Rashikhanna
-
లైన్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తే సినిమా చేయను
‘‘ఈ రోజుల్లో మానవ సంబంధాలకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. కనీసం సహాయం చేసినవారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా మొక్కుబడిగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ‘థ్యాంక్యూ’ మాటకు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అన్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కెమెరామేన్ పీసీ శ్రీరామ్ చెప్పిన విశేషాలు.. ► నేను ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ మొత్తం వింటాను. ఆ కథ నా మనసుకి ఎమోషనల్‌గా నచ్చితేనే సినిమా చేసేందుకు అంగీకరిస్తాను. అంతేకానీ స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోను. కథ పూర్తిగా విన్నప్పుడే దర్శకుడి విజన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఆ కథని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది. ► ‘థ్యాంక్యూ’ అనే పదంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన హృదయంలోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయగలం. నా తల్లితండ్రులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే. నా వ్యక్తిగత, సినీ ప్రయాణంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సినవారెందరో ఉన్నారు.. ఈ సినిమా చేశాక వారందరకీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ► ప్రతి రంగంలో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీలోనూ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ వందల రకాలుగా టెక్నాలజీ అప్డేట్ అవుతుంటుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మన క్రియేటివ్ విజన్‌ని బట్టే అది తెరపై కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన కథని నా కోణంలో తెరపైన ఆవిష్కరించడానికే ప్రయత్నిస్తాను. నేను ఏ సినిమా చేసినా, నా వర్కే డామినేట్ చేస్తుందని అనుకోవడంలో నిజం లేదు. కథకి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే నేను డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ► డైరెక్షన్, సినిమాటోగ్రఫీ రెండూ వేర్వేరు. ఈ విభాగాల పని తీరు వేరుగా ఉంటుంది. దర్శకత్వం నా వృత్తి కాదు. అందుకే డైరెక్టర్ (తమిళ చిత్రాలు ‘మీరా, కురుది పునల్, వానమ్ వసప్ప డుమ్’కి దర్శకత్వం వహించారు) గా సక్సెస్ కాలేకపోయాను. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టాలన్న ఆలోచన లేదు. -
సీరియస్ ప్రేమికుడు
ఎంత గొప్ప ప్రేమికుడు కాకపోయుంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అని చెప్పుకుంటారు? విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు తనో ప్రపంచ ఫేమస్ లవర్ అంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్‌పై కేయస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, కేథరిన్ థెరీసా, ఐశ్వర్యా రాజేశ్, ఇజాబెల్లా హీరోయిన్లు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ముఖం నిండా రక్తపు మరకలతో సీరియస్‌గా చూస్తున్న విజయ్ లుక్ ఆసక్తి క్రియేట్ చేసే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ గుమ్మడి, సంగీతం: గోపీ సుందర్. -
బంధాలను గుర్తు చేసేలా...
మారుతి దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. నటులు సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ–నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ‘‘హీరో సాయిని ఓ కొత్తరకమైన పాత్రలో, న్యూ లుక్‌లో చూస్తారు. కుటుంబ బంధాలు, విలువలను గుర్తు చేసేలా ఉంటుందీ చిత్రం. రెండురెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండేలా మారుతి తెరకెక్కిస్తున్నారు. బుధవారం విడుదల చేసిన సాయితేజ్, సత్యరాజ్ ఉన్న లుక్కు మంచి స్పందన లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
చేజింగ్.. చేజింగ్
విజయ్ దేవరకొండ ఎవర్నో చేజ్ (వెంబడించడం) చేస్తున్నారు. ఇంతMీ వాళ్లతో విజయ్‌కి పనేంటి? దాని వెనక ఉన్న కారణమేంటి? ఆ కథేంటి? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వేచి చూడాలి. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. కేయస్ రామారావు సమర్పణలో కేయస్ వల్లభ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సింగరేణి ఉద్యోగి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ కణల్ కణ్ణన్ ఆధ్వర్యంలో ఓ చేజింగ్ సీన్‌ని చిత్రీకరిస్తున్నారు. -
బిజీ బిజీ
అటు ప్రమోషన్స్ ఇటు షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు రాశీఖన్నా. విజయ్‌సేతుపతి, రాశీ జంటగా ‘స్కెచ్’ ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. దీంతో విశాల్ ‘అయోగ్య’ (తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్) సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లారు రాశీ. విజయ్ సేతుపతి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా చెన్నైలో స్టార్ట్ కానుంది. అంటే.. కొన్ని రోజులు రాశీ అక్కడే ఉంటారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్. రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి రాశీ సూట్ కేస్ సర్దుకుని వేరే లొకేషన్లోకి వాలిపోవాల్సిందే. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తున్నారు రాశీ. ఇలా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారీ బ్యూటీ. -
సంతోషంగా ఇంటికి వెళ్తారు
‘‘తమిళంలో ‘ఇమ్మైక్కా నొడిగల్’ చిత్రాన్ని తెరకెక్కించడానికి రెండేళ్లు పట్టింది. సినిమా సక్సెస్ అయ్యాక ఆ కష్టాన్ని మర్చిపోయాం. తెలుగులోనూ అదే రేంజ్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. నయనతార లీడ్ రోల్లో రాశీఖన్నా, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రల్లో దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇమ్మైక్కా నొడిగల్’. ‘అంజలి సీబీఐ’ టైటిల్‌తో సి.హెచ్. రాంబాబు, ఆచంట గోపీనాథ్ ఈ నెల 22న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర ఆడియో లాంచ్ జరిగింది. మిలింద్ రావ్ సీడీ విడుదల చేసి తుమ్మల ప్రసన్నకుమార్‌కు అందించారు. ‘‘ఇమ్మైకా నొడిగల్’ చూడగానే నచ్చి, ఫ్యాన్సీ రేట్‌తో హక్కులను తీసుకున్నాం’’ అన్నారు సిహెచ్ రాంబాబు. ‘‘రజనీకాంత్ కెరీర్లో ‘బాషా’ చిత్రంలా నయనతారకు ‘అంజలి సీబీఐ’ అలా నిలిచిపోతుంది. ప్రతి సీన్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. టికెట్ కొని సినిమాకు వచ్చే ప్రేక్షకుడి డబ్బులు వృథా కావు. సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాం’’ అన్నారు ఆచంట గోపీనాథ్. అమ్మిరాజు, శ్రీరామకృష్ణ పాల్గొన్నారు. ∙అమ్మిరాజు, గోపీనాథ్, ప్రసన్న కుమార్, అజయ్ జ్ఞానముత్తు -
అంజలి సాహసం
నయనతార లీడ్ రోల్లో ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇమైక్క నొడిగళ్’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని విశ్వశాంతి క్రియేషన్స్ పతాకంపై సిహెచ్ రాంబాబు, ఆచంట గోపినాథ్ ‘అంజలి విక్రమాదిత్య’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో ఘన విజయం సాధించింది. నయనతార, అధర్వ, రాశీఖన్నాల నటన హైలైట్. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్‌గా చేశారు. ఇందులో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరవనున్నారు. అంజలి చేసే సాహసాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: ఆర్.డి. రాజశేఖర్. -
పక్కా ప్లాన్
ఈ ఏడాది దసరాకు ‘పందెంకోడి 2’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు విశాల్. ఇదే స్పీడ్‌లో నెక్ట్స్ ఇయర్లో ఏ ఏ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో కూడా ఇప్పుడే ఆయన ప్లాన్ గీస్తున్నారని కోలీవుడ్ టాక్. తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో విశాల్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖన్నా కథనాయికగా నటిస్తారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. సెట్స్‌పైకి వెళ్లనున్న విశాల్ నెక్ట్స్ చిత్రమిదేనట. ఈ చిత్రంతో పాటు లక్ష్మణ్ డైరెక్షన్లో విశాల్ ఓ సినిమా చేస్తారని సమాచారం. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఒకేసారి జరిగేలా విశాల్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారట. ఈ రెంటినీ వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. ఇక 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి ‘పందెంకోడి 2’ సీక్వెల్ అని తెలిసిన విషయమే. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
కొంటె పనులు ఏం చేయలేదు
ఫ్యాన్స్ అంటే రాశీఖన్నాకి బోలెడంత అభిమానం. అందుకే అప్పుడప్పుడూ తన సినిమాల గురించి ట్వీటర్ ద్వారా అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ టైమ్ దొరికితే ఫ్యాన్స్‌తో చాట్ చేస్తారు. శనివారం అభిమానులకు ఆ చాన్స్ దక్కింది. ఆ చిట్ చాట్‌లోని కొన్ని విశేషాలు. ► మీ బ్యూటీ సీక్రెట్? టైమ్‌కు తినడం, పడుకోవటం. ఈ రెండూ పర్ఫెక్ట్గా లేకపోతే ఆ ఇంపాక్ట్ మన స్కిన్‌పై పడుతుంది. జిమ్‌లో మాత్రం బాగా కష్టపడతాను. ► ఫిట్నెస్ కోసం చాలా కష్టపడతారు. మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. హెల్తీగా ఉండాలనే కోరికలో నుంచి ఈ మోటివేషన్ లభిస్తుంది. ► మీ ఫేవరెట్ ఫిల్మ్? క్రిస్టొఫర్ నోలన్ తీసిన ‘ఇన్సెప్షన్’. అది మైండ్ బ్లోయింగ్ సినిమా. ► మీకు నచ్చిన కొటేషన్? చేంజ్ ఈజ్ ది ఓన్లీ కాన్స్టన్ట్ (మార్పొక్కటే స్థిరమైనది) ► మీ దృష్టిలో ఫెయిల్యూర్‌కి డెఫినేషన్ ? మన మీద మనకు నమ్మకం లేకపోవడం. ► మీ బ్యాడ్ మూడ్‌ని దూరం చేసేది? సంగీతం. ► స్కూల్లో మీరు చేసిన కొంటె పని? అలాంటి పనులు ఏం చేయలేదు.. స్కూల్లో నేను చాలా సైలెంట్ అమ్మాయిని. ► సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి? హార్డ్ వర్క్. ► ప్రస్తుతం టాలీవుడ్లో మీ అభిమాన హీరోయిన్లు? సమంత, అనుష్క. ► యాక్టింగ్‌లో మీ ఇన్స్పిరేషన్? హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్. ► ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. సీక్రెట్ ఏంటి? ప్రతిసారీ పాజిటివ్‌గా ఉండటం కుదరదు. నేనూ కొన్నిసార్లు డౌన్ అవుతాను. కానీ, మన మీద మనకు ఉన్న నమ్మకమే మనల్ని పాజిటివ్‌గా, స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. ► లక్‌ని నమ్ముతారా ? నేను కేవలం సిన్సియారిటీ, హార్డ్ వర్క్‌నే నమ్ముతాను. ► వరుసగా యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న సినిమాల్లో ఎందుకు కనిపించరు? మేం స్క్రిప్ట్స్‌ని చూజ్ చేసుకోలేం, స్క్రిప్ట్సే మమ్మల్ని చూజ్ చేసుకుంటాయి. ప్రభావతి (ఊహలు గుసగుసలాడే), వర్ష (తొలిప్రేమ) లాంటి పాత్రలు తరచూ రావు. మాకు ఆఫర్ చేసిన దాంట్లో బెస్ట్ ఎంచుకోవడానికి ట్రై చేస్తా. ► నటిగా మారినప్పటి నుంచి మీలో మీరు గమనించిన మార్పు? మనుషుల్ని అర్థం చేసుకోవడంలో బెటర్ అయ్యాననుకుంటున్నాను. ► సూపర్ హీరో? పురాణాల్లో ఏదైనా పాత్ర? ఏది సెలెక్ట్ చేసుకుంటారు? పురాణాల్లో సూపర్ పవర్స్ ఉన్న ఏ క్యారెక్టర్ అయినా ఓకే. -
నాన్‌స్టాప్
ఐదు కాదు. పది కాదు. ఏకంగా ఇరువై గంటలు కెమెరా ముందే ఉన్నారు కథానాయిక నందితా శ్వేత. అవును... ఉదయం నాలుగు గంటల నుంచి దాదాపు ఇరవై గంటల పాటు షూట్లో పాల్గొన్నారు నందిత. దీన్ని బట్టీ ఆమె ఎంత అకింతభావంతో వర్క్ చేస్తోరో అర్థం చేసుకోవచ్చు. అంతేనా.. ఈ ఏడాది ఆమె సూపర్ స్పీడ్.. కాదు కాదు జెట్‌స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. మరి.. ఏక కాలంలో ఏడు సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు కదా. ‘‘ఈ ఏడాది లైఫ్ రంగులరాట్నంలా తిరుగుతుంది. గత ఆరు నెలల నుంచి ఏక కాలంలో ఏడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. నా వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రస్తుతం నైట్ షూట్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు నందితా శ్వేతా. అంటే నందిత నాన్‌స్టాప్‌గా కెరీర్లో ముందుకెళ్తున్నారన్నమాట. రెండేళ్ల క్రితం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగు తెరపై మెరిశారీ బ్యూటీ. ప్రస్తుతం నితిన్ హీరోగా ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు నందిత. మరో కథానాయికగా రాశీఖన్నా చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. తమిళ సినిమా ‘నర్మద’లో తల్లి పాత్రలో యాక్ట్ చేస్తున్నారామె. -
స్క్రీన్ టెస్ట్
► అక్కినేని నాగార్జున సరసన తొలిసారి హీరోయిన్గా నటించిన నటి ఎవరు? ఎ) అమలా అక్కినేని బి) గౌతమి సి) సుహాసిని డి) శోభన ► శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ‘రాధాగోపాళం’ చిత్రానికి బాపు దర్శకుడు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో? ఎవరా హీరో? ఎ) నాని బి) విజయ్‌కృష్ణ సి) నరేశ్ డి) విజయ్ దేవరకొండ ► చిరంజీవితో 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండరామిరెడ్డి బి) బి. గోపాల్ సి) దాసరి నారాయణరావు డి) కె. రాఘవేంద్రరావు ► ‘ప్రేమనగర్’ అనే చిత్రం ద్వారా తన సురేశ్ ప్రొడక్షన్ సంస్థ నిలబడిందని నిర్మాత డి.రామానాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఆ చిత్రదర్శకుని కుమారుడు కూడా ప్రముఖ దర్శకుడే) ఎ) బోయిన సుబ్బారావు బి) కె. విశ్వనాథ్ సి) కె.యస్. ప్రకాశరావు డి) వి.మధుసూదన్‌రావు ► ‘విన్నర్’ సినిమాకి యాంకర్ సుమ ఓ పాట పాడింది. ఆమె పాడిన పాటలో ఓ యాంకర్ నటించారు. ఎవరా యాంకర్? ఎ) రేష్మి గౌతమ్ బి) అనసూయ సి) ఝాన్సీ డి) శిల్పా చక్రవర్తి ► ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే’ అనే పాటలో నటించిన తార ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) రిచా గంగోపాధ్యాయ సి) హంసా నందిని డి) ముమైత్‌ఖాన్ ► చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ హీరోయిన్ చిరంజీవితో మొదటిసారిగా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) రమ్యకృష్ణ బి) మీనా సి) నయనతార డి) టబు ► హీరో నాని ‘కృష్ణార్జున యుద్ధం’అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంతో కలిపి ఇప్పటివరకు నాని ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో గుర్తు తెచ్చుకోండి? ఎ) 3 బి) 2 సి) 4 డి) 1 ► యోగా గురువు ‘భరత్ ఠాగుర్’ తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో నటించిన హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీరోయిన్ పేరేంటో చెప్పేయండి? ఎ) సంగీత బి) సిమ్రాన్ సి) స్నేహ డి) భూమిక ► దర్శకుడు మణిరత్నం 1983వ సంవత్సరంలో మొదటిసారిగా దర్శకునిగా అరంగేట్రం చేశారు. ఆయన ఏ భాషలో తన మొదటి సినిమాను తెరకెక్కించారో తెలుసా? ఎ) కన్నడ బి) మలయాళం సి) తమిళ్ డి) తెలుగు ► ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఈ హీరోయిన్, అజయ్ దేవ్గన్తో ‘హిమ్మత్వాలా’లో కూడా నటించింది? ఎ) రాశీ ఖన్నా బి) లావణ్య త్రిపాఠి సి) తమన్నా భాటియా డి) శ్రియ శరన్ ► హీరో నాగచైతన్య ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) ఐయామ్ చే బి) అక్కినేని చైతన్య సి) చే అండర్స్కోర్ అక్కినేని డి) దిస్ ఈజ్ చే ► శ్రీ విష్ణు నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఓ దర్శకుడు నటుడయ్యారు, ఆయన పేరేంటో తెలుసా? ఎ) దేవి ప్రసాద్ బి) పరశురామ్ సి) కోన వెంకట్ డి) తరుణ్ భాస్కర్ ► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం పేరు ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన నటి పేరేంటి? ఎ) సమంత బి) కీర్తీ సురేష్ సి) నిత్యామీనన్ డి) అనుష్క ► దర్శకుడు శ్రీను వైట్ల భార్య కూడా సినీ రంగంలోని ఓ విభాగంలో పని చేస్తున్నారు. అమె పని చేస్తున్న విభాగం పేరేంటి? ఎ) ఫ్యాషన్ డిజైనర్ బి) ఆర్ట్ డిపార్ట్మెంట్ సి) ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డి) ఎడిటింగ్ ► ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అనే పాట రచయిత ఎవరు? ఎ) వరికుప్పల యాదగిరి బి) మాస్టర్జీ సి) కేదారేశ్వర్ డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి ► ‘లైఫ్‌లో ఎపుడైనా ఏమైనా జరగొచ్చు, అది జరిగినప్పుడు దాన్ని మనం ఫేస్ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామా.. లేదా అన్నదే ముఖ్యం’.. ఈ డైలాగ్ చెప్పింది హీరో నాగచైతన్య. ఇది ఏ సినిమాలోని డైలాగో చెప్పుకోండి? ఎ) యుద్ధం శరణం బి) బెజవాడ సి) ఆటోనగర్ సూర్య డి) సాహసం శ్వాసగా సాగిపో ► అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలోని బంగళా సెట్‌కి మంచి పేరొచ్చింది. ఆ బంగళాను డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఎవరు? ఎ) ఆనంద్ సాయి బి) రవీందర్ రెడ్డి సి) అశోక్ కుమార్ డి) బ్రహ్మ కడలి ► కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) నాలుగు స్తంభాలాట బి) రెండు రెళ్ల ఆరు సి) సీతాకోక చిలుక డి) స్వరకల్పన ► ఈ క్రింది ఫోటోలోని నటుడెవరో గుర్తు పట్టండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాగశౌర్య డి) ప్రభాస్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) ఎ 3) ఎ 4) సి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) ఎ 16) డి 17) డి 18) బి 19) సి 20) ఎ -
టెంపర్ బంపర్
రాశీఖన్నా వెరీ కూల్ గర్ల్. అయితే తన టెంపర్ చూపించడానికి రెడీ అయ్యారని సమాచారమ్. ఎందుకలా అంటే? సినిమా కోసం. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ‘టెంపర్’ తమిళ రీమేక్‌లో రాశీని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. విశాల్ హీరోగా నటించనున్న ఈ సినిమాకి మురుగదాస్ వద్ద ‘స్పైడర్’ చిత్రానికి దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహించనున్నారట. వరుస విజయాలతో రాశీ ఖన్నా తెలుగులో దూసుకెళుతున్నారు. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు సైన్ చేశారు. ఇప్పుడు ‘టెంపర్’ చాన్స్. ఇది కచ్చితంగా బంపర్ ఆఫరే. ఎందుకంటే ‘టెంపర్’లో హీరోయిన్ క్యారెక్టర్‌కి ప్రాధాన్యత ఉంది. యాక్ట్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో.. రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ బ్యూటీ అమలాపురంలో ఉన్నారు. నితిన్ హీరోగా రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా రూపొందుతోన్న ‘శ్రీనివాస కల్యాణం’ షూటింగ్ జరుగుతోందక్కడ. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
హ్యాపీ జర్నీ
... అని ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు ఒకేసారి చెబుతున్నారు సినీ ప్రేమికులు. ఇద్దరూ వెళ్తుంది ఒకే చోటుకి కదా. అందుకే ఇద్దరికీ కలిపి ఒకేసారి చెబుతున్నారు. ‘బాహుబలి’ వంటి మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమా చేశాక రామ్‌చరణ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి ఓ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. బుధవారం చరణ్ అండ్ ఎన్టీఆర్ కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీరిద్దరూ కలిసి అమెరికా వెళ్తున్నారని, అక్కడ జరిగే ఫొటోషూట్‌లో పాల్గొంటారని, సినిమాను అధికారికంగా ఎనౌన్స్ చేసినప్పుడు ఆ ఫొటోలను రిలీజ్ చేస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ఇందులో రామ్‌చరణ్ సరసన సమంత, ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా నటించనున్నారని కొందరు గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్‌లో స్టార్ట్ చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. -
తొలిప్రేమ టైటిల్ అనగానే భయపడ్డా– వరుణ్ తేజ్
‘‘ప్రసాద్‌గారికి, నాకు మంచి అనుబంధం ఉంది. ‘మగధీర’ సినిమాకు ఆయన కో–ప్రొడ్యూసర్. పవన్‌కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ సినిమా తీసిన ప్రసాద్‌గారు ఇప్పుడు పవన్ టైటిల్ ‘తొలి ప్రేమ’తో వరుణ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఆ ‘తొలిప్రేమ’తో పవన్‌కి ఎంత పేరొచ్చిందో.. ఈ ‘తొలిప్రేమ’ పెద్ద హిట్ అయి వరుణ్‌కి అంతే మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలిప్రేమ’. ఎస్.ఎస్.తమన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను అల్లు అరవింద్ విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఫిదా’ సినిమాకి ముందు ‘తొలిప్రేమ’ చిత్రాన్ని వెంకీ మా బ్యానర్లో చేయాల్సింది. కానీ, ‘ఫిదా’ కారణంగా తను బాపినీడుకి కథ వినిపించడం, ఆయనకు నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది. మా బ్యానర్లో చేయాల్సిన సినిమా వారి బ్యానర్లో చేశారనే కారణంతో బాపినీడు ఈ సినిమా టోటల్ రైట్స్‌ను నాకు ఇచ్చేశాడు. ఇలాంటి విషయాలు అరుదుగా జరుగుతుంటాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆరు నెలల వరకు ఏ టైటిల్ పెడదామని ఆలోచించాం. ‘తొలిప్రేమ’ టైటిల్ పెడదామని వెంకీ అన్నారు. నాకు ఇష్టమున్నా కాస్త భయపడ్డాను. ఆ టైటిల్ పెట్టుకుని ఏమైనా తేడా వస్తే మనకు పగిలిపోద్ది అన్నాను. ఎందుకంటే అది బాబాయ్‌కి ఐకానిక్ మూవీ. మా పెదనాన్న, బాబాయ్ వేసిన ఈ ఫౌండేషన్‌ను పాడు చేయకుండా మంచి సినిమాలు చేస్తాం’’ అన్నారు వరుణ్‌తేజ్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నన్ను నమ్మిన వ్యక్తి, ఇండస్ట్రీని నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి ‘దిల్’ రాజుగారు. ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న నాకు ఆరు అడుగుల నాలుగు అంగుళాల ధైర్యాన్నిచ్చాడు వరుణ్. నా నమ్మకానికి ఊపిరి పోసిన వ్యక్తి బాపినీడు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు వెంకీ అట్లూరి. రాశీఖన్నా, తమన్ పాల్గొన్నారు. -
ఉతికి ఆరేస్తాడు
కూల్‌గా కామ్‌గా ఉన్నవాడిని అనవరంగా కదిలిస్తేనే ఏదో రకంగా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అలాంటిది బలుపు, పవర్ ఉన్న మాస్ అబ్బాయిని కెలికితే ఊరుకుంటాడా? దమ్ము చూపించి, వాళ్ల దుమ్మ దులిపి ఉతికారేస్తాడు. మరి.. మా హీరో ఉతుకుడు ఏ రేంజ్లో ఉందో చూడాలంటే మా సినిమా వచ్చేంతవరకు ఆగాల్సిందే అంటున్నారు ‘టచ్ చేసి చూడు’ చిత్ర బృందం. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘టచ్ చేసి చూడు’. రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘రవితేజతో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ ఇమేజ్ తగ్గట్లుగా రచయిత వక్కంతం వంశీ సూపర్ కథను అందించారు. షూటింగ్ కంప్లీటైంది. ప్రజెంట్ రీ–రికార్డింగ్ వర్క్ జరుగుతుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం : ప్రీతమ్ జామ్8, కెమెరా: చోటా. కె. నాయుడు. -
పుట్టిన రోజు కానుకగా ‘టచ్ చేసి చూడు’
రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సీనియర్ హీరో రవితేజ, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీ అయ్యాడు. రాజా ది గ్రేట్ తో పాటు షూటింగ్ ప్రారంభించిన టచ్ చేసి చూడు సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న ఈసినిమాను రవితేజ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు కావటంతో ఒక్క రోజు ముందు జనవరి 25న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించినా.. వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. -
తొలి ప్రేమని మరచిపోలేం
‘మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరచిపోలేం’ అంటున్నారు వరుణ్ తేజ్. సో.. వరుణ్ ఒకప్పుడు లవ్‌లో పడ్డారన్న మాట అని ఫిక్స్ అవ్వకండి. ఇది సినిమాలో చెప్పిన డైలాగ్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ’. బుధవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. అందులో ఉన్న డైలాగ్ ఇది. ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
హాయ్ దుబాయ్
సాంగ్స్ షూట్ చేయడానికి దుబాయ్‌కి హాయ్ చెప్పింది ‘టచ్ చేసి చూడు’ చిత్రబృందం. మరి.. దుబాయ్‌కి బై బై ఎప్పుడు చెప్తారంటే వారం రోజుల తర్వాత. రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మిస్తున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. ఇందులో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ కథానాయికలు. దుబాయ్‌లో ఏం జరుగుతోంది? ఎన్ని రోజులు షూటింగ్లో పాల్గొంటారు? అని రాశీ ఖన్నాని అడిగితే – ‘‘ఈ సినిమాలో వెస్ట్రన్ డ్యాన్స్ టీచర్ పాత్ర చేస్తున్నాను. ఓన్లీ సాంగ్స్‌లోనే కాకుండా కొన్ని సీన్స్‌లో కూడా నేను డ్యాన్స్ చేయాల్సి ఉంది. అంతే కాదు నా క్యారెక్టర్ కొంచెం కామిక్‌గా ఉంటుంది. స్క్రీన్‌పై నేనొచ్చినప్పుడు వచ్చే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం సాంగ్స్‌ను షూట్ చేయడానికి దుబాయ్ వచ్చాం. ఈ వన్ వీక్ షెడ్యూల్లో టు సాంగ్స్‌ను కంప్లీట్ చేయబోతున్నాం. ప్రీతమ్ ఎక్స్లెంట్ మ్యూజిక్ ఇచ్చారు’’ అని చెప్పారు రాశీ ఖన్నా. అంటే రవితేజ, రాశీఖన్నా దుబాయ్‌లో చిందేస్తున్నారన్నమాట. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. -
సినిమా రిలీజ్ నా చేతుల్లో ఉండదు
‘‘నా సినీ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఈ జర్నీతో సంతృప్తిగానే ఉన్నాను. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఇతరులను బ్లేమ్ చేయను. ఎందుకంటే... అవన్నీ నాకు నచ్చి చేసినవే. చేసిన తప్పులను మళ్లీ చేయకూడదనుకుంటా’’ అన్నారు హీరో గోపీచంద్. ఏయం జ్యోతికృష్ణ దర్వకత్వంలో ఆయన హీరోగా శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. అనూ ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా కథానాయికలు. ఈ చిత్రాన్ని గురువారం విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో గోపీచంద్ చెప్పిన విశేషాలు.. ► కథను, ఏయం రత్నంగారిని నమ్మి, ఈ సినిమా చేశాను. ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. మా నాన్న (ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ) గారితో ఉన్న అనుబంధాన్ని ఆయన చెప్తుండేవారు. నాన్నగారి గురించి వినడం నాకో మంచి అనుభూతి. ఇందులో నా పాత్ర పేరు సంజీవ్. అతను ఏం చేస్తాడనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టార్టింగ్ టు ఎండింగ్ అలరించేలా ఉంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు కిక్ ఇస్తుంది. ఈ సినిమా హిట్ అయి... నాకు, కొన్నవాళ్లకు ఆక్సిజన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. యువన్ మంచి పాటలు ఇచ్చారు. ► ‘ఆక్సిజన్’ ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ, లేట్ అయింది. నా సినిమాలు త్వరగా రిలీజ్ కావాలని నాకూ ఉంటుంది. అయితే... నటించడం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. రిలీజ్ చేయడం నిర్మాతల చేతుల్లో ఉంటుంది. ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా నిర్మాత సెలక్షన్ విషయంలో నాదే రాంగ్ అనిపించింది. ► ‘లౌక్యం’ సినిమా చేసిన తర్వాత ‘జిల్’ చేశా. అది ఓకే. బట్, ‘సౌఖ్యం’ సినిమా రాంగ్ స్టెప్. ఆ తర్వాత ‘ఆక్సిజన్’ స్టార్ట్ చేశా. అనుకున్న టైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయితే గ్యాప్ వచ్చేది కాదు. ‘గౌతమ్‌నంద’ చిత్రకథను నమ్మాను. ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నా. కానీ, రిలీజ్ అయిన తర్వాత సెకండాఫ్‌లో ఏదో మిస్ అయ్యిందనిపించింది. హిట్టూ, ఫ్లాపు అన్నవి మన చేతుల్లో ఉండవు. చేసే ప్రతి సినిమాని మంచి కథే అని నమ్మి చేస్తాను. ► ప్రభాస్, నేనూ సినిమాల గురించే కాదు మిగతా విషయాల గురించీ మాట్లాడుకుంటుంటాం... చర్చించుకుంటాం. ‘బాహుబలి’ ప్రెజర్ అయిపోయింది కదా! తను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు (నవ్వుతూ). మా ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. ► ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు వస్తున్నాయి. రాజశేఖర్‌గారి ‘గరుడవేగ’ చూశా. బాగా నచ్చింది. ఆయనకు కాల్ చేసి, ‘రాజశేఖర్ బ్యాక్’ అని చెప్పా. తెలుగులో వెబ్ సిరీస్‌లు స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎన్ని వచ్చినప్పటికీ, థియేటర్ ఫీల్ వేరు. వెబ్ సిరీస్‌లలో నటించాలనే ఆలోచన ప్రస్తుతం లేదు. అయినా వెబ్ సిరీస్‌లు అనేవి సినిమాల్లో ఒక పార్ట్ మాత్రమే. ప్రపంచం ఉన్నంత కాలం సినిమాలు ఉంటాయి. ► మా అబ్బాయి అన్ని సినిమాలు చూస్తాడు. ఫైటింగ్ మూవీస్ అయితే ఎంజాయ్ చేస్తాడు. స్లోగా ఉంటే ‘బాలేదు’ అంటూ పక్కకి వెళ్లిపోతాడు. ► దర్శకుడు చక్రితో సినిమా చేస్తున్నాను. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నాకు డైరెక్టర్ అవ్వాలని లేదు. అది టఫ్ జాబ్. -
