‘నేను హిట్స్, ఫ్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ఫ్లాపా? అని నాకొచ్చే ఫోన్‌కాల్స్ చెప్పేస్తాయి. ఈ మధ్య కాలంలో నా సినిమాలు హిట్ అని వినలేదు. కానీ, ‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది. శ్రీనివాసా చిట్టూరి, పవన్ పడిన కష్టానికి ఇంత పెద్ద హిట్ వచ్చింది. సంపత్ కూడా ఈ హిట్‌తో ఆపకుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాలి’ అన్నారు హీరో గోపీచంద్.
చదవండి: Seetimaarr Review In Telugu: కూత అదిరింది.. సీటీ కొట్టాల్సిందే!
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటింన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సీటీమార్ ఈ నెల 10న విడుదలైంది. థియేటర్లో విడుదులైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. నిన్న జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్‌లో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ‘‘గౌతమ్ నంద’ మా అంచనాలు అందుకోలేకపోయింది. ‘సీటీమార్’తో గోపీచంద్ బాకీ తీర్చేసుకున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment