సాక్షి, తాడేపల్లి: బందరు పోర్టుకు శంకుస్థాపన చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం (బందరు) పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంకుస్థాపన చేశామని ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంఖుస్థాపన చేశాం. 4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహ… pic.twitter.com/qLCV0k6Oxp
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023
4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును నిర్మిస్తున్నామని అన్నారు. కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్టును జాతీయ రహదారి-216కి, అలాగే గుడివాడ-మచిలీపట్నం రైల్వే లైనుకి అనుసంధానం చేస్తున్నామని తెలిపారు.
కాగా, మచిలీపట్నం ప్రజల చిరకాల కల ఎట్టకేలకు సాకారం అయ్యింది. సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో.. ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం సీం జగన్ తపసిపూడిలో భూమి పూజ చేసి పైలాన్ ఆవిష్కరించారు.
చదవండి: ఆయన కోరుకున్న అమరావతి అలాంటిది మరి!.. బాబు ‘సమాధి’ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment