Sampath Nandi
-
'సింబా' సినిమా రివ్యూ.. థ్రిల్లింగ్ చేస్తుందా..?
టైటిల్: సింబా నటీనటులు: జగపతిబాబు, అనసూయ, శ్రీనాథ్ మాగంటి, కబీర్‌సింగ్ తదితరులు నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్ దర్శకత్వం: మురళీ మనోహర్ రెడ్డి విడుదల తేది: ఆగస్ట్ 9, 2024కథేంటంటే.. ?హైదరాబాద్ నగరంలో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త పార్థ(కబీర్ సింగ్) సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. విచారణ కోసం పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) నగరానికి వస్తాడు. ఈ క్రమంలో మరో హత్య కూడా అలానే జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్ టీచర్ అనుముల అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్(శీనాథ్ మాగంటి) ఉన్నారని తెలిసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకి తరలించే క్రమంలో హత్య చేయాలని పార్థ ప్లాన్ వేస్తాడు. అయితే వీరిద్దరు కలిసి తమను చంపాడానికి వచ్చిన వ్యక్తిని పోలీసుల ముందే చంపేస్తారు.ఈ హత్యలో డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) భాగస్వామి అవుతాడు. అసలు ఎలాంటి సంబంధంలే లేని ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? బొద్దింకను కూడా చంపడానికి ఇష్టపడని అక్షిక..దారుణ హత్యలు ఎలా చేసింది? పురుషోత్తమ్ రెడ్డి అలియాస్ సింబా(జగపతి బాబు) ఎవరు? ఆయనకు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పార్థకి, పురుషోత్తమ్ రెడ్డి మధ్య ఉన్న వైరం ఏంటి? పోలీసాఫీసర్ అనురాగ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? అనేది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక రివేంజ్ డ్రామా.. బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కు డైరెక్టర్ పరిచయం చేశారు. ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే, ఇందులో వాటన్నింటికి భిన్నంగా ఆసక్తి రేకెత్తించేలా సినిమా ఉంటుంది. భవిష్యత్ సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. ఈ అంశాన్ని ఇందులో చూపించిన తీరుని డైరెక్టర్ మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పస్టాప్‌లోనే కథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. దాదాపు చాలా సీన్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతున్న తీరును ఆసక్తిగా చూపించిన దర్శకుడు.. ఈ హత్యల వెనక ఎవరుంటారో అనేది చెప్పడంలో కాస్త విఫలం అయ్యాడు అనిపిస్తుంది.అలా వరుస హత్యలతో పస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతున్న క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సిల్లీగా అనిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని ఆసక్తిగా చెప్పడం లో కాస్త విఫలం అయ్యాడు. ఫోన్ కాల్ లిస్ట్‌తోనే హంతకులను పట్టుకున్న తీరు ఏమాత్రం మెప్పించదు. సెకడాఫ్‌లో క బయాలాజికల్ మెమరీ అంశం అనేది తెరపైకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. పురుషోత్తమ్ రెడ్డి (జగపతిబాబు ) కథ ఇక్కడే మొదలౌతుంది. సినిమాలో ఆయన పాత్రని చివరి వరకూ పెద్దగా ప్రభావం లేకుండా కథ నడపం కాస్త మైనస్ అనిపిస్తుంది. కథ సాధారణమై అయినా.. దర్శకుడు చూపించిన తీరు థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ముందుగా సింబా దర్శకుడు మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాలి. ఉన్నంతలో బాగానే తీశాడు. జగపతిబాబు, అనసూయ లాంటి స్టార్స్‌ను పాత్రల మేరకు బాగానే ఉపయోగించుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వశిష్ఠ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. కథ చివర్లో ఆయన నటించిన తీరు మెప్పిస్తుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించిన కబీర్ పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ మేరకు సినిమా మించే ఉందని చెప్పవచ్చు. ఫైనల్‌గా అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చే సింబా మెప్పిస్తాడు. -
ఆ డెరెక్టర్పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్‌గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్‌పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్‌ను సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కించిన రచ్చ బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. Thankyou for your kind words @IamSampathNandi , it means a lot✨ I have always strongly believed that filmmaking is a collaborative effort. Even if it begins with one person’s vision, it’s the fusion of each team member’s perspective that matters and Sampath truly understands… https://t.co/SVcRFRMt6O — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 10, 2024 -
Odela 2 Movie: ‘ఓదెల 2’లో మిల్కీ బ్యూటీ.. కాశీలో గ్రాండ్ గా ఓపెనింగ్ (ఫోటోలు)
-
'సౌండ్ పార్టీ' టీజర్.. స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా రిలీజ్
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తీస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?) తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా 'సౌండ్ పార్టీ' టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సౌండ్ పార్టీ' టీజర్ బాగుంది. మోహిత్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుంది' అని అన్నారు. (ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ) -
‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ లో కనిపిస్తోంది: శర్వా
‘‘హీరో ఆది సాయికుమార్ని నేను బ్రదర్‌లా భావిస్తాను. ఆదికి సక్సెస్ వస్తే నేనూ ఎంజాయ్ చేస్తాను. నిర్మాత రాధామోహన్ గారు పదేళ్లుగా తెలుసు. నేను హీరోగా చేసిన ‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు శర్వానంద్. ఆది సాయికుమార్, మిర్నా మీనన్ జంటగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హీరో శర్వానంద్, దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు మారుతి. ‘‘రాధామోహన్ గారితో తొలి సినిమా చేసే దర్శకులకు విజయం వస్తుంది. అలా ఫణి కృష్ణకు కూడా ‘క్రేజీ ఫెలో’తో విజయం వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు సంపత్ నంది. ‘‘క్రేజీ ఫెలో’ హిలేరియస్ ఎంటర్టైనర్. సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది’’ అన్నారు ఆది. ‘‘ఈ సినిమాలో ఆది సాయికుమార్ కొత్తగా కనిపిస్తారు. మేం అందరం క్రేజీగా పని చేశాం’’ అన్నారు ఫణి కృష్ణ. ‘‘ఈ కథకు ఆది బాగా సరిపోయాడు. దర్శకుడిగా ఫణి కృష్ణకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు రాధామోహన్ . ఈ కార్యక్రమంలో నటుడు అనీష్ కురువిల్లా, నటి వినోదినీ వైద్యనాథన్, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?
ఒకవైపు రాజకీయాలు ఇంకో పైవు సినిమాలు అంటూ రెండు పడవల పై ప్రయాణం సాగిస్తున్నాడు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. అతని ప్లాన్ అతనికి ఉంది. కాని అతని సినిమాలతో కెరీర్ ప్లాన్ చేసుకున్న దర్శకుల ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతోంది. ఏళ్ల తరబడి పవన్ దర్శకులు ఖాలీగా కూర్చోవాల్సి వస్తోంది. మరికొందరికైతే ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసినప్పటికీ అతనితో సినిమా చేసే అవకాశం మాత్రం రావడం లేదు. దీంతొ కొంత మంది దర్శకులు పవన్‌తో సినిమాలు చేయడానికి భయపడిపోతున్నారు. గద్దలకొండ గణేష్(2019) తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు దర్శకుడు హరీశ్ శంకర్. వీరిద్దరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.కేవలం పవన్ కోసమే హరీశ్ రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చాడు.ఇప్పుడు పవన్ భవదీయుడు చేసేందుకు టైమ్ లేదు అంటున్నాడట పవన్. అందుకే హరీష్ ఇక తన వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. (చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..) మరో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్ తో సినిమా ప్రకటన చేశాడు. ఏజెంట్ తర్వాత పవర్ స్టార్ తో మూవీ అంటుంది అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ తో మూవీ కమిట్ అయ్యాడు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ ప్రీ ప్రొడక్షన్ దశలోనూ దర్శకుడు సంపత్ నంది పవన్ తో సినిమా కోసం ఇలాగే ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేశాడు. అయితే లాస్ట్ కు ఆ ఛాన్స్ ను బాబి అందుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరి హర వీరమల్లు సినిమా ఆగిపోయిందంటూ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే క్రిష్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం చేతిలో ఉన్న చిత్రాలను అన్ని పక్కనపెట్టి , రెండేళ్లుగా తనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్న దర్శకులను కాదని, తమిళ సినిమా వినోదయ సిత్తంను సముద్రఖనితో కలసి రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కావాల్సింది..కానీ అదీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పవన్ చేతిలో ఉన్న సినిమాలేవి ఇప్పట్లో ముందుకు కదిలే అవకాశల్లేవు. పవన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల అభిమానులు నిరాశ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
ఆ డైరెక్టర్‌తో సాయిధరమ్ తేజ్ యాక్షన్ ఎంటర్టైనర్..
Sai Dharam Tej Movie With Director Sampath Nandi: తనదైన శైలీలో సినిమాలతో అలరిస్తున్నాడు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ఇటీవల రిపబ్లిక్ మూవీతో సందడి చేసిన సాయిధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనుంది. హై ఓల్టేజ్ యాక్షన్‌గా రూపొందనున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. సంపత్ నంది మార్క్ ఆఫ్ స్టైల్‌తో సాయితేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. కాగా కార్తీక్ అనే కొత్త దర్శకుడితో ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి:👇 లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్.. మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
ఫారెస్ట్ మ్యాన్ గా జగపతిబాబు..ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సింబా’. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు డైరెక్టర్ సంపత్ నంది కథను అందించగా.. మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంపత్‌నంది, రాజేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం(జూన్ 5) ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుగారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నాం’ అని మేకర్స్ రాసిన వ్యాఖ్యలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్న వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. Here’s our Mother Nature's very own child💪🏾💚 Elated to introduce our beloved @iamjaggubhai garu as #SIMBAA - The Forest Man 🔥 on this #WorldEnvironmentDay More details 🔜@mmrdirects@SampathNandi_TW @anusuyakhasba #RajenderReddy @vamsikaka @dhani_aelay pic.twitter.com/j3FzSb5G78 — Sampath Nandi (@IamSampathNandi) June 5, 2022 -
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రముఖ దర్శకుడు
Sampath Nandi Visits Vemulawada Sri Raja Rajeshwara Swamy Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దంపతులిద్దరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. సంపత్ నంది వెంట కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, పలువురు ఉన్నారు. తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశామని సంపత్ నంది తెలిపారు. త్వరలో నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంపత్ నంది 'బ్లాక్ రోజ్, ఓదెల రైల్వేస్టేషన్' చిత్రాలకు కథ అందించారు. 'ఏమైంది ఈవేళ' సినిమాతో తెరంగ్రేటం చేసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రచ్చ' చిత్రంతో హిట్ కొట్టిన డైరెక్టర్ సంపత్ నంది. తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సిటీమార్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. దర్శకుడిగానే కాకుండా పేపర్ బాయ్, గాలిపటం సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన సిటీమార్ 2021లో భారీ హిట్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో గోపిచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదీ చదవండి: పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది -
‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది: గోపీచంద్
‘నేను హిట్స్, ఫ్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ఫ్లాపా? అని నాకొచ్చే ఫోన్‌కాల్స్ చెప్పేస్తాయి. ఈ మధ్య కాలంలో నా సినిమాలు హిట్ అని వినలేదు. కానీ, ‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది. శ్రీనివాసా చిట్టూరి, పవన్ పడిన కష్టానికి ఇంత పెద్ద హిట్ వచ్చింది. సంపత్ కూడా ఈ హిట్‌తో ఆపకుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాలి’ అన్నారు హీరో గోపీచంద్. చదవండి: Seetimaarr Review In Telugu: కూత అదిరింది.. సీటీ కొట్టాల్సిందే! సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటింన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సీటీమార్ ఈ నెల 10న విడుదలైంది. థియేటర్లో విడుదులైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. నిన్న జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్లో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ‘‘గౌతమ్ నంద’ మా అంచనాలు అందుకోలేకపోయింది. ‘సీటీమార్’తో గోపీచంద్ బాకీ తీర్చేసుకున్నాను’’ అన్నారు. చదవండి: బిగ్‌బాస్ అన్యాయం చేశాడని ఏడ్చేసిన సరయూ -
‘సీటీమార్’మూవీ రివ్యూ
టైటిల్ : సీటీమార్ నటీనటులు : గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: సంపత్ నంది సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో మ్యాచోస్టార్ గోపిచంద్ ఒకరు. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్.. ఇటీవల కాలంలో రొటీన్ సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’అని టైటిల్ పెట్టడం, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను గోపిచంద్ అందుకున్నాడా? ‘సీటీమార్’సినిమాకు ప్రేక్షకులు సీటీలు కొట్టారా లేదా? రివ్యూలో చూద్దాం. ‘సీటీమార్’ కథేంటంటే..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపిచంద్) స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగం పొందుతాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన గ్రామంలోని ఆడపిల్లలకు కబడ్డీ కోచింగ్ ఇస్తుంటాడు. వారిని ఎలాగైనా నేషనల్ పోటీల్లో గెలిపించాలని తపన పడతాడు. కప్పు కొట్టి గ్రామంలోని పాఠశాలను మూతపడకుండా చేయాలనేది అతని లక్ష్యం. అనుకున్నట్లే కార్తీక్ టీమ్ నేషనల్ పోటీలకు ఎంపికవుతుంది. కట్‌చేస్తే..గేమ్ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్తీక్ టీమ్‌లోని ఆడపిల్లలు కిడ్నాప్‌నకు గురవుతారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి కార్తీక్‌కి ఎలాంటి సాయం చేసింది. నేషనల్ కప్పు కొట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్న కార్తీక్ ఆశయం నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? కబడ్డీ కోచ్‌గా గోపిచంద్ అదరగొట్టేశాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా మెప్పించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్‌గా దిగంగన సూర్యవంశీ చక్కగా నటించింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా జీవించేశాడు. తెరపై చాలా క్రూరంగా కనిపించాడు. హీరో అక్కగా భూమిక, పోలీసు అధికారిగా రెహమాన్ ఫర్వాలేదనిపించారు. గ్రామ ప్రెసిడెంట్‌గా రావురమేశ్ మరోసారి తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. ఆయన చేసే సీరియస్ కామెడీకి, పంచులకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే.. గోపిచంద్ తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం‘సీటీమార్’. అయితే దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేసి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మలిచాడు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రగతి, అన్నపూర్ణమ్మల గ్యాంగ్.. టీవీ యాంకర్ దిగంగన పెళ్లిని చెడగొట్టే సీన్ అయితే థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్‌కి నవ్వని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సెకండాఫ్‌లో ఇలాంటి కామెడీ లేకపోవడం, కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా రోటీన్‌గా ఉండడం సినిమాకు మైనస్. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఫ్యాన్స్‌తో ఈలలు కొట్టిస్తున్న సీటీమార్ ట్రైలర్
Seetimaarr Trailer: హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్‌గా నటించిన చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఒక ఊరి నుంచి 8 కబడ్డీ ఆటగాళ్లను పంపించడం కుదరదు అని ఓ వ్యక్తి అడ్డు చెపుతుండగా.. 'రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు, రూట్ లభించి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 'మన దేశంలో మగాళ్లు కనీసం అరవయ్యేళ్లు బతికి చచ్చిపోతున్నారు, ఆడాళ్లు కూడా అరవయ్యేళ్లు బతుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చచ్చిపోతున్నారు..' అని చెప్పే డైలాగ్ జనాలకు కనెక్ట్ అవుతుంది. మొత్తానికి తన టీమ్‌ను గెలిపించడానికి ఎంతకైనా తెగించడానికి రెడీ అయ్యాడీ కబడ్డీ కోచ్. మరి వీరి కూత వినాలన్నా, కబడ్డీ ఆట చూడాలన్నా సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే. -
గాడ్ ఫాదర్: సంపత్ నంది, చిరును కలవడానికి కారణం ఇదేనట!
ఇటీవల డైరెక్టర్ సంపత్ నంది మెగాస్టార్ చిరంజీవిని కలిసి భేటి అయిన ఫొటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న చిరును సంపత్ నంది కలవడం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఆయనతో చిరు ఓ మూవీ చేయబోతున్నాడా? అనే ప్రచారం కూడా మొదలైంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ ఉండబోతుందని అభిమానులంతా మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ వెనుక కారణంగా ఎంటన్నది తాజాగా బయటకు వచ్చింది. కాగా చిరు నటిస్తున్న లూసిఫర్ మూవీ టైటిల్ విషయంపై సంపత్ నంది, చిరుతో సమావేశం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోహన్ రాజా దర్శకత్వంలో చిరు లూసిఫర్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీకి కింగ్ మేకర్ అనే టైటిల్ పరీశీలించారు మేకర్స్. దీనితో పాటు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కూడా పరిశీలనకు వచ్చింది. ఇక గాడ్ ఫాదర్ టైటిల్‌నే ఖరారు చేయాలని దర్శక-నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఈ టైటిల్‌ను ఇప్పటికే ఓ దర్శకుడు రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిసి ఆయన ఎవరా.. అని ఆరా తీయగా అది సంపత్ నంది అని తెలిసింది. దాంతో ఈ టైటిల్ ఇవ్వాల్సింది నేరుగా చిరు సంపత్ నందిని అడగడంతో ఆయన వెంటనే టైటిల్‌ను ఇచ్చేశాడట. చిరు అడగ్గానే ఏమాత్రం ఆలోచించకుండా టైటిల్‌ను త్యాగం చేశాడట సంపత్ నంది. ఈ విషయంపైనే చిరుతో చర్చించేందుకు ఆయన ఇంటికి వెళ్లి చిరు కలిశాడట. అక్కడ ఆయనతో కాసేపు ముచ్చటించి, సెల్ఫీ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ‘ఏమైంది ఈవేళ’ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు సంపత్ నంది. ఆ తర్వాత రామ్ చరణ్ ‘రచ్చ’ మూవీకి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఈ మూవీ కమర్షియల్ హిట్ అందుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్ 2’ తీయాలనుకుని కొద్దిలో ఛాన్స్ కొద్దిలో మిస్సైయాడు సంపత్ నంది. ఆయనతో ఈ మూవీ స్టార్ట్ చేసిన పవన్.. మొదట్లోనే ఈ సినిమాను ఆపేశాడట. -
అలా పిలిస్తే కూత ఆగిపోద్ది!
‘‘నన్నెవడైనా అలా (రేయ్ కార్తి) పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్లు పిలవాలి.. లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి.. ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది’.. ‘కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట’ అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్‌తో ‘సీటీమార్’ టీజర్ విడుదలైంది. ‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఇది. మీకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. తమన్నా, భూమిక, దిగంగనా సూర్యవంశీ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్. సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ. -
గోపీచంద్‌తో అప్సర రాణి డ్యాన్స్
రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వెబ్ ఫిల్మ్ ‘థ్రిల్లర్’తో పాపులారిటీ సంపాదించుకున్నారు అప్సరా రాణి. ఆ తర్వాత రవితేజ ‘క్రాక్’లో ‘భూమ్ బద్దల్...’ అంటూ ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్స్ వేశారామె. ఈ పాట మంచి హిట్ అయింది. తాజాగా మరో స్పెషల్ సాంగ్‌కి రెడీ అవుతున్నారు అప్సర. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. ఈ సినిమాలో అప్సరా రాణి స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ‘‘మా సీటీమార్లో ఓ స్పెషల్ పటాకా సాంగ్‌లో చేస్తున్నారు అప్సర. ఈ పాట బొంభాట్గా ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు సంపత్ నంది. ‘సీటీమార్’ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. చదవండి: శృంగార సన్నివేశం.. హీరోను చూసి భయపడ్డాను -
కబడ్డీ కోచ్‌గా తమన్నా
‘సీటీ మార్’ కోసం కబడ్డీ కోచ్ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీమ్‌కి దొరక్కుండా తన టీమ్‌ను తయారు చేసే కోచ్ పాత్రలో ఆమె కనిపిస్తారు. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. సోమవారం తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జ్వాలా రెడ్డిగా నటిస్తున్నారామె. గోపీచంద్ కూడా కబడ్డీ కోచ్ పాత్రలోనే కనిపిస్తారు. సోమవారం సెట్లో తమన్నా పుట్టిన రోజును కూడా సెలబ్రేట్ చేసింది చిత్రబృందం. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
సంక్రాంతికి సీటీమార్?
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్’. తమన్నా కథానాయిక. రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవన్షీ కీలక పాత్రలో నటిస్తున్నారు. కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ పాత్రల్లో కనిపించనున్నారు. కోవిడ్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 60 శాతానికి పైగా పూర్తి చేశారని సమాచారం. త్వరలోనే మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్స్‌లో తీసుకురావాలన్నది ప్లాన్ అని తెలిసింది. -
క్రైమ్ థ్రిల్లర్ ఆరంభం
‘ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్’ వంటి హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఓ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు. దర్శకుడు సంపత్ నంది వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన అశోక్ తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. మా బ్యానర్లో ‘ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది చెప్పిన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్‌గా అనిపించింది. కథ బాగా నచ్చడంతో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం. సెప్టెంబర్ మొదటి వారం నుంచి నా¯Œ స్టాప్‌గా చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ అనుమోలు, సంగీతం: అనూప్ క్రియేటివ్స్, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సంపత్ నంది. -
సీసీసీకి టాలీవుడ్ డైరెక్టర్ విరాళం..
కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి)కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సంపత్ నంది కోరారు. -
పర్ఫెక్ట్ కోచ్
‘జ్వాల’ క్యారెక్టర్‌ను ఓ చాలెంజ్‌గా తీసుకున్నానంటున్నారు తమన్నా. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ జ్వాల పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఈ పాత్ర కోసం తాను సిద్ధమవుతున్న విధానం గురించి తమన్నా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో తొలిసారి ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నాను. కబడ్డీ ప్లేయర్స్‌కు కోచ్‌గా నేను నటిస్తానని అస్సలు ఊహించలేదు. జ్వాల పాత్రను పర్ఫెక్ట్గా చేసేందుకు ఫుల్‌గా ప్రిపేర్ అవుతున్నాను. తెలంగాణ యాస నేర్చుకోవడాన్ని ఓ సవాల్‌గా తీసుకున్నాను.వీగన్ (శాకాహారి)గా మారిపోయి గ్లూటెన్ డైట్ ఫాలో అవుతూ యోగా కూడా చేస్తున్నాను. కోచ్‌గా నా హావభావాలు, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాను. సంపత్ నంది సూచనలతో పాటు మా సెట్లో ఉన్న జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్స్ సలహాలను తీసుకుంటున్నాను. ‘జ్వాల’ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఇంతలా కష్టపడుతున్నాను’’ అని పేర్కొన్నారు తమన్నా. ఈ సిని మాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా కనిపించనున్నారు గోపీచంద్. -
‘చివరికి ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారు’
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుటున్న ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ముందుగా సోషల్‌మీడియాలో లీకువీరులు చెప్పినట్టుగానే ఈ సినిమాకు ‘సీటీమార్’అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ చిత్రంతో కోచ్ అవతారం ఎత్తనున్న గోపిచంద్ అందుకు తగ్గట్టు మారారు. నెత్తిన టోపీ ధరించి, విజిల్ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా పోస్ట్‌ర్‌లో గోపిచంద్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. తన 28వ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్ కోచ్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా మిల్క్‌బ్యూటీ తమన్నా తెలంగాణ జట్టు కబడ్డీ టీమ్ కోచ్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక వరుస ఫెయిల్యూర్‌తో సతమతమవుతున్న గోపిచంద్ ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ‘గౌతమ్‌నంద’తో తనకు ఫెయిల్యూర్ ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నందిపై మరోసారి నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకున్నాడు. దీంతో సంపత్ నంది గోపిచంద్‌కు హిట్టు అందిస్తాడో లేదో చూడాలి. భూమిక, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. Here's the first look from my next #Seetimaarr! Dir by @IamSampathNandi Bankrolled by @SS_Screens #SrinivasaaChhitturi @tamannaahspeaks @bhumikachawlat @DiganganaS #Gopichand28firstlook pic.twitter.com/z5sSNrkXf0 — Gopichand (@YoursGopichand) January 27, 2020 -
గోపీచంద్ సీటీమార్
గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్‌ను ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిరి్మస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతోందని తెలిసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆంధ్ర మహిళల జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్‌గా తమన్నా నటిస్తున్నారని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్ చేసిందట. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
వేసవి బరిలో.. .
‘గౌతమ్‌నంద’ చిత్రం తర్వాత గోపీచంద్– సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. తొలి షెడ్యూల్లో భాగంగా అజీజ్ నగర్లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభిస్తాం. వేసవికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: మణిశర్మ, సమర్పణ: పవన్‌కుమార్. -
గోపీచంద్ ‘28’వ చిత్రం షురూ
ఎప్పటికప్పుడు వినూత్నమైన కథాంశాలు, సరికొత్త పాత్రల్లో ఒదిగిపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు గోపీచంద్. సినిమా ఫలితాలపై సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పంతం’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో రెండు రోజుల్లో ‘చాణక్య’ తో థియేటర్లలో కలవనున్నాడు. అయితే చాణక్య విడుదలకు సిద్దంగా ఉన్న సమయంలోనే మరో రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు గోపీచంద్. తాజాగా గోపీచంద్ తన 28వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం సంపత్ నందికి ఇచ్చిన విషయం తెలిసిందే. ‘గౌతమ్‌నందా’తో నిరుత్సాహపరిచినప్పటికీ ఈ సారి బలమైన స్క్రిప్ట్‌తో రావడంతో సంపత్ నందికి ఈ యాక్షన్ హీరో మరోసారి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తొలి క్లాప్ కొట్టడంతో షూటింగ్ ప్రారంభమైంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ "ప్రొడక్షన్ నెం.3" గా శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు బిను సుబ్రమణ్యం డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. -
కబడ్డీ.. కబడ్డీ...
ఈ మధ్య తమన్నాకు కాస్త తీరిక చిక్కితే చాలు.. కబడ్డీ కబడ్డీ అని నాన్‌స్టాప్‌గా చెబుతూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్లో ప్రత్యర్థి ఒడిసి పట్టుకుంటే, వదిలించుకుని వెళ్లేవరకూ కబడ్డీ కబడ్డీ అనాలి కదా... కాదు కాదు ప్లేయర్స్‌తో అనిపించాలి కదా. విషయం ఏంటంటే.. గోపీచంద్ సరసన తమన్నా ఓ సినిమాలో కథానాయికగా నటించబోతున్నారు కదా. ఇందులో ఈ బ్యూటీ కబడ్డీ కోచ్ పాత్ర చేయబోతున్నారట. సినిమాలో కబడ్డీ ప్లేయర్స్‌కు కోచింగ్ ఇవ్వడానికి ముందు తాను కబడ్డీ గురించి తెలుసుకుంటున్నారట తమన్నా. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ చిత్రానికి ‘సీటీ మార్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం.