NTR Family
-
‘ఎన్టీఆర్, హరికృష్ణకు రుణపడి ఉంటా.. ఆయన వల్లే రాజకీయాల్లోకి వచ్చా’
సాక్షి, కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ అయ్యారు. చంద్రబాబు, పవన్ నాటకాలను ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు అమరావతి పేరిట యాత్రలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు గుణపాఠం చెప్పాలి. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధి కట్టాలి. టీడీపీ, చంద్రబాబును ఘోరంగా ఓడించాలి. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఎన్టీఆర్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. బాబును నమ్మడమే ఎన్టీఆర్ చేసిన తప్పు. చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదు. తోడు కోసం ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. రాజకీయాల్లోని నన్ను హరికృష్ణ తీసుకువచ్చారు. ఎన్టీఆర్ కుటుంబంపై నాకు విశ్వాసం ఉంది. అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిస్తున్నారు. నాకు జూనియర్ ఎన్టీఆర్ సీటు ఇప్పించారు. నేను ఎన్టీఆర్, హరికృష్ణకు రుణపడి ఉంటాను. హైదరాబాద్‌లో కొండలు తవ్వి చంద్రబాబు, పవన్ ఇళ్లు కట్టుకోలేదా?. విశాఖలో కుంభకోణం జరిగింని ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది’ అంటూ మండిపడ్డారు. -
తండ్రికే అన్నం పెట్టని బాలకృష్ణకు విశ్వాసం ఉందా?
సింహాచలం: అమరావతిలో తన బినామీలు తీసుకున్న భూముల కోసమే చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తున్నారని, రైతుల కోసం కాదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని ఆమె ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా పాదయాత్రగా ఉత్తరాంధ్రకు వస్తున్నారన్నారు. అమరావతిలోనే రైతులు ఉన్నారా.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో లేరా.. అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ప్రాంతాల మధ్య విభేదాలు రాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘బాలకృష్ణ విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. అసలు విశ్వాసం లేనిది ఎవరికో ఆయన తెలుసుకోవాలి. సొంత మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి, చెప్పులేసి, పార్టీ లాక్కున్న చంద్రబాబుకు విశ్వాసం ఉందా? తండ్రికే అన్నం పెట్టని మీకు విశ్వాసం ఉందా ? పురందేశ్వరి చరిత్రను మరిచి మాట్లాడుతున్నారు. ఆమె ఒక ఊసరవెల్లిలా కాంగ్రెస్‌కు వెళ్లారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అందువల్లే హెల్త్ వర్సిటీకి ఆయన పేరు పెట్టారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు’ అని రోజా అన్నారు. -
'ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాల్సిందే'
హైదరాబాద్: నేడు దివంగత సీఎం, నటుడు ఎన్టీఆర్ 92 వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద గురువారం ఆయన కుటుంబం నివాళులర్పించింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా వ్యాప్తిచేసింది ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, నటుడు హరికృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగువారందరి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా కలిసిమెలిసి ఉండాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని, కలిసికట్టుగా లక్ష్యాలను సాధించుకోవాలని హరికృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పురందేశ్వరీ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. వీరితో పాటు దర్శకుడు వైవీఎస్ చౌదరి, ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. -
రక్తసంబంధాల మధ్య రాజకీయ చిచ్చు!
రాజకీయాల ముందు రక్తసంబంధాలు కూడా పనిచేయవు. కుటుంబాలు కుటుంబాలనే రాజకీయాలు చీల్చేస్తాయి. అయితే కొందరు సిద్ధాంతపరంగా విడిపోతుంటారు. వారికి రాజకీయ అవగాహన ఉంటుంది. అటువంటి వారిని తప్పుపట్టవలసిన అవసరం ఉండదు. కొందరికి రాజకీయ అవగాహన ఉండదు. స్వార్థం, అధికార దాహం, తాత్కాలిక ప్రయోజనం... వంటి వాటికోసం విడిపోతుంటారు. మన సమాజంలో రక్తసంబంధాలకు విలువ ఎక్కువ. అటువంటి సంబంధాలను కూడా రాజకీయాలు పటాపంచలు చేస్తాయి. దశాబ్దాల అనుబంధాలు పుటుక్కున తెంపేస్తారు. చటుక్కున ఇతరులతో కలిసిపోతారు. అన్నాలేదు-తమ్ముడూ లేదు, తండ్రీలేదు-కొడుకూ లేదు, అక్కాలేదు-తమ్ముడూ లేదు, బావలేదు-బావమరిది లేదు, మావలేదు-అల్లుడూ లేదు.. రాజకీయ లబ్ది కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచేస్తారు. అదే రాజకీయం! ఇదంతా ఒక ఎత్తైతే, కుటుంబంలో ఎవరో ఒకరు అధికారంలో ఉండటం కోసం కొందరు కుటుంబ సభ్యులు చాలా తెలివిగా తలా ఒక పార్టీలో ఉంటారు. అది వీటన్నిటికీ మించిన తెలివైన రాజకీయం. సిద్దాంతం కోసం వేరువేరు పార్టీలలో ఉండేవారికంటే ఇటువంటి వారే ఎక్కువగా ఉంటారు. రాజకీయాల కారణంగా విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. చోటీ రాజకీయ నాయకుల నుంచి పెద్దపెద్ద నేతల వరకు ఈ కోవకు చెందినవారు న్నారు. ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాష్ట్రంలో ఎన్టీఆర్ కుటుంబం నుంచి నేటి ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబం వరకు చాలా మంది రాజకీయాల కోసం రక్త సంబంధాలనే కాదనుకున్నారు. మన్మోహన్ సింగ్ సవతి సోదరుడు దల్జీత్‌సింగ్ కోహ్లీ ఇటీవలే బీజేపీలో చేరారు. నిన్నా మొన్నటి వరకు అన్న కుటుంబంతో పాటుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన దల్జీత్‌సింగ్ ఉన్నట్లుండి కమల దళంలో చేరిపోయారు. సహజంగానే ఈ పరిణామం ప్రధాని కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. దశాబ్దాలుగా తమ కుటుంబం కాంగ్రెస్‌తోనే ఉందని, ఇకపై కూడా అలాగే ఉంటుందని ప్రధాని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.దల్జీత్‌సింగ్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ అయితే షాక్‌కు గురయ్యారు. తమ్ముడి వైఖరికి కలత చెందారు. అందరూ పెద్దవాళ్లైపోయారని, వారిపై తనకెలాంటి నియంత్రణ లేదని నిర్వేదం వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లోకి వెళితే డిఎంకె అధినేత కరుణానిధి కుటుంబంలో రేగిన రాజకీయ చిచ్చు ఇంకా సెగలు కక్కుతూనే ఉంది. కరుణానిధి తమిళ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిన సృష్టించారు. అటువంటి నేత కుటుంబం కూడా రాజకీయ రగడలో చిక్కుకుంది. అన్నాదమ్ములు అళగిరి, స్టాలిన్ ఒకరిపై ఒకరు కత్తులు నూరుకునే పరిస్థితి నెలకొంది. పార్టీపై పట్టు, తండ్రి రాజకీయ వారసత్వం కోసం సాగుతున్న పోరులో అన్న అళగిరి మీద స్టాలిన్ పైచేయి సాధించారు. అళగిరిని పార్టీ నుంచి వెళ్లగొట్టడంతో విజయం సాధించారు. ఇక మహానటుడు ఎన్టీఆర్ కుటుంబంలోని కలహాల కథ అందరికీ తెలిసిందే. నాన్నకు వెన్నుపోటు పొడిచిన బావ చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణ తరలిపోయారు. అక్క పురందేశ్వరి తన దారి తాను చూసుకుంది. మామ నుంచి చంద్రబాబు పార్టీ లాక్కున్నారు. అటువంటి వ్యక్తి చెంతన బాలయ్య మహా ఇష్టంగా చేరిపోయారు. అంతే కాకుండా పిల్లను కూడి ఇచ్చి బంధుత్వాన్ని పెంచుకున్నారు. రాజకీయంగా మరింత పటిష్టమయ్యారు. తమ్ముడి తీరు నచ్చని అక్క పురందేశ్వరి ఏ పార్టీకి వ్యతిరేకంగానైతే తండ్రి పోరాడారో అదే పార్టీలో చేరి పదేళ్లు పదవి అనుభవించారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు కష్టకాలమొచ్చేసరికి ఆ పార్టీకి టాటా చెప్పి కమలం గూటిలో ఒదిగిపోయారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో మరో తాజా కలకలం... కొణిదెల కుటుంబంలో కయ్యాలు. నటుడుగా తెలుగువారి మనసులు కొల్లగొట్టి మెగాస్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న చిరంజీవి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మెగాస్టార్‌కు తోడుగా పవర్ స్టార్ యువరాజ్యం నడిపి కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టాలని పిలుపు ఇచ్చారు. అయితే పార్టీని నడపడం చేతగాని చిరంజీవి లక్షల మంది అభిమానుల ఆశలను మొగ్గలోనే తుంచేశారు. ఎంతో మంది తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారు. ఏ పార్టీనైతే పాపాల పుట్టగా అభివర్ణించి ఎన్నికలలో నిలిచారో, అదే కాంగ్రెస్ పార్టీని గంగలా భావించి మునిగిపోయారు. తనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలను కూడా అందులో ముంచేశారు. ఈ కలయికపై తమ్ముడు పవన్ కళ్యాణ్ అప్పట్లో నోరుమెదపలేదు. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ఒక్క మాట మాట్లాడలేదు. హఠాత్తుగా ఇప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్నట్లు జనసేన పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ హఠావో నినాదం అందుకున్నారు. అన్నాదమ్ముల్లో అన్న కాంగ్రెస్‌లో కలిసిపోగా, తమ్ముడు కమలంలో ఇమిడిపోతున్నారు. రాష్ట్రం విడదీసిన తీరు నచ్చలేదు - ఓట్లు విడిపోకూడదని పోటీ చేయడంలేదు - తెలుగుదేశం పార్టీపై నాకు ఎలాంటి ప్రేమ లేదు - మోడీ కోసం ప్రచారం - అన్నపై అభిమానం ఉంది - కాంగ్రెస్‌ను తరిమి కొట్టండి ..... అని ఇలా రోజుకో పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. అటు అన్న చూస్తే తమ అన్నదమ్ముల లక్ష్యం ఒక్కటే అంటారు. ఇంతకీ ఈ నేతలందరిదీ సిద్దాంతం కోసం పోరాటమా? లేక అధికారం కోసం ఆరాటమా? అనేది అర్ధం కావడంలేదు. కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు అధికారం వైపు ఉండటం మంచిదన్నది వారి అభిప్రాయమా? ఇవేవీ కాకుండా వీరంతా ప్రజల కోసం బంధుత్వాన్నీ, అనుబంధాలనూ వదులుకుంటున్నారా? లేక అందరూ ఉత్తుత్తి నాటకాలు ఆడుతున్నారా? ఇవన్నీ జనం మదిలో మెదిలో ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టం. -
నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దూరంగా ఉండటంపై తెలుగుదేశం పార్టీలో కూడా విస్తృత చర్చకు దారి తీసింది. చంద్రబాబు ఢిల్లీ దీక్షకు కుటుంబ సభ్యులు దూరం ఉండటమే కాకుండా.. దీక్షకు సంఘీభావం తెలుపకపోవడం కూడా చర్చనీయాంశమైంది. చంద్రబాబు దీక్ష శిబిరానికి భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ బాబు, కోడలు బ్రహ్మిణి తప్ప మిగితావారేవరూ కూడా సందర్శించలేదు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అస్పష్టమైన వైఖరిపై బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలో చేపట్టిన దీక్షకు జాతీయ పార్టీల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం కూడా పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల బాలకృష్ణ ఇంట్లో జరిగిన వివాహానికి నందమూరి కుటుంబ సభ్యుల్లో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు దూరంగా ఉండటం కూడా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.