
తమన్నా లీడ్ రోల్‌లో తెరకెక్కించిన చిత్రం ఓదెల-2. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హారర్ ఫాంటసీగా తీసిన ఈ మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా.. సంపత్ నంది కథ అందించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన సంపత్ నందికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
మీ సినిమాల్లో ఫస్ట్ నైట్ సీన్ ఎక్కడో పంట పొలాల్లో పెడుతూ ఉంటారు.. అది మీ రియల్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వచ్చిందా? అని ఆయనను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాస్తా ఆశ్చర్యానికి గురైన సంపత్ నంది సమాధానమిచ్చారు. తనకు అలాంటి అనుభవమేమి లేదని నవ్వుతూ చెప్పారు. సంక్రాంతి కోళ్ల పందాల గురించి విన్నారు కదా? అలా ఒక్కో చోట ఒక రకమైన విధానం ఉంటుందని సంపత్ నంది అన్నారు.
మాకు మొక్కజొన్న పొలాల్లో మంచెలు ఉండేవని సంపత్ నంది తెలిపారు. అక్కడే పైకి ఎక్కి కూర్చోని తినడం చాలా సరదాగా ఉండేదని అన్నారు. ఇలాంటివీ చూసినప్పుడు చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంటుందని సంపత్ నంది బదులిచ్చారు. అయినా ఇలాంటి వింత ప్రశ్న ఎదురు కావడం సంపత్ నందికి బహుశా మొదటిసారి కావొచ్చు.