బంగారు... ఓ మంచి పెప్పీ సాంగ్
‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. ఇంటికొక్కడు... అనేది ఉపశీర్షిక. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా ‘దిల్’ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి బీవీఎస్ రవి దర్శకుడు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీవీఎస్ రవి మాట్లాడుతూ– ‘‘దేశానికి రక్షణగా జవానులు ఉంటారు. అలాగే, ప్రతి ఇంటికీ జవాన్ ఉండాలి, ఉంటాడు కూడా! దేశంలోని తన ఇంటినీ, ఇంట్లోవారినీ తన గుండెల్లో పెట్టుకుని బాధ్యతతో మా జవాన్ కాపాడుకుంటాడు. అందుకే, ‘కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది’ అని టీజర్లో చెప్పాం. అలాగే, ‘దేశభక్తి అనేది కిరీటం కాదు... కృతజ్ఞత’ డైలాగ్. ఇవి విన్నవాళ్లు ఫోనులు చేసి ‘మనసు పెట్టి రాశావ్’ అని ప్రశంసించారు. నిజంగానే ఈ డైలాగులు, కథను మనసుపెట్టి రాశాను. మనసుపెట్టి సినిమాను తీశాను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్’’ అన్నారు. డిసెంబర్ 1న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్రసమర్పకుడు ‘దిల్’ రాజు, నిర్మాత కృష్ణ తెలిపారు. ‘జవాన్’లో రాశీ ఖన్నా బంగారు: హీరోయిన్గా వరుస హిట్స్‌లో ఉన్న రాశీ ఖన్నా... సింగర్‌గానూ జోరు చూపిస్తున్నారు. ‘జోరు’తో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశి.. రీసెంట్గా రెండు సినిమాల్లో పాటలు పాడారు. అయితే... రెండిటిలోనూ హీరోయిన్ ఆమె కాదు. నారా రోహిత్ ‘బాలకృష్ణుడు’లో ఓ పాట పాడారు. శుక్రవారం ఆ ఆడియో విడుదలైంది. సాయిధరమ్ తేజ్ ‘జవాన్’లో పాడిన పాట త్వరలో విడుదల కానుంది. ‘‘జవాన్’లో మంచి పెప్పీ సాంగ్ పాడడం ఆనందంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు బీవీఎస్ రవిలకు థ్యాంక్స్’’ అని రాశి ట్వీట్ చేశారు. ‘‘వాట్ ఎ టాలెంట్. ‘బంగారు...’ పాటకు రాశి వాయిస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఎప్పుడెప్పుడు ఈ పాట విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్నా’’ అని రాశికి తమన్ రిప్లై ఇచ్చారు. -
ఓ ఇంటిదాన్నయ్యా!
‘మలయాళంలో ‘యాక్షన్ హీరో బిజు’ సినిమా చేశా. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయా. ఆ చిత్రం చూసిన జ్యోతికృష్ణగారు నన్ను కాంటాక్ట్ చేసి, ‘ఆక్సిజన్’లో అవకాశం ఇచ్చారు. తెలుగులో నా తొలి సినిమా అదే. ‘ఆక్సిజన్’లో నటిస్తున్నప్పుడే ‘మజ్ను’ సినిమాలో అవకాశం వచ్చింది’’ అని కథానాయిక అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. గోపీచంద్, అనూ ఇమ్మాన్యుయేల్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన ‘ఆక్సిజన్’ నవంబర్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అను చెప్పిన చిత్ర విశేషాలు... ► ఇదొక హెవీ యాక్షన్ మూవీ. మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇందులో నా పాత్ర పేరు గీత. డాక్టర్‌గా కనిపిస్తాను. తెలుగు రాదు కాబట్టి భయపడ్డాను. అయితే జ్యోతికృష్ణగారి హెల్ప్ చేశారు. చాలా ఈజీ అయింది. ఇప్పుడు తెలుగు ఓకే. గోపీచంద్‌గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. ‘ఆక్సిజన్’ మంచి సినిమా. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగులో ఎక్కువ సినిమాలు, మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం కూడా బావుంది. కాబట్టి, నా ప్రాధాన్యత తెలుగు సినిమాలకే. తమిళంలో ఓ సినిమా చేశా. మలయాళంలోనూ చేయాలనుకుంటున్నా. ► ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. గ్లామర్ రోల్స్ చేయడానికీ సిద్ధమే. నా దృష్టిలో గ్లామర్ రోల్స్, వల్గర్ రోల్స్‌కి చాలా తేడా ఉంది. గ్లామర్ ఓకే కానీ, వల్గర్‌గా ఉండకూడదని అనుకుంటాను. ► నేను హైదరాబాద్‌లో సెటిల్ అయ్యా. ఇక్కడ ఫ్లాట్ కూడా కొనుక్కున్నా. తెలుగు ఇండస్ట్రీలో అందరితో స్నేహంగానే ఉంటా. కానీ, నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరిక్కడ. ► ప్రస్తుతం నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. పవన్ కల్యాణ్‌గారితో నటించడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా, మారుతిగారి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలోనూ నటిస్తున్నా. తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నా. -
కోలీవుడ్‌లో పాగాకు తహతహ
తమిళసినిమా: కోలీవుడ్‌లో పాగా వేయడానికి నటి రాశీఖన్నా తహతహలాడుతోంది. ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్లో హీరోయిన్గా బాగానే పాపులర్ అయ్యింది. అయితే బహుభాషానటిగా రాణించాలని ఆశిస్తోందట. ఆ దిశగా ప్రయత్రాలు ముమ్మరం చేసింది. అందాలారబోతకు ఏమాత్రం వెనుకంజవేయని రాశీఖన్నా అనుష్క, సమంత, కాజల్‌అగర్వాల్‌ల వంటి ప్రముఖ కథానాయికల బాటలో పయనం మొదలెట్టింది. తొలుత బాలీవుడ్లో రంగప్రవేశం చేసి ఆ తరువాత తెలుగు చిత్రసీమలోకి ప్రవేసించిన ఈ అమ్మడు తాజాగా కోలీవుడ్‌పై దృష్టిసారించింది. ఇక్కడ యువ నటులు సిద్దార్థ్ తో సైతాన్ కా బచ్చా చిత్రంలోనూ, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇమైకా నోడిగళ్ చిత్రంలో అధర్వకు జంటగానూ నటిస్తోంది. వీటిలో ఇమైకా నోడిగళ్ చిత్రం వచ్చే నెలలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. కాగా కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసే అవకాశాల వేట మొదలెట్టిందట. గత వారం చెన్నైకి వచ్చిన రాశీఖన్నా ఇక్కడి ప్రముఖ దర్శకులను కలిసి చాన్సుల కోసం ప్రయత్నించిందట. త్వరలోనే స్టార్ హీరోలతో కలిసి నటిస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోంది. పనిలో పనిగా మలయాళంలోనూ నటించేస్తోంది. అక్కడ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటిస్తున్న విలన్ చిత్రంతో రంగప్రవేశం చేసింది. తదుపరి శాండిల్‌వుడ్‌పై దృష్టి పెడుతుందేమో. -
పదేళ్ల ప్రేమ కథే ఈ చిత్రం
వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. జ్యోతిర్మయి గ్రూప్స్ చిత్ర సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. హైదరాబాద్‌లో శనివారం ప్రారంభమైన ఈ చిత్రం తొలి సన్నివేశానికి సంగీత దర్శకులు ఎమ్.ఎమ్. కీరవాణి క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ– ‘‘మంచి రచయిత అయిన వెంకీ అట్లూరి... వరుణ్ తేజ్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నాడు. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘బీవీయస్‌యన్ ప్రసాద్, బాపీనీడు నిర్మాతలుగా ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెంకీ అట్లూరి నా ఫ్రెండ్. ఒక ప్రేమకథ లోని పదేళ్ళ ప్రయాణమే ఈ సినిమా. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మంచి టీమ్ కలిసి చేస్తున్న మంచి ప్రయత్నమిది అన్నారు’’ వరుణ్‌తేజ్. వెంకీ అట్లూరి మాట్లాడుతూ–‘‘దర్శకుడిగా నా తొలి చిత్రాన్నే వరుణ్ లాంటి హీరోతో ఇంత పెద్ద బ్యానర్లో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:జార్జి. -
వరుణ్ కొత్త సినిమా ఓపెనింగ్
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫిదా షూటింగ్లో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరో సినిమాను స్టార్ట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివియస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరిన దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో వరుణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, కమర్షియల్ స్టార్ అనిపించుకునేందుకు కష్టపడుతున్నాడు. ముకుంద, కంచె లాంటి సినిమాలో ఆకట్టుకున్న వరుణ్, కమర్షియల్ జానర్లో చేసిన లోఫర్, మిస్టర్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఫిదా మీద ఆశలు పెట్టుకున్నాడు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
మాస్ పంచ్‌లతో 'బెంగాల్ టైగర్'
'కిక్ 2' ఫెయిల్యూర్ నుంచి త్వరగానే కోలుకున్నాడు మాస్ మహరాజ రవితేజ. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ మార్క్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. 'నేను క్లైమేట్ లాంటోన్ని, అప్పుడప్పుడు చల్లగా ఉంటా.. అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా... అప్పుడప్పుడూ వణికిస్తూ ఉంటా..' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. 'కిక్ 2' ఫెయిల్యూర్ తరువాత ఫుల్ ఎనర్జీతో వస్తున్న రవితేజ ఈసారి గ్యారెంటీ హిట్ మీద కన్నేశాడు. తమన్నా అందం సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది. రవితేజ సరసన తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో కెకె రాధమోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బెంగాల్ టైగర్' నవంబర్ 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.