బాలయ్య సంక్రాంతి సందడి | nandamuri balakrishna celebrate sankranti in nimmakuru | Sakshi
Sakshi News home page

బాలయ్య సంక్రాంతి సందడి

Published Thu, Jan 15 2015 2:51 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

నిమ్మకూరులో గంగిరెద్దులవారితో బాలయ్య - Sakshi

నిమ్మకూరులో గంగిరెద్దులవారితో బాలయ్య

పామర్రు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావు స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరులో ఆయన కుమారుడు బాలకృష్ణ బుధవారం సందడి చేశారు. గ్రామానికి వచ్చిన ఆయనకు మహిళలు హారతి పట్టి స్వాగతం పలికారు.  గ్రామంలోని తన త ల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని స్వగ్రామంలో జరుపుకోవాలనే ఉద్దేశంతో వచ్చానన్నారు.

ప్రతి పల్లెలో  చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ సం క్రాంతి సంబరాలు నిర్వహిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలన్నారు. తన అత్తమామలు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులతో ఆనందంగా పండుగ చేసుకోబోతున్నట్లు తెలిపారు. అనంతరం శ్రీ  వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న గోదా కల్యాణంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement