చంద్రబాబును కలిసిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ | Film Stars Junior NTR, Kalyan Ram met Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

Published Sun, May 18 2014 1:26 PM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

చంద్రబాబును కలిసిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ - Sakshi

చంద్రబాబును కలిసిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని సినీ నటులు, హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో  విజయం సాధించిన చంద్రబాబును ఆయన నివాసంలో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అభినందించారు. 
 
చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగా ఎన్నికల ప్రచారానికి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన  జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం ప్రచారం చేపట్టలేదు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించిన హరికృష్ణకు చంద్రబాబు మొండి చేయి చూపించడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వెలవడ్డాయి. తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత శనివారం చంద్రబాబును హరికృష్ణ కలిసి అభినందించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement