ఆ డెరెక్టర్‌పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా? | Tamannaah Bhatia Praises Tollywood Director, Tweet Goes Viral | Sakshi

Tamannaah Bhatia: నా కెరీర్ మొత్తంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు: తమన్నా

Mar 10 2024 2:39 PM | Updated on Mar 10 2024 2:59 PM

Tamannaah Bhatia Praises Tollywood Director Tweet Goes Viral  - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్‌గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్‌ సంపత్‌ నంది చేసిన ట్వీట్‌పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నుంచి తమన్నా పర్సనల్‌ స్టాఫ్‌ను సైతం మెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్‌ నంది డైరెక్షన్‌లో తెరకెక్కించిన రచ్చ  బెంగాల్‌ టైగర్‌, సీటీమార్‌ చిత్రాల్లో తమన్నా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement