మాస్ పంచ్లతో 'బెంగాల్ టైగర్' | Raviteja, sampath nandi bengal tiger teaser released | Sakshi
Sakshi News home page

మాస్ పంచ్లతో 'బెంగాల్ టైగర్'

Published Wed, Oct 14 2015 12:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

మాస్ పంచ్లతో 'బెంగాల్ టైగర్'

మాస్ పంచ్లతో 'బెంగాల్ టైగర్'

'కిక్ 2' ఫెయిల్యూర్ నుంచి త్వరగానే కోలుకున్నాడు మాస్ మహరాజ రవితేజ. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తున్నాడు. రవితేజ మార్క్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది.

'నేను క్లైమేట్ లాంటోన్ని, అప్పుడప్పుడు చల్లగా ఉంటా.. అప్పుడప్పుడు వెచ్చగా ఉంటా... అప్పుడప్పుడూ వణికిస్తూ ఉంటా..' అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ను అలరిస్తున్నాయి. 'కిక్ 2' ఫెయిల్యూర్ తరువాత ఫుల్ ఎనర్జీతో వస్తున్న రవితేజ ఈసారి గ్యారెంటీ హిట్ మీద కన్నేశాడు. తమన్నా అందం సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది.

రవితేజ సరసన తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంపత్ నంది దర్శకత్వంలో కెకె రాధమోహన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బెంగాల్ టైగర్' నవంబర్ 6న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement