Gabbar Singh 2
-
గబ్బర్‌సింగ్ 2 నుండి డైరెక్టర్ బాబీ తప్పుకున్నాడా ?
-
గబ్బర్‌సింగ్-2లో ఛాన్స్ కొట్టేసిన కాజల్?
-
పడమటి కనుమల్లో... షూటింగ్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పవన్ కొత్త సినిమా ‘గబ్బర్‌సింగ్ 2’ రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైంది. పుణే సమీపంలో శుక్రవారం ఉదయం షూటింగ్ ప్రారంభించినట్లు నిర్మాత శరత్‌మరార్ ప్రకటించారు. రవితేజ ‘బలుపు’కు రచయితగా పనిచేసి, ‘పవర్’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన యువకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) తన రెండో చిత్రంగా ‘గబ్బర్‌సింగ్ 2’కు మెగాఫోన్ పట్టారు. నిజానికి, చాలా రోజుల క్రితమే లాంఛనంగా ముహూర్తపు సన్నివేశం చిత్రీకరించారు. ఆ తరువాత తుది స్క్రిప్టు ఖరారు చేయడంలో ఆలస్యమైంది. ఇన్నాళ్ళకు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంతో ‘‘యూనిట్ సభ్యులందరూ ఎగ్జైటెడ్‌గా, ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉన్నారు’’ అని శరత్ తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. అయితే, పవన్ ఇంకా షూటింగ్లో పాల్గొనలేదనీ, త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారనీ ఆయన తెలిపారు. ‘‘దర్శకుడు బాబీ సారథ్యంలో పని మొదలైంది. మహారాష్ట్రలోని మాల్శేజ్ ఘాట్స్ (పుణేకు దాదాపు 130 కిలోమీటర్ల దూరం)లో తుపాకీలు, గూండాలు, గుర్రాల మధ్య షూటింగ్‌కు శ్రీకారం చుట్టాం’’ అని శరత్ మరార్ తెలిపారు. పడమటి కనుమల్లో భాగమైన ప్రసిద్ధ మాల్శేజ్ ఘాట్స్‌లో చుట్టూ అందమైన లోయలు, పచ్చటి చెట్లు, జంతుజాలం కనిపిస్తాయి. ‘గబ్బర్ సింగ్2’ అన్న స్క్రిప్ట్ పేరుకు తగ్గట్లుగా (సినిమా పేరు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది) చిత్రీకరణ అక్కడే ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య గడ్డం పెంచిన పవన్ ఆ గెటప్‌లోనే కెమేరా ముందుకొస్తారా? చూడాలి. -
గడ్డంతో వస్తోన్న గబ్బర్
-
లోకల్ బ్యూటీకు ఛాన్స్ ఇచ్చిన పవన్
-
బాబీ దర్శకత్వంలో గబ్బర్‌సింగ్-2
‘గబ్బర్‌సింగ్’ చిత్రం హిందీ ‘దబాంగ్’ కథకు పునర్నిర్మాణమే అయినా.. కథానాయకుని పాత్ర చిత్రణ, సంభాషణలు పలికే తీరు, నడక, నడత... తదితర అంశాల్లో మాత్రం ‘గబ్బర్‌సింగ్’ చాలా కొత్తగా కనిపిస్తాడు. ఇందులో హీరో... ‘షోలే’ చిత్రంలోని విలన్ పాత్ర ‘గబ్బర్‌సింగ్’ను ఇష్టపడటం, ఆ పేరుతోనే చలామణీ అవుతూ, అలాగే ప్రవర్తిస్తూ, నిజమైన విలన్ల పాలిట విలన్‌గా మారడం, మధ్యలో వచ్చే అంత్యాక్షరి సన్నివేశం, చివరకు టైటిల్‌గా ‘గబ్బర్‌సింగ్’ అనే పేరును సూచించడం... ఇవన్నీ పవన్ ప్రేరణతో చేసినవే అని గతంలో ఆ సినిమా దర్శకుడు హరీశ్శంకరే చెప్పారు. ఆ కారక్టరైజేషన్పై ఉన్న మమకారంతో వెంటనే ‘గబ్బర్‌సింగ్-2’ ప్రకటించారు పవన్. దర్శకునిగా ‘రచ్చ’ఫేం సంపత్‌నందిని కూడా ఖరారు చేశారు. అయితే... ఈ కథ కోసం పవన్ ఎక్కువ సమయాన్ని తీసుకోవడం, మధ్యలో ఆయన రాజకీయ రంగప్రవేశం, తర్వాత ‘గోపాల గోపాల’ చిత్రం షూటింగ్‌తో బిజీ అవ్వడం వంటి కారణాల వల్ల సినిమా సెట్స్‌కి వెళ్లడానికి జాప్యం జరిగింది. ఈలోపు సంపత్‌నంది సొంత నిర్మాణ సంస్థను స్థాపించడం, దర్శకునిగా ఓ భారీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది. దాంతో ఈ చిత్ర దర్శకునిగా ‘పవర్’ఫేం కె.రవీంద్ర(బాబీ)ని పవన్ ఖరారు చేశారు. కథానాయిక కోసం ఆడిషన్స్ నిర్వహించి, తెలుగు చక్కగా మాట్లాడే అనిషా ఆంబ్రోస్‌ని హీరోయిన్గా ఎంపిక చేశారు. దబాంగ్, గబ్బర్‌సింగ్ చిత్రాలకు ఇది సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ కాదని, ప్రేక్షకులకు పవన్ మార్క్ వినోదాన్ని పంచే కథాంశంతో మాత్రమే ఈ చిత్రం రూపొందనుందనీ, డిసెంబర్లో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది మే నెలలో వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామనీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో చిత్ర నిర్మాత శరత్ మరార్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి రచన: కిశోర్ అండ్ టీమ్, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, క్రియేటివ్ హెడ్: హరీశ్‌పాయ్, నిర్మాణం: ఎరోస్ ఇంటర్నేషనల్స్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్. -
నవంబర్ నుంచి గబ్బర్‌సింగ్ 2
పవన్ కల్యాణ్ కెరీర్లోనే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'గబ్బర్‌సింగ్' సినిమా సీక్వెల్ ఎప్పుడా ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నవంబర్ నుంచి గబ్బర్ సింగ్ 2 షూటింగ్ ప్రారంభం కావచ్చని సినిమా దర్శకుడు సంపత్ నంది తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆలస్యం చేయడం ఇక మంచిది కాదని పవన్ భావిస్తుండటంతో దీన్ని వెంటనే చేపడుతున్నారు. వాస్తవానికి కొంతకాలం ముందే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాలని భావించినా, పవన్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో ఇది ఆలస్యమైందని సంపత్ నంది అన్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా మొదలుపెడదామని పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పవన్ హిందీలో బాగా విజయవంతం అయిన 'ఓ మైగాడ్' రీమేక్ 'గోపాల గోపాల' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక గబ్బర్‌సింగ్2లో ఇంకా ఎవరెవరు నటిస్తారన్న విషయం త్వరలోనే తేలిపోతుంది. పవన్, అతడి స్నేహితుడు శరత్ మరార్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. -
నిర్మాతగా సంపత్ నంది
రచయితగా కెరీర్ మొదలుపెట్టి దర్శకునిగా రాణిస్తున్న యువకుడు సంపత్ నంది. డెరైక్ట్ చేసిన రెండు (ఏమైంది ఈ వేళ, రచ్చ) సినిమాలతోనే అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన సంపత్ నంది త్వరలో పవన్ కల్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్-2’ చేయబోతున్నారు. తన స్నేహితుల కోసం సంపత్ నిర్మాతగా మారారు. నవీన్ గాంధీని దర్శకునిగా పరిచయం చేస్తూ ‘గాలి పటం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఆది, రాహుల్, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా ఇందులో ముఖ్యతారలు. ఇప్పటికి 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ -‘‘నేను దర్శకత్వం వహించిన ‘ఏమైంది ఈ వేళ’ తరహాలో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. నవీన్ గాంధీకి దర్శకునిగా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. త్వరలోనే టైటిల్ లోగో ఆవిష్కరిస్తాం. నా స్నేహితులు కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటితో కలిసి ఈ చిత్రాన్ని ఎల్.ఎ.టాకీస్ పతాకంపై నిర్మిస్తున్నా’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, సప్తగిరి, హేమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.ఎస్. కుమార్. -
గబ్బర్‌సింగ్ 2 తెరకెక్కుతుందా ? ... లేదా ?
-
గబ్బర్ సింగ్ 2 హీరోయిన్ వాణీకపూర్
-
పొలిటీషియన్‌గా కనిపించబోతోన్న పవన్
-
గబ్బర్‌సింగ్ 2 మొదలైంది
-
హీరోయిన్ కోసం అన్వేషణ
-
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన గబ్బర్
-
రెండో గబ్బర్‌సింగ్ డిసెంబర్లో స్టార్ట్
‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర జయభేరి మోగించడంతో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ నామజపమే. ప్రస్తుతం ఆయనేం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఆయన ఇవేవీ పట్టించుకోకుండా ‘రెండో గబ్బర్‌సింగ్’ని తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 2న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడం ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడందుకుంది. దర్శకుడు సంపత్‌నందితో పాటు ప్రతిభావంతులైన రచయితల బృందం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో అహర్నిశలూ శ్రమిస్తున్నారు. పవన్‌కల్యాణ్ దగ్గరుండి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 2 నాటికి ఈ సినిమా సెట్స్‌కు వెళ్లాలనే కసితో పనిచేస్తున్నారట. బాలీవుడ్ ‘దబాంగ్’కి రీమేక్ ‘గబ్బర్‌సింగ్’. అయితే... ‘గబ్బర్‌సింగ్-2’ మాత్రం ‘దబాంగ్-2’కు రీమేక్ కాదు. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇందులో పవర్‌స్టార్ పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు పనిచేసే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.