హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ త్వరలో సమైక్య చైతన్య యాత్ర చేపట్టనున్నారు. తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరు నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించనున్నారు. హరికృష్ణ తన యాత్రలో శ్రీకృష్ణ కమిటీ చెప్పిన పలు విషయాలను ప్రజలకు వివరించడంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా యాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. యాత్రకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో రూట్ మ్యాప్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
కాగా అంతకు ముందు హరికృష్ణ హిందూపురం నుంచి ‘సమైక్య చైతన్య యాత్ర’ను ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. రాజకీయంగా నందమూరి కుటుంబానికి హిందూపురం నియోజక వర్గానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన సమైక్య చైతన్య యాత్రను ప్రారంభిస్తారనుకోగా... హఠాత్తుగా నిమ్మకూరు తెరమీదకు వచ్చింది. హరికృష్ణ తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
నిమ్మకూరు నుంచి హరికృష్ణ సమైక్య యాత్ర
Published Sat, Aug 24 2013 8:54 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement
Advertisement