![Akshaye Khanna was offered a role in Ranbir Kapoor's Sanju - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/12/akshaye-khanna.jpg.webp?itok=qUCLny2u)
అక్షయ్ ఖన్నా
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు.
కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా.
Comments
Please login to add a commentAdd a comment