బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై తీస్తున్న సినిమా 'సౌండ్ పార్టీ'. హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది.
(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రుతిహాసన్ కోపం.. వాళ్లపై కౌంటర్!?)
తాజాగా ప్రసాద్ ల్యాబ్స్‌లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా 'సౌండ్ పార్టీ' టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సౌండ్ పార్టీ' టీజర్ బాగుంది. మోహిత్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుంది' అని అన్నారు.
(ఇదీ చదవండి: Pizza 3 Review: 'పిజ్జా 3' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment