నిమ్మకూరులో కాదు.. హైదరాబాద్లోనే! | ntr temper audio release in hyderabad, says producer bandla ganesh | Sakshi
Sakshi News home page

నిమ్మకూరులో కాదు.. హైదరాబాద్లోనే!

Published Fri, Nov 28 2014 10:01 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

నిమ్మకూరులో కాదు.. హైదరాబాద్లోనే! - Sakshi

నిమ్మకూరులో కాదు.. హైదరాబాద్లోనే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్' ఆడియోను హైదరాబాద్లోనే విడుదల చేసేందుకున్న సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా ఆడియో వేడుకను జూనియర్ ఎన్టీఆర్...  తాత నందమూరి తారక రామారావు స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో నిర్వహిస్తున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుంటూరులో అంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ పుకార్లను చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ కొట్టిపారేశారు.  

టెంపర్ ఆడియోను హైదరాబాద్లోనే రిలీజ్ చేసే పనిలో ఉన్నామన్నారు. 'సినిమా ఆడియో కార్యక్రమాన్ని నిమ్మకూరులో నిర్వహిస్తున్నట్లు ఎలా వార్తలు వెలువడ్డాయో అర్థం కావటం లేదు. అసలు అలాంటి ఆలోచన కూడా మాకు రాలేదు.' అని బండ్ల గణేశ్ తెలిపారు. డిసెంబర్ రెండోవారంలో పాటల్ని విడుదల చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను విడుదల చేస్తామన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement