
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment