బెంగాల్ టైగర్ సరసన! | Raviteja, Tamanna Pairing For 'Bengal Tiger' | Sakshi
Sakshi News home page

బెంగాల్ టైగర్ సరసన!

Published Sat, Nov 15 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

బెంగాల్ టైగర్ సరసన!

బెంగాల్ టైగర్ సరసన!

 మిల్క్ బ్యూటీ తమన్నా కథానాయికగా రంగప్రవేశం చేసి, పదేళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించిన తమన్నా ఒక్క రవితేజతో మాత్రమే నటించలేదు. వచ్చే ఏడాది ఈ మాస్ హీరోతో తెరపై కనిపించనున్నారామె. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి  ‘బెంగాల్ టైగర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం వచ్చే ఫిబ్రవరిలో ఆరంభం కానుంది. ఈ సినిమా గురించి తమన్నా చెబుతూ - ‘‘రవితేజతో మొదటిసారి నటించనున్నా. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ‘రచ్చ’ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే చేశానని రవితేజ చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఇప్పటివరకు మీడియమ్ బడ్జెట్ చిత్రాలు నిర్మించిన నాకు రవితేజ డేట్స్ ఇవ్వడం ఆనందంగా ఉంది. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నా’’ అన్నారు. రవితేజ ఎనర్జీకి తగ్గ కథ ఇదని సంపత్ నంది తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement