Nimmakuru
-
నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయన్నారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశారు. ఇప్పుడు సిగ్గులేకుండా వచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం గుడివాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుడివాడకు చంద్రబాబు ఏం చేశారు? గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపించగలరా?. చంద్రబాబు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు జిత్తులమారి నక్క’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. ‘‘సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదు. మేము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారు. హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు నిమ్మకూరును అభివృద్ధి చేశారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న చిత్తుశుద్ధి చంద్రబాబుకు లేదు. నిమ్మకూరును ఉద్దరించామని చెబితే ఎవరు నమ్ముతారు?’’ అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు -
అప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా? బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్
సాక్షి, తిరుపతి: ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. బాలకృష్ణను చూస్తే బాధకరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా?.. ఇప్పుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెడుతానంటున్నారని విమర్శించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అభివృద్ధి చేస్తామని..సీఎం జగన్, కొడాలి నాని ముందే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్క్రిప్ట్‌లు మానేసి.. ఎన్టీఆర్ కొడుకుగా ఒక డైనమిక్ లీడర్‌గా ముందుకొచ్చి టీడీపీ కార్యకర్తలను కాపాడండని అన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా శనివారం మాట్లాడుతూ.. ‘తండ్రికి తగ్గ తనయుడిగా ఉండి ఉంటే, ఎన్టీఆర్‌గారు చనిపోయినప్పుడు బాలకృష్ణగారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ కుటుంబసభ్యుల అమాయకత్వాన్ని వాడుకుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, వాళ్లను ఏ విధంగా బయటపడేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరంగా ఉంచిన చంద్రబాబు, మళ్లీ తన అధికారం కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవడం కూడా చూశాం. చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని నిమ్మకూరు అభివృద్ధి, ఈరోజు బాలకృష్ణ అక్కడకు వెళ్ళి, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుతామని, ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టామని చెప్పడం అమాయకమా? మరొకటా అనేది అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా బాలకృష్ణగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలని ఎందుకు గుర్తుకు రాలేదు. ఎన్టీఆర్‌ను గౌరవిస్తామని సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ చెప్పేవారు. అందుకు నిదర్శనంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టడం జరిగింది. అందుకు ముందుగా ఎన్టీఆర్ కుటుంబం వైఎస్ జగన్‌కు థ్యాంక్స్ చెప్పాలి’ అని మంత్రి రోజా అన్నారు. చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు.. నరసరావుపేట సభలో మంత్రులు -
నిమ్మకూరు: ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులర్పించిన బాలకృష్ణ
-
నిమ్మకూరులో వైఎస్సార్సీపీ విజయం
నిమ్మకూరు (పామర్రు): టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి అశోక్‌కుమార్ జయకేతనం ఎగురవేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు ఆకర్షితులై వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అశోక్‌కుమార్ తన ప్రత్యర్థి వీరాంజనేయులుపై తొలుత రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనికి ప్రత్యర్థి రీ కౌటింగ్ జరపాలని డిమాండ్ చేయగా రీ కౌంటింగ్‌లో అశోక్‌కుమార్‌కు మరో 6 ఓట్లు ఆధిక్యం రాగా మొత్తం 8 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. చదవండి: ప్రజాప్రయోజనాలకే పెద్దపీట -
మానవత్వాన్ని చాటిన పేర్ని నాని
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు. -
ఉప్పులేటి వాడ..అవినీతి చీడ
సాక్షి, కృష్ణా : దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అన్న చందంగా సాగిపోయింది ఆ ఎమ్మెల్యే తీరు. అడ్డూ అదుపులేని అవినీతి పర్వం.. ఇసుక, బుసక, మట్టి తవ్వకాల నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకూ అన్నింటా దోచుకో, దాచుకో.. పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నైతిక విలువలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీ పంచన చేరి అందుకున్న తాయిలాలు ఒక ఎత్తయితే.. ఆమె కనుసన్నల్లో అక్రమార్జనకు ద్వారాలు తెరుచుకున్న వైనం మరొక ఎత్తు... కనీసం నమ్మి ఓట్లేసిన దళితులను సైతం పట్టించుకోకుండా.. సొంత లాభమే అజెండాగా పాలన సాగిస్తున్న పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అవినీతి అంకంపై ‘సాక్షి’ ఫోకస్. చినబాబుకు వాటాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వస్థలం నిమ్మకూరులో అడుగడుగునా అవినీతి దర్శనమిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ప్రభుత్వం వివిధ పనుల కోసం రూ.15 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.7 కోట్లు అభివృద్ధి పనుల ముసుగులో తెలుగు తమ్ముళ్ల జేబుల్లోకెళ్లినట్లు తెలుస్తోంది. మండల అధ్యక్షుడు కనుసన్నల్లోనే ఈ అవినీతి జరిగినట్లు కొందరు పేర్కొంటున్నారు. ఇందులో చినబాబుకు మూడో వంతు వాటా వెళ్లినట్లు తెలుస్తోంది. చెరువు తవ్వకంలో రూ.కోటి స్వాహా.. నిమ్మకూరు గ్రామంలోకి ప్రవేశించేటప్పుడు చెరువు దర్శనమిస్తుంది. ఈ చెరువును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్ది చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతామని చెప్పారు. అయితే నీరు–చెట్టు కింద నిబంధనలకు విరుద్ధంగా సుమారు 25,000 ట్రక్కుల మట్టిని తవ్వి, ఒక్కొక్క ట్రక్కు రూ.400 చొప్పున మండలాధ్యక్షుడు యథేచ్ఛగా విక్రయించుకున్నారు. దీని ద్వారా సుమారు రూ.కోటి సంపాదించారు. తన స్వస్థలంతో పాటు పక్కనే ఉన్న పోరంబోకు స్థలం సుమారు 10 సెంట్లు ఆక్రమించుకుని చెరువు మట్టితో నింపి ప్లాట్లుగా విభజించి విక్రయించుకుని మరో రూ.10 లక్షలు వెనకేసుకున్నారు. చెరువు తవ్వినందుకు మరో రూ.8 లక్షలు ప్రభుత్వం నుంచి తవ్వకం కింద తీసుకున్నారు. ఉన్న రోడ్లపైనే సిమెంట్ రోడ్లు వేసి.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే నిమ్మకూరులో సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు ఆ రోడ్లపైనే సిమెంట్ పూత పూశారు. రోడ్లకు ఇరువైపులా ఒక అడుగు మేర సిమెంట్ రోడ్లు వేసి మొత్తం రోడ్లు వేసినట్లుగా చూపి సుమారు రూ.కోటిన్నర వరకు టీడీపీ నేతలు దండుకున్నారు. హాస్పిటల్ లేదు.. అనుబంధ రోడ్లు వచ్చాయి.. నిమ్మకూరు దాని చుట్టు పక్కల గ్రామాలకు కలిపి రూ.4.5 కోట్లతో 30 పడకల హాస్పటల్‌ను రెండేళ్ల కిందట అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌కు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడికి మధ్య బేరాలు కుదరక శంకుస్థాపన దశలోనే ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయింది. అయితే ఈ ఆస్పత్రికి అనుబంధంగా నిమ్మకూరు–మత్రిపాలెం, నిభానుపూడి, వడ్రపూడి తదితర ప్రాంతాలను కలుపుతూ రూ.6 కోట్లతో రోడ్లు వేశారు. ఇందులో సుమారు రూ.2 కోట్ల వరకు చేతులు మారాయి. రూ.5 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరగ్గా ఇందులోనూ రూ.2 కోట్లు తెలుగు తమ్ముళ్ల ఖాతాలోకి వెళ్లాయి. అవినీతి గురించి అధికారులకు తెలిసినా సాక్షాత్తూ చిన్నబాబుతో మండల నాయకులు టచ్‌లో ఉండటంతో మౌనంగా ఉన్నారు. నిమ్మకూరు పార్టీ నాయకులే పనులు మంజూరు చేయించుకుని, వారే చేసుకుని, వారే బిల్లులు పెట్టుకున్నారని, అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారని స్థానికులు చెబుతున్నారు. కల్పన ‘కారు’ కక్కుర్తి దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆశతో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంది. పేదలకు అందాల్సిన పథకాలను వదిలిపెట్టలేదు. కేంద్రం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా సబ్సిడీపై మంజూరు చేసిన ఇన్నోవా వాహనాన్ని తన బినామీ పేరుతో తీసుకొని దర్జాగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు పాతర.. ఎమ్మెల్యే అనుచరుడు, మువ్వా గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా దాదాపు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16 టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపి ఎల్లో ప్లేట్ ఉంచాలి. కానీ ఆ కారు నంబరు వైట్ బోర్డు కింద కేటాయించారు. ఈ తతంగం వెనుక ఎమ్మెల్యే ఉండటంతో రవాణా శాఖ అధికారులు నిబంధనలను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరుతో50 శాతం నిధులు బొక్కేశారు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్లు పామర్రు నియోజకవర్గంలో టీడీపీ నేతల దోపిడీ పర్వం కొనసాగింది. ఇసుక, మట్టి, మద్యం తదితరాల్లో రూ.కోట్లు దండుకున్నారు. 2015–16లో నీరు–చెట్టు పథకం కింద నియోజకవర్గంలో 15 చెరువులను రూ.3 కోట్లు వెచ్చించి తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఈ పనుల్లో 50 శాతం నిధులు నొక్కేశారు. చెరువుల నుంచి తవ్విన మట్టిన సైతం రైతులకు ఉచితంగా ఇవ్వకుండా ట్రాక్టరుకు రూ.500 చొప్పున వసూలు చేశారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు ఇసుక క్వారీ అధికార పార్టీ నేతలకు కాసులవర్షం కురిపించింది. ఇసుక కోసం వచ్చే వాహనదారుల నుంచి బాట పనుల పేరుతో సుమారు ఏడాది పాటు ఆ పార్టీ నేతలు అడ్డగోలు వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో ట్రాక్టర్ డ్రైవర్ వద్ద రూ.100 చొప్పున, రోజుకి 500 నుంచి 600 వాహనాల వద్ద డబ్బును వసూలు చేశారు. నెలకు రూ.10 లక్షల చొప్పున నాలుగున్నరేళ్లు రూ.5.20 కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. ఇసుక అమ్మకాలకు మరో ధర నిర్ణయించి రూ.కోట్లు దండుకున్నారు. సుమారు రూ.1.20 కోట్ల సొమ్ము అధికార పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేత, దిగువ శ్రేణి నాయకులు కలిసి స్వాహా చేశారు. రొయ్యూరులోని కృష్ణా నదీ గర్భంలోని పట్టా భూముల్లో జరిగిన ఇసుక తవ్వకాల్లో కూడా అధికార పార్టీ నేతల మధ్య రూ.లక్షల్లో సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రభుత్వం నుంచి అందాల్సిన కార్పొరేషన్ రుణాలు, పింఛన్లు, పక్కా గృహాలు, ఆదరణ వంటి పథకాల అమలులో తమకు అనుకూలమైన వారికే దక్కేలా తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పారు. ఈ రుణాలు ఇప్పించే పేరిట కూడా తమ్ముళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. చాలా మండలాల్లో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్టజెప్పిన వారికే ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ పేదల నుంచి వసూళ్లు చేశారు. ఈ మొత్తం రూ.కోటి వరకు ఉన్నట్లు తెలుస్తోంది. -
నిమ్మకూరు కంట కన్నీరు
ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతితో స్వగ్రామమైన నిమ్మకూరు లో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుటుంబసభ్యుడ్ని కోల్పోయినట్లు గ్రామస్తులు రోదించారు. బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. జ్ఞాపకాలు తలచుకుంటూ విచారం వ్యక్తం చేశారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు బుధవారం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. సాక్షి,విజయవాడ/ పామర్రు : టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు ఆయన స్వస్థలం నిమ్మకూరుకు విడదీయరాని అనుబంధం ఉంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ చనిపోయాడని తెలుసుకున్న గ్రామస్తులు విలపించారు. ఆయన పుట్టిన నిమ్మకూరులోనే అంత్యక్రియలు జరిగితే బాగుంటుదని పలువురు భావించినా, అది అసాధ్యమని మౌనంగా ఉండిపోయారు. హరికృష్ణ గురించి ఆయన సన్నిహితులు, గ్రామస్తులు అభిప్రాయాలు వారి మాటల్లోనే.... వరదయ్య కొట్టే అడ్డా..... హరికృష్ణకు చిన్నప్పుడు ఒక స్నేహితుల బృందం ఉండేదట. పాఠశాల సమీపంలో వరదయ్య కొట్టే వారకి అడ్డా. స్నేహితులతో కలిసి అక్కడ కూర్చుని చిరుతిళ్లు తిన్నేవారు. స్నేహితులకు చిరుతిళ్లు అన్ని హరికృష్ణ ఖాతాలోనే. డబ్బులు లేకపోతే వరదయ్య కోట్లోనే అప్పు చేసేవాడు. తరువాత నానామ్మ వెంకట రావమ్మ వద్ద దాచుకున్న డబ్బులు తెచ్చి అప్పు తీర్చేవాడని వరదయ్య సాక్షికి వివరించారు. తరువాత కాలంలో వరదయ్యకు అనారోగ్యం వస్తే హరికృష్ణ ఆయన్ను నిమ్స్ పిలిపించుకుని వైద్యం చేయించుకున్నారు. నిమ్మకూరులో హరికృష్ణకు సన్మానం చేసినప్పుడు వరదయ్య షాపు వద్ద తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. మామగారి పేరుతో బస్ షెల్టర్.... హరికృష్ణ మామగారు సోమశేఖరరావు చనిపోయిన తరువాత ఆయన జ్ఞాపకార్థం నిమ్మకూరులో బస్‌షెల్టర్ నిర్మించారు. దీనికి హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ కూడా వచ్చి అందర్ని పేరు పేరునా పలకరించారని కుదరవల్లి సతీష్ బాబు తెలిపారు. మంచి చతురుడు.. ఆయన అందరితోనూ ఎంతో సన్నిహితంగా, చతురతతో ఉండేవారని, మహిళల్ని అక్కా,అమ్మా అంటూ సంబోధించేవారని ఆయన కుటుంబానికి సన్నిహితంగా ఉండే పద్మ తెలిపింది. లక్మయ్య, ఎన్టీఆర్, హరికృష్ణ ఆమెకు సుపరిచితులే. రజక వృతి చేసుకుని జీవించే తనను హరికృష్ణ ఆర్థ్ధికంగా ఆదుకున్నారని పద్మ ‘సాక్షి’ కి తెలిపారు. కొడాలి నాని అంటే ఎంతో అభిమానం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) అంటే హరికృష్ణకు ఎంతో అభిమానం. అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, గుడివాడ నుంచి పోటీ చేసినప్పుడు నాని వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలు స్థాపించడంలో కొడాలి నాని ఎంతో కీలకపాత్ర పోషించారు. హరికృష్ణకు గ్రామస్తులు సన్మానం చేసినపుడు నాని స్వయంగా ఆ కార్యక్రమంలో పాల్గొని హరికృష్ణను సత్కరించారు. తరువాత నానికి గుడివాడ ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిచడంలోనూ హరికృష్ణ ఎంతో ఆసక్తి చూపించారని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువులో ఈత... తాతతో కలిసి వ్యవసాయం నిమ్మకూరు చెరువులో స్నేహితులతో కలిసి ఈత కొట్టేవారు. తాతయ్య సాగు చేసే పొలానికి స్నేహితులతో కలిసి వెళ్లేవారు. తండ్రి ఎన్టీఆర్, తాతయ్య లక్ష్మయ్య లాగానే వ్యవసాయం అన్నా సినిమాలు అంటే ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు. అందువల్లనే నిమ్మకూరులో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పటికీ ఆయనకు ఆ గ్రామంలో పంటభూములు ఉన్నాయి. ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఈ గ్రామంలో పొలాలు కొనిపించటం విశేషం. గ్రామంలో అందరితోనూ సన్నిహితంగా.. హరికృష్ణ గ్రామంలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. రాజ్యసభ సభ్యుడుగా స్వగ్రామనికి వచ్చినప్పుడు కూడా కారు గానీ, గన్‌మెన్ గానీ ఉండేవి కాదని ఆయన స్నేహితులు చెబుతున్నారు. నడుచుకుంటూనే గ్రామమంతా తిరిగే వారు. పేరు పెట్టి కాకుండా బాబాయి, అన్నాయ్, తమ్ముడు, మామయ్య, అమ్మ, అక్కా అంటూ బంధుత్వాలను కలుపుకుని పిలిచేవారని ఏ మాత్రం బేషజం లేకుండా అందరితో కలిసి కూర్చుని మాట్లాడేవారని గ్రామస్తులు చెబుతున్నారు. నిమ్మకూరులోనే ఓటు.. హరికృష్ణ జీవితకాలమంతా నిమ్మకూరునే శ్వాస, ధ్యాసగా భావించారు. నిమ్మకూరులో పుట్టడమే కాకుండా అక్కడమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత నిమ్మకూరుకు తన ఓటును మార్చుకున్నారని ఆయన స్నేహితులు గుర్తు చేసుకున్నారు. నిమ్మకూరు అభివృద్ధిలో కీలకపాత్ర.... అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.25 లక్షలు, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.05 కోట్లు, ఏపీఆర్జేసీ గురుకుల పాఠశాలకు రూ.40 లక్షలు, సోలార్ విద్యుదీపాలకు రూ.1 కోటి రూపాయలు నిధులు వెచ్చించి అభివృద్ధి చేశారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా నిభానుపూడి వెళ్లే రోడ్డు, అవురుపూడి వెళ్లే రోడ్లకు కూడా నిధులు కేటాయించారని ఆయా గ్రామాల ప్రజలు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. గరికపర్రుతో ప్రత్యేక అనుబంధం తోట్లవల్లూరు: టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చైతన్యరధ సారథి, సినీనటుడు దివంగత నందమూరి హరికృష్ణ మృతితో మండలంలోని గరికపర్రులో విషాదచాయలు అలముకున్నాయి. తోడల్లుడి స్వగ్రామమైన గరికపర్రుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. కృష్ణా జిల్లాకు ఎప్పుడు వచ్చినా హరికృష్ణ గరికపర్రులోని ఆయన తోడల్లుడు సూరపనేని హనుమంతరావు నివాసంలోనే ఎక్కువగా గడిపేవారు. నాలుగైదు రోజులు ఉండి బంధువులతో ఆత్మీయంగా గడిపి హైదరాబాద్ వెళ్లేవారు. హరికృష్ణ రాక విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పార్టీ నాయకులు అధికసంఖ్యలో వచ్చి కలుసుకునే వారు. గరికపర్రు అభివృద్దికి హరికృష్ణ ఎనలేని కృషి చేశారు. ఆయన రవాణా మంత్రిగా పని చేసినప్పుడు ప్రత్యేకంగా గ్రామానికి బస్సు ఏర్పాటు చేశారు. ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలకుపైగా మంజూరు చేయించి సిమెంటు రహదారులు, వంతెనలు నిర్మింపజేశారు. రూపాయి పాతి డబ్బుల చెట్టుకోసం.. రూపాయి బిళ్ల భూమిలో పాతితే డబ్బులు చెట్టు వస్తుందని అతని మిత్రుడు గాంధీ చెప్పడంతో నమ్మిన హరికృష్ణ తన ఇంట్లో రూపాయి బిళ్ల పాతి రోజు నీళ్లు పోసేవాడు. అయితే వారం తరువాత కూడా డబ్బులు చెట్లు రాకపోవడంతో స్నేహితులందరికి చెప్పడంతో అంతా సరదాగా నవ్వుకునేవారంట! అని ఆయన స్నేహితుడు కుదరవల్లి రఘురామయ్య సాక్షికి తెలిపారు. –రఘురామయ్య ఇద్దరం ఒకే చోట ఉండేవాళ్లం నేను హరికృష్ణ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. అయితే లక్మయ్య తాత ఇంట్లో, లేదా మా ఇంట్లో ఉండేవాళ్లం. పెళ్లయ్యే వరకు మద్రాసు వెళ్లినా కలిసి వెళ్లేవారం. కలిసి వచ్చేవాళ్లం. చిన్నప్పుడు వాళ్ల ఇంటి నుంచి సవారీ (పరిగెత్తు) చేసూ కొస్తున్నాం. ఇద్దరం కలిసే పొలానికి వెళ్లేవారం. మోటర్ సైకిల్ ఎక్కితే ఎదురుగా ఎవరు వచ్చినా చూసేవాడు కాదు. ఇద్దరం కలిసి పోటీ పెట్టుకుని పరిగుపెడుతుంటే ఎదురుగా వచ్చిన ఒక రైతు చేతిలో ఉన్న పలుగు ఇద్దరికి రెండువైపుల తగిలి ఇద్దరం ఒకేసారి కిందపడిపోయాం. –యలవర్తి శరత్‌బాబు -
నిమ్మకూరు: హరికృష్ణ చదివిన స్కూలు
-
నిమ్మకూరులో ‘ఎన్టీఆర్’ టీం
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం లొకేషన్స్‌ను వెతికే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ బాల్యనికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించాల్సిన లొకేషన్స్ పరిశీలించేందుకు ఆయన స్వగ్రామం నిమ్మకూరుకు వచ్చింది ఎన్టీఆర్ టీం. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ క్రిష్ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు నిమ్మకూరు, కొమరవోలులో పర్యటించారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను అభిమానులకు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘సినిమాలో నాన్నగారు, అమ్మ పుట్టిన ఊర్లను యాదాతధంగా చూపించాలని అనుకుంటున్నాం. ఈ గ్రామాలతో మాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కథను వెండితెర మీద చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. -
నిమ్మకూరులో పైసా వసూల్
ఇక్కడ పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. చేసే పని చిన్నదైనా అక్కడి నేతకు పైసలు సమర్పించుకోవాల్సిందే. ఇదేమిటంటే చినబాబు పేరు చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో కాంట్రాక్టర్లు గుర్రుగా ఉన్నారు. అన్ని పనులకు పర్సంటేజీలు ఇస్తే తమకు ఏమి మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో దందాకు తెరతీసిన నేత అక్రమ వసూళ్లపై కథనం. సాక్షి,అమరావతిబ్యూరో: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా వంటబట్టించుకున్నారు అధికార పార్టీనేతలు.. ప్రతి పనిలో పర్శంటేజీలు బహిరంగంగా వసూలు చేస్తున్నారు. తాజాగా పామర్రు నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో చినబాబు ముఖ్య అనుచరుడు చేస్తున్న దందాలు వివాదస్పదంగా మారాయి. ఆ గ్రామాన్ని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకొని గ్రామాభివృద్ధి కోసం కేటాయించిన పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద పర్సంటేజీల వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ చెరువులో నీరు..చెట్టు పనుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దందాలు ఇలా.. నిమ్మకూరును ఆయన మనవడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేçష్ 2015 డిసెంబర్లో దత్తత తీసుకున్నాడు. గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే దాదాపు రూ.28 కోట్ల నిధులు మంజూరు చేశారు. గ్రామంలో ఆయా నిధులతో పనులు జరుగుతున్నాయి.ఆ పనులను టెండర్ల ప్రక్రియలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు వద్ద చినబాబు కీలక అనుచరుడు దందాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి. 30 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ వద్ద భారీగానే వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆస్పత్రి శంకుస్థాపన సమయంలోనే వసూళ్లు వ్యవహారం వెలుగులోకి రావడంతో స్వయంగా అప్పటి మంత్రి కామినేని శ్రీనివాస్ పర్సంటేజీలు ఇవ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అలాగే రూ.3 కోట్ల వ్యయంతో ఉండరపూడి నుంచి నిమ్మకూరు మీదగా వెళ్లే రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్ వద్ద కూడా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి.. ఇలా ప్రతి పనిలో చినబాబు పేరుతో చేస్తున్న దందాల వ్యవహారంపై సదరు కాంట్రాక్టర్లు లబోదిబోమంటూ ఆ పార్టీ నేతలకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. గత రెండేళ్ల కాలంలో దందాల పేరుతో సదరు చోటానేత భారిగానే ఆస్తులు కూడబెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. నీరు–చెట్టు పేరుతో మట్టి అమ్మకాలు నిమ్మకూరు చెరువులో పూడిక తీత కోసం నీరు–చెట్టు పథకం ద్వారా ప్రభుత్వం రూ.8.5 లక్షలు మంజూరు చేసింది. ఆయా పనులను చేజిక్కించుకున్న చిన బాబు అనుచరుడు పూడిక తీత పేరుతో మట్టి విక్రయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సహజంగా చెరువులో తీసిన మట్టిని రైతులకు, లేదా ప్రభుత్వ స్థలాల్లో ఉచితంగా తోలాలి..కానీ సదరునేత భారీ యంత్రాలతో చెరువును తోడేస్తూ ఆ మట్టిని వ్యాపార కలాపాలకు, ఇతరత్రా అవసరాలను విక్రయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీగానే చేతులు మారినట్లు సమాచారం. చెరువు పూడిక తీతలో కూడా కేవలం 3 మీటర్లు మాత్రమే మట్టిని తీయాల్సి ఉన్నా 15 నుంచి 20 అడుగుల మేర నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే మట్టి విక్రయాలతో లక్షలాది రూపాయలు సంపాదించాడన్న ఆరోపణలున్నాయి. చినబాబు పేరు చెప్పడంతో నిబంధనలు ఉల్లంఘించి మట్టి విక్రయాలు చేస్తున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో చినబాబు ప్రధాన అనుచరుడు చేస్తున్న దందాలు తీవ్ర రూపం దాల్చాయి. ఆ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రూ.28 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే పనులు సాగుతున్నాయి. టెం డర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లను చినబాబు అనుచరుడు బెదిరించి పర్సంటేజీలు వసూలుచేస్తున్నారనే ఆరోపణలువెల్లువెత్తాయి. నిమ్మకూరు చెరువుతో యంత్రంతో మట్టి తవ్వకాలు -
బాలయ్య సంక్రాంతి సందడి
పామర్రు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావు స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఆయన కుమారుడు బాలకృష్ణ బుధవారం సందడి చేశారు. గ్రామానికి వచ్చిన ఆయనకు మహిళలు హారతి పట్టి స్వాగతం పలికారు. గ్రామంలోని తన త ల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో వచ్చానన్నారు. ప్రతి పల్లెలో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ సం క్రాంతి సంబరాలు నిర్వహిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలన్నారు. తన అత్తమామలు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా పండుగ చేసుకోబోతున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న గోదా కల్యాణంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. -
నిమ్మకూరుకు హీరో బాలకృష్ణ
నిమ్మకూరు : ప్రముఖ సినీనటుడు, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఊరులో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. కృష్ణాజిల్లా నిమ్మకూరులో జరిగే సంక్రాంతి వేడుకలను ఆయన హాజరు అవుతున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న బాలకృష్ణ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నిమ్మకూరు వెళ్లారు. కాగా బాలకృష్ణకు గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. -
నిమ్మకూరులో కాదు.. హైదరాబాద్‌లోనే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'టెంపర్' ఆడియోను హైదరాబాద్‌లోనే విడుదల చేసేందుకున్న సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా ఆడియో వేడుకను జూనియర్ ఎన్టీఆర్... తాత నందమూరి తారక రామారావు స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో నిర్వహిస్తున్నట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గుంటూరులో అంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ పుకార్లను చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ కొట్టిపారేశారు. టెంపర్ ఆడియోను హైదరాబాద్‌లోనే రిలీజ్ చేసే పనిలో ఉన్నామన్నారు. 'సినిమా ఆడియో కార్యక్రమాన్ని నిమ్మకూరులో నిర్వహిస్తున్నట్లు ఎలా వార్తలు వెలువడ్డాయో అర్థం కావటం లేదు. అసలు అలాంటి ఆలోచన కూడా మాకు రాలేదు.' అని బండ్ల గణేశ్ తెలిపారు. డిసెంబర్ రెండోవారంలో పాటల్ని విడుదల చేసి, సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమాను విడుదల చేస్తామన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. -
బాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ,జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ నుంచి ఎన్టీఆర్ స్వగ్రామం నందమూరు వెళ్లి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వీరు హాజరు అవుతారు. కాగా చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈసారి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం ప్రచారం చేపట్టలేదు. ఎన్నికల్లో టికెట్ ఆశించిన హరికృష్ణకు చంద్రబాబు మొండి చేయి చూపించడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత హరికృష్ణ తన కుమారులతో కలిసి బాబును కలిసి అభినందించారు. విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి సీతయ్య తన కుమారులతో కలిసి బావ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానుండటం విశేషం. -
సొంతగడ్డలో బొమ్మా...బొరుసు!
తండ్రికి పట్టాభిషేకం.. తనయుడికి పరాభవం.. గుడివాడలో ఎన్టీఆర్ వారసత్వం సాక్షి, మచిలీపట్నం : ఓటరు దేవుళ్ల కరుణాకటాక్ష వీక్షణలు ఎప్పుడు ఎవరిపై ఎలా ప్రసరిస్తాయన్నది చెప్పడం కష్టమే. అందులోనూ సొంతగడ్డలో జనాధరణ ఎలా ఉందనేది మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తుంటారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు గడించిన నందమూరి తారక రామారావును పార్టీ పెట్టిన తొలినాళ్లలో బాగా ఆదరించిన గుడివాడ ఆ తరువాత అంతగా ఆదరించలేదనిభావన. హరికృష్ణను అయితే నాలుగో స్థానానికే పరిమితం చేసి...సొంత గడ్డలో ఎన్టీఆర్ వారసులకు ఇమేజ్ తగ్గిందనే సంగతిని రుజువు చేశారు. హరికృష్ణకు నాలుగో స్థానం! ఎన్టీఆర్ మరో తనయుడు నందమూరి హరికష్ణకు గుడివాడ ప్రాంతంతో అనుబంధం ఉంది. చిన్నప్పటినుంచి స్వగ్రామం నిమ్మకూరులో తాతగారి వద్దనే ఆయన ఉండేవారు. పదో తరగతి వరకు హరికృష్ణ అక్కడే చదువుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తరువాత చైతన్య రథానికి హరికృష్ణ సార థి(డ్రైవర్)గా వ్యవహరించారు. ఎన్టీఆర్ మరణానంతరం టీడీపీ నుంచి బయటకు వచ్చిన హరికృష్ణ పెద్ద బావగారైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 1999 ఎన్నికల్లో హరికృష్ణ గుడివాడ నుంచి పోటీచేసి పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో ఆయనకు నాల్గవ స్థానం దక్కింది. తరువాత హరికృష్ణ టీడీపీలో చేరి, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడై, రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యూరు. సమైక్యాంధ్ర కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఒక్కడి రాజీనామానే హడావిడిగా ఆమోదించడం వెనుక చంద్రబాబు హస్తం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తన తండ్రి ఎన్టీఆర్ పురుటిగడ్డ నిమ్మకూరు నుంచి సమైక్యాంధ్ర బస్సుయాత్రను నిర్వహిస్తానని ప్రకటించిన హరికృష్ణ.... కుటుంబీకుల వత్తిడితో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ప్రచారం జరిగింది. గతంలోకి ఓమారు.... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన తొలి ఎన్నికల్లో సొంతగడ్డ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆయన స్వగ్రామం నిమ్మకూరు, అత్తవారి ఊరు కొమరవోలు గ్రామాలు అప్పట్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఎన్టీఆర్ సొంత గ్రామం, అత్తగారి ఊరు రెండు ఇప్పుడు పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. కాగా, 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తొలిసారిగా గుడివాడ నుంచి పోటీ చేశారు. పార్టీ అధినేతగా ఎన్టీఆర్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావడంతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ గుడివాడ నియోజకవర్గంలో తండ్రి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. తరువాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ ఎన్టీ రామారావు గుడివాడ నుంచి పోటీచేశారు. రెండోసారి ఎన్టీఆర్‌కు తగ్గిన మెజార్టీ.. గుడివాడ నియోజకవర్గంలో జయకృష్ణ ప్రచారం నిర్వహించినప్పటికీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 53,906ఓట్లురాగా, కఠారి సత్యనారాయణరావు (కాంగ్రెస్) 27,368ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ 26,538ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, 1985ఎన్నికల్లో ఇదే గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్‌కు 49,600ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి ఉప్పలపాటి సూర్యనారయణబాబు(కాంగ్రెస్)కు 42,003ఓట్లు వచ్చాయి. దీంతో 1985ఎన్నికల్లో ఇక్కడ ఎన్టీఆర్ 7,597ఓట్ల మేజార్టీతో మాత్రమే గెలుపొందారు. తొలి ఎన్నికల కంటే రెండవ సారి పోటీలో దాదాపు 20వేల ఓట్ల మెజార్టీ తగ్గిపోవడం గమనార్హం. -
నిమ్మకూరులో హీరో బాలకృష్ణ ప్రత్యేక పూజలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సినీహీరో బాలకృష్ణ స్వగ్రామమైన నిమ్మకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీ వారి తీర్థప్రసాదాలను పండితులు బాలకృష్ణకు అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని నిమ్మకూరులో ఆయన ప్రారంభించనున్నారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా నిమ్మకూరు తరలివచ్చారు. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు కూడా బాలకృష్ణకు కలిసేందుకు ఇప్పటికే నిమ్మకూరు చేరుకున్నారు. -
దళితుల ‘దారి’ మళ్లింది!
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధుల పక్షపాతవైఖరి, అధికారుల అనాలోచిత చర్యలు దళితుల పాలిట శాపంగా పరిగణిస్తున్నాయి. దళితుల పేరుతో లబ్ధిపొందాలని ప్రణాళికలు రూపొందించుకున్న అగ్రవర్ణాల వారి అరాచక చర్యలకు అధికారులు వంతపాడడం పలు విమర్శలకు తావిస్తుంది. దళితుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పాలకులు చేస్తున్న ప్రకటనలు ‘నేతిబీరకాయ’ చందంగా మారిపోయాయనే విమర్శలకు కొన్ని సంఘటనలతో బలం చేకూరుతుంది. దళితుల పేరుతో నిధులు దారిమళ్లిపోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రహదారి నిర్మాణం నిమిత్తం విడుదల చేసిన నిధులు వారికేమాత్రం ఉపయోగపడని వైనం నిమ్మకూరు- చినముత్తేవి రోడ్డు ప్రతిపాదనల్లో వెలుగుచూసింది.నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా తన నిధుల నుంచి రూ.1.02 కోట్లను నిమ్మకూరు-చినముత్తేవి రోడ్డు అభివృద్ధికి కేటాయించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామరావు సొంత గ్రామమైన నిమ్మకూరు నుంచి మొవ్వ మండలం చినముత్తేవి దళితవాడ వరకు 1.8 కిలోమీటర్ల మేర డొంక రోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రతిపాదనలు ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నాయి. అయితే అసలు మతలబు అంతా ఇక్కడే ఉంది. నిమ్మకూరు నుంచి చినముత్తేవి వెళ్లడానికి సరాసరి రోడ్డు లేనే లేదు. నిమ్మకూరు నుంచి 1.8 కిలోమీటర్ల మేర డొంక రోడ్డు ఉంది. అరకిలోమీటరు మేర పొలాలు అడ్డుగా ఉన్నాయి. పంట కాల్వ ఉంది. చినముత్తేవి దళితవాడకు వెళ్లాలంటే కనీసం కాలిబాట లేని దుస్థితి. ఇటువంటి పరిస్థితిలో కొత్తగా ప్రతిపాదించిన రోడ్డు దళితవాడ వరకు వెళ్లే అవకాశం లేదు. అయినా ఆ ప్రాంతంలో పోలాలున్న కొంతమంది ‘పెద్ద మనుషుల’ సౌకర్యార్థం దళితుల నిధులను దారి మళ్లించడం విమర్శలకు తావిస్తోంది. నిమ్మకూరు నుంచి చినముత్తేవి దళితవాడ వరకు డొంకరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతిపాదనల్లో చూపి అధికారులు పనులకు టెండర్లు పిలిచారు. అసలు లేనిరోడ్డును ఎలా అభివృద్ధి చేస్తారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే...అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలకు కేటాయించే నిధుల నుంచి 22శాతం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటాయించాల్సి ఉంది. దళితవాడల అభివృద్ధికి మాత్రమే ఆ నిధులను వినియోగించాల్సి ఉంది. దీంతో నిమ్మకూరు డొంక రోడ్డును తారురోడ్డుగా మార్చేందుకు నిమ్మకూరు సమీపంలోని చినముత్తేవి దళితవాడను ప్రతిపాదనల్లో చూపి ఈ రోడ్డు నిర్మాణానికి రూపకల్పన చేశారు. వాస్తవంగా ఈ రోడ్డు అభివృద్ధి చేస్తే నిమ్మకూరులోని కొంతమంది పెద్దలకు మాత్రమే ఉపయోగంగా ఉంటుందని... వ్యూహాత్మకంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులనుఈ విధంగా దారి మళ్లించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన
-
నిమ్మకూరు నుంచి హరికృష్ణ సమైక్య యాత్ర
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ త్వరలో సమైక్య చైతన్య యాత్ర చేపట్టనున్నారు. తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరు నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించనున్నారు. హరికృష్ణ తన యాత్రలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిన పలు విషయాలను ప్రజలకు వివరించడంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా యాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. యాత్రకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో రూట్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది. కాగా అంతకు ముందు హరికృష్ణ హిందూపురం నుంచి ‘సమైక్య చైతన్య యాత్ర’ను ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. రాజకీయంగా నందమూరి కుటుంబానికి హిందూపురం నియోజక వర్గానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సమైక్య చైతన్య యాత్రను ప్రారంభిస్తారనుకోగా... హఠాత్తుగా నిమ్మకూరు తెరమీదకు వచ్చింది. హరికృష్ణ తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది.