Thriller Movie Actress Apsara Rani Special Song In Gopichand Seetimaarr Movie - Sakshi
Sakshi News home page

Seetimaarr: అప్సర రాణి స్పెషల్‌ సాంగ్‌

Published Fri, Feb 19 2021 9:58 AM | Last Updated on Fri, Feb 19 2021 10:18 AM

Apsara Rani Special Song In Seeti Maar - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన వెబ్‌ ఫిల్మ్‌ ‘థ్రిల్లర్‌’తో పాపులారిటీ సంపాదించుకున్నారు అప్సరా రాణి. ఆ తర్వాత రవితేజ ‘క్రాక్‌’లో ‘భూమ్‌ బద్దల్‌...’ అంటూ ఓ స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్స్‌ వేశారామె. ఈ పాట మంచి హిట్‌ అయింది. తాజాగా మరో స్పెషల్‌ సాంగ్‌కి రెడీ అవుతున్నారు అప్సర. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీటీమార్‌’. ఈ సినిమాలో అప్సరా రాణి స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్నారు. ‘‘మా సీటీమార్‌లో ఓ స్పెషల్‌ పటాకా సాంగ్‌లో చేస్తున్నారు అప్సర. ఈ పాట బొంభాట్‌గా ఉంటుంది’’ అని ట్వీట్‌ చేశారు సంపత్‌ నంది. ‘సీటీమార్‌’ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

చదవండి: శృంగార సన్నివేశం.. హీరోను చూసి భయపడ్డాను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement