నవంబర్ నుంచి గబ్బర్సింగ్ 2 | 'Gabbar Singh 2' may start from November | Sakshi
Sakshi News home page

నవంబర్ నుంచి గబ్బర్సింగ్ 2

Published Sat, Oct 11 2014 11:52 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

నవంబర్ నుంచి గబ్బర్సింగ్ 2 - Sakshi

నవంబర్ నుంచి గబ్బర్సింగ్ 2

పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బ్లాక్బస్టర్గా నిలిచిన 'గబ్బర్సింగ్' సినిమా సీక్వెల్ ఎప్పుడా ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నవంబర్ నుంచి గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభం కావచ్చని సినిమా దర్శకుడు సంపత్ నంది తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆలస్యం చేయడం ఇక మంచిది కాదని పవన్ భావిస్తుండటంతో దీన్ని వెంటనే చేపడుతున్నారు.

వాస్తవానికి కొంతకాలం ముందే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాలని భావించినా, పవన్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఇది ఆలస్యమైందని సంపత్ నంది అన్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా మొదలుపెడదామని పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పవన్ హిందీలో బాగా విజయవంతం అయిన 'ఓ మైగాడ్' రీమేక్ 'గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక గబ్బర్సింగ్2లో ఇంకా ఎవరెవరు నటిస్తారన్న విషయం త్వరలోనే తేలిపోతుంది. పవన్, అతడి స్నేహితుడు శరత్ మరార్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement