
స్పోర్ట్స్ నేపథ్యంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా తమన్నా నటించారు. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మంగళవారం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ.. ‘గోపీచంద్, తమన్నా ఇప్పటి వరకు చేయని పాత్రల్లో అద్భుతంగా నటించారు. మణిశర్మ మ్యూజిక్, సౌందర్ రాజన్ కెమెరా సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసి సంపత్ చక్కగా తెరకెక్కించారు’ అని పేర్కొన్నారు.