విశాల్‌ ఎక్స్‌ప్రెస్‌ | Vishal and Raashi Khanna-starrer Ayogya begins | Sakshi
Sakshi News home page

విశాల్‌ ఎక్స్‌ప్రెస్‌

Aug 24 2018 2:51 AM | Updated on Aug 24 2018 2:51 AM

Vishal and Raashi Khanna-starrer Ayogya begins  - Sakshi

విశాల్‌

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ తెలుసు ఈ విశాల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏంటీ? అనుకుంటున్నారా. విశాల్‌ స్పీడ్‌ చూసి ఇలాగే అనుకోవాలేమో. ఈ ఏడాది సమ్మర్‌లో ఒకసారి ‘అభిమన్యుడి’గా కనిపించిన ఆయన దసరాకు ‘పందెం కోడి 2’గా రానున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగానే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేసి, పొంగల్‌కి వస్తున్నట్టు అనౌన్స్‌ చేశారాయన. యన్టీఆర్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌ ‘అయోగ్య’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు విశాల్‌. గురువారం ఈ చిత్రం ఆరంభమైంది. ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ఏఆర్‌ మురుగదాస్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన వెంకట్‌ మోహన్‌ దర్శకుడు. రాశీ ఖన్నా కథానాయిక. దర్శకుడు కేయస్‌ రవికుమార్, పార్తీబన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ‘‘నా ఫస్ట్‌ అసిస్టెంట్‌ వెంకట్‌ మోహన్‌ డైరెక్టర్‌గా మారారు. తనకి, టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు మురుగదాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement