సౌత్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం..! | Gopichand Skydive In Gowtham Nanda | Sakshi
Sakshi News home page

సౌత్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం..!

Published Tue, Apr 11 2017 10:11 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

Gopichand Skydive In Gowtham Nanda

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ చేస్తున్న తాజా చిత్రం గౌతమ్ నంద. మాస్ ఇమేజ్ ఉన్న గోపిచంద్ తొలిసారిగా ఓ స్టైలిష్ పాత్రలో కనిపిస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.

యాక్షన్ సీన్స్ చేయటంలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న గోపిచంద్, గౌతమ్ నంద సినిమా కోసం ఓ రిస్కీ స్టంట్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి సారిగా ఓ పూర్తి స్థాయి స్కైడైవ్ సీక్వెన్స్ను గౌతమ్ నంద కోసం షూట్ చేసినట్టుగా తెలిపారు. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా తెలిపిన దర్శకుడు సంపత్ నంది, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో స్కైడైవ్కు రెడీ అవుతున్న గోపిచంద్ ఫోటోలను పోస్ట్ చేశాడు. అయితే ఈ సీక్వెన్స్ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్లో వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం దుబాయ్లో రాజు సుందరం కొరియోగ్రఫిలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ను షూట్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement