క్రేజీ కాంబినేషన్‌లో... | Crazy Combination .. | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌లో...

Published Wed, Jul 6 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

క్రేజీ కాంబినేషన్‌లో...

క్రేజీ కాంబినేషన్‌లో...

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు అంకురార్పణ జరిగింది. రవితేజను ‘బెంగాల్ టైగర్’గా బాక్సాఫీస్ పైకి దూకించిన దర్శకుడు సంపత్ నంది, మాస్ హీరో గోపీచంద్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె. పుల్లారావు, జె. భగవాన్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘గోపీచంద్‌లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్తగా చూపించబోయే చిత్రమిది. సంపత్ నంది చెప్పిన కథ మాకు బాగా నచ్చింది.


మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుంది. హై బడ్జెట్‌తో, మంచి టెక్నికల్ వేల్యూస్‌తో సినిమా నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కెమేరా: ఎస్. సౌందర్ రాజన్, ఆర్ట్: ఏయస్ ప్రకాశ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతంరాజు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement