సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కేసుతో సంబంధం లేకపోయినా పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేస్తున్నారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. కేసుతో సంబంధం లేకపోయినప్పటికీ పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం రెండు గంటలలోపే స్టేషన్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని.. అలాగే, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసులో తెలిపారు. అయితే, కేసుతో సంబంధం లేకపోయినా నోటీసులు ఇవ్వడమేంటని పలువురు వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment