బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం తలైవి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న ఈ మూవీ థియేటర్లో విడుదల కానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ మూవీ ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని, ఏదేమైన తమ మూవీని థియేటర్లోనే విడుదల చేస్తున్నట్లు కంగనాతో పాటు మేకర్స్ కూడా తేల్చిచెప్పారు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘తలైవి’ ఖచ్చితంగా పెద్ద స్క్రీన్‌పై చూడాల్సిన మూవీ అని అన్నారు.
చదవండి: ‘తలైవి’ విడుదల తేదీ వచ్చేసింది, అప్పడే థియేటర్లోకి
అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా తలైవి విడదుల చేయాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. కాగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూతపడిన సినిమా థియేటర్లు పార్శికంగా తెరుచుకున్నాయి. ఇక మహారాష్ట్ర, ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు పూర్తిగా తెరుచుకోనేలేదు. ఈ నేపథ్యంలో తలైవి థియేటర్లో విడదులై అనంతరం నేరుగా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలతో మేకర్స్ భారీగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న జీవితా రాజశేఖర్, హేమ
కానీ థియేటర్లో విడుదలైన 4 వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో తలైవి విడుదల కానున్నట్లు వినికిడి. ఈ తాజా బజ్ ప్రకారం ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైంలో తలైవి మూవీని విడుదల చేసేందుకు 55 కోట్ల రూపాయల ఒప్పందం కుదర్చుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. ఇక దక్షిణాన 50 శాతం సిట్టింగ్‌తో థియేటర్లు ఒపెన్ అయ్యాయి. అందువల్లే ‘తలైవి’ థియేటర్లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఓటీటీ సంస్థలతో మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారట.
Comments
Please login to add a commentAdd a comment