Seetimaarr Movie
-
ఓటీటీలో సీటీమార్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
‘గౌతమ్ నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్– డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించింది. భూమిక చావ్లా, రెహమాన్, రావు రమేష్, ప్రగతి వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు. అప్సరా రాణి ‘పెప్సీ ఆంటీ’ అనే ఐటెం సాంగ్‌తో దుమ్ము దులిపేసింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న వినాయక చవితి కానుకగా థియేటర్లో విడుదలై మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. Action, Drama, and Romance; we’ve got everything for you Watch @YoursGopichand and @tamannaahspeaks in their most #SeetiMaarr avatar ever Streaming from 15th October only on @DisneyPlusHS #SeetiMaarrOnHotstar pic.twitter.com/rF1FQLwv0M — BA Raju's Team (@baraju_SuperHit) October 8, 2021 తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్టాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 'సీటీమార్' స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం ఈ నెల 15 నుంచి హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఇదివరకే థియేటర్లలో సినిమా చూసిన అభిమానులు దసరా పండగరోజు మరోసారి ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
‘సీటీమార్’ మేకింగ్ వీడియో చూశారా?
Seetimaarr Movie Making Video: కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘సీటీమార్’.సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసుకు మంచి వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాలో టాలీవుడుకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. భూమిక చావ్లా, రెహమాన్, రావు రమేష్, ప్రగతి వంటి ప్రముఖులు ఈ సినిమాలో భాగస్వామ్యమయ్యారు. ఇక వర్మ స్కూల్ నుంచి వచ్చిన అప్సరా రాణి ‘పెప్సీ ఆంటీ’ అనే ఐటెం సాంగ్‌తో దుమ్ముదులిపింది. ప్రారంభం నుంచే సీటీమార్పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. చదవండి: బిగ్‌బాస్ : ప్రియాంక సింగ్‌కు కన్నడ నటి మద్దతు సంపత్ నంది రూపొందించిన ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ ఇటీవల సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సీటీమార్ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందనేది వీడియో రూపంలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది: గోపీచంద్ -
‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది: గోపీచంద్
‘నేను హిట్స్, ఫ్లాప్స్ చూశాను. నా సినిమా హిట్టా, ఫ్లాపా? అని నాకొచ్చే ఫోన్‌కాల్స్ చెప్పేస్తాయి. ఈ మధ్య కాలంలో నా సినిమాలు హిట్ అని వినలేదు. కానీ, ‘సీటీమార్’ ఆ కొరత తీర్చింది. శ్రీనివాసా చిట్టూరి, పవన్ పడిన కష్టానికి ఇంత పెద్ద హిట్ వచ్చింది. సంపత్ కూడా ఈ హిట్‌తో ఆపకుండా ఇంకా పెద్ద హిట్ మూవీస్ చేయాలి’ అన్నారు హీరో గోపీచంద్. చదవండి: Seetimaarr Review In Telugu: కూత అదిరింది.. సీటీ కొట్టాల్సిందే! సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటింన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సీటీమార్ ఈ నెల 10న విడుదలైంది. థియేటర్లో విడుదులైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. నిన్న జరిగిన ఈ మూవీ సక్సెస్ మీట్లో దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. ‘‘గౌతమ్ నంద’ మా అంచనాలు అందుకోలేకపోయింది. ‘సీటీమార్’తో గోపీచంద్ బాకీ తీర్చేసుకున్నాను’’ అన్నారు. చదవండి: బిగ్‌బాస్ అన్యాయం చేశాడని ఏడ్చేసిన సరయూ -
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించకున్న హీరో గోపీచంద్
-
పదేళ్లుగా నాకు ఈ స్థాయిలో హిట్ మూవీ రాలేదు : సంపత్ నంది
‘‘హీరో అభిమానులు హ్యాపీగా ఫీలయ్యే సినిమాను తీస్తే ఓ దర్శకుడు గర్వపడతాడు. ప్రస్తుతం నేను ఆ ఫీలింగ్‌లోనే ఉన్నాను. పదేళ్లుగా నాకీ స్థాయిలో హిట్ మూవీ రాలేదు. ‘సీటీమార్’ విజయంతో ఇటు గోపీచంద్ అభిమానుల దాహం కూడా తీరింది’’ అన్నారు సంపత్ నంది. గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో థియేట్రికల్ రిలీజ్లో పెద్ద హిట్ అని మా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇది ప్రేక్షకుల విజయం. ఈ సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు ఆందోళనకు గురయ్యాను. ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? వస్తే వారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? థియేట్రికల్ రిలీజ్ అంటూ రిస్క్ తీసుకుంటున్నామా? ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ మూడు రోజుల్లో... ప్రతిరోజూ నేను గంట కూడా నిద్రపోలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, నార్త్ ఇండియాలో కూడా షోలు పడ్డాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్క నెగటివ్ కామెంట్ కూడా వినపడలేదు. మార్నింగ్ షో కాస్త నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత కలెక్షన్స్ బాగా పుంజుకున్నాయి. (చదవండి: ‘సీటీమార్’మూవీ రివ్యూ) కబడ్డీ అనేది మాస్ గేమ్. ఈ గేమ్‌కు కమర్షియల్ అంశాలు జోడించి చెబితే ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకున్నాను. వాళ్లకు నచ్చింది. ఎమోషనల్గానూ కనెక్ట్ అయ్యారు. అందుకే ‘సీటీమార్’ది ప్రేక్షకుల విజయం. గతంలో గోపీచంద్‌తో నేను చేసిన ‘గౌతమ్ నంద’ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే డబ్బులు రాకపోయినా పేరొచ్చింది. ఇప్పుడు ‘సీటీమార్’కు పేరు, డబ్బులు వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లా డుతూ– ‘‘రచయితగా ‘బ్లాక్ రోజ్’, ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రాలకు కథలు అందించాను. కథల పరంగా నాకు పదేళ్ల వరకూ కంగారు లేదు. నా దగ్గర అన్ని కథలున్నాయి. నా డైరెక్షన్‌లోని తర్వాతి సినిమాను త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు. -
గోపిచంద్ కోసం విజిల్ వేసిన ప్రభాస్.. హ్యాపీగా ఉందని కామెంట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, గోపిచంద్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి గతంలో వర్షం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెరపై వీరు కలిసి కనిపించకపోయినా.. ఆఫ్ స్క్రీన్‌లో వీరి బంధం కొనసాగుతోంది. ఇటీవల గోపీచంద్ 'సీటీమార్' వినాయక చవితి సందర్భంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా చూసిన ప్రభాస్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రభాస్ సీటీమార్ సక్సెస్ గురించి అభినందిస్తూ ఓ విజిల్ బొమ్మను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దానికి క్యాప్షన్‌గా .."నా స్నేహితుడు గోపీచంద్ సీటీమార్ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. చాలా హ్యాపీగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ సీటీమార్. ఇలాగే విజయవంతంగా రన్ అవ్వాలని కోరుకుంటూ చిత్రబృందానికి అభినందనలు" అని అందులో తెలిపారు. కాగా చాలా కాలం తర్వాత గోపీచంద్ సంపత్ నందికి మంచి కమర్షియల్ హిట్ దక్కింది. ‘సీటీమార్’ సినిమా ముఖ్యంగా మాస్ సెంటర్లలో దూసుకుపోతోంది. తొలిరోజునే దాదాపు నాలుగు కోట్లకు వరకు వసూళ్లను సాధించింది. సెకండ్ కోవిడ్ తరువాత దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా సీటీమార్ రికార్డ్‌ను క్రియేట్ కూడా చేసింది. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) చదవండి: Sai Dharam Tej-Road Accident: సాయి రాష్‌గా వెళ్లే వ్యక్తి కాదు: నటుడు శ్రీకాంత్ -
‘సీటీమార్’మూవీ రివ్యూ
టైటిల్ : సీటీమార్ నటీనటులు : గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి దర్శకుడు: సంపత్ నంది సంగీతం : మణిశర్మ సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో మ్యాచోస్టార్ గోపిచంద్ ఒకరు. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్.. ఇటీవల కాలంలో రొటీన్ సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’అని టైటిల్ పెట్టడం, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను గోపిచంద్ అందుకున్నాడా? ‘సీటీమార్’సినిమాకు ప్రేక్షకులు సీటీలు కొట్టారా లేదా? రివ్యూలో చూద్దాం. ‘సీటీమార్’ కథేంటంటే..? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపిచంద్) స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగం పొందుతాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన గ్రామంలోని ఆడపిల్లలకు కబడ్డీ కోచింగ్ ఇస్తుంటాడు. వారిని ఎలాగైనా నేషనల్ పోటీల్లో గెలిపించాలని తపన పడతాడు. కప్పు కొట్టి గ్రామంలోని పాఠశాలను మూతపడకుండా చేయాలనేది అతని లక్ష్యం. అనుకున్నట్లే కార్తీక్ టీమ్ నేషనల్ పోటీలకు ఎంపికవుతుంది. కట్‌చేస్తే..గేమ్ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్తీక్ టీమ్‌లోని ఆడపిల్లలు కిడ్నాప్‌నకు గురవుతారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి కార్తీక్‌కి ఎలాంటి సాయం చేసింది. నేషనల్ కప్పు కొట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్న కార్తీక్ ఆశయం నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే..? కబడ్డీ కోచ్‌గా గోపిచంద్ అదరగొట్టేశాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా మెప్పించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్‌గా దిగంగన సూర్యవంశీ చక్కగా నటించింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా జీవించేశాడు. తెరపై చాలా క్రూరంగా కనిపించాడు. హీరో అక్కగా భూమిక, పోలీసు అధికారిగా రెహమాన్ ఫర్వాలేదనిపించారు. గ్రామ ప్రెసిడెంట్‌గా రావురమేశ్ మరోసారి తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. ఆయన చేసే సీరియస్ కామెడీకి, పంచులకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎలా ఉందంటే.. గోపిచంద్ తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం‘సీటీమార్’. అయితే దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేసి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మలిచాడు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రథమార్థంలో ప్రగతి, అన్నపూర్ణమ్మల గ్యాంగ్.. టీవీ యాంకర్ దిగంగన పెళ్లిని చెడగొట్టే సీన్ అయితే థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్‌కి నవ్వని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సెకండాఫ్‌లో ఇలాంటి కామెడీ లేకపోవడం, కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా రోటీన్‌గా ఉండడం సినిమాకు మైనస్. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అందుకే ఓటీటీలో రిలీజ్ చేయలేదు
‘‘ఓటీటీల్లో సినిమాను విడుదల చేయడం అనేది ఆయా నిర్మాతల పరిస్థితిని బట్టి ఉంటుంది. సినిమా కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుంటే వారు మాత్రం ఏం చేస్తారు? ఓటీటీ అనేది ఒక అడ్వాంటేజ్. భవిష్యత్‌లో ఓటీటీకి ఇంకా మంచి ఆదరణ ఉంటుంది. అయితే థియేటర్స్ అనేవి జీవితాంతం ఉంటాయి’’ అని గోపీచంద్ అన్నారు. ‘గౌతమ్ నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్– డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్గా నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతున్న సందర్భంగా గోపీచంద్ చెప్పిన విశేషాలు... ► ‘గౌతమ్ నంద’ చిత్రం మేం అనుకున్నంత ప్రేక్షకాదరణ పొందలేదు. దానికి ఎన్నో కారణాలున్నాయి. ఆ సమయంలోనే సంపత్ నందితో మరో సినిమా చేస్తానని చెప్పాను. ‘సీటీమార్’ కథకంటే ముందు విద్యా వ్యవస్థ నేపథ్యంలో సంపత్ ఓ కథ చెప్పాడు. అయితే ఇప్పుడప్పుడే సందేశాత్మక చిత్రం వద్దని, వేరే కథతో చేద్దామని చెప్పాను. ఆ తర్వాత ‘సీటీమార్’ కథ రాసుకొచ్చాడు.. బాగా నచ్చడంతో చేశాను. ► తెలుగులో పురుషుల కబడ్డీ నేపథ్యంలో గతంలో ‘భీమిలీ కబడ్డీ జట్టు, కబడ్డీ కబడ్డీ’ వంటి చిత్రాలు వచ్చాయి. అయితే మా సినిమా మహిళా కబడ్డీ నేపథ్యంలో ఉంటుంది. స్పోర్ట్స్ ఫిల్మ్‌కి కమర్షియల్ అంశాలు యాడ్ చేశాం. సిస్టర్ సెంటి మెంట్, భావోద్వేగాలతో కూడిన సీన్స్ కూడా ఉన్నాయి. ► ‘సీటీమార్’ కథ నాకు కొత్తగా అనిపించింది. పైగా స్పోర్ట్స్ నేపథ్యంలో నేను ఇప్పటివరకూ సినిమా చేయలేదు. ఈ సినిమాలోని కబడ్డీ జట్టులో నటించిన 12 మందిలో నలుగురు నిజమైన కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. వారు జాతీయ స్థాయికి రావడానికి పడిన కష్టం, అనుభవాలు చెబుతుంటే పాపం అనిపించింది. జట్టులోని మిగిలిన 8 మందికి 3 నెలలు కబడ్డీలో శిక్షణ ఇచ్చారు.. ప్రాక్టీస్‌లో మోకాళ్లకు దెబ్బలు తగిలినా అంకితభావంతో చేశారు. ► ఈ చిత్రంలో కోచ్లకి ఓ గోల్ ఉంటుంది. తన జట్టు ద్వారా ఆ గోల్‌ని ఎలా రీచ్ అయ్యారన్నదే ‘సీటీమార్’ కథ. 2019 డిసెంబరులో ‘సీటీమార్’ చిత్రం ప్రారంభమైంది. 2020 వేసవిలో విడుదల చేద్దామనుకున్నాం. కరోనా మొదటి విడత లాక్డౌన్ వచ్చింది. ఆ తర్వాత 2021 ఏప్రిల్ రిలీజ్‌కి ప్లాన్ చేశాం.. కానీ ఇప్పటికి కుదిరింది. మా చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాని థియేటర్స్‌లో చూస్తే బాగుంటుందనే ఓటీటీకి వెళ్లలేదు. ప్రేక్షకులు కూడా ప్రస్తుతం థియేటర్లకు బాగానే వస్తున్నారు. ► మణిశర్మగారితో నేను 7 సినిమాలు చేస్తే వాటిల్లో 6 హిట్స్ ఉన్నాయి. ‘సీటీమార్’కి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారాయన. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాను. అలాగే శ్రీవాస్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాను. -
ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!
లాక్డౌన్లో షూటింగ్‌లు, థియేటర్లు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు టైంపాస్ లేక ఇబ్బందులు పడ్డారు. ఓటీటీ వేదిక సినిమాలు చూస్తూ అలా గడిపేశారంతా. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే మెల్లిమెల్లిగా థియేటర్లు, షూటింగ్‌లు తిరిగి పున: ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోగా మళ్లీ సినిమాల సందడి మొదలైంది. అయితే సెకండ్ వేవ్ తర్వాత తెరచుకున్న థియేటర్లో విడుదలైన సినిమాలేవి అంతగా అలరించలేకపోయాయి. ఇటీవల పెద్ద సినిమాల హీరోలు తమ షూటింగ్‌లను పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం అవి విడుదలకు సిద్దమయ్యాయి. దీంతో ఈ వారం వినాయక చవితికి ప్రేక్షకులకు బోలేడంత వినోదం పంచేందుకు థియేటర్లు, ఓటీటీల వేదిక భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేవో ఓసారి చూద్దాం రండి.. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు: థియేటర్లో ఈలల వేయించేందుకే వస్తున్న ‘సీటీమార్’ హీరో గోపిచంద్-తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది దర్శకత్వంతో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సిటీమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లో విడుదలయ్యేందుకు సిద్దమైంది. ఇప్పటికే వేసవి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. వినాయక చవితి సందర్భంగా సందడి చేసేందుకు రానుంది. ఇందులో గోపీచంద్ ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా, తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమా, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్ ‘తలైవి’ దివగంత నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందింన ‘తలైవి’ చిత్రం కూడా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో కంగనా జయలలితగా కనిపించనుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, ఆయన భార్యగా మధుబాల అలరించనున్నారు. జయలలిత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్‌కు ఎలా దగ్గరయ్యారు? తమిళ రాజకీయాల్లో ప్రవేశించి ఏవిధంగా చక్రం తిప్పారన్న విషయాలను బిగ్‌స్రీన్‌పై చూడోచ్చు. చదవండి: ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి-శృతీ హాసన్ ‘లాభం’ విజయ్ సేతుపతి-శృతి హాసన్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం ‘లాభం’. సెప్టెంబరు 9న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం అదే పేరుతో తెలుగులో కూడా విడుదల కానుంది. ఇందులో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి రైతులకు మద్ధుతుగా నిలబడతాడు. పి.అరుముగకుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఇమ్రాన్ సంగీతం అందించారు. జాతీయ రహదారి లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంలో తెరెక్కించిన సినిమా ‘జాతీయ రహదారి’. ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహిచిన దర్శకుడు నరసింహ నంది ఈ మూవీని రూపొందించాడు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్లో విడుదల కానుంది. ఓటీటీ వేదికగా అలరించున్న చిత్రాలు, సిరీస్‌లు: నాని ‘టక్ జగదీష్’ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, కుటుంబ కథా చిత్రం టక్ జగదీష్. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికులు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇటీవల ఈ సినిమా విడుదల విషయంలో వివాదంలో నెలకొన్న సంగతి తెలిసిందే. థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరకు ఓటీటీ బాట పట్టింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో జగపతి బాబు, నాజర్, నరేశ్, రావురమేశ్, రోహిణిలు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. అవికా గోర్, రాహుల్ రామకృష్ణ ‘నెట్’ రాహుల్ రామకృష్ణ, అవికాగోర్‌లు లీడ్ రోల్ నటించిన చిత్రం ‘నెట్’. భార్గవ్ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో లక్ష్మణ్ అనే పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించనుండగా... అవికాగోర్.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించింది. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్ లైఫ్‌ని వీక్షించిన రాహుల్ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్’ చూడాల్సిందే. చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు' ముంబై డైరీస్ 26/11 ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా మరో కొత్త సిరీస్ అలరించనుంది. ‘ముంబై డైరీస్ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్ థ్రిల్లర్ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. కొంకణ సేన్ శర్మ, మోహిత్ రైనా, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్ అడ్వాణీ, నిఖిల్ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల్లో సీరియల్ సిరీస్ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్ ఫోర్స్ ఏవిధంగా పనిచేసిందనే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరక్కించారు దర్శకుడు. విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ విజయ్ సేతుపతి మరో చిత్రం తుగ్లక్ దర్భార్ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో ప్రసారం కానుంది. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన తమిళ పొలిటికల్ మూవీ ‘తుగ్లక్ దర్బార్’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్ కథానాయికలు. దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ► లూలా రిచ్ (సెప్టెంబర్ 10) ఆహా! ► ద బేకర్ అండ్ ద బ్యూటీ ( సెప్టెంబర్ 10) ► మహాగణేశా ( సెప్టెంబర్ 10) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ► అమెరికన్ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్ 08) నెట్‌ఫ్లిక్స్ ► అన్‌టోల్డ్: బ్రేకింగ్ పాయింట్ (సెప్టెంబర్ 07) ► ఇన్ టు ది నైట్ (సెప్టెంబర్ 08) ► బ్లడ్ బ్రదర్స్ (సెప్టెంబర్ 09) ►మెటల్ షాప్ మాస్టర్స్ (సెప్టెంబర్ 10) ► లూసిఫర్ (సెప్టెంబర్ 10) ► కేట్ (సెప్టెంబర్ 10) జీ 5 ► డిక్కీ లూనా (సెప్టెంబర్ 10) ► క్యా మేరీ సోనమ్ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్ 10) వూట్(VOOT) ► క్యాండీ (సెప్టెంబర్ 08) -
ఫ్యాన్స్‌తో ఈలలు కొట్టిస్తున్న సీటీమార్ ట్రైలర్
Seetimaarr Trailer: హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్‌గా నటించిన చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఒక ఊరి నుంచి 8 కబడ్డీ ఆటగాళ్లను పంపించడం కుదరదు అని ఓ వ్యక్తి అడ్డు చెపుతుండగా.. 'రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు, రూట్ లభించి ఆలోచించి పంపిస్తే పేపర్లో వస్తారు' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 'మన దేశంలో మగాళ్లు కనీసం అరవయ్యేళ్లు బతికి చచ్చిపోతున్నారు, ఆడాళ్లు కూడా అరవయ్యేళ్లు బతుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చచ్చిపోతున్నారు..' అని చెప్పే డైలాగ్ జనాలకు కనెక్ట్ అవుతుంది. మొత్తానికి తన టీమ్‌ను గెలిపించడానికి ఎంతకైనా తెగించడానికి రెడీ అయ్యాడీ కబడ్డీ కోచ్. మరి వీరి కూత వినాలన్నా, కబడ్డీ ఆట చూడాలన్నా సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే. -
సీటీమార్ మూవీ రిలీజ్ డేట్ ఖారారు
స్పోర్ట్స్ నేపథ్యంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించారు. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మంగళవారం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ.. ‘గోపీచంద్, తమన్నా ఇప్పటి వరకు చేయని పాత్రల్లో అద్భుతంగా నటించారు. మణిశర్మ మ్యూజిక్, సౌందర్ రాజన్ కెమెరా సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్గా మిక్స్ చేసి సంపత్ చక్కగా తెరకెక్కించారు’ అని పేర్కొన్నారు. -
వినాయక చవితికి థియేటర్లో సందడి చేసే భారీ చిత్రాలివే!
కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా 9 నెలల పాటు సినీ పరిశ్రమతో పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఆ తర్వాత పాక్షికంగా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రజలు బిగ్స్క్రిన్పై సినిమా చూసేందుకు భయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి పండగలసందర్భంగా విడుదలయ్యే సినిమాల సందడి లేకుండా పోయింది. దీంతో ఓటీటీలోనే సినిమాలు చూడ్సాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే థియేటర్లు మెల్లిగా తెరుచుకుంటున్నాయి. వరసగా సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత మళ్లీ పండగ కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగశౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఈ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాగా ఇటీవల టక్ జగదీశ్, సీటీమార్, లవ్‌స్టోరీతో పాటు మరిన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు అయోమంలో పడ్డారు. ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్ని కూడా థియేటర్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. -
గోపీచంద్‘సీటీమార్’ విడుదల వాయిదా.. కారణం ఇదే
గోపీచంద్ ఆట వాయిదా పడింది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. ఇందులో తమన్నా హీరోయిన్గా నటించారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రలు పోషించారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ పాత్రలో తమన్నా నటించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదు. ఆడియన్స్‌కు థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే మా సినిమాను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబందం పేర్కొంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. -
హీటెక్కిస్తున్న‘సీటీమార్’ పెప్సీ ఆంటీ సాంగ్
గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్‌తో పాటు ‘జ్వాలారెడ్డి’పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆదివారం ఈ సినిమా నుంచి ఐటమ్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. 'నా పేరే పెప్సీ ఆంటీ... నా పెళ్ళికి నేనే యాంటీ...' అంటూ సాగే ఈ పాటను దర్శకుడు సంపత్ నంది రాశారు. కీర్తన, శర్మ ఆలపించారు. క్రాక్ సినిమాలో 'భూం బద్దల్' సాంగ్‌తో ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తెచ్చుకున్న అప్సర రాణి.. ఈ పాటకు స్టెప్పులేసింది. 'మా అమ్మకు పెళ్ళి కాకముందే కడుపులో పడ్డాను... నెలలు నిండక ముందే భూమ్మీద పడ్డాను.... బారసాల కాకముందే బోర్లా పడ్డాను... టెన్త్ లోకి రాగానే వాల్ జంప్ లే చేశాను.... ఇంటర్ లోకి రాగానే బోయ్ ఫ్రెండ్ నే మార్చాను.... డిగ్రీ లోకి రాగానే దుకాణమే తెరిసేశాను... పిజీ లోకి రాగానే ప్రపంచమే చూశాను' లాంటి మాస్ పదాలకు అప్సర గ్లామర్ షో యాడ్ కావడంతో ఈ మాస్ సాంగ్ యూత్‌లో బలంగా దూసుకెళ్లింది. ఈ పాటకు మణిశర్మ బాణీ ఓ రేంజులోనే కుదిరిందని చెప్పాలి. గత కొంతకాలంగా గోపీచంద్‌కి మంచి హిట్ దక్కడం లేదు. అయితే సీటీమార్ సినిమాతో మళ్ళీ భారీ హిట్ అందుకొని ఫాంలోకి వస్తాడన్న నమ్మకంగా ఉన్నాడట గోపీచంద్. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అయితే సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ‘పెప్సీ ఆంటి’ మాస్ సాంగ్ ‘సిటీమార్’కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి. -
తెలంగాణ యాసలో తమ్మన్నా డబ్బింగ్!
తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడారు. ఎలా మాట్లాడారో వినాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసిన తమన్నా మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ‘సీటీమార్’లో జ్వాలారెడ్డి పాత్రకు అవకాశం ఇచ్చినందుకు సంపత్‌కి థ్యాంక్స్. ఇందులో నా పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది’’ అన్నారు. డబ్బింగ్ పూర్తయిందోచ్ అంటూ ఫుల్ జోష్‌గా ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.