
మన దేశంలో మగాళ్లు కనీసం అరవయ్యేళ్లు బతికి చచ్చిపోతున్నారు, ఆడాళ్లు కూడా అరవయ్యేళ్లు బతుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చచ్చిపోతున్నారు...
Seetimaarr Trailer: హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్‌గా నటించిన చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. భూమిక, సూర్యవంశీ ముఖ్య పాత్రలు పోషించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.
ఒక ఊరి నుంచి 8 కబడ్డీ ఆటగాళ్లను పంపించడం కుదరదు అని ఓ వ్యక్తి అడ్డు చెపుతుండగా.. 'రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు, రూట్ లభించి ఆలోచించి పంపిస్తే పేపర్‌లో వస్తారు' అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. 'మన దేశంలో మగాళ్లు కనీసం అరవయ్యేళ్లు బతికి చచ్చిపోతున్నారు, ఆడాళ్లు కూడా అరవయ్యేళ్లు బతుకుతున్నారు.. కానీ 20 ఏళ్లకే చచ్చిపోతున్నారు..' అని చెప్పే డైలాగ్ జనాలకు కనెక్ట్ అవుతుంది. మొత్తానికి తన టీమ్‌ను గెలిపించడానికి ఎంతకైనా తెగించడానికి రెడీ అయ్యాడీ కబడ్డీ కోచ్. మరి వీరి కూత వినాలన్నా, కబడ్డీ ఆట చూడాలన్నా సెప్టెంబర్ 10 వరకు ఆగాల్సిందే.