
తమన్నా పేరు కంటే.. మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. జైలర్ సూపర్ హిట్ కావడంతో పారితోషికం అమాంతం పెంచేసిందంటూ టాక్ కూడా వినిపించింది. దీంతో బాలీవుడ్‌లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. ఇందులో తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది.
ఇదలా ఉంచితే తమన్నా 2005లోనే తన కెరీర్ ప్రారంభించింది. ఓకే ఏడాదిలో తెలుగు, హిందీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో శ్రీ మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, బద్రినాథ్, 100% లవ్, రచ్చ, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని తమన్నా సినిమాల్లో చేసిన పాత్రలతో ఫోటోను షేర్ చేశాడు.
ఇది చూసిన తమన్నా అభిమాని ట్వీట్‌కు స్పందించింది. తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక అభిమాని ట్వీట్‌కు తమన్నా రిప్లై ఇవ్వడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Thank you 🫶🏻
Many more to come 💕 https://t.co/TNMr1ChANd— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024
Comments
Please login to add a commentAdd a comment