బాబుకు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు! | Junior NTR greets chandra babu | Sakshi
Sakshi News home page

బాబుకు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు!

Published Mon, May 19 2014 12:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

బాబుకు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు! - Sakshi

బాబుకు జూ.ఎన్టీఆర్ శుభాకాంక్షలు!

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రాం ఆదివారం కలిశారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన నేపథ్యంలో వీరు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో వారిద్దరితో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ కూడా టీడీపీ తరఫున ప్రచారం చేయని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన, ఓడిన పలువురు నేతలు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ఎంపీలు రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, మురళీమోహన్, మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్,  తోట సీతారామలక్ష్మి, యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, గంటా శ్రీనివాసరావు, గొల్లపల్లి సూర్యారావు, చింతమనేని ప్రభాకర్, పితాని సత్యనారాయణ, ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. అలాగే టీడీపీలో చేరినా టికెట్ దక్కని యు.వి.రమణమూర్తిరాజు (కన్నబాబు) కూడా చంద్రబాబును కలిశారు. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కూడా ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నేతలు  పెద్ద సంఖ్యలో చంద్రబాబును కలిశారు. అలాగే జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ మాజీ సీఎస్ ఎస్‌వీ ప్రసాద్, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఐజీ శివశంకర్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement