
తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడారు. ఎలా మాట్లాడారో వినాలంటే ఏప్రిల్ 2 వరకూ ఆగాల్సిందే. గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీటీమార్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకానుంది. ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసిన తమన్నా మాట్లాడుతూ –‘‘నన్ను నమ్మి ‘సీటీమార్’లో జ్వాలారెడ్డి పాత్రకు అవకాశం ఇచ్చినందుకు సంపత్‌కి థ్యాంక్స్. ఇందులో నా పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది’’ అన్నారు. డబ్బింగ్ పూర్తయిందోచ్ అంటూ ఫుల్ జోష్‌గా ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.