలోని ఓ దృశ్యం ఆధారంగా చిత్రం

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సంజయ్‌ దత్‌ బయోపిక్‌ సంజు రిలీజ్‌కు ముందే హాట్‌ టాపిక్‌గా మారింది. అచ్చం సంజూ బాబాలా తెరపై కనిపించేందుకు రణ్‌బీర్‌ కపూర్‌ పడ్డ కష్టం.. పైగా సంజయ్‌ దత్‌ లైఫ్‌లోని ప్రతీ కోణాన్ని విప్పి చూప్పానని దర్శకుడు చేసిన ప్రకటనతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌లు ఆ అంచనాలను పెంచేయగా.. తాజాగా చిత్రంలోని ఓ సాంగ్‌ ప్రమోషన్‌ బిట్‌ను వదిలారు. ‘కర్‌ హర్‌ మైదాన్‌ ఫతే...’ అంటూ సాగే పాట.. శేఖర్‌ అస్థిత్వ లిరిక్స్‌, విక్రమ్‌ మాంట్రోస్‌ సంగీతాన్ని అందించగా.. సుఖ్విందర్‌ సింగ్‌-శ్రేయా ఘోషల్‌లు పాటను ఆలపించారు.  సంజయ్‌ దత్‌ జీవితంలోని డ్రగ్స్‌ కోణాన్ని చూపిస్తే సాగే పాట ఇది. వాటి నుంచి తేరుకోడానికి పునరావాస కేంద్రానికి పంపించటం, అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి ఇంటికి చేరటం, దారిలో అడ్డుకుంటూ కష్టాలు పడటం, డ్రగ్స్‌ నుంచి బయటపడేందుకు చేసే యత్నాలు, తల్లిదండ్రుల ఆప్యాయత.. మొత్తం ఎమోషనల్‌ కంటెంట్‌తో సాంగ్‌ సాగింది.

ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ తండ్రి సునీల్‌దత్‌ పాత్రలో పరేష్‌ రావెల్,  తల్లి నర్గీస్‌ దత్‌ పాత్రలో మనీషా కోయిరాల నటించారు. సోనమ్‌ కపూర్‌, దియా మీర్జాలు ఇతరత్రా పాత్రల్లో నటిస్తుండగా, కీలక పాత్రలో అనుష్క శర్మ కనిపించనుంది. జూన్‌ 29న సంజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement