ranbir singh
-
ఢిల్లీ పోలింగ్ @ 62.59%
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తుది గణాంకాలను.. పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల తరువాత.. ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు విడుదల చేసింది. మొత్తంగా, 62.59 శాతం పోలింగ్ నమోదైందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్‌బీర్ సింగ్ వెల్లడించారు. 2015 ఎన్నికల కన్నా ఇది దాదాపు 5% తక్కువ. ఆ ఎన్నికల్లో 67.47% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో బల్లీమారాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6%, ఢిల్లీ కంటోన్మెంట్ స్థానంలో అత్యల్పంగా 45.4% పోలింగ్ నమోదైందని సింగ్ తెలిపారు. తుది గణాంకాలను విడుదల చేయడంపై జరిగిన ఆలస్యంపై ఆయన వివరణ ఇచ్చారు. కచ్చితమైన గణాంకాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో రాత్రంతా రిటర్నింగ్ అధికారులు సమాచారాన్ని విశ్లేషించారని, అందువల్లనే పోలింగ్‌కు సంబంధించిన తుది శాతాన్ని వెల్లడి చేయడంలో జాప్యం ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే, ఇది అసాధారణ ఆలస్యమేమీ కాదన్నారు. తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించడంలో ఆలస్యం నెలకొనడాన్ని ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఈసీ ఏం చేస్తోంది? పోలింగ్ వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదు?’ అని ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ట్వీట్ చేశారు. ‘బీజేపీ నేతలు ఇచ్చే పోలింగ్ గణాంకాల కోసం ఈసీ ఎదురు చూస్తోంది. అందుకే, పోలింగ్ ముగిసి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ తుది లెక్కలు ఈసీ వెల్లడించలేకపోయింది’ అని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాతో అన్నారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. -
టెక్నాలజీతో ఓటింగ్ పెంచుతాం
న్యూఢిల్లీ: టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఓట్ల శాతాన్ని పెంచుతామని, పలు కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఓటేసేలా చేస్తామని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రణ్‌బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. త్వరలోనే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ కోడ్లు, సోషల్ మీడియాల ద్వారా ఓటర్లను ఆకర్షిస్తామని చెప్పారు. ‘జోష్ టాక్స్’ ప్రతినిధుల ద్వారా కాలేజీలు, ఇతర సంస్థల్లో కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రముఖ రేడియో జాకీ నవీద్ ఖాన్, కథక్ డాన్సర్ అలక్‌నంద దాస్‌గుప్త, క్రీడాకారులు మానిక బాత్రా, రిషభ్ పంత్ పాల్గొననున్నట్లు చెప్పారు. మొత్తం 1.4 కోట్ల మంది ఓటర్లని తెలిపారు. అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పత్పార్గంజ్ నుంచి బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఐదుగురు నామినేషన్ దాఖలు చేశారు. 15 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారారు. 24 మంది కొత్త వారు కాగా మొత్తం 8 మంది మహిళలు కూడా బరిలో ఉన్నట్లు తెలిపారు. -
నేటి నుంచి ఓటర్ వెరిఫికేషన్
న్యూఢిల్లీ: కొత్త ఓటర్లను చేర్చేందుకు, చనిపోయిన వారి ఓట్లను తీసి వేసేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ‘మెగా ఎలక్టర్స్ వెరిఫికేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఈసీ అధికారులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రత్యేక యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. వాటితో అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాల్సి ఉంటుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ స్పష్టం చేశారు. ఇలా చేర్చిన వివరాలను బ్లాక్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీని వల్ల సమయం ఆదా కావడమేగాక, సాధికారత వైపు ఓటర్లు అడుగులు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతుందని అన్నారు. ఢిల్లీలో దీనిపై సెస్టెంబర్ 1 నుంచి 15 వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ముసాయిదాను 2020 జనవరి 1న ప్రచురిస్తామని, రెండు మూడు వారాల్లోగా తుది ఫలితాలను తెలుపుతామన్నారు. ఇందులో పత్రాలు సమర్పించేందుకు రూ. 1, ఫొటో అప్లోడ్ చేసేందుకు రూ. 2, ఫామ్ 6 సమర్పించేందుకు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. -
‘దీపిక, రణబీర్ డ్రగ్స్ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’
ముంబై : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల తన స్నేహితులకి ఇచ్చిన విందు రాజకీయ దుమారానికి దారి తీసింది. కొద్దిరోజల క్రితం కరణ్ తన స్నేహితులకు తన ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు దీపిక పదుకొణే, రణబీర్ కపూర్, షాహిద్ కపూర్, మీర్జా రాజ్‌పుత్, వరుణ్ ధావన్, నటాషా దలాల్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు. వీరందరు సందడి చేస్తుండగా, వీడియోని తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు కరణ్. ఇప్పుడు ఆ వీడియో కాంట్రావర్సీగా మారింది. బాలీవుడ్ సెలబ్రీటీలంతా డ్రగ్స్ తీసుకుంటారని శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎమ్మెల్యే మజీందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. వారి రీల్ లైఫ్‌కి రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంటుందని, డ్రగ్స్‌ను సేవించామని గర్వంగా ఫీలవుతున్న బాలీవుడ్ సెలబ్రీటీలను చూడండంటూ కరణ్ జోహార్ తీసిన వీడియోను ట్విట్ చేశారు. #UDTABollywood - Fiction Vs Reality Watch how the high and mighty of Bollywood proudly flaunt their drugged state!! I raise my voice against #DrugAbuse by these stars. RT if you too feel disgusted @shahidkapoor @deepikapadukone @arjunk26 @Varun_dvn @karanjohar @vickykaushal09 pic.twitter.com/aBiRxwgQx9 — Manjinder S Sirsa (@mssirsa) July 30, 2019 కాగా మజీందర్ ఆరోపణలను కాంగ్రెస్ నేత మిలింద్ డియోరా ఖండించారు. వారు డ్రగ్స్ సేవించలేదని, అనవసరంగా ఇతరుల ప్రతిష్టతలను దిగజార్చేలా మాట్లాడొద్దని సూచించారు. ఇలాంటి అరోపణలు చేసినందుకు వీడియో ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరికి భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ కరణ్ ఇచ్చిన పార్టీకి నా భార్య కూడా వెళ్లింది. అక్కడ ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదు. దయచేసి ఇలాంటి అబద్దాలను ప్రచారం చేస్తూ.. ఇతరులను ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించకండి. వారందరికి మీరు భేషరతుగా క్షమాపణ చెబుతారని ఆశిస్తున్నాను’ అని డియోరా ట్విట్ చేశారు. కాగా, వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు డ్రగ్స్ తీసుకోలేదు సరదాగా పార్టీ చేసుకున్నారని కొందరు.. ఇది క్యాజివల్ పార్టీ కాదని, మందు పార్టీ అని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు. My wife was also present that evening (and is in the video). Nobody was in a “drugged state” so stop spreading lies & defaming people you don’t know! I hope you will show the courage to tender an unconditional apology https://t.co/Qv6FY3wNRk — Milind Deora मिलिंद देवरा (@milinddeora) July 30, 2019 -
మంచి చాన్స్ మిస్
మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం చేజారినప్పుడు ఏ యాక్టర్ అయినా ఫీల్ అవుతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన సంజయ్‌దత్ బయోపిక్ ‘సంజు’ గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో సంజయ్ పాత్రలో రణ్‌బీర్‌సింగ్, సంజయ్ తండ్రి సునీల్ దత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. కానీ సునీల్ దత్ పాత్రలో నటించే అవకాశం తొలుత అక్షయ్ ఖన్నాకు వచ్చింది. ‘‘సంజు సినిమాలో సునీల్ దత్ పాత్రకోసం లుక్ టెస్ట్ చేశారు. ఆ పాత్రకు నేను మిస్ ఫిట్ అని హిరానీ ఫీల్ అయ్యారు. ఇలా మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం నాకు దక్కలేదు’’ అని పేర్కొన్నారు అక్షయ్ ఖన్నా. -
'పద్మావత్'కు ముహూర్తం ఖరారు.. రిలీజ్ డేట్ ఇదే!
సాక్షి, ముంబై: ఇటీవల తీవ్ర వివాదాల్లో కూరుకుపోయిన సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావతి' సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. వివాదాల నేపథ్యంలో 'పద్మావతి' టైటిల్‌ను 'పద్మావత్'గా మార్చుకొని ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు 'సీబీఎఫ్సీ' అనుమతి ఇచ్చింది. మేవాడ రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిన 'పద్మావతి' సినిమాపై కర్ణిసేన నేతృత్వంలోని రాజ్‌పుత్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ఆగ్రహం నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాయి. దీంతో డిసెంబర్ నెలలో రావాల్సిన ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాపై వివాదం తలెత్తకుండా సీబీఎఫ్సీ పలు మార్పులు సూచించింది. పలుచోట్ల కత్తెరలు వేసింది. ఇందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది. సినిమా టైటిల్‌ను 'పద్మావత్'గా మార్చేందుకు అంగీకరించింది. దీంతో ఈ నెల 25న సినిమా విడుదలకు లైన్ క్లియరైంది. -
హిందీ టెంపర్‌లో?
ఎన్టీఆర్ నటనలో టెంపర్‌ను, కాజల్ అగర్వాల్ గ్లామర్‌లో టెంపర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్గా చూపించిన సినిమా ‘టెంపర్’. సినిమాలో ఎమోషనల్ యాంగిల్‌తో పాటు ఎన్టీఆర్, కాజల్ మధ్య ఫన్నీ లవ్ ట్రాక్ ప్రేక్షకులకు భలే నచ్చింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని పూరి ప్రయత్నించారు. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్‌లకు సినిమా కూడా చూపించారు. కానీ, ఎందుకో ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. తాజా ఖబర్ ఏంటంటే... రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్‌శెట్టి ‘టెంపర్’ను హిందీలో రీమేక్ చేయాలను కుంటున్నారట! హిందీలోనూ హీరోయిన్గా కాజల్ నటిస్తారని టాక్. ఆల్రెడీ రోహిత్ దర్శకత్వంలో కాజల్ ఓసారి నటించారు. అదే ‘సింగమ్’. ‘‘రణవీర్‌తో నటించడం ఇష్టమే. అలాగే, రోహిత్ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు ఆసక్తిగా ఉన్నా’’ అని ఇటీవల కాజల్ అన్నారు. దాంతో ‘టెంపర్’ హిందీ రీమేక్‌లో కాజల్ కన్ఫర్మ్ అయ్యారనే టాక్ జోరందుకుంది. -
నా బాయ్‌ఫ్రెండ్‌ను అడిగితే చెబుతాడు!
మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌తో దీపికా పదుకొనే నటి స్తూంటే, తాజా ప్రియుడు రణ్వీర్ సింగ్‌కు ఎలా ఉంటుంది? పుండు మీద కారం చల్లినట్లు ఉంటుందన్నది కొంతమంది ఊహ. అందుకే దీపికా పదుకొనే దగ్గర ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. దీపిక ఏ మాత్రం తడబడకుండా... ‘‘ఈ విషయం గురించి మీరు రణ్వీర్ను అడిగితే బాగుంటుంది’’ అన్నారు. ‘‘అయినా మనం గతాన్నీ, భవిష్యత్తునూ ఏ మాత్రం దాచకూడదు. ఆ విషయంలో నేనెప్పుడూ క్లారిటీగా ఉంటాను. మంచీ, చెడు -రెండిటినీ నేను రణ్వీర్ సింగ్‌తో పంచుకుంటాను. ఏ బంధమైనా పటిష్ఠంగా ఉండాలంటే.. దాపరికాలు ఉండకూడదు. అందుకే, నేను అన్ని విషయాలనూ రణవీర్‌తో చెప్పేస్తాను’’ అని దీపిక పేర్కొన్నారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ, రణ్వీర్ గురించి చెబుతున్నప్పుడు దీపిక ‘నా బాయ్‌ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆ మాట అందరి దృష్టినీ ఆకర్షిం చింది. ఎందుకంటే, ఇప్పటివరకూ ఆమె ఎప్పుడూ అతణ్ణి ‘మంచి ఫ్రెండ్’ అని మాత్రమే చెప్పుకొ చ్చారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ పదం వాడడానికి కారణమేమిటని ఇప్పుడంతా చర్చిస్తున్నారు. బహుశా తమ బంధం గురించి బాహాటంగా ప్రక టించాలని దీపిక అనుకుని ఉంటుందనీ, అందుకే ఇలా క్లూ ఇచ్చారనీ గుసగుస వినిపిస్తోంది. -
ఇప్పుడు మీ అందరికీ ఆనందమేగా?
సిద్ధార్ధ్ మాల్యా... తొలి ప్రేమికుడు రణబీర్ కపూర్... మలి ప్రేమికుడు రణవీర్ సింగ్... మూడో ప్రేమికుడు. ఇప్పటివరకు దీపికా పదుకొనే సాగించిన ప్రేమాయణాల జాబితా ఇది. సిద్ధార్ధ్ నుంచి విడిపోయిన తర్వాత రణబీర్‌తో లవ్‌లో పడ్డ దీపికా ఈసారి పెళ్లి పీటల మీద కూర్చుంటారని చాలామంది ఊహించారు. కానీ, ఆ ముచ్చట జరగకుండానే రణబీర్‌తో ప్రేమకు టాటా చెప్పేశారు దీపికా. ఇక, గత కొన్నాళ్లుగా రణవీర్‌తో సాగిస్తున్న ప్రేమకు కూడా ఫుల్స్టాప్ పెట్టేశారని తెలుస్తోంది. ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఓ పది, పదిహేను రోజులై ఉంటుంది. ఎందుకంటే, ఈ నెల 5న తన పుట్టినరోజుని రణవీర్‌తో కలిసి న్యూయార్క్‌లో జరుపుకున్నారామె. అక్కడే ఏదో జరగకూడనిది జరిగి ఉంటుందని బాలీవుడ్‌వారు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న దీపికా పదుకొనే దగ్గర రణవీర్ ప్రస్తావన తీసుకొచ్చిన పాత్రికేయులతో -‘‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పుడు మీ అందరికీ ఆనందమేగా’’ అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పారు. ఆ నవ్వులు చూస్తుంటే.. రణవీర్ నుంచి విడిపోయినందుకు ఆమె చాలా ఆనందంగా ఉన్నారని అర్థమవుతోంది. అందరూ తమ గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి, ఆ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టించాలనే దీపికా అలా చెప్పి ఉంటారన్నది కొంతమంది ఊహ. కానీ, ఈ మధ్య రెండు, మూడు కార్యక్రమాలకు ఇద్దరూ విడివిడిగా వచ్చారని, కనీసం మొహమాటానిక్కూడా పలకరించుకోలేదట. కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడలేదట. సో.. మూడో ప్రేమకు కూడా దీపికా మంగళం పాడేసినట్లే.