నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు!
నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు!
Published Fri, Oct 11 2013 9:14 PM | Last Updated on Wed, Aug 29 2018 1:16 PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దూరంగా ఉండటంపై తెలుగుదేశం పార్టీలో కూడా విస్తృత చర్చకు దారి తీసింది. చంద్రబాబు ఢిల్లీ దీక్షకు కుటుంబ సభ్యులు దూరం ఉండటమే కాకుండా.. దీక్షకు సంఘీభావం తెలుపకపోవడం కూడా చర్చనీయాంశమైంది.
చంద్రబాబు దీక్ష శిబిరానికి భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ బాబు, కోడలు బ్రహ్మిణి తప్ప మిగితావారేవరూ కూడా సందర్శించలేదు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అస్పష్టమైన వైఖరిపై బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో చేపట్టిన దీక్షకు జాతీయ పార్టీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కూడా పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇటీవల బాలకృష్ణ ఇంట్లో జరిగిన వివాహానికి నందమూరి కుటుంబ సభ్యుల్లో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు దూరంగా ఉండటం కూడా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement