temper
-
బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు
అగ్రరాజ్యం అమెరికాలో జరిగే పరిణామాల గురించి తెలుసుకోవాలని ప్రతీదేశానికి ఎంతో ఆసక్తి ఉంటుంది. అలాగే అధ్యక్షుడు బైడెన్ పనితీరు గురించి తెలుసుకోవాలని కూడా పలువురు అనుకుంటారు. అయితే బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే బైడెన్ లోపల మరో విధంగా ఉంటారని అని సన్నిహితులు చెబుతుంటారు. బైడెన్ వైట్‌హౌస్‌లోని గది తలుపులు మూసివేసి, తన సహాయకులపై కోపాన్ని ప్రదర్శిస్తారని పలువురు చెబుతుంటారు. వైట్ హౌస్ సిబ్బందిని తిట్టడంలో బైడెన్ ముందుంటారని ఒక తాజా నివేదిక తెలియజేస్తోంది. ‘ఎవరూ సురక్షితంగా లేరు’: సీనియర్ అధికారి గతంలోనూ, ప్రస్తుతం బైడెన్‌కు సహాయకులుగా పనిచేస్తున్న ఒక సీనియర్ ‘ఆక్సియోస్’ సంస్థతో మాట్లాడుతూ తనను తరచూ బైడెన్ నిందిస్తుంటారని ఆరోపించారు. ఇక్కడున్న కొంతమంది అధ్యక్షుడి కోపానికి భయపడుతున్నారని, అతని భాషను భరించలేక, తమకు కవచంగా వారు సహోద్యోగులను సమావేశాలకు తీసుకువెళుతుంటారని చెప్పారు. ఇక్కడి ఉద్యోగులు ‘ఎవరూ సురక్షితంగా లేరు’ అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ కోసం టెస్టింగ్ కిట్ రోల్అవుట్ చేసే విషయంలో 2021 చివరిలో బైడెన్ అప్పటి కోవిడ్ నియంత్రణ అధికారి, ప్రస్తుత వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జెఫ్ జియంట్స్పై విపరీతమైన కోపం ప్రదర్శించారన్నారు. ఇతరులను సవాలు చేయడం ద్వారా.. బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టెడ్ కౌఫ్మన్ అవుట్లెట్ సంస్థతో మాట్లాడుతూ బైడెన్ తన సిబ్బంది ఇబ్బంది పెట్టడానికి ఇలా చేయరని, సరైన నిర్ణయం తీసుకునే దిశగా అలా ప్రవర్తిస్తారన్నారు. ఇతరులను సవాలు చేయడం ద్వారా మంచి నిర్ణయం తీసుకోవచ్చని బైడెన్ భావిస్తారని తెలిపారు. కాగా బైడెన్‌కు టెంపర్ ఉందనడంలో సందేహం లేదని ‘ది ఫైట్ ఆఫ్ హిజ్ లైఫ్: ఇన్సైడ్ జో బైడెన్స్ వైట్ హౌస్’ రచయిత క్రిస్ విప్ల్ పేర్కొన్నారు. అయితే ఇది బిల్ క్లింటన్ మాదిరిగా అగ్నిపర్వతం కాకపోవచ్చు, కానీ బైడెన్‌కు ఖచ్చితంగా టెంపర్ ఉందన్నారు. బైడెన్ ‘అహంకార నిరంకుశుడు’ కౌఫ్మన్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, బైడెన్ మాజీ ప్రచార సహాయకుడు జెఫ్ కన్నాటన్ మాట్లాడుతూ అధ్యక్షుడిని ‘అహంకార నిరంకుశుడు’గా అభివర్ణించారు. అతను తన 2012 నాటి పుస్తకం ‘ది పేఆఫ్: వై వాల్ స్ట్రీట్ విన్స్’ లో ‘భయంతో తన సిబ్బందిని అదుపులో ఉంచాలని బైడెన్ నిర్ణయించుకున్నాడు’ అని పేర్కొన్నారు. బైడెన్ తన 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక సహాయకుడు నిధుల సేకరణ కాల్లు చేయడానికి సమయం ఆసన్నమైందని అనడంతో అతనితో ‘కారు నుండి బయటకు వెళ్లండి’ అని బైడెన్ అరిచారని కన్నాటన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై వైట్‌హౌస్ తక్షణమే స్పందించలేదని తెలిపారు. ఇది కూడా చదవండి: పేదరికంపై భారత్ విజయం! ‘అది నాయకత్వం చిహ్నమా?’ బైడెన్ తన చివరి దశలో చిత్తవైకల్యంతో బాధపడుతున్నట్లుందని మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ ట్విట్టర్లో స్నిప్ చేశారు. బైడెన్ మంచి వ్యక్తి అని పేర్కొనడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ప్రో-రాన్ డిసాంటిస్ సూపర్ పీఏసీ జాతీయ ప్రతినిధి స్టీవ్ కోర్టెస్ పేర్కొన్నారు. బైడెన్ అవినీతిపరుడు. అబద్ధాలకోరు. ప్రెస్‌లోని మూర్ఖులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు. ఎవరైనా సరే ఇతరుల తిట్టడం అనేది చాలా చెడ్డ విషయం. అయితే బైడెన్ దీనిని 'నాయకత్వానికి చిహ్నం' అని చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘నేను ఏ వయసులో ఉన్నానో నాకు తెలుసు’ బైడెన్ గత సంవత్సరం తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు ఒక పరిచయస్తుడితో తన వయస్సు గురించి చర్చ జరిగినప్పుడు ‘నేను ఏ వయసులో ఉన్నానో నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. అలాగే బైడెన్ తన కుమారుడి విదేశీ వ్యాపార వ్యవహారాల్లో అతని ప్రమేయం గురించి ప్రశ్నించినప్పుడు అధ్యక్షుడు ది పోస్ట్‌పై విరుచుకుపడ్డారు. మరోసారి హాట్ మైక్‌లో ఫాక్స్ న్యూస్ వైట్ హౌస్ రిపోర్టర్ పీటర్ డూసీని ‘బిచ్కు పుట్టిన తెలివితక్కువ కొడుకు’ అంటూ అవమానకరంగా సంబోధించారు. ప్రమాణానికి విరుద్దంగా బైడెన్ ప్రవర్తన? ప్రజలను ఇబ్బందులకు గురిచేసే తన సిబ్బందిని కాల్చివేస్తానంటూ గతంలో బైడెన్ చేసిన తొలి వాగ్దానంలోని నిజాయితీని ఈ నివేదిక ప్రశ్నించింది. గతంలో బైడెన్ ‘నేను ఈ విషయంలో జోక్ చేయడం లేదు, నాతోపాటు పని చేస్తున్నవారు.. మరొక సహోద్యోగితో అగౌరవంగా ప్రవర్తించడం లేదా ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడటం అనేది నేను విన్నట్లయితే, అందుకు బాధులైనవారిని అక్కడికక్కడే విధుల నుంచి తొలగిస్తాను. అని బైడెన్ తన సిబ్బందితో జనవరి 20, 2021న ప్రమాణం చేస్తున్నప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు తాను చేసిన ప్రమాణానికి విరుద్దంగా బైడెన్ ప్రవర్తిస్తున్నారని అతని సన్నిహితులే విమర్శిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎంతటి సంపన్నుడైనా.. ఆడవాళ్ల చేతిలో కీలుబొమ్మేనా? నమ్మితే అంతే! -
జెలెన్స్కీ తీరుపై బైడెన్ అసహనం.. అత్యాశకు పోతే అంతే!
వాషింగ్టన్: రష్యా దాడిని తప్పుపడుతూ ఎప్పటికప్పుడూ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌కు అడగక ముందే ఆర్థికంగా, ఆయుధాల సాయం అందించారు. అలాంటిది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుపై జో బైడెన్ అసహనం వ్యక్తం చేశారంటే నమ్ముతారా? అది నిజమే.. జో బైడెన్ అసహనం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో ఇరువురి మధ్య ఫోన్ సంభాషణ నడుస్తుండగా ఆయుధాల విషయంపై బైడెన్ అసహనం వ్యక్తం చేసినట్లు ఎన్బీసీ న్యూస్ సోమవారం వెల్లడించింది. జూన్ 15వ తేదీన 1 బిలియన్ డాలర్ల మానవీయ, సైనిక సాయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో బైడెన్ వివరాలు చెప్పటం ముగించాక.. ఉక్రెయిన్‌కు ఇంకా కావాల్సిన ఆయుధాల జాబితాను జెలెన్స్కీ చెప్పటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన బైడెన్ స్వరం పెంచి.. ‘కొంచెం కృతజ్ఞత చూపించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే, అలాంటిదేమి లేదని బుకాయించేప్రయత్నం చేశారు జెలెన్స్కీ. సాయం చేసినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ రిపోర్టు ప్రకారం.. 2022లో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్‌కు వచ్చాయి. అమెరికా ఇచ్చిన ఆయుధాల్లో హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, జావెలిన్ క్షిపణులు, ఎం-17 హెలికాప్టర్లు ఉన్నట్లు పెంటగాన్ నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా -
లఖీంపూర్ ఖేరి ఘటన.. మిశ్రాపై వేటు తప్పదా?
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే తక్షణం ఢిల్లీ రావాలని ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు సంధించగా.. ఆయన సహనం కోల్పోయి మీడియాపై ఫైర్ అయ్యారు. చదవండి: Lakhimpur Violence: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ తనయుడు ఆశిష్ మిశ్రా గురించి అడిగిన జర్నలిస్టులపై కేంద్రమంత్రి దుర్భాషలాడారు. ‘మూర్ఖుడిలా ప్రశ్నలు అడగవద్దు. మీరు మానసికస్థితిని కోల్పోయారా?. ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు?. నిర్దోషిని నిందితుడిగా మార్చారు. మీకు సిగ్గు లేదా?. నీవు ఒక దొంగ’ అంటూ జర్నలిస్టుపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అప్పుడు టెంపర్ రీమేక్‌లో.. ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్‌లో..
-
టెంపర్‌లో బ్లాక్ బస్టర్
‘బ్లాకు బస్టర్.. బ్లాకు బస్టరే.. నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాకుబాస్టరే...’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ‘సరైనోడు’ సినిమాలో ఈ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు తెలుగులో ఫుల్ విజిల్స్ పడ్డాయి. ఇప్పుడీ ట్యూన్ తమిళ్లో వినిపించనుంది. తమిళ వెర్షన్ ‘బ్లాక్‌బస్టర్..’ పాటకు విశాల్ డ్యాన్స్ చేయనున్నారు. ఎన్టీఆర్ సూపర్ హిట్ ‘టెంపర్’ చిత్రం తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ అవుతోంది. ఇందులో విశాల్, రాశీఖన్నా జంటగా నటిస్తున్నారు. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఠాగూర్’ మధు నిర్మాత. ‘టెంపర్’ సినిమాలో వచ్చే ‘ఇట్టాగె రెచ్చిపోదాం పిల్లా’ పాట ప్లేస్‌లో ‘బ్లాక్ బస్టర్’ సాంగ్ ట్యూన్‌ను వాడుకుంటున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయడానికి తొలుత సన్నీ లియోన్, శ్రుతీహాసన్ పేర్లు వినిపించాయి. లేటెస్ట్గా ఈ సాంగ్‌లో విశాల్‌తో శ్రద్ధాదాస్ కాలు కదుపుతున్నారట. ఈ స్పెషల్ సాంగ్‌తోనే శ్రద్ధ తమిళ ఎంట్రీ ఇవ్వనున్నారు. సమ్మర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సి యస్. -
రెండోసారి
మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నాకి రెండోసారి జోడీ కుదిరిందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘పందెం కోడి 2’ తర్వాత విశాల్ నటిస్తున్న చిత్రం ‘అయోగ్య’. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ ఇది. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం తర్వాత సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విశాల్. ఇందులో ఆయనకి జోడీగా తమన్నాని తీసుకున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విశాల్–తమన్నా రెండేళ్ల క్రితం ‘కత్తి సండై’(తెలుగులో ‘ఒక్కడొచ్చాడు) చిత్రంలో నటించి, ప్రేక్షకులను అలరించారు. తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో మొదలు కానుంది. -
విశాల్ ఎక్స్‌ప్రెస్
విశాఖ ఎక్స్‌ప్రెస్ తెలుసు ఈ విశాల్ ఎక్స్‌ప్రెస్ ఏంటీ? అనుకుంటున్నారా. విశాల్ స్పీడ్ చూసి ఇలాగే అనుకోవాలేమో. ఈ ఏడాది సమ్మర్లో ఒకసారి ‘అభిమన్యుడి’గా కనిపించిన ఆయన దసరాకు ‘పందెం కోడి 2’గా రానున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగానే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేసి, పొంగల్‌కి వస్తున్నట్టు అనౌన్స్ చేశారాయన. యన్టీఆర్, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు విశాల్. గురువారం ఈ చిత్రం ఆరంభమైంది. ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వెంకట్ మోహన్ దర్శకుడు. రాశీ ఖన్నా కథానాయిక. దర్శకుడు కేయస్ రవికుమార్, పార్తీబన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ‘‘నా ఫస్ట్ అసిస్టెంట్ వెంకట్ మోహన్ డైరెక్టర్‌గా మారారు. తనకి, టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు మురుగదాస్. -
పక్కా ప్లాన్
ఈ ఏడాది దసరాకు ‘పందెంకోడి 2’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు విశాల్. ఇదే స్పీడ్‌లో నెక్ట్స్ ఇయర్లో ఏ ఏ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో కూడా ఇప్పుడే ఆయన ప్లాన్ గీస్తున్నారని కోలీవుడ్ టాక్. తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో విశాల్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖన్నా కథనాయికగా నటిస్తారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. సెట్స్‌పైకి వెళ్లనున్న విశాల్ నెక్ట్స్ చిత్రమిదేనట. ఈ చిత్రంతో పాటు లక్ష్మణ్ డైరెక్షన్లో విశాల్ ఓ సినిమా చేస్తారని సమాచారం. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరిగేలా విశాల్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారట. ఈ రెంటినీ వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. ఇక 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి ‘పందెంకోడి 2’ సీక్వెల్ అని తెలిసిన విషయమే. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
సింబా స్టార్ట్
ముంబై టెంపర్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు హీరో రణ్వీర్ సింగ్. ఇందుకోసం ఆల్మోస్ట్ టు మంత్స్ ఇక్కడే పాగా వేస్తారు. ‘గోల్మాల్ అండ్ సింగమ్ ఫ్రాంచైజీ, చెన్నై ఎక్స్‌ప్రెస్’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రోహిత్‌శెట్టి నేతృత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింబా’. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. రెండు నెలల పాటు కంటిన్యూస్‌గా ఇక్కడే షూటింగ్ ప్లాన్ చేశారట. ఇందులో అజయ్ దేవగన్ గెస్ట్ రోల్ చేస్తారని బీటౌన్ ఖబర్. ‘సింబా’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రబృందం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో టెంపర్ రీమేక్ షురు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన చిత్రం టెంపర్.. ఈ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చింది. నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి సింబా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో రణ్వీర్ సింగ్‌కు జోడిగా సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ నటిస్తున్నారు. సారా ఈ చిత్రం ద్వారానే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఎప్పుడో రూపకల్పన చేసినప్పటికీ.. పట్టాలెక్కెందుకు చాలా సమయమే తీసుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముందుగా అనుకున్నట్టే డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ స్పాట్లో రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్, రోహిత్ శెట్టి, కరణ్ జోహర్ కలసి దిగిన ఫొటోను కరణ్ అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా సింబా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ROHIT SHETTY is back!!!! @RanveerOfficial as #SIMMBA with #SaraAliKhan produced by @RSPicturez @DharmaMovies @RelianceEnt @apoorvamehta18 releasing 28th DEC 2018 pic.twitter.com/sDSi7eqom9 — Karan Johar (@karanjohar) June 6, 2018 -
‘తారాజువ్వ’లా.. తారక్ సినీ కెరీర్!
అసలు పేరు ‘నందమూరి తారక రామరావు జూనియర్’...కానీ అభిమానులు మాత్రం ‘యంగ్ టైగర్’గా పిలుచుకుంటారు. మాస్ ఇమేజ్‌కు నిలువెత్తు నిదర్శనంలా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్.. 35వ పుట్టిన రోజు నేడు.. ఈ సందర్భంగా శనివారం విడుదల చేసిన ‘అరవింద సమేత’ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది. ఫస్లుక్లో ఎన్టీఆర్ కత్తి పట్టుకుని, సిక్స్‌పాక్ బాడీతో పవర్ బ్యాంక్‌లా, మాస్ హీరోకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్నాడు. అయితే ఈ కొత్త లుక్ కోసం తారక్ ఎంతో శ్రమించాడు. ఎంతోమంది బాలీవుడ్ టాప్ హీరోలకు ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేసిన లాయిడ్ స్టీవెన్స్ శిక్షణలో యంగ్‌టైగర్ రాటుదేలాడు. తారక్ ఫిజక్ గురించి మాట్లాడుకోవాలంటే యమదొంగకు ముందు...యమదొంగ తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే యమదొంగ ముందువరకూ ఈ హీరో దాదాపు 100 కేజీల బరువుతో ఉండేవాడు. ఆ తర్వాత 20 కేజీల బరువు తగ్గి చాలా స్టైలిష్‌గా తయారయ్యాడు. నేటితో 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ హీరో సినీ జీవితాన్ని ఓ సారి చూద్దామా.... భారీ సినీ నేపథ్యం.. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు లేనటువంటి భారీ సినీ నేపథ్యం ఎన్టీఆర్‌కు సొంతం. తాతగారి పేరు పెట్టుకుని యాక్టింగ్, డాన్స్‌తో దూసుకుపోతున్న ఈ హీరో ప్రేక్షకుల హృదయాల్లో ‘జూనియర్ ఎన్టీఆర్’గా స్థానం సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే పరిశ్రమలోకి... బన్నీ, రామ్ చరణ్ కంటే ముందే పరిశ్రమకు వచ్చాడు తారక్. తొలిసారిగా 1996 ‘బాల రామాయణం’ చిత్రంలో రాముడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ ఐదేళ్లలోనే అంటే 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేదు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నం.1’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ‘ఆది’ సినిమా తారక్‌లోని మాస్ హీరోను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ యంగ్ టైగర్ కెరీర్ ఆశించినంత బాగా సాగలేదు. అల్లరి రాముడు, నాగ లాంటి రెండు డిజాస్టర్ల తరువాత ‘సింహాద్రి’ రూపంలో జక్కన్నే మరోసారి ఎన్టీఆర్‌కు భారీ విజయాన్ని ఇచ్చాడు. తరువాత అశోక్, సాంబ, నాగ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోసారి గట్టెక్కించిన జక్కన్న... ఇలా ఆరేళ్లపాటు కొనసాగిన తారక్ సిని ప్రస్థానాన్ని ‘దర్శక ధీరుడు’ రాజమౌళి మరోసారి మలుపు తిప్పాడు. 2007లో రాజమౌళి తారక్‌తో ‘యమదొంగ’ సినిమాను తీసాడు. ఈ సినిమా కోసం జూనియర్ 20 కేజీల బరువు తగ్గి, కొత్త లుక్‌తో ఆకట్టుకోవడమే కాక నటనలో తాతకు తగ్గ మనవడిగా నిరుపించుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ యమగోలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపితే.. తాతకు తగ్గ మనవడిగా జూనియర్ యమదొంగతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాడు. ‘టెంపర్’ చూపించాడు.... యమదొంగ తర్వాత అదుర్స్, బృందావనం లాంటి సినిమాలతో ఘనవిజయాలు సాధించిన ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాతో మరోసారి సరికొత్తగా తనని తాను ఆవిష్కరించుకున్నాడు.. అవినీతి పోలీసు అధికారి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పూరీ, ఎన్టీఆర్లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఎన్టీఆర్ యాక్టింగ్, పూరి మార్క్ పంచ్ డైలాగ్‌లతో టెంపర్ మంచి విజయాన్ని అందుకుంది. జనతా గ్యారేజ్‌తో కొత్తగా... టెంపర్ తర్వాత సినిమాల ఎంపికలో తారక్‌లో చాలా మార్పు వచ్చింది. రొటిన్‌కు భిన్నంగా, కథాబలం ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే సమయంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇలా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమాలతో వరుస విజయాలందుకున్నాడు తారక్. ప్రస్తుతం ఈ యంగ్‌టైగర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. -
ఆవకాయ్... అందరికీ కావాలోయ్
కావాలోయ్.. కావాలోయ్... మాకూ ఆవకాయ్ కావాలోయ్... అంటున్నారు మన పక్క భాషలవాళ్లు... తెలుగోడి ఆవకాయ్కి అంత క్రేజ్ మరి. తెలుగు సినిమాలకూ అంతే క్రేజ్ ఉంది. అదిరేటి మన ఆవకాయ్లాంటి సినిమాలను రీమేక్ చేస్తున్నారు. రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సీన్ రివర్స్. మనం పక్క సినిమాలను ఎక్కువ రీమేక్ చేసేవాళ్లం. ఇప్పుడు మన సినిమాలు అక్కడికెళుతున్నాయి. ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగా ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయ్. బాహుబలి.. వీర్ యోధ మహాబలి ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న యావత్తు భారతదేశాన్ని ఏడాదిన్నరకు పైగా వెంటాడింది. 2015 జూలై 15న ‘బాహుబలి’ విడుదలైన తొలి ఆట నుంచి సినిమా చూసిన అందరిలోనూ ఇదే ప్రశ్న. ‘వై కట్టప్ప కిల్డ్ బాహుబలి’ అంటూ గూగుల్లోనూ రికార్డు స్థాయిలో వెతికారంటే ఎంత ఆసక్తి నెలకొందో తెలిసిందే. 2017 ఏప్రిల్ 28న ‘బాహుబలి 2’ తొలి షో పడగానే ‘బాహుబలి’ ని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది. ఆ సంగతలా ఉంచితే.. ‘తెలుగు సినిమా స్టామినా ఇది’ అని ప్రపంచానికి చాటి చెప్పింది ‘బాహుబలి’. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్ తమ నటన విశ్వరూపాన్ని చూపారు. దర్శకుడిగా రాజమౌళి ఈ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయారు. కావాలంటే ఈ సినిమాని డబ్, చేసి విడుదల చేసుకోవచ్చు కానీ రీమేక్ చేయడం సాహసమే అని మన దేశంలో ఇతర భాషలవాళ్లు అనుకున్నారు. అయితే భోజ్‌పురిలో ‘వీరయోధ మహాబలి’ పేరుతో తెరకెక్కుతోన్న ఓ సినిమా ‘బాహుబలి’కి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. దినేష్‌లాల్ యాదవ్, ఆమ్రపాలి దుబే, అయాజ్ ఖాన్, సుశీల్ సింగ్, దీపక్ భాటియా ముఖ్య తారలుగా ఇక్భాల్ బి„Š దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పణలో ఎమ్. రమేష్ వ్యాస్ నిర్మిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ‘వీరయోధ మహాబలి’ ఫొటోలు, వీడియోలు ‘బాహుబలి’ని పోలి ఉండటం విశేషం. సో.. ఇది ‘ఫ్రీమేక్’ అనుకోవచ్చేమో. ఒకేసారి రెండు భాషల్లో టెంపర్ ‘నా పేరు దయ.. నాకు లేనిదే అది.. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్’.. ‘చేతనైతే చెయ్యి.. లేకపోతే అన్నీ మూసుకుని కూర్చో. ఊరికే అరవకు’.. వంటి డైలాగ్స్‌తో ఆకట్టుకుంది పూరి జగన్నాథ్ ‘టెంపర్’. ఎన్టీఆర్లోని మరో కోణాన్ని చూపించిన చిత్రమిది. ఈ చిత్రాన్ని ‘సింబా’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో రణ్వీర్ సింగ్, కాజల్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ కనిపించనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 28న విడుదల కానుంది. మరోవైపు తమిళంలోనూ ‘టెంపర్’ రీమేక్ అవుతోంది. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. మన ‘టెంపర్’ ఒకేసారి రెండు భాషల్లో రీమేక్ అవ్వడం విశేషం. ఇక్కడ లవ్.. అక్కడ కాదల్ ‘చూశారా నా బ్యాడ్‌లక్ ఎలా ఉందో. నాకు నచ్చినంత అందంగా.. నీరసం వచ్చేంత ఉత్సాహంగా.. కోపం వచ్చేంత క్యూట్‌గా.. నా బ్యాడ్‌లక్‌ని రిసీవ్ చేసుకోవటానికి స్వయంగా మా నాన్నే స్టేషన్‌కి వెళ్లారు’ అంటూ తన మరదలు మహా లక్ష్మిని (తమన్నా) పరిచయం చేస్తాడు బాలు (నాగచైతన్య). బావామరదళ్లుగా ౖచైతూ, తమన్నా అలక, ప్రేమ, కుటుంబ పెద్దల జోక్యంతో ‘100% లవ్’ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందర్నీ ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ‘100% కాదల్’ పేరుతో చంద్రమౌళి దర్శకత్వంలో తమిళంలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని సుకుమార్ నిర్మిస్తుండటం విశేషం. ‘కుమారి 21ఎఫ్’, ‘దర్శకుడు’ చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు సుక్కు. నాగచైతన్య పాత్రలో జి.వి.ప్రకాష్, తమన్నా క్యారెక్టర్లో ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే నటిస్తున్నారు. ఈ వేసవిలో ఈ కాదల్ (ప్రేమ) తెరమీదకు రానుంది. అర్జున్ రెడ్డి.. వర్మ అయ్యాడు ‘మొదటి సంవత్సరంలో ఒకమ్మాయి చేరింది. ఆ పిల్ల అంటే నాకిష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతావాళ్లంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి. తరగతులు పెరిగేకొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి. మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రానివాళ్లకి, మిగతా తరగతుల వాళ్లకు చెప్పండి. ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు’ అంటూ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో జూనియర్స్‌కి వార్నింగ్ ఇస్తాడు అర్జున్‌రెడ్డి (విజయ్ దేవరకొండ). ‘పెళ్ళిచూపులు’ వంటి ఫ్యామిలీ మూవీలో నటించిన విజయ్ ‘అర్జున్‌రెడ్డి’ వంటి బోల్డ్ క్యారెక్టర్లో నటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా యూత్‌కి తెగ నచ్చేయడంతో సూపర్‌హిట్‌గా నిలిచింది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో విజయ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. కథానాయిక షాలినీ పాండేకీ అదే స్థాయిలో పేరొచ్చింది. ఈ సినిమాని తమిళ్లో ‘వర్మ’ పేరుతో విలక్షణ దర్శకుడు బాలా రీమేక్ చేస్తున్నారు. నటుడు విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాలీవుడ్‌లోనూ ఈ సినిమా రీమేక్ కానుంది. తొలుత రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత వరుణ్ ధావన్ పేరు.. ఇప్పుడేమో అర్జున్ కపూర్ పేరు వినిపిస్తోంది. అర్జున్ కపూర్ హీరోగా మురద్ ఖేతానీ ఈ సినిమా తెరకెక్కించనున్నారని బాలీవుడ్ టాక్. క్షణం.. బాఘీ 2 రిషి (అడివి శేష్) ఎన్ఆర్ఐ. మెడిసిన్ చదివేందుకు ఇండియా వెళ్లినప్పుడు సహ విద్యార్థి శ్వేతతో (అదా శర్మ) ప్రేమలో పడతాడు. తండ్రి కోసం శ్వేత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. శ్వేత నుంచి ఫోన్ రావడంతో ఇండియాకి వచ్చిన రిషికి శ్వేత కుమార్తె రియా కిడ్నాప్ అయిన విషయం తెలుస్తుంది. కిడ్నాప్ చేసిందెవరు? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అనే అంశాలతో.. చక్కటి స్క్రీన్‌ప్లేతో రూపొందిన చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్టయింది. ఈ చిత్రాన్ని ‘బాఘీ–2’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్, దిశాపాట్నీ జంటగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఈనెల 30న విడుదల చేస్తున్నారు. సీతారామ కల్యాణ చూద్దాం శివ (నాగచైతన్య), భ్రమరాంబ (రకుల్ ప్రీత్‌సింగ్) ఓ పెళ్లిలో కలుసుకుంటారు. వారిమధ్య పరిచయం ఏర్పడుతుంది. భ్రమరాంబ అంటే శివకు చెప్పలేనంత ఇష్టం. ప్రేమ విషయం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందోనని భయపడుతుంటాడు శివ. తన కోసం రాజకుమారుడు వస్తాడనే భ్రమల్లో ఉన్న భ్రమరాంబ.. శివ ప్రేమను అర్థం చేసుకోదు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న శివ, భ్రమరాంబ తండ్రులు తర్వాత విడిపోతారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరి ప్రేమకథ ఏ మలుపు తీసుకుంది? వారి తండ్రులు కలిశారా? లేదా? అనే చక్కటి కుటుంబ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రారండోయ్ వేడుకచూద్దాం’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ హిట్ సినిమాని కన్నడంలో ‘సీతారామ కల్యాణ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘జాగ్వార్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నిఖిల్ హీరోగా, రచిత రామ్ హీరోయిన్గా నటిస్తున్నారు. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. భలే భలే గజినీకాంత్ లక్కీ (నాని)కి చిన్నప్పటి నుంచి మతిమరుపు వ్యాధి ఉంటుంది. కానీ, ఆ విషయం ఎదుటి వాళ్లకు తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తుంటాడు. ఇలాంటి టైమ్‌లో నందనతో (లావణ్య త్రిపాఠి) పరిచయం ఏర్పడుతుంది లక్కీకి. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. తన మతిమరుపు గురించి నందనకు తెలియకుండా లక్కీ జాగ్రత్త పడుతుంటాడు. అయితే లక్కీకి మతిమరుపు ఉన్న విషయం నందన తండ్రి రంగారావుకు (మురళీ శర్మ) తెలుస్తుంది. రంగారావు పెట్టిన పరీక్షను లక్కీ ఎలా ఎదుర్కొన్నాడన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మనిషిలోని లోపాన్ని కూడా కథాంశంగా తీసుకుని సూపర్ హిట్ సాధించొచ్చని నిరూపించారు దర్శకుడు మారుతి. నాని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఆర్య హీరోగా తమిళంలో ‘గజినీకాంత్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘అఖిల్’ బ్యూటీ సాయేషా ఇందులో కథానాయిక. ఇటు సూర్య హిట్ మూవీ ‘గజనీ’, అటు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గుర్తొచ్చేలా ‘గజినీకాంత్’ టైటిల్ పెట్టడం విశేషం. ఈ సినిమా ఈ ఏడాది వెండితెరపై సందడి చేయనుంది. - డేరంగుల జగన్ -
టెంపర్ చూపించనున్న సారా
రూమర్లకు చెక్ పడింది. ఇప్పటికైనా ఓ క్లారిటీ వచ్చింది. ఏ విషయంలో? అనేగా మీ డౌట్. కథానాయిక విషయంలో అన్నమాట. ఎన్టీఆర్–పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘టెంపర్’ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా బాలీవుడ్లో ‘సింబా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంపై చాన్నాళ్లుగా పలు రూమర్లు వినిపిస్తున్నాయి. హీరోయిన్ ఎవరన్నది చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో రూమర్లకు ఫుల్స్టాప్ పడింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ‘సింబా’ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌తో జోడీ కడుతున్నారు. అలనాటి అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ ‘సింబా’ చిత్రంలో నటించనున్నారనే వార్తలు చాలా రోజులు బాలీవుడ్లో హల్చల్ చేశాయి. తాజాగా ‘ఒరు అదార్ లవ్’ ఫేమ్ ప్రియాప్రకాశ్ పేరు తెరపైకి వచ్చింది. తమ చిత్రంలో కథానాయికగా సారా అలీఖాన్ నటించనున్నారంటూ కరణ్ జోహార్, రోహిత్ శెట్టి ప్రకటించి, సారాతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది డిసెంబరు 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం అభిషేక్ కపూర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కేదార్నాథ్’ చిత్రంలో నటిస్తున్నారు సారా. -
‘టెంపర్’ రీమేక్‌కు హీరోయిన్ ఫిక్స్
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన టెంపర్ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో సింబా పేరుతో సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు హీరోయిన్ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతోందన్న ప్రచారం జరిగింది. తరువాత ప్రియా ప్రకాష్ వారియర్ పేరు తెరమీదకు వచ్చింది. ఈ రూమర్స్ చెక్ పెడుతూ చిత్రయూనిట్ సారా అలీఖాన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురైన సారా ప్రస్తుతం కేదార్నాథ్ షూటింగ్లో బిజీగా ఉంది. సింబాతో సారా ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 28న విడుదల కానుంది. Sara Ali Khan in #Simmba with @RanveerOfficial directed by ROHIT SHETTY! Releasing on the 28th of December 2018 ! This winter gets hotter!!!! pic.twitter.com/bjZGjehZl0 — Karan Johar (@karanjohar) 20 March 2018 -
మాలీవుడ్ టు బాలీవుడ్
‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది.. ఒక్క సినిమా హిట్ అయితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు’.. కానీ.. ఒక్క చూపుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మాలీవుడ్ బ్యూటీ ప్రియాప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ మలయాళ చిత్రం ట్రైలర్లో ప్రియ కన్నుకొట్టే సన్నివేశానికి ఎంతటి స్పందన వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా ఇంకా విడుదల కాకముందే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ప్రియకు అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా రణ్వీర్ సింగ్ సరసన నటించే అవకాశం ప్రియా ప్రకాశ్‌ని వరించిందని బాలీవుడ్ టాక్. తెలుగు హిట్ మూవీ ‘టెంపర్’ కి రీమేక్‌గా బాలీవుడ్లో ‘శింబా’ మూవీ తెరకెక్కుతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్‌శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రణ్‌వీర్‌కి జోడీగా అలనాటి అందాలనటి శ్రీదేవి తనయ జాన్వీ నటించనున్నారంటూ బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ప్రియాప్రకాశ్ పేరు తెరపైకి వచ్చింది. ‘శింబా’ చిత్రవర్గాలు ప్రియను సంప్రదించాయట. అయితే.. తొలి సినిమా ‘ఒరు అదార్ లవ్’ విడుదల వరకూ ఏ సినిమా ఒప్పుకోకూడదనే ఒప్పందం కారణంగా ఆమె ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని టాక్. -
‘నా లిస్ట్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా టెంపర్. తొలిసారిగా ఎన్టీఆర్‌ను నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో చూపించిన పూరి ఘనవిజయం సాధించాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెంపర్ సక్సెస్ పూరికి కొత్త ఉత్తేజాన్ని అందించింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘టెంపర్.. నా సినిమాల జాబితాలో గర్వంగా చెప్పుకునే సినిమా. నటుడిగా తారఖ్ నాకు ఎంతో ప్రేరణ ఇచ్చాడు. కథ అందించిన వక్కంతం వంశీకి, ఘనవిజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు పూరి. ప్రస్తుతం పూరి తన తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ మోహబూబా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపొందుతున్న ఈ సినిమా భారత్ పాక్‌ల యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. Yessssssss ! #Temper is a proud film in my list , as an actor @tarak9999 gives me immense high .. thanks to #VakantamVamsi n all the fans 👍🏼#3YearsOfTemper .. love u all — PURI JAGAN (@purijagan) 13 February 2018 -
జాన్వీ@టెంపర్
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. శషాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో జోడీ కట్టారు జాన్వీ. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో క్రేజీ ఆఫర్ జాన్వీని వరించిందని బీ టౌన్ టాక్. ఎన్టీఆర్, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రాన్ని ‘శింబా’ పేరుతో హిందీలో రీమేక్ చేయనున్నారు. రణ్వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో కరణ్ జోహార్ ఈ చిత్రం నిర్మించనున్నారట. ఇందులో జాన్వీ కపూర్‌ని కథానాయికగా తీసుకున్నారని బాలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తెలుగులో కాజల్ చేసిన పాత్రకంటే ‘శింబా’లో జాన్వీ పాత్రను మరింత క్యూట్‌గా మలచనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. జాన్వీ ఫస్ట్ మూవీ ‘ధడక్’ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ‘టెంపర్’ రీమేక్‌కి కూడా ఆయనే నిర్మాత. ఒకవేళ జాన్వీ నటన నచ్చి, ‘టెంపర్’కి కూడా తీసుకోవాలనుకున్నారేమో? అని బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. -
టెంపర్ రీమేక్‌లో స్టార్ డాటర్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందింన సూపర్ హిట్ సినిమా టెంపర్. నటుడిగా ఎన్టీఆర్ కు ఎంతో మంచి పేరు తీసుకువచ్చిన ఈ సినిమాను బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ స్టార్ వారసురాలు నటించనుందట. సింబా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా అలరించనుంది. తెలుగులో కాజల్ కనిపించిన పాత్రలో జాన్వీ నటించనుంది. అయితే ప్రస్తుతానికి జాన్వీ నటిస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ రీమేక్ ను కరణ్ జోహార్ నిర్మిస్తుండటంతో జాన్వీ నటించటం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హిందీ టెంపర్
‘‘యూజర్ నేమ్ రణ్వీర్, పాస్వర్డ్ పోలీస్. దమ్ముంటే నా ఇగో వైఫైని దాటి రండిరా’.. ఏంటి మన ‘టెంపర్’ సినిమాలో డైలాగ్‌లా ఉందే అనుకుంటున్నారా? ఎన్టీఆర్ డైలాగ్‌లో యూజర్‌నేమ్ దయ కదా. బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ ఎందుకు వచ్చారనే డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే ‘టెంపర్’ హిందీ రీమేక్‌లో రణ్వీర్ నటించనున్నారు. రణ్‌వీర్‌సింగ్ హీరోగా ‘గోల్మాల్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘సింగమ్ రిటర్న్స్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రోహిత్ శెట్టి ఈ సినిమాను రూపొందించనున్నారు. ‘‘రణ్వీర్ బిగ్ స్టారే కాదు బ్రిలియంట్ యాక్టర్ కూడా. అతనితో ‘టెంపర్’ సినిమాను రీమేక్ చేయనున్నాను. ఈ సినిమా గురించి అతను కూడా ఎగై్జట్‌గా ఉన్నాడు. రణ్వీర్ లుక్ కొత్తగా ఉంటుంది. వచ్చే ఏడాదిలో సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు రోహిత్ శెట్టి. -
స్క్రీన్ టెస్ట్
► ‘టెంపర్’ సినిమాలో పోసాని కృష్ణమురళి స్ట్రిక్ట్ పోలీసాఫీసర్‌గా చేశారు. చిత్రదర్శకుడు పూరి జగన్నాథ్ ఈ పాత్రకు ముందు వేరే నటుణ్ణి అనుకున్నారు. అతనెవరో తెలుసా? ఎ) సూర్య బి) రాజీవ్ కనకాల సి) ఆర్. నారాయణమూర్తి డి) శివాజీ ► మషేశ్ బాబు మొట్టమొదట తెరపై కనిపించిన సినిమాకు దర్శకుడు ఎవరు? ఎ) దాసరి నారాయణరావు బి) బి.గోపాల్ సి) కె. రాఘవేంద్రరావు డి) కోడి రామకృష్ణ ► ‘తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో..’ పాటలో నాగార్జునతో పాటు రొమాన్స్ చేసిన బాలీవుడ్ భామ ఎవరో గుర్తుందా? ఎ) సుస్మితా సేన్ బి) టబు సి) మనీషా కొయిరాల డి) సోనాలి బింద్రే ► ‘అడవి రాముడు’ సినిమాకి ఎన్టీఆర్‌తో పాటు దాదాపు అంతే పారితోషికం అందుకొన్న నటుడెవరో తెలుసా? (చిన్న క్లూ: ఆ నటుడి తమ్ముళ్లు ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు ) ఎ) కైకాల సత్యనారాయణ బి) మాడా సి) రాజబాబు డి) కొంగర జగ్గయ్య ► ఈ నలుగురిలో ఓ నటుడికి 17 సార్లు ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. అతనెవరో చెప్పగలరా? ఎ) చిరంజీవి బి) కమల్‌హాసన్ సి) మమ్ముట్టి డి) రజనీకాంత్ ► శ్రుతీహాసన్, రకుల్ ప్రీత్‌సింగ్, అమలాపాల్ ఒకే ఏడాది కథానాయిక అయ్యారు. ఆ సంవత్సరం ఏంటో చెప్పగలరా? ఎ) 2008 బి) 2009 సి) 2010 డి) 2006 ► ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగును ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి ఏ నటుణ్ణి ఉద్దేశించి చెప్పారు? ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) ప్రకాశ్‌రాజ్ సి) ముఖేష్ రుషి డి) తనికెళ్ల భరణి ► రామ్‌గోపాల్ వర్మ చదివిన సిద్ధార్ధ కాలేజీలోనే ఈ హీరో కూడా డిగ్రీ పూర్తి చేశారు? అతనెవరో తెలుసా? ఎ) ర వితేజ బి) నాగార్జున సి) ప్రభాస్ డి) వెంకటేశ్ ► ఇతను చాలా అవార్డులు గెలుచుకున్న కెమెరామేన్. తర్వాత కాలంలో సంచలన దర్శకుడు కూడా? అతనెవరు? ఎ) బి. గోపాల్ బి) వీవీ వినాయక్ సి) తేజ డి) గుణశేఖర్ ► ఆదిత్య 369’ చిత్రంలో ‘జాణవులే నెరజాణవులే..’ పాట పాడిన గాయని ఎవరు? ఎ) ఎస్.జానకి బి) జిక్కి సి) పి. సుశీల డి) చిత్ర ► లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి ఏ హీరోతో తీయాలనుకున్నారో తెలుసా? ఎ) శర్వానంద్ బి) నిఖిల్ సి) రామ్ డి) అఖిల్ ► ‘ప్రతిఘటన’లో పదునైన సంభాషణలుంటాయి. ఆ మాటలు ఏ రచయిత కలం నుంచి వచ్చాయో తెలుసా? ఎ) పరుచూరి బ్రదర్స్ బి) మరుధూరి రాజా సి) తనికెళ్ల భరణి డి) యం.వి.ఎస్. హరనాథరావు ► మాఫియా డాన్ అబూ సలేం ప్రేయసిగా వార్తలోకెక్కిన మోనికా బేడిని తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో చెబుతారా? ఎ) ముత్యాల సుబ్బయ్య బి) ముప్పలనేని శివ సి) సురేశ్ కృష్ణ డి) ఎ. మోహనగాంధి ► రాధ, రాధిక, రేవతి.. ఈ ముగ్గురివీ ఒరిజినల్ పేర్లు కాదు. ‘ఆర్’ అక్షరం వచ్చేట్లు వీరికి స్క్రీన్ నేమ్ పెట్టిన దర్శకుడు ఎవరు? ఎ) కె.బాలచందర్ బి) భాగ్యరాజ సి) భారతీరాజా డి) బాలు మహేంద్ర ► నటుడు రానా ట్విట్టర్ ఐడీ ఏంటో చెప్పుకోండి చూద్దాం! ఎ) రానా దగ్గుబాటి బి) యువర్స్ రానా సి) ఐయామ్ రానా డి) మీ రానా ► పాటల రచయిత సుద్దాల అశోక్ తేజకు, నటుడు ఉత్తేజ్‌కు చుట్టరికం ఉంది? అశోక్ తేజకు ఉత్తేజ్ ఏమవుతాడు? ఎ) బావమరిది బి) మేనల్లుడు సి) తమ్ముడు డి) కొడుకు వరుస ► ఈ ఫోటోలోని బుడతణ్ణి గుర్తు పట్టగలరా? ఎ) శర్వానంద్ బి) సందీప్ కిషన్ సి) అల్లరి నరేష్ డి) ఆర్యన్ రాజేష్ ► జయప్రద, శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) దేవత బి) బంగారక్క సి) భోగభాగ్యాలు డి) అనురాగాలు ► సినిమా షూటింగ్ ప్రారంభం రోజున కొబ్బరికాయ కొడతారు. చివరి రోజున ఏ కాయను కొట్టి ముగిస్తారు? ఎ) నిమ్మకాయ బి) బత్తాయికాయ సి) గుమ్మడి కాయ డి) పనసకాయ ► ఏ ప్రముఖ వ్యక్తి జీవిత చరిత్రను ‘దసరాబుల్లోడు’పుస్తక రూపంలో విడుదల చేశారు? ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) డి. రామానాయుడు సి) వీబీ రాజేంద్రప్రసాద్ డి) యస్వీ రంగారావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే...మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) సి 4) డి5) బి 6) బి 7) సి 8) ఎ9) సి 10) బి 11) ఎ 12) డి 13) బి 14) సి 15) ఎ16) బి 17) సి 18) ఎ 19) సి 20) సి -
టెంపర్‌గా విశాల్
తమిళసినిమా: నటుడు విశాల్ టెంపర్ అయ్యిపోతున్నారు. ఈయన దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, తమిళ నిర్మాతలమండలి అధ్యక్షుడిగా ఏక కాలంలో రెండు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్నారన్న విషయం తెలిసిందే. మరో పక్క కథానాయకుడు, నిర్మాతగానూ బాధ్యతలను చేపడుతున్నారు. ఈ కారణంగా విశాల్ టెంపర్ అవుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. టాలీవుడ్లో ఎన్టీఆర్ నటించిన చిత్రం టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్టీఆర్‌కు మంచి విజయాన్ని కట్టబెట్టింది. కాగా ఆ చిత్రం తమిళ రీమేక్‌లో విశాల్ నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. విశాల్ హీరోగా నటించి తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్. అనుఇమానువేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్మక్రమాలను పూర్తి చేసుకుంది. శనివారం చిత్ర ట్రైలర్ విడుదలైంది.కాగా చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. దీంతో విశాల్ తదుపరి నటించే చిత్రం టెంపర్ రీమేక్నేనని తెలిసింది. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరు? కథానాయకి, ఇతర నట వర్గ విషయాలను త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. విశాల్ హీరోగా సండైకోళి–2 చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు ప్రారంభం అవుతుందన్న విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
టెంపర్ హిందీ రీమేక్‌కు హీరో ఫిక్స్
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ సినిమా 'టెంపర్'. ఎన్టీఆర్లోని కొత్త కోణాన్ని చూపించడమే కాకుండా ఆయన కెరీర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. చాలా కాలంగా ఈ సినిమా హిందీ రీమేక్ విషయంలో చర్చలు జరుగుతున్న హీరో మాత్రం ఫైనల్ కాలేదు. తాజాగా టెంపర్ హిందీ రీమేక్ కు హీరోను ఫిక్స్ చేశారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ టెంపర్ రీమేక్ లో నటిస్తున్నాడు. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం రణ్వీర్ సింగ్, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పద్మావతి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత టెంపర్ రీమేక్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
నవల రూపంలో ఎన్టీఆర్ సినిమా
రెగ్యులర్‌గా మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రూట్ మార్చి చేసిన తొలి చిత్రం టెంపర్. ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా నటించిన టెంపర్ ఘనవిజయం సాధించటంతో పాటు ఎన్టీఆర్‌ను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు కథను మరింత మంది పాఠకులకు అందించనున్నాడు రచయిత వక్కంతం వంశీ. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా కథను ఇంగ్లీష్ నవలగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆరు నెలలకు పైగా కష్టపడి వంశీ నవలను సిద్ధం చేశాడు. అయితే ఈ నవలలో క్లైమాక్స్‌ను సినిమాకు భిన్నంగా రాశాడట. ప్రస్తుతానికి ఆ క్లైమాక్స్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్. -
హిందీ టెంపర్‌లో?
ఎన్టీఆర్ నటనలో టెంపర్‌ను, కాజల్ అగర్వాల్ గ్లామర్‌లో టెంపర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్గా చూపించిన సినిమా ‘టెంపర్’. సినిమాలో ఎమోషనల్ యాంగిల్‌తో పాటు ఎన్టీఆర్, కాజల్ మధ్య ఫన్నీ లవ్ ట్రాక్ ప్రేక్షకులకు భలే నచ్చింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని పూరి ప్రయత్నించారు. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్‌లకు సినిమా కూడా చూపించారు. కానీ, ఎందుకో ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. తాజా ఖబర్ ఏంటంటే... రణవీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్‌శెట్టి ‘టెంపర్’ను హిందీలో రీమేక్ చేయాలను కుంటున్నారట! హిందీలోనూ హీరోయిన్గా కాజల్ నటిస్తారని టాక్. ఆల్రెడీ రోహిత్ దర్శకత్వంలో కాజల్ ఓసారి నటించారు. అదే ‘సింగమ్’. ‘‘రణవీర్‌తో నటించడం ఇష్టమే. అలాగే, రోహిత్ దర్శకత్వంలో మరోసారి నటించేందుకు ఆసక్తిగా ఉన్నా’’ అని ఇటీవల కాజల్ అన్నారు. దాంతో ‘టెంపర్’ హిందీ రీమేక్‌లో కాజల్ కన్ఫర్మ్ అయ్యారనే టాక్ జోరందుకుంది. -
ఎప్పటికీ హీరోగానే కొనసాగుతా..!
విప్లవ చిత్రాలతో పీపుల్స్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్ననటుడు ఆర్.నారాయణమూర్తి. కొంత కాలంగా సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించలేకపోతున్న ఆర్ నారాయణమూర్తి ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హెడ్ కానిస్టెబుల్ వెంకట్రామయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నారాయణమూర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న సంక్రాంతి సీజన్లో సినిమాను రిలీజ్ చేస్తున్న పీపుల్స్ స్టార్.. భవిష్యత్తులోనూ హీరోగానే కొనసాగుతానే తప్ప క్యారెక్టర్ రోల్స్ చేయనని ప్రకటించాడు. అందుకే టెంపర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఇచ్చిన పాత్రను తిరస్కరించానని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదని చిన్న సినిమాను పూర్తిగా తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదలవాడ శ్రీనివాస రావు తెరకెక్కిస్తున్న ఈసినిమాలో జయసుథ, నారాయణమూర్తి భార్యగా నటిస్తోంది.