బాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ,జూ.ఎన్టీఆర్ | Nandamuri Harikrishna family going to attend chandrabau naidu swearing- in ceremony | Sakshi
Sakshi News home page

బాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ,జూ.ఎన్టీఆర్

Published Sat, Jun 7 2014 10:50 AM | Last Updated on Wed, Aug 29 2018 1:13 PM

బాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ,జూ.ఎన్టీఆర్ - Sakshi

బాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ,జూ.ఎన్టీఆర్

హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ నుంచి ఎన్టీఆర్ స్వగ్రామం నందమూరు వెళ్లి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వీరు హాజరు అవుతారు.

కాగా  చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈసారి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన  జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం ప్రచారం చేపట్టలేదు.

ఎన్నికల్లో టికెట్ ఆశించిన హరికృష్ణకు చంద్రబాబు మొండి చేయి చూపించడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత హరికృష్ణ తన కుమారులతో కలిసి బాబును కలిసి అభినందించారు. విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి సీతయ్య తన కుమారులతో కలిసి బావ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానుండటం విశేషం.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement