'గౌతమ్ నంద'గా గోపిచంద్ | Gopichand, Sampath Nandi GAUTHAM NANDA First look | Sakshi
Sakshi News home page

'గౌతమ్ నంద'గా గోపిచంద్

Published Sat, Feb 4 2017 11:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

'గౌతమ్ నంద'గా గోపిచంద్

'గౌతమ్ నంద'గా గోపిచంద్

యాక్షన్ హీరో గోపిచంద్, మాస్ సినిమాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ లుక్లో మాత్రమే కనిపించిన గోపిచంద్, ఈ సినిమాలో స్టైలిష్ లుక్లో అలరించనున్నాడు.

శ్రీ బాలజీ సినీ మీడియా బ్యానర్పై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గోపిచంద్ సరసన హన్సిక, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో గౌతమ్ నంద మూవీ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement