
రాశీఖన్నా, విశాల్
రాశీఖన్నా వెరీ కూల్ గర్ల్. అయితే తన టెంపర్ చూపించడానికి రెడీ అయ్యారని సమాచారమ్. ఎందుకలా అంటే? సినిమా కోసం. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో రాశీని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. విశాల్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి మురుగదాస్ వద్ద ‘స్పైడర్’ చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహించనున్నారట. వరుస విజయాలతో రాశీ ఖన్నా తెలుగులో దూసుకెళుతున్నారు. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు సైన్ చేశారు.
ఇప్పుడు ‘టెంపర్’ చాన్స్. ఇది కచ్చితంగా బంపర్ ఆఫరే. ఎందుకంటే ‘టెంపర్’లో హీరోయిన్ క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉంది. యాక్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో.. రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ బ్యూటీ అమలాపురంలో ఉన్నారు. నితిన్ హీరోగా రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా రూపొందుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్ జరుగుతోందక్కడ. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment