టెంపర్‌గా విశాల్‌ | Vishal will act in the Tamil remake of Temper | Sakshi
Sakshi News home page

టెంపర్‌గా విశాల్‌

Published Sun, Sep 10 2017 4:21 AM | Last Updated on Tue, Sep 19 2017 12:04 PM

టెంపర్‌గా విశాల్‌

టెంపర్‌గా విశాల్‌

తమిళసినిమా: నటుడు విశాల్‌ టెంపర్‌ అయ్యిపోతున్నారు. ఈయన దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, తమిళ నిర్మాతలమండలి అధ్యక్షుడిగా ఏక కాలంలో రెండు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్నారన్న విషయం తెలిసిందే. మరో పక్క కథానాయకుడు, నిర్మాతగానూ బాధ్యతలను చేపడుతున్నారు. ఈ కారణంగా విశాల్‌ టెంపర్‌ అవుతున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే.

టాలీవుడ్‌లో ఎన్‌టీఆర్‌ నటించిన చిత్రం టెంపర్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్‌టీఆర్‌కు మంచి విజయాన్ని కట్టబెట్టింది. కాగా ఆ చిత్రం తమిళ రీమేక్‌లో విశాల్‌ నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. విశాల్‌ హీరోగా నటించి తన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్‌. అనుఇమానువేల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్మక్రమాలను పూర్తి చేసుకుంది.

శనివారం చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.కాగా చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. దీంతో విశాల్‌ తదుపరి నటించే చిత్రం టెంపర్‌ రీమేక్‌నేనని తెలిసింది. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరు? కథానాయకి, ఇతర నట వర్గ విషయాలను త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. విశాల్‌ హీరోగా సండైకోళి–2 చిత్రం ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు ప్రారంభం అవుతుందన్న విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement