హిందీ టెంపర్‌లో? | Kajal Agarwal act hindi 'temper' remake movie? | Sakshi
Sakshi News home page

హిందీ టెంపర్‌లో?

Published Tue, Mar 21 2017 11:00 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

హిందీ టెంపర్‌లో? - Sakshi

హిందీ టెంపర్‌లో?

ఎన్టీఆర్‌ నటనలో టెంపర్‌ను, కాజల్‌ అగర్వాల్‌ గ్లామర్‌లో టెంపర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్‌ పర్‌ఫెక్ట్‌గా చూపించిన సినిమా ‘టెంపర్‌’. సినిమాలో ఎమోషనల్‌ యాంగిల్‌తో పాటు ఎన్టీఆర్, కాజల్‌ మధ్య ఫన్నీ లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులకు భలే నచ్చింది. ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేయాలని పూరి ప్రయత్నించారు. సల్మాన్‌ ఖాన్, అభిషేక్‌ బచ్చన్‌లకు సినిమా కూడా చూపించారు. కానీ, ఎందుకో ప్రాజెక్ట్‌ పట్టాలు ఎక్కలేదు.

తాజా ఖబర్‌ ఏంటంటే... రణవీర్‌ సింగ్‌ హీరోగా దర్శకుడు రోహిత్‌శెట్టి ‘టెంపర్‌’ను హిందీలో రీమేక్‌ చేయాలను కుంటున్నారట! హిందీలోనూ హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తారని టాక్‌. ఆల్రెడీ రోహిత్‌ దర్శకత్వంలో కాజల్‌ ఓసారి నటించారు. అదే ‘సింగమ్‌’. ‘‘రణవీర్‌తో నటించడం ఇష్టమే. అలాగే, రోహిత్‌ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు ఆసక్తిగా ఉన్నా’’ అని ఇటీవల కాజల్‌ అన్నారు. దాంతో ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌లో కాజల్‌ కన్ఫర్మ్‌ అయ్యారనే టాక్‌ జోరందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement