
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా..నాగసాధు పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 22న కాశీ మహా కుంభమేళాలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ కానున్న మొట్టమొదటి టీజర్ 'ఓదెల 2' కావడం విశేషం.
ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో నాగసాధు గా కనిపించిన తమన్నా లుక్ డివైన్ వైబ్ తో పవర్ ఫుల్ గా ఉంది.ఓదెల మల్లన్న స్వామి తన గ్రామ ప్రజలను దుష్ట శక్తుల నుంచి ఏ విధంగా కాపాడారు? అన్నదే ఈ చిత్రం కథాంశం. సంపత్ నంది ఈ సినిమాకు కథ అందించగా, అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చాడు.
Comments
Please login to add a commentAdd a comment