Gopichand Seetimaarr Movie Video Goes Viral - Sakshi
Sakshi News home page

Seetimaarr Making Video: ‘సీటీమార్‌’ మూవీ మేకింగ్‌ వీడియో చూశారా?

Published Fri, Sep 17 2021 3:19 PM | Last Updated on Fri, Sep 17 2021 8:04 PM

Seetimaarr Movie Making Video Goes Viral - Sakshi

Seetimaarr Movie Making Video: కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేట‌ర్స్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన చిత్రం ‘సీటీమార్’.సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి  బాక్సాఫీసుకు మంచి  వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమాలో టాలీవుడుకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. భూమిక చావ్లా, రెహమాన్, రావు రమేష్, ప్రగతి వంటి ప్రముఖులు ఈ సినిమాలో భాగస్వామ్యమయ్యారు. ఇక వర్మ స్కూల్ నుంచి వచ్చిన అప్సరా రాణి ‘పెప్సీ ఆంటీ’ అనే ఐటెం సాంగ్‌తో దుమ్ముదులిపింది. ప్రారంభం నుంచే సీటీమార్‌పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. 

చదవండి: బిగ్‌బాస్‌ : ప్రియాంక సింగ్‌కు కన్నడ నటి మద్దతు

సంపత్‌ నంది రూపొందించిన ఈ సినిమాను పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేస్తూ ఇటీవల సెల‌బ్రేష‌న్స్ కూడా జ‌రుపుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ మేకింగ్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. సీటీమార్‌ మూవీ ప్రారంభం నుంచి చివరి వ‌ర‌కు షూటింగ్ ఎలా జ‌రిగింద‌నేది వీడియో రూపంలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

చదవండి: ‘సీటీమార్‌’ ఆ కొరత తీర్చింది: గోపీచంద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement