List Of Theatre And OTT Releases This Week Vinayaka Chavithi - Sakshi
Sakshi News home page

OTT: థియేటర్లో తలైవి, ఓటీటీలో టక్‌ జగదీష్‌, ప్రేక్షకులకు పండగే

Published Mon, Sep 6 2021 3:42 PM | Last Updated on Mon, Sep 6 2021 5:33 PM

Theatres And OTT Release Movies List In This Week For Vinayaka Chavithi - Sakshi

లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు, థియేటర్లు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు టైంపాస్‌ లేక ఇబ్బందులు పడ్డారు. ఓటీటీ వేదిక సినిమాలు చూస్తూ అలా గడిపేశారంతా. ఇక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే మెల్లిమెల్లిగా థియేటర్లు, షూటింగ్‌లు తిరిగి పున: ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోగా మళ్లీ సినిమాల సందడి మొదలైంది. అయితే సెకండ్‌ వేవ్‌ తర్వాత తెరచుకున్న థియేటర్లో విడుదలైన సినిమాలేవి అంతగా అలరించలేకపోయాయి. ఇటీవల పెద్ద సినిమాల హీరోలు తమ షూటింగ్‌లను పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం అవి విడుదలకు సిద్దమయ్యాయి. దీంతో ఈ వారం వినాయక చవితికి ప్రేక్షకులకు బోలేడంత వినోదం పంచేందుకు థియేటర్లు, ఓటీటీల వేదిక భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఆ సినిమాలేవో ఓసారి చూద్దాం రండి..

థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు:

థియేటర్లో ఈలల వేయించేందుకే వస్తున్న ‘సీటీమార్‌’


హీరో గోపిచంద్‌-తమన్నా ప్రధాన పాత్రలో సంపత్‌ నంది దర్శకత్వంతో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘సిటీమార్‌’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 10న థియేటర్లో విడుదలయ్యేందుకు సిద్దమైంది. ఇప్పటికే వేసవి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. వినాయక చవితి సందర్భంగా సందడి చేసేందుకు రానుంది. ఇందులో గోపీచంద్ ఆంధ్రా ఫీమేల్‌ కబడ్డీ టీం కోచ్‌గా, తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీం కోచ్‌గా  వ్యవహరిస్తున్నారు. 

సినిమా, రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్‌ ‘తలైవి’


దివ‌గంత న‌టి జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా రూపొందింన ‘త‌లైవి’ చిత్రం కూడా సెప్టెంబ‌ర్ 10న తెలుగు, తమిళం భాషల్లో థియేటర్లో విడుదల కానుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్రమాలు జ‌రుపుకుంటుంది. ఇందులో కంగనా జయలలితగా కనిపించనుండగా, ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌ స్వామి, ఆయన భార్యగా మధుబాల అలరించనున్నారు. జయలలిత తమిళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్‌కు ఎలా దగ్గరయ్యారు? తమిళ రాజకీయాల్లో ప్రవేశించి ఏవిధంగా చక్రం తిప్పారన్న విషయాలను బిగ్‌స్రీన్‌పై చూడోచ్చు. 

చదవండి: ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్‌ సేతుపతి

విజయ్‌ సేతుపతి-శృతీ హాసన్‌ ‘లాభం’


విజయ్‌ సేతుపతి-శృతి హాసన్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం ‘లాభం’. సెప్టెంబరు 9న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌పీ జననాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం అదే పేరుతో తెలుగులో కూడా విడుదల కానుంది. ఇందులో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో విజయ్‌ సేతుపతి రైతులకు మద్ధుతుగా నిలబడతాడు.  పి.అరుముగకుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు ఇమ్రాన్‌ సంగీతం అందించారు.

జాతీయ రహదారి
లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంలో తెరెక్కించిన సినిమా ‘జాతీయ రహదారి’. ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’, ‘లజ్జ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహిచిన దర్శకుడు నరసింహ నంది ఈ మూవీని రూపొందించాడు. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్‌లో విడుదల కానుంది. 

ఓటీటీ వేదికగా అలరించున్న చిత్రాలు, సిరీస్‌లు:

నాని ‘టక్‌ జగదీష్‌’


నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం టక్‌ జగదీష్‌. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికులు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్‌ 10న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఇటీవల ఈ సినిమా విడుదల విషయంలో వివాదంలో నెలకొన్న సంగతి తెలిసిందే. థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరకు ఓటీటీ బాట పట్టింది.  షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో జగపతి బాబు, నాజర్‌, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణిలు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. 

అవికా గోర్‌, రాహుల్‌ రామకృష్ణ ‘నెట్‌’


రాహుల్‌ రామకృష్ణ, అవికాగోర్‌లు లీడ్‌ రోల్‌ నటించిన చిత్రం ‘నెట్‌’. భార్గవ్‌ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో లక్ష్మణ్‌ అనే పాత్రలో రాహుల్‌ రామకృష్ణ కనిపించనుండగా... అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించింది. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే ‘నెట్‌’ చూడాల్సిందే.

చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు'

ముంబై డైరీస్‌ 26/11 
ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా మరో కొత్త సిరీస్‌ అలరించనుంది. ‘ముంబై డైరీస్‌ 26/11’ పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్‌ థ్రిల్లర్‌ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కొంకణ సేన్‌ శర్మ, మోహిత్‌ రైనా, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్‌ అడ్వాణీ, నిఖిల్‌ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌ల్లో సీరియల్‌ సిరీస్‌ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్‌ ఫోర్స్‌ ఏవిధంగా పనిచేసిందనే నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరక్కించారు దర్శకుడు. 

విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’


విజయ్‌ సేతుపతి మరో చిత్రం తుగ్లక్‌ దర్భార్‌ వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో ప్రసారం కానుంది. ఆయన లీడ్‌ రోల్‌లో తెరకెక్కిన తమిళ పొలిటికల్‌ మూవీ ‘తుగ్లక్‌ దర్బార్‌’. రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌ కథానాయికలు. దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్‌ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

► లూలా రిచ్‌  (సెప్టెంబర్‌ 10)

ఆహా!

 ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ ( సెప్టెంబర్‌ 10)

 మహాగణేశా ( సెప్టెంబర్‌ 10)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

► అమెరికన్‌ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్‌ 08)

నెట్‌ఫ్లిక్స్‌

 అన్‌టోల్డ్‌: బ్రేకింగ్‌ పాయింట్‌ (సెప్టెంబర్‌ 07)

 ఇన్‌ టు ది నైట్‌ (సెప్టెంబర్‌ 08)

 బ్లడ్‌ బ్రదర్స్‌ (సెప్టెంబర్‌ 09)

మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌ (సెప్టెంబర్‌ 10)

 లూసిఫర్‌ (సెప్టెంబర్‌ 10)

► కేట్‌  (సెప్టెంబర్‌ 10)

జీ 5

 డిక్కీ లూనా (సెప్టెంబర్‌ 10)

 క్యా మేరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్‌ 10)

వూట్‌(VOOT)

 క్యాండీ (సెప్టెంబర్‌ 08)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement